సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆర్థిక ఖనిజములు
మును గ్రహింపజాలని రోమను సైనికుడొకడు, ఆర్కి మెడీసును కలిసికొని అతనిని తన వెంట రావలసినదిగా ఆజ్ఞాపించెను. కాని మహామహుడగు ఆర్కి మెడీసు శూన్యమనస్కుడై కొంతతడవుండెను. ప్రేపితుడైన సైనికుడు ఆతని శూన్య మనస్కతను అర్థము చేసికొన లేదు. అతడు దానిని ఆజ్ఞా తిరస్కారముగా భావించి వెంటనే అతనిని కత్తితో పొడిచి చంపెను. పిదప ఆర్కిమెడీసు యొక్క దుర్మరణమునకై ఆ రోమను - సేనానాయకుడు మిక్కిలి దుఃఖించెను. సుప్రసిద్ధుడగు ఆ శాస్త్రజ్ఞుని భౌతిక దేహము గౌరవపూర్వకముగా పాతిపెట్టబడెను. అతని సమాధి పై ఒక శిల స్థాపింప బడెను. ఆశిలపై నొక చిత్రము వ్రాయబడెను. అందు ఒక స్తూపము, దానిలో నొక గోళము లిఖింపబడెను. ఎందుచేతననగా ఆర్కిమెడీసు గోళము యొక్కయు దానిని ఆవరించియుండు స్తూపము యొక్కయు ఘనపరిమాణములకు గల సంబంధములో తాను కసిపెట్టియున్న వి శేషము అన్ని విధముల ముఖ్యమైన దానినిగా భావించెను.
త.స.న
ఆర్థిక ఖనిజములు*:- ఉపోద్ఘాతము :- భూమిపై దొరకు ఖనిజ సంబంధమైన వస్తువులను మానవులనాదిగా నుపయోగించుచుండి రను విషయ మెల్లరకు విదితమే. మొట్టమొదట వాడిన వస్తువులలో గొడ్డండ్లు, కత్తులు మొదలగు సామగ్రిని తయారుచేయుట కుపయుక్తమైన చెకుముకి రాయి (flint, chert etc.), స్పటికపురాయి, పలుగురాయి, లేక పిండిరాయి (quartz) మొదలైన వాటిని పేర్కొనవచ్చును. బలపపురాయి (steatite) సున్నపురాళ్ళు (lime stones) మొదలైన మెత్తనిరాళ్ళు చిప్పలు, తోట్లు మొదలైనవి చేయుట కుపకరించిరి. తదుపరి పలురకములగు మన్నులతో కుండలు, పెంకులు చేయబడినవి. క్రమక్రమముగా రంగుమన్నులు, బంగారు, రాగి, మొదలగు లోహములు కూడ ఉపయోగింపబడుచు వచ్చినవి.
వివిధ దేశపు ప్రజలలో నాగరకత ప్రబలుచు వచ్చిన కొలది అంతకంతకు ఖనిజములు అత్యధికముగా ఉపయోగింప బడుచు వచ్చినవి. ఖనిజముల ఉపయోగము లెక్కువైనకొలది, వాటిని వెదకి, భూమినుండి త్రవ్వి తీయుపద్ధతులు గూడ క్రమముగా నభివృద్ధి చెందసాగినవి. ఖనిజములను గురించిన సమస్యలు, వాటి సాధనలు విజ్ఞాన శాస్త్రములలో నొక భాగముగా పరిణమించినవి. ఇదియే ఆర్థిక ఖనిజములకు సంబంధించిన భూగర్భ శాస్త్రము (Economic Geology).
భూగర్భశాస్త్రరీత్యా భూమి పైభాగము సుమారు 40 మైళ్ళ లోతువరకు, రాతిమయమై యున్నది. దీనిలో చాలభాగము లక్షలాది సంవత్సరముల క్రితము శిలాద్రవము (magma) ఘనీభవించుట వలన నేర్పడిన రాళ్ళు (Igneous rocks). ఇవిగాక యిసుక, ఒండుమట్టి మొదలైన పదార్థములు నీటి ప్రవాహములద్వార సముద్రములలోనికి కొట్టుకొనిపోయి అచ్చట చాల కాలము తరువాత గట్టిపడి శిలలుగామారి, యుగాంతము లందు వచ్చు భూచలనములలో నీటి పైభాగమునకు వచ్చిన రాళ్ళుగూడ ఉన్నవి (Sedimentary rocks). పై రెండురకముల రాళ్ళు శీతోష్ణ పరిణామముల వలనను పీడనము (pressure) చేతను మార్పుచెంది పలురకములగు ఇతర శిలలు గూడ నేర్పడినవి (metamorphic rocks).
ఇట్లు భూమిపై నున్న శిలలన్నిటిని ముఖ్యముగా మూడు రకములుగా విభజింపవచ్చును. ఈ శిలలన్నియు చాలవరకు పలువిధములగు ఖనిజనముదాయములే. ఈ ఖనిజములలో పారిశ్రామికముగ నుపయోగపడునవి చాల తక్కువ. అవిగూడ పలురకములగు శిలలతోగూడి యనేకచోట్ల నున్నను ప్రకృతిలో కొన్ని కొన్ని చోట్లనే అవి కేంద్రీకరింపబడి యున్నవి. అట్లు కేంద్రీకరింపబడి లాభదాయకముగా నుపయోగింప బడగలిగినప్పుడే వానిని 'ఆర్థిక ఖనిజము' లనదగును. ప్రస్తుతము తెలిసి యున్న సుమారు 1400 ఖనిజములలో 200 మాత్రము ఆర్థిక ఖనిజములుగా పరిగణింపబడుచున్నవి.
ఆర్థిక ఖనిజములు - వాని విభజన - ఆర్థిక ఖనిజములను, ముఖ్యముగా మూడురకములుగా విభజింపవచ్చును (1) ధాతు ఖనిజములు (metallic ores). (2) అలోహ ఖనిజములు (non-metallic minerals). (3) ఆంగారిక ఖనిజములు (minerals of organic origin). ధాతు ఖనిజ
- భారతీయ భూతాత్త్విక సమీక్ష డైరెక్టరుగారి అనుమతితో.
ములు సర్వసాధారణముగా వానిలోనుండు పలురకములగు ధాతువులను వివిధరూపములలో నుపయోగించు నిమిత్తమై భూమినుండి త్రవ్వి తీయబడుచున్నవి. ఇట్టి ఖనిజము లెన్నియో గలవు. ఉదాహరణకు ప్లాటినము (platinum), బంగారము, వెండి, రాగి, ఇనుము, తగరము, తుత్తునాగము (zinc) మొదలగు లోహములకు సంబంధించిన ఖనిజములను పేర్కొనవచ్చును.
అలోహ ఖనిజములుగూడ నసంఖ్యాకములుగ గలవు. ముఖ్యముగా నిటీవల నుపయోగింప బడుచు వచ్చిన యలోహ ఖనిజముల సంఖ్య పెరుగుచున్నది. వీనిలో కొన్ని ధాతువులుగూడ రాసాయనికరీత్యా సమ్మిళితమై, యున్నను ఈ ఖనిజములు చాలవరకు, ఆయా ధాతువుల కొరకు గాక భూమినుండి త్రవ్వి తీయబడిన రూపములోనే వాడుటకై సేకరింపబడును. ఇట్టి ఖనిజముల కుదాహరణముగా నీ క్రింది వానిని పేర్కొన వచ్చును :- వజ్రములు (Diamonds), అభ్రకము (Mica), రాతినార (Asbestos), హరశోధము (Gypsum), గంధకము(Sulphur), మెరుగుమట్టి (Graphite), నీలస్ఫసై కిజము కై నైటు Kyanite), కురువిందము (Corundum), రాతీయుప్పు (Rock salt) మున్నగునవి. ఇట్టి ఖనిజములలో రసాయన సంఘట్టన కెట్టి ప్రాముఖ్యత లేదన్న విషయమును విశదీకరించుటకై ఉదాహరణముగా మెరుగుమట్టి, వజ్రములను బేర్కొనవచ్చును. ఈ రెండును రాసాయనికముగా కర్బనము (Carbon) తో నేర్పడినవే గాని, వాటి ఉపయోగములలోను, విలువలలోను, భౌతిక గుణములలోను చాల తారతమ్యము గలదు.
కొందరు వైజ్ఞానికుల రాసాయనిక దృష్ట్యా ఖనిజము లనబడకపోయినప్పటికిని, పలురకములు కట్టడపురాళ్ళు (Building stones), తెల్లమన్ను (Clays), ఇసుక (Sand) అంతర్జాలము (Ground water) మున్నగున విగూడ నలోహ ఖనిజములుగా బరిగణించబడు చున్నవి. అంగారిక ఖనిజములను గూడ అలోహ ఖనిజములలో నొక భాగముగా భావించవచ్చును గాని, వాని ఉత్పత్తివిధానముల ననుసరించి సాధారణముగ వాటినొక వేరు తరగతికి చెందిన ఖనిజములుగా చర్చించుటకద్దు. నేలబొగ్గు (రాక్షసిబొగ్గు) పెట్రోలియము మొదలగునవి ఈ తరగతికి చెందినవి.
ఆర్థిక ఖనిజములు - వాటి నైజములు :- ఆర్థిక ఖనిజములు సాధారణముగా ప్రకృతిలో పరిశుభ్రమైన స్థితిలో దొరకవు. వీనితోబాటు అనేకరకములైన యితర నిరుపయోగ ఖనిజములు కలిసియుండును. వీటిని 'గ్యాంగ్' (Gangue) లేక “అనార్థిక ఖనిజము లందురు. ఒక యార్థిక ఖనిజనిధిలో చాలచోట్ల నొకే రకమైన యనార్థిక ఖనిజములు కలిసియుండును. సాధారణముగా వీటిలో నున్న ఆర్థిక ఖనిజమును మాత్రము విడదీసి ఉపయోగించుచు మిగతా ఖనిజములన్నింటిని బారవేయు చుందురు. కాని యొక్కొక్కప్పుడు ఈ యనార్థిక ఖనిజములలో గూడ కొన్ని యుపయుక్త మగుచుండును. అప్పుడు వానితో గలిసియుండు ఆర్థిక ఖనిజము తక్కు వగానున్నను, లేక తక్కువ విలువగల దైయున్నను దీనిని లాభదాయకముగనే త్రవ్వి తీసి ఉపయోగింపవచ్చును. ఇట్టి యనార్థిక ఖనిజములకు ఉదాహరణముగ నీక్రింది వానిని పేర్కొనవచ్చును. చూర్ణజము (కాల్సైటు Calcite). సున్నపురాయి (lime stone), సుద్దమన్ను (clays), స్ఫటికపురాయి (quartz), భూస్ఫటికము (ఫెల్స్పారు fellspar), మాక్షికము (పై రైటు pyrites) మొదలైనవి. వీటిలో కొన్ని, రోడ్లు మరి కట్టడములకు కావలసిన కంకరగాను, సున్నపురాయి మొదలగునవి ద్రవకారులుగాను (fluxes) మాక్షికము గంథ కోత్పత్తికిని ఉపయోగపడగలవు.
చాలచోట్ల ఆర్థిక ఖనిజములు విరివిగా నుపయోగింపబడు చున్నను, అట్టి ఖనిజములు దొరకు అన్ని చోట్లలోను, అవి అన్ని సమయములందును, లాభదాయకముగా పరిగణింపబడక పోవచ్చును. అవి యార్థిక ఖనిజములుగా నుపయోగింపబడగలవా లేదా యను సమస్య ఎన్నియో విషయములపై నాధారపడి యుండును. మొదట, అట్టి ఖనిజములు ప్రకృతిలో తగురీతిని కేంద్రీకరింపబడి యుండవలెను. వీలయినంత తక్కువ ఖర్చుతో వానిని భూమిలో నుండి త్రవ్వితీసి వానితో గలసి యున్న యితర అనార్థిక ఖనిజములనుండి సునాయాసముగా విడదీసి వాని నుప యోగించు స్థితిలోనికి తెచ్చునట్లుండవలెను. అట్టి ఆర్థిక ఖనిజముల యొక్క గాని, వాని నుండి తయారుజేసి వాడబడు వస్తువుల యొక్కగాని క్రయవిక్రయముల ధరలు తగురీతి నుండవలెను. అట్టి ఖనిజముల నిధులు దొరకు చోట్లు రాకపోకల కనుగుణ్యముగా నుండు టత్యావశ్యకము.
ఇట్టి విషయములన్నియు నొక సమయమునుండి మరియొక సమయమునకును, ఒక చోటినుండి వేరొకచోటికిని మారుచు నుండవచ్చును గాన ఆర్థిక ఖనిజములుగా నుపయోగింపబడు ఖనిజము అన్ని చోట్లను, అన్ని వేళల యందును లాభకరముగా నుప యోగింపబడజాలక పోవచ్చును. అల్యూమినియం నూటికి 20-25 పాళ్ళు రాసాయనికముగా కలిసియున్న మన్నులు (clays) సాధారణముగా ప్రతిచోటను ఉండునుగాని వానినుండి యా ధాతువును తేలికగా విడదీయు విధాన మింతవరకు కనుగొనబడనందున నవి యార్థిక ఖనిజములు గానేరవు. నూటికి 30 వంతులు లోహము (Iron) గల ఖనిజములు ఉపయోగపడక పోవచ్చునుగాని నూటి కొక్కవంతు ధాతువులున్న తగరపు ఖనిజములను లాభదాయకముగా త్రవ్వి తీయవచ్చును. అట్లే బంగారము, ప్లాటినము, రేడియం, మొదలైన విలువగల ధాతువులు, నిధులలో కొన్ని లక్షలలో నొక వంతు ఉన్నను, అవి లాభదాయకముగ పరిగణింపబడును.
ఇవిగాక, ప్రస్తుత మెందుకు పనికిరావనుకొన్న కొన్ని ఖనిజములు కొంతకాలము తరువాత నెంతో యుపయుక్తము కావచ్చును. ఉదాహరణమునకు మనదేశ మందు అభ్రకపు గనులలో దొరకు బెరిల్ (Beryl) అను ఖనిజము, చాలకాలమువరకు పనికిరానిదిగా పార వేయ బడు చుండెడిది. కాని గత యుద్ధకాలములో దానికి ప్రాముఖ్యము వచ్చినందున, ఇదివరలో త్రవ్విపోసిన రాతికుప్పలనుండి కూడ ఏరితీయుట జరిగినది.
ఆర్థిక ఖనిజవిధులు - వాని నైజములు - పుట్టుక :- ఆర్థిక ఖనిజనిధులు ప్రకృతిలో పెక్కువిధములుగా నేర్పడి యున్నవిగాని వానిని ముఖ్యముగా రెండు తెగలుగా విభజించవచ్చును. (1) వెయిన్ నిధులు (Vein deposits) (2) పొరల నిధులు (bedded deposits). వీనిలో మొదటివి భూమిలోపలి భాగమునుండి పగుళ్ళద్వారా పైకి ప్రవహించుచు వచ్చిన శిలాద్రవము (magma) మూలమున గాని, చాల వేడిమి, పీడనములతోగూడి అట్లు ప్రవ హించుచు వచ్చిన ద్రావణముల (Solutions) మూలమున గాని యేర్పడినవి. శిలాద్రవము ఘనీభవించునప్పుడు తమతమ విశిష్ట గురుత్వమూలమున వేర్వేరు నిధులుగా నేర్పడిన ఖనిజములలో మాగ్నటైటు (magnetite) క్రోమైటు (Chromite)), ఇల్మెనైటు (Ilmenite) మొదలైనవి.
శిలాద్రవములలో గూడ ననేక విధములయిన ధాతువులు (metals) ఇతర మూలకములు (elements) వాయు రూపమున (gaseous state) గాని, ద్రవరూపమున (fluid state) గాని యిమిడియుండి భూమిలోపల నుంచి కొంత పైకి చొచ్చుకొని వచ్చును చల్లబడుచు నిధులుగా నేర్పడును. ఇట్టి నిధులలో తగరము, టంగ్ స్టన్ (Tungsten) రాగి, సీసము, వెండి, బంగారము మొదలగు ధాతుఖనిములను పేర్కొనవచ్చును. వీటిలో గలసియుండు అనార్థిక ఖనిజము లనేకము గలవుగాని వీనిలో గొన్ని స్ఫటికము (Quartz) చూర్ణిజము (కాల్సైటు - Calcite భూస్ఫటికము (ఫెల్పారు - Felispar) హరిశుల్భిజమ (బేరైట్సు Barytes) మున్నగునవి. ఇదే తెగకు సంబధించిన అలోహ ఖనిజములలో అభ్రకము, మెరుగుమట్టి మొదలగునవి యున్నవి. ఇట్టి వేయిన్ నిధులు సాధారముగా భూమిలోకి చాల యేటవాలుగా నుండును.
భూతలమునకు సమీపముననుండు అంతర్జలము కొంతవరకు ఆమ్లపూరితమై యుండుట వలనను, మరి యితర కారణముల వలనను; అదివరలో నేర్పడిన ధాతు ఖనిజములను కరగించుకొని తిరిగి భూమిలో నుండు పగుళ్ళు మొదలగు వానిలో వేరురూపమున ఖనిజ నిధులనుగా నేర్పరచుట జరుగుచుండును. ఇట్లు కేంద్రీకరింపబడి నిధులు మొదటివానికంటె విలువగలవై యుండును. ఇట్లు రెండవతూరి ఖనిజనిధు లేర్పడుట (Seconda enrichment) అనబడును. ఉదాహరణకు రాగి, వెండి గంధకిదములను చెప్పవచ్చును. మరికొన్నిచోట్ల సున్నపు రాయి (Lime stone) మొదలైన రాళ్ళను కరిగించి వాటిస్థానే వేర్వేరు ఖనిజ నిధులను గూడ జేర్చుట జరుగు చుండును. భూమిలో నుండి పైకివచ్చు నీటితోను, ఇతర ద్రావణములచేతను ఈ నిధులేర్పరుపబడు చుండును. ఇట్టి ఖనిజము లేర్పడుట (Metasomatism) అనబడును. కొన్ని ధాతువులు, ఖనిజములు సాధారణ రాసాయనిక విధానముచే వియోగము (Decomposition) చెందకుండుట వలనను, ఇసుక మొదలగు ఇతర వస్తువులకంటే నెక్కువ విశిష్ట గురుత్వము గలిగియుండుట చేతను నీటిలో కొట్టుకొనిపోయి, కొన్నికొన్ని చోట్ల కేంద్రీకరింపబడును. ఇవి చాలవరకు విఘటన చెందిన (Disintegrated) రాళ్ళ నుండి జనించినవి. ఇట్టి ఖనిజ నిధులను నదీనిధులు (Placer or alluvial) అందురు. బంగారము, తగరపు ఖనిజమైన త్రపుజా రేయిజము (కాసిటరైటు Cassiterite) తిరువాన్కూరు, ఆంధ్రతీరముల దొరకు మోనజై టు (Monozite) మొదలగున వీ జాతికి కొంత వరకు చెందినవి.
వీటియడుగున నేర్పడిన రాళ్ళ (Sedimentary rocks) తో గూడిన ఖనిజములుగూడ చాల గలవు. ఇవి సాధారణముగా రకరకములైన రాతిపొరలలో (Sedimentary rocks) నిధులుగా నేర్పడియుండును. వెయిన్ నిధులవలె నివి యెక్కువ యేటవాలుగా నుండవు. కొన్ని నిధులు (మన్ను, ఇసుక ఖనిజములు) నీటిలో కొట్టుకొని వచ్చి యేర్పడినవి. మరికొన్ని నీటిలో రాసాయనిక అవ షేపము (Precipitation) వలన గలిగినవి. (ఉదా: కొన్ని సున్నపురాళ్ళు, లోహఖనిజములు మొదలైనవి.) మరికొన్ని సముద్రజలము ఎండవేడిమిచే ఇగిరిపోయి నందున ఆ జలములో ఇమిడియున్న లవణములు పొరలు పొరలుగా నేర్పడిన నిధులు. ఇట్టి లవణనిధులుగూడ ననేకములున్నవి. సాధారణముగా రాతియుప్పు నిధులు ఎక్కువగా నున్నను, ఒకేచోట అనేక లవణములు పొరలు పొరలుగా నుండుటగలదు. జర్మనీలో స్టాస్ఫర్టు (Stass_ furt) అనుచోటనుండు లవణ నిధులు చాల ప్రసిద్ధి.
ఆంగారిక ఖనిజములుగూడ నీటియడుగున నేర్పడిన శిలలతోనే గలిసియుండునుగాని వాని పుట్టుకలో కొంత వ్యత్యాసమున్నది. పై చెప్పిన ఖనిజములన్నియు చాల వరకు అదివర కే భూమియందుండిన రాళ్ళు ఛిన్నా భిన్నము లగుటవలన ఏర్పడినవి. కాని బొగ్గు మొదలగు ఖనిజములు కోట్ల సంవత్సరముల క్రితము పుట్టి పెరిగిన చెట్లు చేమలు నీళ్ళలో కొట్టుకొనిపోయి, పెద్ద పెద్ద సరస్సులలో పడి యిసుక, మన్నుపొరలతో కప్పబడుటవలన జనించి నవి. అట్టి చెట్లు చేమలు వేరుచోట్లనుండి కొట్టుకొనివచ్చి యిప్పుడు బొగ్గు ఉన్నచోట పూడ్చ బడినవనియు, అచ్చటనే పుట్టి పెరిగి పూడ్చబడినవనియు రెండు భేదాభిప్రాయములు గలవు, ఒక్కొకచోట ఇసుకరాతి పొరల మధ్య చాల బొగ్గుపొర లుండును. ఈ పొరలలో నార్థికముగా నుపయోగించునవి 2-3 నుండి 100 అడుగుల వరకు మందము గలిగియుండును.
పెట్రోలియం నిధులు అంగారక పదార్థములనుండి యుద్భవించిన వనియు, అట్టి వస్తువులలో చెట్లు చేమలేగాక జంతు సంబంధ మైనవిగూడ గలవనియు తెలియుచున్నది. ఇదిగాక పెట్రోలియం అనంగారక వస్తువులనుండి భూమియందే రాసాయనికముగా నుద్భవించినదనికూడ కొందరి యభిప్రాయము. కాని దీని కెక్కువ ఆధారములులేవు. బొగ్గువలెనే పెట్రోలియం కూడ నీటియందు జనించిన శిలలతోనే కలిసియుండును. కాని దీనితో గూడిన రాతిపొరలు, సరంధ్రములు (Porous) గాను, కొన్ని విధములుగా మడతలు పడి (Folded) వంగియుండవలెను. ఇది నీటికంటే తేలికయగుటచే, భూమిలోపలనే నీటిపై తేలుచుండును. పెట్రోలియం నిధుల పైభాగమున పెట్రోలియం వాయువు (Petroleum gas or natural gas) గూడ కొన్నిచోట్ల నేర్పడియుండును.
ఆర్థిక ఖనిజ నిధుల పరిశీలన - వానిని త్రవ్వి తీయు విధానములు :- ఆర్థిక ఖనిజములను లాభదాయకముగా త్రవ్వి తీయుటకై మొదట ఆయాచోట్లనున్న పలురకములగు రాళ్లను, వాటి గుణములను భూగర్భశాస్త్రరీత్యా పరిశీలించి, పటములు (maps) తయారు చేయుదురు. ఆర్థిక ఖనిజము లున్నవని తెలిసినను, లేక దొరకవచ్చునని యూహించినను తగు స్థలములందు, చిన్న గోతులు (pits) కందకములు, (trenches) త్రవ్విగాని లేక డ్రిల్లింగ్ (drilling) మూలమునగాని వాటి ఉనికి యొక్క వైశాల్యమును పరిశీలించి, ఖనిజముల నిధులు, వాని నిలువ మొదలగు విషయములను సుమారుగా అంచనా వేసి వాటిని త్రవ్వి తీయుటకై గనులేర్పరుచుదురు. అట్టి గనులు, నీరు, రైలుమార్గము లేక యితరబాటలు మొదలుగా గల వసతులన్నియు సరిజూచుకొనిన వెనుకనే, మొదలు పెట్టబడును. ఆర్థిక ఖనిజపుగనులు ముఖ్యముగా రెండురకములుగా నున్నవి. మొదటిది భూమి పైనుండియే లోతుగా గోతులు త్రవ్వితీయునవి. వీనిని క్వారీలు (quarries) అందురు, రెండవది, భూమిలో సొరంగములుగా త్రవ్వి తీయునవి. వీనిలో మొదటిరకపుగనులు, ఖనిజములు భూమి పైననే దొరకుచోట్లగాని, లేక ఖనిజము లెక్కువ విలువలేనివై చాల తక్కువ ఖర్చుతో త్రవ్వి తీయబడగల చోట్లను, ఇంకా యిట్టి యితర సందర్భములలోను తీయుదురు. ఇవి సాధారణముగా 100 అడుగులకంటె ఎక్కువలోతు ఉండవు. కాని, ఒక్కొక్కప్పుడు 400-500 అడుగులవరకు కూడ లోతు ఉండుట గలదు. కొన్ని బొగ్గుగనులు, పలక రాళ్లు, కట్టడపు రాళ్ళు మొదలైన ఖనిజముల గను లీతెగకు చెందినవి. ఇట్టి గనులందు భూమియందుండి వచ్చు ఊటనీరేగాక వర్షపునీరుగూడ చేరుచుండుటచేత ఆనీరు పైకి తోడుటకు వ్యయమధికముగా నగుచుండును.
సొరంగపు గనులు, భూమిలో లోతుగానున్న ఖనిజ నిధులను త్రవ్వితీయుటకును, లేక భూమి పైభాగము నుండి క్వారీలద్వారా త్రవ్వుటకు సాధ్యముగాని, నిధులను త్రవ్వుటకును ఉపయోగింతురు. భూమి పైభాగము నుండి బావులు, లేక యేటవాలుగా నున్న సొరంగముల ద్వారా ఖనిజము లున్న చోట ప్రవేశించి వానిని త్రవ్వి తీయుదురు. ఖనిజనిధి జేరినవిదప దానియందే తగురీతిని వేర్వేరు సొరంగములను త్రవ్వి ఖనిజమును భూమి పైకి తీయుదురు, ఈ సొరంగములు పట్టాలమీద నడచు తొట్టి బండ్లలో ఖనిజమును పైకి తీసికొని పోవుటకును, పనివారు నడుచుటకును, పైనుండి పరిశుభ్రమైన గాలి పారుటకును తగినట్లు వెడల్పు, ఎత్తు గలిగియుండును. ఇట్టి గనులలో నొక్కొక్క ఖనిజమునకు సంబంధించిన సమస్యలు అసంఖ్యాకములుగా నుండును. సాధారణముగా నన్ని గనులలోను నీరూరుచుండును. ఆ నీటిని పైకి తోడుటకు పంపులు ఏర్పాటు చేయుచుండవలెను. ఖనిజములను, వాటి నంటియున్న శిలలను పగులగొట్టుటకై వాడు ప్రేలుడుమందు నుపయోగించుటచే జనించు విష వాయువులను, తదితర విషవాయువులను పైకి పంపుటకై పరిశుభ్రమైన గాలి గనులలోనికి వచ్చున ట్లేర్పాట్లు చేయవలెను,
బొగ్గుగనులు సుమారు 2000 అడుగులకంటే ఎక్కువ లోతుగా నుండవు. కాని కొన్ని ధాతు ఖనిజములగనులు 10,000 అడుగులకంటెగూడ ఎక్కువ లోతుగా నుండును. అట్టి గనులలో భూమిలోనికి పోయినకొలది వేడిమి యెక్కువగుచుండుట చేత పైనుండి పంపెడు పరిశుభ్రవాయువును చల్లబరచి పంపవలసి వచ్చుచుండును, ప్రపంచములో చాలాచోట్ల బంగారపు గనులు 10 వేల అడుగులపైగా లోతుగా నున్నవి. కోలారులో నున్న బంగారపు గనులుగూడ నట్టివానియందు జేరినవే. ఇట్టి లోతుగల గనులలో, పైనున్న శిలల పీడనమువలన ఒక్కొక్కప్పుడు రాళ్ళు తమంతటతామే ప్రేలు చుండి (Rock burst) ప్రమాదములు సంభవించుచుండును. అట్లే కొన్ని బొగ్గుగనులలో కొన్ని వాయువులు అగ్ని సోకగానే ప్రేలుటగాని, మండుటగాని సంభవించి ప్రమాదములు కలుగుచుండును. ఖనిజములు త్రవ్వి తీయగానే పైనున్న రాళ్ళు విరిగి పడకుండ కర్ర, లేక యినుప దూలములు, స్తంభములు, పోటీ పెట్టి యుంచుట గనులలో సామాన్య విషయమే. కొన్ని బొగ్గుగనులలో బొగ్గు తీయగానే, ఖాళీయైన స్థలమును ఇసుకతోగాని మరి యితరరాళ్ళ ముక్కలతోగాని నింపు చుందురు. ఇట్లు చేయుటచే గనులలోని పైభాగపు రాయి విరిగి పడకుండా నుండును. ఇట్లిసుకతో నింపుట సేండ్ స్టోయింగ్ (San stowing) అనబడును. ఇంకను ఇట్టి సమస్యలవలన ఒక్కొక్కప్పుడు, ఖనిజ నిధులు బాగుగా నున్నను వాని సేకరణ లాభదాయకముగా నుండదు. పెట్రోలియం గనులు పై జెప్పిన గనులవలెగాక మొదట బోరింగు వల్ల నీ ఖనిజమున్నదని తెలిసినచోట, పై నుండి యే పంపుల నేర్పరచి గొట్టముల ద్వార దీనిని పైకితీయుదురు. వీటిని నూనెబావు (Oil wells) లందురు.
ముడి ఖనిజములను శుభ్రపరచుట :- ముడిఖనిజములను గనులనుండి త్రవ్వితీసిన వెనుక వాటిలో వివిధ పరిశ్రమలకు పనికివచ్చు ఖనిజములను వేరుచేసి శుభ్రపరుచుదురు. ఇట్లు శుభ్రపరచుట ఓర్ డ్రెస్సింగు (ore dressing) అందురు. పైన జెప్పినట్లు అలోహ ఖనిజములను చాలవరకు ఆ రూపములలో నే పరిశ్రమలలో వాడుదురు. అందు వీటిని శుభ్రపరచుట అనగా వానితో కలసియున్న అనార్థిక ఖనిజములు, రాళ్ళు మున్నగువాటిని తీసివేయుటయే. అట్టి ఖనిజములను, రాళ్లను, చేతులతో నేరి వేయుట, ఖనిజములను నీటియందు కడుగుట, మొదలగు విధానములచే వేరు జేయబడుచున్నవి. ధాతు ఖనిజములను శుభ్రపరచిన తరువాత, వాటిని కరగించిగాని లేక ఇతర రాసాయనిక విధానములచే గాని, వాటిలోనుండు ధాతువులను వేరు జేయుదురు. బంగారు మున్నగు కొన్ని ధాతువులు ఆరూపములోనే రాళ్లయందు మిశ్రమై దొరకుచుండును, అట్టి ధాతువులను సేకరించుట సులభ సాధ్యము. ఆ ధాతువులుండు శిలలను మెత్తగా పొడి గొట్టి నీటియందు తగురీతిని కడుగుటటచే ధాతువులు చాలవరకు వీడిపోవును. చివరకు మిగిలిపోయిన కొంచెము భాగమును రాసాయనిక విధానములచే సేకరింతురు.
ఖనిజములలోని ధాతువులను సేకరించుటకు ముందు ఒక్కొక్కప్పుడు వేర్వేరు విధానములచే వాటిని సంకేంద్రీకరింప జేయుదురు. ఇట్టి విధానము లనేకములు గలవు. ఉదాహరణమునకు అయస్కాంతములచే విడదీయుట (Magnetic separation), నురుగుచే విడదీయుట (Froth floatation) పేర్కొన వచ్చును. అయస్కాంతముచే నాకర్షింపబడు ఖనిజములు సునాయాసముగా వేరుచేయ బడవచ్చును. నురుగుచే వేరుచేయబడు విధానము ఇటీవల కనిపెట్టబడినదే. ఇది యెక్కువగా గంధకిద (సలైఎడు) ఖనిజముల కుపకరించును. ఖనిజములను మెత్తగా పొడిచేసి, కొన్ని రాసాయనిక వస్తువులతో బాటు నీటిలో కలిపి చాల సేపు యంత్రసహాయమున చిలికెదరు. అట్లు చేసినప్పుడు గాలిబుడగల వలన ఏర్పడిన నురుగుతోబాటు ఖనిజకణములు వేరయి, యితర అనార్థిక ఖనిజములు నీటి యడుగుభాగమున జేరును. ఇటీవల ఈ విధానము అలోహ ఖనిజములు సంకేంద్రీకరింపబడుటకు గూడ కొలదిగా నుప యోగింపబడు చున్నది. ఉత్తర ప్రదేశములోనున్న ఖిలేరి గనులలో ఇదివరకు పనికి రాదనుకొన్న సున్నపురాయి నీవిధమున బాగుపరచి యిప్పుడు సిమెంటు తయారుచేయుచున్నారు.
ఇనుము మొదలగు లోహ ఖనిజములనుండి ధాతువులను వేరుచేయుటకై వాటిని బొగ్గు, మరికొన్ని ద్రవీకరణ వస్తువులతో (Fluxes) జేర్చి కొలుములలో కరగింతురు. ఈ విధానమునందు బొగ్గు వేడిని జనింప జేయుట యేగాక రాసాయనికముగా గూడ పనిచేయును. అల్యూమినియం మొదలగు ధాతువులను ఖనిజముల నుండి విడదీయుటకై విద్యుచ్ఛక్తి విరివిగా నవసరము. ఈ విధముగా నార్థిక ఖనిజములు లాభ దాయకములుగా నుండగలుగుట వాటియందున్న ధాతువులను విడదీయు పద్ధతుల పై గూడ నాధారపడియుండును.
ఆర్థిక ఖనిజములు, వానినుండి యుత్పత్తియగు పదార్థముల ఉపయోగములు :- ఆర్థిక ఖనిజముల యొక్కయు, వానినుండి తీయు ధాతువుల, ఇతర వస్తువుల యొక్కయు ఉపయోగము అసంఖ్యాకములుగా గలవు. మనము ప్రతిదినము వాడుకొను పెక్కు వస్తువులందు ఖనిజము లేదో యొక రూపము వహించియుండును. ఉదాహరణకు కాగితములందు సుద్ద మన్ను (China clay) పూత యుండును. పెన్సిళ్ళ ములుకులు మెరుగుమట్టితో తయారు చేయుదురు. ప్రతి చిన్న మేకుగూడ ఇనుము ఖనిజములనుండి తయారుగాబడిన యినుముతో చేసినదే.
కొన్ని ఖనిజములు చాల అరుదుగను, స్వల్పపరిమాణములలోను దొరకినను, వాటి ప్రాముఖ్యము చాల ఎక్కువగా నున్నది. తేజాతువు (రేడియం) కిరణాతువు (యురేనియం), మొదలగు ధాతువులు ఖనిజము లిందుకు తార్కాణము. ఇవిగాక పెక్కు ధాతువులు, వివిధములైన ధాతుమిశ్రణములను (alloys) తయారుచేయుట యందుపకరించుచున్నవి. కొన్ని మిశ్రణముల యందు ఒక్కొక్క లోహము మిగుల కొలదిగా నున్నప్పటికిని దాని కలయిక వలన మార్పు చాలా యెక్కువగానుండును. నూటికి ఒకపాలుకంటే తక్కువగా రోచాతువు (వెనాడియం) అను ధాతువు చేర్చుటవలన ఉక్కు కెంతయో బలము చేకూరును. అట్లే చండాతువు (టంగ్ స్టన్) అను ధాతువు గట్టితనము ఎక్కువగల యనేక మిశ్రణము లలో నుపయోగింతురు. భూగర్భశాస్త్రజ్ఞులకు మాత్రమే తెలిసి పరిశ్రమలలో నెందుకు పనికిరావనుకొని, తదుపరి యెంతో నుపయుక్తములైన కొన్ని ఖనిజము లిటీవల ననేకము గన్పించుచున్నవి. కృమిరూపిజము (వర్మిక్యు లైటు (Vermiculite). సిల్లిమనైటు (Sllimanite) మొదలగు ఖనిజము లిటువంటివి. ఇట్టి ఖనిజముల సంఖ్య వాని ఉపయోగములు నానాటి కెక్కు వగును నే యున్నవి.
భారతదేశపు ఖనిజపంపద ఇతరదేశములతో గల తారతమ్యత :- ప్రపంచములో నేదేశమందును దానికి కావలసిన ఖనిజములన్నియు దొరకవు. కొన్ని దేశము లందు ముఖ్య ఖనిజసంపద యెక్కువగా నుండును. అందుచేత వివిధ దేశములమధ్య ఖనిజముల యెగుమతి దిగుమతులు సర్వసామాన్యముగా జరుగుచుండును. ఖనిజసంపద యెక్కువగా గలిగి వానిని ఉపయోగించు విధానములను బాగుగ చక్కబరుచుకొనిన దేశములు, ఆర్థిక విషయములందును రాజ్యాంగ విషయములందును ముందడుగు వేసి యుండును. భారతదేశములో ఇతర దేశములవలెనే కావలసిన ఖనిజము లన్నియు పూర్తిగా లేకపోయినను కొన్ని ముఖ్య ఖనిజసంపదలలో అది ఇతర దేశముల కెంతమాత్రమును దీసిపోదు. వీనిలో ముఖ్యముగా బేర్కొనవలసినవి, తిరువాన్కూరు తీరమున దొరకు మోనజైటు ఇసుక(monozite sands). అయోరజజారిజము (ilmenite), అభ్రకము (mica), మాంగనము (manganese), ఇనుము (iron), అల్యూమినియం (Alluminium) ఖనిజములు. కొలది సంవత్సరముల క్రితమువరకు మనదేశపు ఖనిజములు ఎక్కువగా ముడిస్థితిలోనే యితర దేశముల కెగుమతి యగుచుండెడివి. కాని యిటీవల వాటిని వీలైనంతవరకు మనదేశమందే యుపయోగించుచు కొన్ని ధాతువులను గూడ నిచ్చటనే తయారుచేయు నేర్పాట్లు జరుగుచున్నవి. మనకు కావలసిన వాటికంటె నెక్కువగా నున్న ఖనిజములను కొన్నింటిని మాత్ర మితర దేశముల కెగుమతి చేయుచున్నాము. మనకు కావలసిన ఖనిజములను దిగుమతి చేసికొనుచున్నాము.
మన దేశమునుండి యెగుమతియగు ముఖ్య ఖనిజములు అభ్రకము, మాంగనము, లోహఖనిజములు, బొగ్గు మొద లైనవి. నెల్లూరు, హజారిబాగ్ జిల్లాలలో దొరకు అభ్రకము చాల ప్రసిద్ధికలది. ఇచ్చటి కార్మికులు అభ్రకమును పలుచటి పొరలుగా చీల్చి, కత్తిరించుటలో నసామాన్య మగు నిపుణత గాంచిరి. అభ్రకము ఎక్కువగా విద్యుధ్యంత్ర నిర్మాణమునం దుపయోగింపబడు చుండుట చేతను ఆ పరిశ్రమ యింకా మనదేశమునం దభివృద్ధి చెందనందునను అభ్రకమింకా చాలవరకు ఎగుమతి చేయబడుచున్నది. మేలిమి రకమునకు చెందిన మాంగనము, లోహఖనిజములు మనదేశమం దపారముగ నున్నవి. ఇట్లున్నను మనదేశమం దింతవరకు మనకు కావలసిన యినుము, ఉక్కు తయారగుట లేదు. ఇటీవల మధ్య ప్రదేశమునందు ఖిల్లాయివద్దను, ఒరిస్సాలో రూయిర్ కేలావద్దను, బెంగాలులో దుర్గాపూరు వద్దను పెద్ద పెద్ద యినుము, ఉక్కుకర్మాగారముల నేర్పరచుటకు ప్రయత్నములు సాగుచున్నవి. 5, 6, సంవత్సరములలో మనకు కావలసినంత యినుము, ఉక్కు ఇచ్చటనే తయారు కాగలదని యంచనా వేయబడినది. మన దేశమందు విరివిగా దొరకు బాక్సైటు (Bauxite) నుండి అల్యూమినియం తయారుచేయుటకును, మోనజైటు మొదలగు ఖనిజములనుండి పలువిధముల నుపయోగింపబడు అణుశక్తిని తయారు గావించుటకునుగూడ ఏర్పాట్లు జరుగుచున్నవి. మనకు కావలసినంత పెట్రోలియం మనదేశ మందింతవరకు దొరకనందున ఈ ఖనిజమునకై తీవ్ర పరిశో ధనలు జరుగుచున్నవి. అదీగాక యితర దేశములనుండి ముడి పెట్రోలియం తెప్పించి మన దేశమందు బొంబాయి, విశాఖపట్టణములవద్ద, దానినుండి పెట్రోలు, కిరోసిన్ మొదలగు నూనెలు, తదితర వస్తువులు తయారుజేయు పెద్ద పెద్ద యంత్రాగారములు నెలకొల్పబడుచున్నవి.
ఈ క్రింద కొన్ని ముఖ్యఖనిజముల పేర్లు, అవి యెక్కువగా నుత్పత్తియగు దేశముల పేర్లు ఇవ్వబడినవి. వాటిక్రింద మన దేశమునందు 1954 వ సంవత్సరమున ఉత్పత్తి యయిన కొన్ని ముఖ్యఖనిజములు, వాటి విలువలు ఇవ్వబడినవి.
బొగ్గు : - అమెరికా, జర్మనీ, ఇంగ్లండు, రష్యా.
పెట్రోలియం :- అమెరికా, రష్యా, వెనుజులా, రుమేనియా, ఇరాన్, (జర్మనీ, ఇటలీ, ఫ్రాన్సు, ఇంగ్లండు, జపానుదేశములలో పెట్రోలియం చాల తక్కువ.)
ఇనుము :- అమెరికా, రష్యా, ఇండియా, ఫ్రాన్సు, ఇంగ్లండు, జర్మనీ, బ్రెజిల్ .
అల్యూమినియం :ఫ్రాన్సు, అమెరికా, హంగరీ, ఇటలీ, ఇండియా. తగరము :- మలయా, బొలివియా, డచ్చి యీస్టు యిండీస్, (అమెరికా, రష్యా, ఫ్రాన్సు, ఇటలీ, జపాను దేశములలో నిది చాల తక్కువ.)
తుత్తునాగము (Zinc) :- అమెరికా, కెనడా, ఆస్ట్రే లియా. (ఫ్రాన్సులో తక్కువ.)
వర్ణజారేయిజము (క్రోమైటు Chromite) రష్యా, టర్కీ, దక్షిణరొడీషియా.
మాంగనము (Manganese) ;- రష్యా, ఇండియా, ఘనా (గోల్డుకోస్టు), దక్షిణ ఆఫ్రికా, (ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, జపానులలో తక్కువ.)
చండాతువు (టంగ్ స్టన్ Tungsten):- చైనా, బర్మా, మలయా, అమెరికా (రష్యా, జర్మనీ, ఇటలీలలో తక్కువ.)
బంగారము :- దక్షిణ ఆఫ్రికా, రష్యా, కెనడా, ఆస్ట్రే లియా, దక్షిణ రొడేషియా (ఇండియాలో తక్కువ.)
వెండి :- మెక్సికో, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, పెరూ, (ఇండియాలో తక్కువ, ఇటీవల తుత్తునాగము, సీసపు గనులలో కొలదిగా దొరకుచున్నది.)
పాదరసము (Mercury):- స్పెయిను, అమెరికా.
అభ్రకము :- ఇండియా, అమెరికా, రష్యా.
మోనజైటు (Monozite) :- ఇండియా, బ్రెజిల్,
వజ్రములు (Diamonds) :- గోల్డుకోస్టు (ఘనా), బెల్జియన్ కాంగో, దక్షిణ ఆఫ్రికా, బ్రెజిల్.
లిఖిజము (గ్రాఫైట్ (Graphite) :- కొరియా, ఆస్ట్రే లియా, జర్మనీ, సిలోన్.
కిరణాతువు (యురేనియం) :- బెల్జియకా కాంగో, కెనడా (కొంత ఆస్ట్రేలియా, అమెరికా గూడ.)
1954 వ సంవత్సరమున ఇండియాలో నుత్పత్తియైన కొన్ని ముఖ్య ఖనిజములు, సుమారుగా అంచనా వేయబడిన వాటి విలువలు:-
మొత్తము ఖనిజముల విలువ (పెట్రోలియంగాక)
1958. 1.12,78,21,111. 1954 o రూ. 1,02,51.97,252 (ఇంకా కొన్ని ఖనిజము లీక్రింది పట్టికలో నివ్వబడ లేదు.) నిజము బొగ్గు మొత్తము విలువ రూ. 36,886,810 టన్నులు 58,98,82,850 ఖనిజము మాంగనము అభ్రకము బంగారము రాగి (ఖనిజము) మొత్తము
ఆర్ధిక భూగోళశాస్త్రము విలువ రూ. 1.418.847 " 19.54.17.452 103.881 0.3. 1.55.81,884 239,188 ఔన్సులు 5,02,08,814 522.89.86.036 1,87.22.628 ఇనుము (ఖనిజము) 4.808.279 842,750 .. ఆయో రిజజా రిజము (ఇల్మెనైటు) క్రోమైటు 240,518 " 79,80.210 $5,507 " 13,59,607 812.120 41.58.888 తుత్తునాగము (సంకేంద్రీ కృతములు) 3,974 10,80.898 .. వెండి 185,185 ఔన్సులు 6.67.880 బాకై ఎటు 74,747 టన్నులు 8,27,785 వజ్రములు 1,995 కారట్లు 4,74,286 పచ్చలు (emeralds) 508.180 " 8,70,406 18,792 టన్నులు 2,81,879 75.508 5.47.189 2. 3o. సంబం ఓలర్ (రంగుముద్ద)
పి. వేం>
ఆర్థిక భూగోళశాస్త్రము :- పరిసరములకు ధించి, మానవుని ఆర్థికచర్యలను గురించి తెలుపు శాస్త్ర మును ఆర్థిక భూగోళశాస్త్రమని నిర్వచింపవచ్చును. ప్రతి భౌగోళిక ప్రాంతమునందును పరిసర ప్రకృతికి అనువగునట్లు మానవుని ప్రవృత్తి మారుచుండును. అనగా ప్రదేశ భేదమునుబట్టి మానవుని ఆహారము, దుస్తులు, వృత్తి మొదలగునవి ప్రకృతి కల్పించు అవకాశములను బట్టి మారుచుండును.
ఆహారములు, ముడిపదార్థములు, ఆర్థిక ఖనిజములు ఆటవిక వస్తువులు, భారీపరిశ్రమలు, వాటి సరఫరా, ముడిపదార్థముల యొక్కయు యంత్రములచే తయా రైన పదార్థములయొక్కయు పరస్పర వినిమయము అంతర్దేశీయ విదేశీయ వర్తక వ్యాపారములు, మున్నగు అంశములయొక్క పరిశీలనమే ఆర్థిక భూగోళ శాస్త్రమందలి ముఖ్యమైన విషయము.
పై విషయములను ఇంకను సూక్ష్మముగా తెలుపుటకై ఈ క్రింది విధముగా అంతర్విభాగము చేయనగును. 273