Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆర్థిక భూగోళశాస్త్రము

వికీసోర్స్ నుండి

తగరము :- మలయా, బొలివియా, డచ్చి యీస్టు యిండీస్, (అమెరికా, రష్యా, ఫ్రాన్సు, ఇటలీ, జపాను దేశములలో నిది చాల తక్కువ.)

తుత్తునాగము (Zinc) :- అమెరికా, కెనడా, ఆస్ట్రే లియా. (ఫ్రాన్సులో తక్కువ.)

వర్ణజారేయిజము (క్రోమైటు Chromite) రష్యా, టర్కీ, దక్షిణరొడీషియా.

మాంగనము (Manganese) ;- రష్యా, ఇండియా, ఘనా (గోల్డుకోస్టు), దక్షిణ ఆఫ్రికా, (ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, జపానులలో తక్కువ.)

చండాతువు (టంగ్ స్టన్ Tungsten):- చైనా, బర్మా, మలయా, అమెరికా (రష్యా, జర్మనీ, ఇటలీలలో తక్కువ.)

బంగారము :- దక్షిణ ఆఫ్రికా, రష్యా, కెనడా, ఆస్ట్రే లియా, దక్షిణ రొడేషియా (ఇండియాలో తక్కువ.)

వెండి :- మెక్సికో, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, పెరూ, (ఇండియాలో తక్కువ, ఇటీవల తుత్తునాగము, సీసపు గనులలో కొలదిగా దొరకుచున్నది.)

పాదరసము (Mercury):- స్పెయిను, అమెరికా.

అభ్రకము :- ఇండియా, అమెరికా, రష్యా.

మోనజైటు (Monozite) :- ఇండియా, బ్రెజిల్,

వజ్రములు (Diamonds) :- గోల్డుకోస్టు (ఘనా), బెల్జియన్ కాంగో, దక్షిణ ఆఫ్రికా, బ్రెజిల్.

లిఖిజము (గ్రాఫైట్ (Graphite) :- కొరియా, ఆస్ట్రే లియా, జర్మనీ, సిలోన్.

కిరణాతువు (యురేనియం) :- బెల్జియకా కాంగో, కెనడా (కొంత ఆస్ట్రేలియా, అమెరికా గూడ.)

1954 వ సంవత్సరమున ఇండియాలో నుత్పత్తియైన కొన్ని ముఖ్య ఖనిజములు, సుమారుగా అంచనా వేయబడిన వాటి విలువలు:-

మొత్తము ఖనిజముల విలువ (పెట్రోలియంగాక)

1958. 1.12,78,21,111. 1954 o రూ. 1,02,51.97,252 (ఇంకా కొన్ని ఖనిజము లీక్రింది పట్టికలో నివ్వబడ లేదు.) నిజము బొగ్గు మొత్తము విలువ రూ. 36,886,810 టన్నులు 58,98,82,850 ఖనిజము మాంగనము అభ్రకము బంగారము రాగి (ఖనిజము) మొత్తము

ఆర్ధిక భూగోళశాస్త్రము విలువ రూ. 1.418.847 " 19.54.17.452 103.881 0.3. 1.55.81,884 239,188 ఔన్సులు 5,02,08,814 522.89.86.036 1,87.22.628 ఇనుము (ఖనిజము) 4.808.279 842,750 .. ఆయో రిజజా రిజము (ఇల్మెనైటు) క్రోమైటు 240,518 " 79,80.210 $5,507 " 13,59,607 812.120 41.58.888 తుత్తునాగము (సంకేంద్రీ కృతములు) 3,974 10,80.898 .. వెండి 185,185 ఔన్సులు 6.67.880 బాకై ఎటు 74,747 టన్నులు 8,27,785 వజ్రములు 1,995 కారట్లు 4,74,286 పచ్చలు (emeralds) 508.180 " 8,70,406 18,792 టన్నులు 2,81,879 75.508 5.47.189 2. 3o. సంబం ఓలర్ (రంగుముద్ద)

పి. వేం>

ఆర్థిక భూగోళశాస్త్రము :- పరిసరములకు ధించి, మానవుని ఆర్థికచర్యలను గురించి తెలుపు శాస్త్ర మును ఆర్థిక భూగోళశాస్త్రమని నిర్వచింపవచ్చును. ప్రతి భౌగోళిక ప్రాంతమునందును పరిసర ప్రకృతికి అనువగునట్లు మానవుని ప్రవృత్తి మారుచుండును. అనగా ప్రదేశ భేదమునుబట్టి మానవుని ఆహారము, దుస్తులు, వృత్తి మొదలగునవి ప్రకృతి కల్పించు అవకాశములను బట్టి మారుచుండును.

ఆహారములు, ముడిపదార్థములు, ఆర్థిక ఖనిజములు ఆటవిక వస్తువులు, భారీపరిశ్రమలు, వాటి సరఫరా, ముడిపదార్థముల యొక్కయు యంత్రములచే తయా రైన పదార్థములయొక్కయు పరస్పర వినిమయము అంతర్దేశీయ విదేశీయ వర్తక వ్యాపారములు, మున్నగు అంశములయొక్క పరిశీలనమే ఆర్థిక భూగోళ శాస్త్రమందలి ముఖ్యమైన విషయము.

పై విషయములను ఇంకను సూక్ష్మముగా తెలుపుటకై ఈ క్రింది విధముగా అంతర్విభాగము చేయనగును. 273 ముఖ్య ఆహారమనియు, సహకారి (subsidiary) ఆహారమనియు ఆహారము రెండువిధములు, గోధుమ, వరి, జొన్నలు, సజ్జలు, రాగులు మున్నగు ధాన్యముల ఉత్పత్తి, వాటి ఖర్చు మున్నగు విషయములు ముఖ్యాహారమునకు చెందినవి. పప్పుదినుసులు, చక్కెర, ఫలములు, కూరగాయలు మున్నగునవి సహకారి ఆహారమునకు చెందినవి. పై రెండు కాక మూడవ విభాగము క్రింద వచ్చునవి. తేనీరు, కాఫీ, కోకో, ఓవలటీను మున్నగు పానీయములు.

ప్రత్తి, జనుము, నార. పొగాకు, రబ్బరు, అవిసేనార మున్నగునవి ముఖ్యమైన ముడిపదార్ధములు. ఈ పంటలు పండుటకు అనువగు పరిస్థితులను గూర్చి విమర్శించుట కూడ ముఖ్యమైన విషయము.

ఖనిజపదార్ధములును మూడు రకములు - (1) ఇనుముతో సంబంధము గల లోహములు. ఉదా :- ఇనుము, మాంగనము, (2) ఇనుముతో సంబంధము లేని లోహములు, ఉదా :- సీసము, యశదము, రాగి, అల్యూమినియము.. తగరము, (3) మిక్కిలి విలువగల లోహము లగు బంగారము, వెండి, ప్లాటినము. ఇవిగాక పెట్రోలు, బొగ్గు మున్నగు పారిశ్రామిక ఇంధనములు, రాతి ఉప్పు, కాల్షియగంధకితము, రాతినార, అభ్రకము మున్నగు అనేక లోహేతర ఖనిజములు కూడ ఖనిజసంబత్తియందలి అంతర్విభాగములే. స్థూలదృష్టిచే పరిశ్రమలు కుటీరపరిశ్రమ లనియు కర్మాగారపరిశ్రమ అనియు, యంత్ర పరిశ్రమ లనియు మూడు తెరగులు, యంత్రములను నడుపుటకు వలసిన శక్త్యుత్పత్త్యాధారముల సాధనములను గూర్చిన పరిశీలనముకూడ ఆర్థిక భూగోళశాస్త్రము యొక్క ముఖ్య విషయములలో నొకటి. * అట్టి ఆధారములలో మానవ కృషి, జంతు సాహాయ్యము, బొగ్గు, పెట్రోలు, విద్యుత్తు, సూర్యశ క్తి, అణుశక్తి మున్నగునవి లెక్కింపదగినవి. రవాణా సౌకర్యములలో రహదారులు, రైలుమార్గములు, జల వాయుమార్గములును చేరును. ఆర్థిక భూగోళశాస్త్రములో, వాణిజ్య మొక ప్రధానాంశమై యున్నది. వివిధప్రాంతముల మధ్య జరుగు ఎగుమతి దిగుమతి వస్తువులనుగూర్చి తెల్పు విషయమే వాణిజ్యము.


వివిధ దేశములమధ్య జరుగు ఎగుమతులనుగూర్చి ఇందు చర్చింపబడును. వ్యాపారము కొంత విలువగలదైనను ఆర్థిక భూగోళశాస్త్రమున దానికి ప్రాముఖ్యము లేదు.

ఆధునిక ఆర్థిక శాస్త్రపఠనములో మానవుని వృత్తులు ఆధారముగా కనుపడినవి. ఆ వృత్తులు పురాతన వృత్తు లనియు, ప్రథాన వృత్తులనియు, సహకారి వృత్తులనియు మూడు తెరగులు.

కాయలు, దుంపలు ఏరుట, చేపలు పట్టుట, వేటాడుట ఇవి పురాతన వృత్తులు. వీటిని ఆధారముగా గొనియే పురాతన కాలములో మానవుడు జీవిత సమరమును సాగించుచుండెను.

మానవుడు తన పరిసరములకు అలవాటుపడిన కొలది. ప్రకృతి కనుగుణముగా ప్రవర్తింపనేర్చిన కొలదియు, ప్రధానవృత్తులను స్వీకరించెను. పశువులను పెంచుట, కాలక్రమమున గనులు త్రవ్వుట మున్నగునవి ప్రధాన వృత్తుల కుదాహరణము,

ప్రధానవృత్తు లాధారముగా ఏర్పడి పారిశ్రామిక విప్లవానంతరము అభివృద్ధిలోనికి వచ్చిన వృత్తులు సహకారివృత్తు లనబడును. ఉదా : రవాణాలు, వాణిజ్యము మున్నగునవి.

ప్రతిప్రాంతమునందును ఈ వృత్తులలోగల వైవిధ్యమును, మనుష్యుడు చేయు కృషికి ప్రకృతినుండి కలుగు ఫలితములును పరిశీలింపబడి, మానవుని పరిసరములకును, ఆతడవలంబించు వృత్తికిని సమన్వయము కల్పింపబడు చున్నది.

వివిధ భౌగోళిక ప్రాంతములలో మానవులెట్లు జీవించుచున్నారో, ఎట్లు సంచరించుచున్నారో, ఎట్లు తమ క్షేమమును సాధించుకొనుచున్నారో వివరించు భూగోళశాస్త్ర భాగమును ఆర్థిక భూగోళము అందురు. ఇది ఆర్థికావసరములమీదను, వాటిని సాధించు పద్ధతుల మీదను ప్రాధాన్యమును ప్రసరింప చేయును.

బి. యన్. చ

ఆర్థిక వ్యవసాయ ప్రణాళిక (ఇండియా):- భారతదేశపు ప్రణాళికా విధానము ప్రజాస్వామ్య దృక్పథము కలిగియుండవలె ననువిషయము ఎల్లరిచే ఆమోదింపబడినది. ప్రజల యొక్క ఆర్థిక వసతులను