సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇబ్రహీం కుతుబు షాహ
ఇబ్రహీంకుతుబుషాహ (1550 - 1580) : ఆంధ్ర దేశ మునందు “మల్కిభరాము" డని ప్రసిద్ధిచెందిన అబుల్ ముజర్ఫర్ ఇబ్రహీం కుతుబుషాహ 977 హిజ్రి (1550 క్రీ. శ.) లో సింహాసనమధిష్ఠించెను. ఇతడు కుతుబషాహిరాజ పరంపరలో మూడవవాడు. కుతుబుషాహి రాజ్యనిర్మాతగా నీతనినే పేర్కొనవలయును. ఈ రాజ్య మింకను నిర్మాణదశలో నుండెను. దానికి పుష్టినిచ్చి, సంఘటితము చేసినవా డీతడే. నిజజనకుని మరణానంతర మితనిజీవితము పెక్కు ముఖ్య సంఘటనలకు తావల మయ్యెను. జీవితాదర్శమును సిద్ధిపొందుటకు పూర్వము కఠిన పరీక్షల నెదుర్కొనవలసి వచ్చిన చారిత్రక వీరులలో నితడొకడయి యున్నాడు. రాజకుమారుడుగా నున్నప్పుడు ఈతని జీవితము ఎడతెగని పోరాటములలో చిక్కుకొనెను. రాజ్యస్థాపకుడగు సుల్తాన్ కులి మరణించినపుడు, ఇతని తరువాత వచ్చిన రాజుల యొక్క స్వార్ణాభిలాషముల మూలముగ రాజ్యమంతయు అల్లకల్లోల మయ్యెను. కేంద్రీయ, రాష్ట్రీయ రాచరికములు తప్పు దారులుపట్టెను. పరిపాలనా విధానము భగ్నమయ్యేడు స్థితికి వచ్చెను. రాజులును, ఆంధ్రప్రజలును పరస్పరామోదముతో వర్తించుట పూర్వరాజుల పరమాదర్శముగా నుండెను. అది ఇప్పుడు పూర్తిగ భ్రష్టమైనది. ఇట్టి వికటస్థితి మూలకముగా ఇబ్రహీం ఎక్కువగ కడగండ్ల పాలయ్యెను. చివరకాతడు తన జన్మభూమిని వీడి, విదేశములో తలదాచుకొనవలసి నట్టి గతికి వచ్చెను. అయినను బలవద్విరోధులకు విరుద్దముగాసలిపిన ఆతని ప్రతిఘటనము, చివరకు గోలకొండ ప్రభుత్వ మును స్వాధీనము చేసికొనుటలో ఆతడు పొందిన విజయము, కుతుబుషాహీ చరిత్రలో భయ విస్మయార్థక కథా విధానమయి యున్నది. తండ్రి సింహాసన మీతడు సంపాదించుటలో విఫలుడయి యుండిన యెడల ఆరంభ దశలో నున్న (అనగా పూర్ణముగ వికసించని) ఆరాజ్యము అకస్మాత్తుగా నామావశేషమయి, ఆ తరువాత రెండు వందల సంవత్సరముల కాలములో ఈ రాజ్యము సాధించిన రాజకీయ, సాంస్కృతిక వైభవములకు అవకాశము మృగ్యమైయుండి యుండెడిది.
సుల్తాన్ కులీకుతుబుషాహ (1512-1543) మగసంతానములో ఇబ్రహీం ఆరవవాడు, కనిష్ఠుడును. ఇతడు సోదరులందరి లోను సమర్థుడు. ఇతర సోదరులవలెగాక ఇతడు సద్వర్తనాసంపన్నుడు. మనోనిశ్చలత గలవాడు. పితృ సేవావిధులను కచ్చితముగా నెరవేర్చువాడు. సోదరులలో నెల్ల నీతనికి వన్నె తెచ్చినది యీతని ఉదారహృదయమే; ఇతని సోదరులు ఎల్లప్పుడు రాజ్యాపహరణమునకు - ఫలితము లెట్లుండునోయని ఎంత మాత్రము గమనించక -అవకాశముల కొరకు ఎదురు చూచు చుండెడివారే. ఇబ్రహీమునందు భవిష్యత్తులో గొప్పవాడు కాగల లక్షణాలుండుటచే సుల్తాన్ కులీకుతుబు షాహ ఈ కుమారుని మానసిక, నైతిక శిక్షణార్ధము అత్యంత శ్రద్ధ గైకొని, ఒక జిల్లా పరిపాలనాభారము ఇతని వశ మందుంచి నట్లు కనబడుచున్నది.
దేవరకొండ జిల్లా క్రొత్తగా జయింప బడుటచే అది అధికారమునకు లొంగక, సంక్షోభమానమై యుండెను. దానిని అప్రమత్తతతో అదపులో నుంచుట అవసరమయ్యెను. అందుచే, ఇబ్రహీం దేవరకొండ జిల్లా యందు శాంతి భద్రతలు కాపాడుటకై తండ్రి యవసానకాలమున పంపబడెను. ఈ జిల్లాలో ఈ కార్యమునకు ఎప్పుడు నియమింపబడినాడో సరియైన తారీఖు చెప్పుటకు వీలులేదు. కాని, అట్టి బాధ్యతాయుతమగు ఉద్యోగమునకు నియమింపబడుటకుముందే ఇతడు యుక్తవయస్కుడై యుండి యుండవచ్చును.1 దేవరకొండ యందు అతడు చూపిన పరిపాలనా దక్షత అతడు శారీరకముగా, మానసికముగా సమర్థుడను విషయమునకు ప్రబల సాక్ష్యముగా నుండ గలదు. అట్టి బాధ్యతగల కార్యకరణమునకు అతడు యోగ్యుడుగా నున్నట్లు తేటపడగలదు. తండ్రి మరణానంతరము అతడు మొదట బిజాపురమునకును, తరువాత అచ్చటి నుండి విజయనగరమునకును పరుగెత్తి పోవుటయును, అతడు తొణకని మానసిక వ్యవస్థ కలవాడనుటకును మరియొక సాక్ష్యమై యున్నది. రాజపదవిని పొందుట యందు, విజయసిద్ధిని తప్పక కలిగించు విధమున, పరిస్థితులను ఎదుర్కొ నేను. ఈతని వ్యక్తిగత ఆకర్షణము, (Personal Charm), సద్భావములను బట్టి పెక్కుమంది అనుచరులకు అతడు ప్రీతి పాత్రుడయ్యెను. అందుచే వీరు అతడు విజయనగరము నందు అజ్జాతవాసుడయి యున్నప్పుడు కూడ అతనిపక్ష విజయమునకై తమ జీవితములను వినియోగించిరి. గోలకొండ ప్రజల లోను, ఇతడు అధిక రంజకత్వమును గలిగియుండెను. సోదరుని మరణానంతరము ఇబ్రహీం గోలకొండకు పోవునప్పుడు ప్రతి మజిలీ యందును జనసమూహములువచ్చి అతని పక్షమున చేరుచుండుట కనుపించును. తత్ఫలితముగా, దినక్రమేణ ఆతని అనుచరులు సంఖ్య పెరుగసాగెను. రాజ్యకాంక్షా పరులగు ప్రతి స్పర్థుల విరోధ చర్యలున్నప్పటికిని, రక్తపాత రహితముగ ఇతడు సింహాసనాధిష్ఠితుడగుట చరిత్రలో అసాధారణ విషయమై యున్నది.
అయినను, దేశీయ, విదేశీయములగు రాజకీయ విషయములు రెండింటియందును, అతనిపూర్వు లందరికంటె బలవత్త రమయిన పరిపాలనా కాలము ఇబ్రహీంకులీ కుతుబుషా రాజ్య సింహాసన మెక్కుటతోనే ప్రారంభమయినది. ఇబ్రహీం రాజ్యారూఢుడయినప్పుడు. రాజ్యమింకను నిర్మాణావస్థలోనే యుండెను. సుల్తాన్ కులీ కుతుబుషా గవర్నరుగాను, స్వతంత్ర రాజుగాను అరువది సంవత్సరములకు మించిన కాలము పరిపాలనము నెరపినను పటిష్ఠమయిన పునాదులపయి ప్రభుత్వమును స్థాపించలేకపోయెను. ఇతడు ఎక్కువగ విజేతయేగాని నిర్మాణ కుశలుడుగాడు. ఇంతియేగాక, కోహీరు మొదలుకొని మచిలీ
1. "తారీఖె కుతుబుషాహి" అను గ్రంథము ఈ యుద్యోగ సమయమున ఇబ్రహీం అల్పవయస్కుడు (Minor) గా నున్నట్లు తెలుపుచున్నది. "కుతుబుషాహి. " పుట. 107. పట్టణము వరకును వ్యాప్తమయియున్న గోలకొండ వంటి పెద్ద రాజ్యమును సంఘటితముచేయుట సులభకార్యము కాదు. కులీ కుతుబుషాహ తరువాత రాజ్యమునకు వచ్చిన జెంషీదు (1543–1550) దర్బారుకుట్ర వ్యవహారములందునో విదేశీయములగు చిక్కులలో తగులుకొనియో కాలము నంతయు వ్యర్థము చేసెను. తత్కారణమున కేంద్ర సంబంధ మయిన, సూబాల సంబంధమయిన ప్రభుత్వ విధాన నిర్మాణము, ఇబ్రహీం రాజ్యభారము వహించువరకు నిలిచి పోయెను. కేంద్ర ప్రభుత్వము ప్రాథమిక దశలో నుండుటచే, ప్రాంతీయ ప్రభుత్వములపై ఎట్టి ప్రాబల్యమును కలిగియుండలేదు. తరువాత రాజ్యమునందు చేర్చబడిన పెక్కు జిల్లాలు అశాంతి (restive) గా నుండెను. దారి దోపిడులు తీవ్రముగా సాగుచుండెను. ఆంధ్రదేశమంతయు దారిదోపిడి గాండ్రతో అపఖ్యాతిని చెంది యుండెను.
ఈ దొంగలు ఈ దుష్ట వృత్తియందు నేర్పరులై యుండి, బాటసారుల ప్రాణధనములకు ముప్పు తెచ్చుచుండిరి.2 ఇబ్రహీం సింహాసనారోహణము చేసిన ప్రారంభమునుండి రాజకీయ సంఘటనా సంబంధమగు ప్రచండ కార్యము నెడ శ్రద్ధాసక్తులను చూపెను. ఇట్టి కార్యాచరణమునకు రాజనీతి, వివేకము, అత్యధికానుభవము అవశ్యముగా కావలసి యున్నవి. రాజ్యాభిషిక్తుడయినప్పుడు ఇబ్రహీం 24 సంవత్సరముల ప్రాయము వాడయి యున్నను, ప్రభుత్వ పరిపాలన కళయందు సూక్ష్మబుద్ధియు, నేర్పును అతడు కలిగియుండెను. రాజ్యకార్యములందు స్వయముగా శ్రద్ధగైకొని వాటిని సరళముగా పరిష్కరించు చుండెను.3 బాల్యజీవితము నుండియే అతడు రాజ్యపరిపాలనా వ్యవహారములతో సంబంధముకలిగి యుండెను. బహుశః ఈ పరిపాలనాతంత్ర పరిజ్ఞానమును ఇతడు విజయనగరము నందు గ్రహించి యుండును. ఇబ్రహీం పాదుషా ప్రదర్శించిన రాజ్యపరిపాలనా నిర్వహణ నైపుణ్యము, ప్రతిభ చరిత్రయందు అప్రతిమానమయిన విషయమని నుడువుటకు కుతుబుషాహి వంశ చరిత్ర కారుడు సంకోచించలేదు.4 రఫి యు ద్దీన్ షీ రాబి అనువాడు మొదటిసారి వర్తకుడుగను, రెండవసారి బిజాపూరు రాజ్య రాయబారి గను రెండువిధముల ఇబ్రహీం కుతుబుషాతో స్వయముగా పరిచయము కలవాడయ్యెను. ఇతడు ఇబ్రహీం కుతుబుషాను గూర్చి ప్రశంసాత్మకముగ నుడివియున్నాడు. ఇబ్రహీం కుతుబుషాయందు నిర్మాణ చాతురీధురంధరత్వము, క్రమశిక్షణ యెడ సమధిక భావము, రాజు యొక్క ప్రతిష్ఠ ప్రస్ఫుటముగా ఇతనికి గోచరించెను.5"మహాసామ్రాజ్యాధి నేతలగు ప్రచండ రాజవరేణ్యుల యందును ఈ సుగుణములు మృగ్యములు." అని షిరాబి వచించి యున్నాడు. రాజ్యవ్యవహారములను సక్రమ మార్గముల నడుపుటయందును, న్యాయనిర్వహణ యందును ఇబ్రహీం ఆకాలమునాటి రాజస్యులలో ప్రముఖస్థానమును వహించియున్నాడని తరువాతి కాలపు వాడగు మరియొక చరిత్రకారుడు నుడివియున్నాడు.6
"న్యాయశాస్త్రమును పాటించుటయందును, న్యాయమును ప్రజలకు చేకూర్చుటయందును ప్రపంచములోని రాజులందరకు మహోన్నతాదర్శముగా ఇబ్రహీం ప్రకాశించుచున్నాడు". అని అలీబిన్ అజిజుల్లా యొక్క అభిప్రాయము.7 క్రీ. శ. 1565 లో ప్రజ్వరిల్లిన తాళికోటయుద్ధము నందును ఇతడు ఉద్దండముగ పాల్గొని దక్కన్ సేనయొక్క వామపార్శ్వమునకు సేనాపతియై యుండెను.
రాచరికపు పగ్గములను చేబట్టిన కొన్నిదినముల తరువాత ఇబ్రహీం రాజ్యపరిపాలనా చక్రమును నడుపుటకు నడుము కట్టెను. కుతుబుషాహి చరిత్ర కథనము ప్రకారముతన సింహాసనారోహణ సందర్భ జ్ఞాపకార్ధము నడచుచున్న మహోత్సవాదులను, త్వరితముగా ముగింపజేసి, ఆనాటి యవసరముల కనుగుణముగ ప్రభుత్వ సరళిని సరిదిద్దుటలో పూర్తిగ మగ్న మానసుడయ్యెను. కేంద్ర ప్రభుత్వమునందు ప్రతిభావంతులను నియమించి, ఇబ్రహీం దాని సామర్థ్య ప్రమాణమును పెంపుచేసెను. న్యాయ శాఖా నిర్వహణము నందును, అతనిపాత్ర ప్రశంసనీయముగా నుండెను. సివిల్ వ్యవహార విషయములను
2. ఆబుతురాజు, హాదీశ్వాతుల్ ఆలం, పుటలు 116, 200.3. "కుతుబుషాహి" పుట 2 4. "కుతుబుషాహ్" పుట 103. 5, షిరాజ్., రఫీయుద్దీన్ - "తజ్కిరాతుల్ ములుక్" పుట ? 6. ఆభుతురాబు, హదీక్వాతుల్ ఆలం, పుట 189. 7. ఆలీబిన్ అజీబుల్లా, బురహానె మాశిర్', పుట 523, సంస్కరించుటకు ఎట్టి ఉత్సాహమును చూపెనో అట్లే, న్యాయశాఖా సంస్కారమునకును కడం గెను. ఆతని ముఖ్యా దర్శము పోలీసుశాఖ, న్యాయశాఖ, దేశము నందు సంపూర్ణశాంతి, భద్రతలను సమకూర్చు విధమున క్రమబద్ధము చేయుటయై యుండెను. సైనికశాఖా నిర్మాణములో కూడ అతడు సమానముగ శ్రద్ధవహించెను. అందుచే గోలకొండ సైన్యము, దుర్గప్రాకారములు ప్రక్క రాజ్యములలోని వాటివలె బలపరుపబడెను. సైనిక విధానమంతయు పునర్వ్యవస్థ గావించినట్లును, యోధ నివహమునందు నూత్నమగు ఉత్సాహశక్తి కలిగించినట్లును తోచుచున్నది. ఉద్యానవనముల నిర్మాణము, ఉద్యానవనముల నిర్మాణము, తటాక నిర్మాణము మొదలగు ప్రజోపయోగకర కార్యములుకూడ ఆతనికి కీర్తిదెచ్చునవియై యున్నవి.
ఇబ్రహీం గొప్ప గొప్ప ప్రాసాదములను కట్టించినాడు. తన పేరుమీద కొన్ని పట్టణములను నిర్మించినాడు. ఇతని పరిపాలన కాలములో "దౌలత్ - ఖానె- అలీ" అను చంద్రశాల కట్టింపబడెను. మరికొన్ని రాజమందిరములు, ఉద్యానవనములు, కట్టడములు కట్టుటకు మార్గ మేర్పరచెను. వీటిలో బాగెగుల్షన్, ఇబ్రహీంబాగ్, లంగరు దర్వాజా, ఇమాంబాదా, బారాదరి, అనునవి ప్రఖ్యాతములైనవి.
కుతుబుషాహి రాజన్యుల ప్రజాసంక్షేమ కార్యములు అందరకు తెలిసినవే. ఈ విషయములో ప్రథమ మార్గదర్శి ఇబ్రహీంకుతుబుషాహీ యే. మసీదులు, పాఠశాలలు, చెఱువులు నిర్మాణము చేయుటలో ఇతడు మిగుల కృషి సలిపెను. హుస్సేన్సాగరు చెఱువు, ఇబ్రహీం పట్టణం చెఱువు. బుద్వేల్ చెఱువు మిగుల ప్రసిద్ధిచెందినట్టివి. వీటిని ముఖ్యముగా వ్యవసాయమునకు, మంచినీటి వసతికి ఉపయోగించుచుండిరి. “పురానాపూల్" అను పేరితో మూసీనది మీద ఒక వంతెన కట్టబడెను. ఈ వంతెన హైదరాబాదు పట్టణమును గోలకొండ దుర్గముతో కలుపుచున్నది.
గోలకొండ రాజ్యము కళలను, విజ్ఞానశాస్త్రములను పోషించుటలో నిక్కపు ఆశ్రయదాతగా పేరొందెను. వైదుష్య సముద్దీపక శక్తికి మూలాధారము ఇబ్రహీం రాజ్యకాలముననే లభించెను. ఇబ్రహీం సభ్యతాశీలమగు వైదుష్యమును, సకల విద్యా పరిచయమును, విజ్ఞానాభిమానమును కలవాడుగా నున్నట్లు కనబడుచున్నది. శాస్త్రాభిజ్ఞులును, విద్యాశోభితులును అగు విద్వన్మణి మండలమును ఎల్లప్పుడును తనచుట్టు పరివేష్టించుకొని యుండెడివాడు, అతడెచ్చటికి వెడలినను వరణీయులగు నీపండిత మండలి వెంటనే యుండుచుండెను. మనోల్లాసకర ప్రసంగములతో రాజు వారితో వినోదించుచుండెను. “రాజుగారు రాజ్యములోని పలు ప్రాంతముల పరిశీలనార్థము వెడలినప్పుడు కూడ విద్వచ్వర్యులు ఆయనతో ప్రసంగములు చేయుచునేయుండి, తమ వాగ్రచనా చాతుర్యములతోరాజునకు సంప్రీతి గావించుచుండిరి." అని " తారీఖే- కుతుబ్ షాహి " గ్రంథకారుడు వచించియున్నాడు. ఈపండితులందరు రాజసమ్మానమును పొందియున్న వారు. ఇబ్రహీం కుతుబుషాహ సభాలంకారులలో ఆమీరుషాహ మొహమ్మదు అంజు, అమీరు ఇమాదుద్దీను, మొహమ్మదు షిరాజి, ఖాసింబేగు షిరాజ, హుస్సేన్ కులిమీర్జా అను వారు పేర్కొన దగినవారు. వీరందరు విజ్ఞాన ధురీణులు, తర్క శాస్త్ర పారంగతులును అయియుండిరి. ఇబ్రహీం కుతుబుషా పెక్కు విద్యాలయములు, మసీదులు ఇతర మందిరములు నిర్మాణముచేసెను. అతని కాలములో మహోన్నతములగు మసీదులు, విద్యాలయములు, బ్రహ్మాండ మగు కట్టడములు నిర్మాణము చేయబడెను.8 ఈ తరుణముననే గ్రంథ రచనా ప్రయత్నములును (work of compilation) ప్రారంభమాయెను. ఖోర్ షాహఖబాదుల్ హుస్సేని అనువాతడు "కుతుబుషాహీల చరిత్ర" అను నామముతో విపులచరిత్రను వ్రాసెను.9
మొత్తముమీద దక్కన్ భాషలన్నియు తిరిగి సాహిత్య రంగమున ప్రవేశించెను. సాహిత్య దిఙ్మండలమున ఫెరోజు, మహమూదువంటి కవులనామములు ఎక్కువగా దృశ్య మానము లగుచుండెను. ఈ యిద్దరుకవులు అన్ని విధము లను మేటికవులుగా కనబడుచున్నారు. వీరి రచనలు దొరకుటలేదు. వీరి జీవితములపయి మాయావరణము
8. తారీఖె-కుతుబుషాహి, పత్రముసంఖ్య 225. సాలార్జంగు లైబ్రరీ. 9. ఈ చరిత్రము అబ్దుల్లా కుతుబుషాహ కాలమున 1038 హిజ్రిలో ముగింపబడినది. ఇందు కుతుబుషాహాల యుదంతములేదు. ఈ గ్రంథము యొక్క మేలుప్రతి సాలారంగు గ్రంథాలయములో కలదు. గలదు. అయినను, ఉర్దూభాషాభ్యుదయమునకు ఇబ్రహీం కుతుబుషాహ కాలములో పునాదివేయబడినదేమో అని అనుకొనుటకు ఈ కవిద్వయము యొక్క తేజోవంతమగు అస్తిత్వము దోహద మిచ్చుచున్నది. తత్ఫలితముగా అతని తరువాతి పాదుషాలు గద్దెనెక్కినప్పుడు ఈ అభ్యుదయ కృషి. అతివేగము చెందెను. మహమ్మదుకులీ, సుల్తాన్ మహమ్మదు రాజన్యుల కాలములో ఇది తారాపథము నంటెనుకూడ
కుతుబుషాహీలు ఆంధ్రభాషా, వాఙ్మయాలంకరణకు సమధిక ఉత్సాహాభిమానములు కలిగియుండిరి. ఈ విషయ మున సమృద్ధమైన, అచంచలమైన ప్రయత్నములు జరిగేను. ఈ ప్రయత్నములు ఉర్దు, పారసీ భాషల విషయమున తీసికొన్న చర్యలతో సరిసమానముగనున్నవి. తెలంగాణము తమ మాతృభూమిగను, తెలుగు భాష తమ మాతృభాష తరువాతి భాషగను కుతుబుషాహీ రాజన్యులు తలంచి నారనుట నిరాక్షేపణీయమైన యంశము. అందుచే, ఈ భాషాభివృద్ధికి శక్త్యుత్సాహములతో పనిచేయక డంగిరి, ఆంధ్రవిద్యార్థులకు, ఆంధ్రకవులకు, తమకు సాధ్యమైనంత వరకు తగు ప్రోత్సాహము నిచ్చిరి. తత్ఫలితముగా చివరకు ఈ భాషా భాండారము యొక్క భాగ్యము పండెను. వారందరు విద్యావ్యాసంగమునం దారి తేరిన వారు. స్వయం ప్రేరితులయి కవిత నల్లియున్నారు. కుతుబుషాహీ యుగము ఆంధ్రదేశమునకును, తెలుగు వాఙ్మయమునకును సువర్ణయుగ మని చెప్పుట సత్య విరుద్ధముకాదు. ఏలయన, కుతుబుషాహి రాజవంశొదయమునుండిగాని, తరువాతి రాజుల కాలములోగాని అట్టి రాజాభిమానముతో, వదాన్యతతో ఈ భాష, సమ్మానింపబడ లేదు. 'రాజసభలోనే ప్రతిభాషయు పరిపుష్టి ప్రాభవములు పొందుచుండుట సర్వజనవిదితమే. తెలుగు భాషా ప్రాగల్భ్యమును ప్రకటించిన మొదటి రాజవైతాశికుడు ఇబ్రహీం కుతుబుషా.
ఆతని జీవితములో ప్రారంభదశ దేవరకొండలో గడచేను. తరువాతి కాలములో ఏడు సంవత్సరములు దేశ భ్రష్టుడయి విజయనగరమున గడపెను. ఇట్టి పరిసరముల మధ్య కాలములోనే స్థానిక సంపర్కములచే, ప్రభావితుడయి తెలుగుభాష నేడ విశుద్ధప్రీతి గలవాడయ్యెను. ఇతడు ఆంధ్ర భాష యందు మంచి పండితుడు. ఆంధ్రకవి పండితుల కావ్యాలలోని ప్రౌఢ కవితాంశముల రసగ్రహణ పరాయణుడయియుం డెను. అతని సభాస్థానము (దర్బారు)న ఉర్దు, పారసీ కవుల కెట్టి ఆశ్రయముండెనో అట్లే తెలుగు కవులకును ఆశ్రయ స్థానమై వెలసెను. ఈతెలుగు కవులకును రాజుగారి వితరణములో భాగము దొరకుచుండెను. ఆంధ్ర భాషలో మనొహర కవితాగానమును రాజుగారికి వినిపించిన వారిలో అద్దంకి గంగాధరకవి యొకడై యుండెను. ఇతడు ప్రతిభాశాలి యగు తెలుగుకవి. ఆంధ్రవాఙ్మయ భూషణుడు. ఇతడు తపతీసంవరణోపా ఖ్యానమను మహాప్రబంధనిర్మాతగా ప్రసిద్ధి చెందిన వాడు. ఈ కావ్యము ఇబ్రహీంకుతుబుషాకు అంకితమీయబడినది. దర్బారులోని రాజసామంతులును, సర్దారులును రాజు మార్గమునే అనుసరించిరి. వీరిలో అమీన్ ఖాను అనువాడు ఒకడు. పొన్నికంటి తెలగనార్యుడను కవికి అమీన్ ఖాన్ ఆశ్రయదాతగా ఇప్పటికిని స్మరింపబడుచున్నాడు. పటంచెరువు నివాసి అయిన ఈకవి "యయాతి చరిత్రము" అను కష్టసాధ్యమగు అచ్చతెనుగు కావ్యమును వ్రాసెను. ఈ కావ్యము ఆకాలమునాటి ఆచార సంప్రదాయములను గూర్చియు, సంస్కృతి, సాంఘిక పరిస్థితులను గూర్చియు ఎక్కువగ తెలుపుచున్నది.
ఇబ్రహీం కుతుబుషా 1580 జూన్ 5వ తారీఖున కీర్తి శేషుడ య్యెను.
ఏ. ఎం. ఎస్.