Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆర్కిమెడీసు

వికీసోర్స్ నుండి

గలదు. ఈ ప్రపాఠకమునందు పురాతనార్య సంస్కృతి గోచరించుననుటకు ఇందలి మేరుగత సూర్య వర్ణనమే ప్రమాణము. ఉత్తరధ్రువ గోచరమగు సూర్యవిషయక విజ్ఞానము ఆర్యపరంపరా ప్రాప్తమై ఇందు తెలియవచ్చును. ఇందు మేరుగత కశ్యపసూర్యుడు, సప్త సూర్యులు, సూర్య మహత్త్వము, సంవత్సరస్వరూపము మొదలగు బహువిషయములు వర్ణితములు. వసంతాది ఋతువులు అతి మనోహరముగా వర్ణింపబడినవి.

స్వభావసిద్ధమైన ఇందలి ఋతువర్ణనము, సంవత్సర పరివర్తనమును, నాటి సాంఘికజీవనమును ప్రత్యక్షము గావించుచు, తరువాత బయలు వెడలిన ఋతువర్ణనలకు మార్గదర్శకమైన దనవచ్చును.

ద్వితీయ ప్రపాఠకము స్వాధ్యాయ బ్రాహ్మణ మనబడును. ఇది మొదలుగా నైదు ప్రపాఠకములు వైదికకర్మ వరములు. ఆరవది పితృమేధ మనబడును. 7,8,9 ప్రపాఠకములే శిక్షావల్లి, ఆనందవల్లి, భృగువల్లి అనబడేడి ఉపనిషత్తులు. ఈ మూడింటికిని వేదాంతము లను ఖ్యాతి కలదు. ఆత్మైకత్వ విజ్ఞానమునకు ఆధారములైన యీ ఉపనిషత్తులు దేశమంతట నేడును వ్యాప్తికెక్కి యున్నవి.

బృహదారణ్యక మునందలి 7-8 అధ్యాయములవలె ఇందలి దశమ ప్రపాఠకము ఖిలమనబడును. కర్మోపాసన బ్రహ్మ కాండములలో జెప్పగా మిగిలిన దానిని పూర్తిగా తెల్పెడి ప్రకీర్ణరూపమైన గ్రంథము 'ఖిల' మనబడును. అట్టి ఈ దశమ ప్రపాఠకమైన నారాయణోపనిషత్తు, పూర్వోక్తమైన వల్లీత్రయమువలె శుద్ధముగా బ్రహ్మ ప్రతిపాదకము కాదు. దీనికి యాజ్ఞ క్యుపనిషత్తని ప్రసిద్ధి గలదు. అయినా, “నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణమ్" ఇత్యాది మంత్రముల సకల జగ దాత్మకుడు వర్ణింపబడుటం బట్టి దీనికి నారాయణోపనిషత్తను పేరు వ్యాప్తమైనది.

ఈదశమప్రపాఠక పాఠ సంప్రదాయము దేశమున బహువిధముగా నున్నది. ద్రావిడ పాఠమున ఇందలి అనువాకములు 64. కర్ణాటక పాఠమున 74. మరికొన్నిచోట్ల 80 అనువాకములు. సాయణాచార్యులు 64 అనువాకముల పాఠమే భాష్యమున గ్రహించిరి. ఈ పాఠ భేదమే దీని అర్వాచీనతను బలపరచుచున్నది.


ఐతరేయ బ్రాహ్మణమునకు అనుబంధమైన ఏకారణ్యకాండమం దైదు భాగములు కలవు. అందు ప్రథమ ద్వితీయారణ్యక భాగములందు ఐదేసి అధ్యాయములును. తృతీయమున రెండును, చతుర్థమున నొకటియు, పంచమమున మూడును, అధ్యాయములు గలవు.

ఇందు ప్రథమారణ్యకభాగమునందు సత్రయాగము, మహావ్రతము మొదలయినవి వర్ణితములు. ద్వితీయ తృతీయారణ్యక భాగములు జ్ఞానబోధకములు. వీటికి ఐతరేయోపనిషత్తని పేరు. నాల్గవదానిలో మహానామ్నీ మంత్రములు చెప్పబడినవి. అయిదవదానిలో మహావ్రత ప్రయోగము వివరింపబడినది. అందుచే నిది యర్వాచీన కాండమని తెలియుచున్నది. ఈ యభిప్రాయము భాష్య కర్తయగు సాయణాచార్యులు తెలిపినట్టు "పంచ మారణ్యక మృషిప్రోక్తం సూత్రమ్, ప్రథమారణ్యకం త్వపౌరుషేయం బ్రాహ్మణమ్ " అను భావము వల్ల ధ్రువ పడుచున్నది.

ప్రతివేదమునకును దానికి సంబంధించిన బ్రాహ్మణ మందో, ఆరణ్యకమునందో కొంచెముగానో, గొప్పగానో, ఉపనిషద్భాగము గూడా చేరియున్నమాట సత్యము. అట్లు చేరిన ఉపనిషద్భాగములు కర్మప్రతిపాదకములు గాకపోయినా, కర్మము జ్ఞానార్థమే కావున కర్మనిష్ఠులగు వారికి, జ్ఞానమార్గము ఉపదేశించుట ఆవశ్యకమను తలంపుతో తాత్కాలిక ఋషులు వాని నందు చేర్చి యుందురు. అది సముచితమే కదా!

మ, నూ, నా, కా.

ఆర్కిమెడీసు ( క్రీ.పూ. 287-212 ) :- క్రీస్తుకు పూర్వము మూడవశతాబ్దియందు సిసిలీ దేశమునకు రాజధాని యగు సైరకూసు అను నగరమును హైరో అను రాజు పరిపాలించుచుండెను. ఆర్కిమెడీసు హైరో అను రాజునకు సమకాలికుడు. అతడు ఉత్తమమైన కుటుంబములో జన్మించెను, ఆతని తండ్రియగు ఫీడిన్ (Pheidis) ఖగోళ శాస్త్రజ్ఞుడు, అతడు హైరో రాజుతో ఎక్కువ పరిచయమును గలిగియుం డెను.

అలెగ్జాండ్రియా నగరమున యుక్లిడు (Euclid) అను గణితశాస్త్రోపాధ్యాయుడు ఉండెను. అతనిదగ్గర ఆర్కిమెడీను విద్యాభ్యాసము చేయుకాలమున ఈజిప్టుదేశ మందు నీటిపారుదలకు గల అవశ్యకతను గుర్తించెను.

ఇడియే ఆర్కి మెడియన్ సర్పిలయంత్రము (Archemedian Screw) ను కనిపెట్టుటకు కారణమయ్యెను.

హైరోరాజుకొరకు తయారు చేయబడిన పెద్ద నౌక నుండి నీరు తొలగించుటకుగాను ఇతడు నీరు పైకెత్తునట్టి ఈ పరికరమును కనుగొనేనని మరియొక ప్రతీతి కలదు. ఆర్కి మెడియన్ సర్పిలయంత్రము మిక్కిలి స్థూల రూపములో ఒక లోహముతో చేయబడిన గొట్టము అది ఒక గట్టి స్తూపము చుట్టు సర్పిల ఆకారములో వంచబడి ఉండును. కడ్డీ స్తూపాకారపు చివరలయందు మొత్తము పరికరమును దాని ఇరుసుచుట్టును త్రిప్పుటకు వీలుగా భ్రమణ కీలకములు అమర్చబడియుండును. మెలికలు 'తిరిగిన గొట్టపు క్రింది చివరి పైకెత్తబడవలసిన నీటిలో నుంచి స్తూపాకారముగల గొట్టమును దిఙ్మండలమునకు (Horizon) ఏటవాలుగా నుంచి, ఆ పరికరమును త్రిప్పిన యెడల, క్రమముగా నీరు ఒక సర్పిలము (Spiral) నుండి మరియొక సర్పిలములోనికి ఎక్కును. ఇదే సూత్రము నేడు గోధుమలు మున్నగు ధాన్యముల విషయములో వాటిని పైకి చేరవేయు యంత్రములలో ఉపయోగించ బడుచున్నది.

ఆర్కి మెడీసుచే కనుగొనబడిన అనేక యంత్రములలో ఆర్కి మెడియన్ సర్పిలయంత్రము ఒకటియై యున్నది. అతడు తులాదండము (Lever) యొక్క సూత్రమును కనుగొనెను. కప్పీలను (Pulleys), తులాదండములను ఉపయోగించి రోమన్ దండయాత్రికులకు భయమును కలిగించునట్లు అతిభారముతో నుండు పెద్ద పెద్ద నౌకలను గూడ పై కెత్త గలి గెనని చెప్పబడుచున్నది. "ఒక తులా దండమును దానిని నిలువబెట్టుటకు కొంత స్థలమును ఇచ్చినచో, నేను యావత్ప్రపంచమును కదిలింతును." అని ఆర్కిమెడీసు చేసిన సుప్రసిద్ధమగు ప్రతిజ్ఞ వలన ఈ సూత్రమునుగూర్చి అతనికిగల స్పష్టజ్ఞానము తేటపడు చున్నది. గెలిలియో కాలమువరకు తిరిగి ఇతని సిద్ధాంతములను అందుకొనగల ప్రయోగ శాస్త్రవేత్త వేరొకడు జన్మించలేదు.

ఆర్కి మెడీసు తన పేరుతో వ్యవహరింపబడు ఈ దిగువ సూత్రముతో మిక్కిలి ప్రఖ్యాతిగాంచెను :

“ఒక పదార్థము ద్రవములో మునిగినపుడు అది నష్టపోవుభారము దానిచేత తొలగింపబడిన ద్రవభారమునకు సమానము." ఆర్కిమెడిస్ కనుగొనిన సూత్రములలో నిది మిక్కిలి ప్రసిద్ధమగు సూత్రము. ఈ సూత్రమును కనుగొనుటకు ఏర్పడిన పరిస్థితులు వివరించు ఒక చక్కని గాథ కలదు. హీరోరాజు తన కొరకు ఒక కంసాలి చేసి యిచ్చిన బంగారు కిరీటము యొక్క పారిశుధ్యమును నిర్ణయించవలసినదిగ విజ్ఞాన సమస్యలయందు ఆసక్తుడగు ఆర్కి మెడీసును ఆజ్ఞాపించెను, ఆర్కి మెడీసు ఆ శాస్త్రీయ సమస్యయందు నిమగ్నుడై యుండెను ఇట్లుండ ఒక వేసవిలో ఒకనాటి సాయం కాలమున ఆర్కి మెడీసు పౌర స్నానాలయమునందు స్నానము చేయు చుండెను. అట్టి సమయమున అతనికి ఆ సమస్యాపరిష్కా రము స్ఫురించెను. తత్ క్షణమే అతడు నగరవీధులగుండా వివస్త్రు డై ‘యురేకా', 'యురేకా' (నేను కనుగొంటిని నేను కనుగొంటిని) అని అరచుచు పరుగెత్తెను. అప్పుడతనికి స్ఫురించిన ఆ సమస్యా పరిష్కారము పై సూత్రము ననుసరించి ఇట్లుండి యుండవచ్చును. ఆ కిరీటముతొ సమానమగు భారముకల స్వచ్ఛమగు బంగారము నీటిలో ముంచబడిన పుడెంత భారమును నష్టపోవునో కిరీటము కూడ నీటిలో ముంచబడినపుడు అంతేభారమును నష్టపోవలెను. అపుడే ఆ కిరీటములోని బంగారము పరిశుద్ధ మగునదిగా గ్రహింపబడును. కాని అవి నష్టపోవు భారము ఎట్టి వ్యత్యాసమున్నను అది కల్మషమగు బంగారముగా గ్రహింపబడును.

గరిమనాభి, (Centre of Gravity) తులాదండము, (Levers), ఉత్ల్పవనము (Buoyancy), అను మూడు విషయములలో నితడొనర్చిన పరిశోధనలు విజ్ఞానశాస్త్రాభివృద్ధి కెంతయు తోడ్పడినవి. రేఖాగణిత శాస్త్రమునందు కూడ వివిధవిషయములను గూర్చి అతడు వివవరించెను. అతడు ఈ క్రింది విషయములపై గ్రంథములు వ్రాసెను.

1. 'గోళము, స్తూపము' ఇందు గోళములు, శంఖులు, ఘన సమచతుర్భుజములు, స్తూపములు- అను వాటియొక్క కొలతలు శుద్ధ రేఖాగణిత విధానము ననుసరించి చూపబడినవి. ఈ గ్రంథము రెండు భాగములుగా నున్నది.

2. వృత్తము యొక్క కొలత.

3. ఘనశంఖులు; ఘనగోళములు ఇందు 32 ఆకాంక్షా సిద్ధాంతములు ప్రతిపాదింపబడినవి.

4. సర్పిలములు; ఇందు 28 ప్రతిపాదనలు కలవు.

5. సమతలముల యొక్క గరిమనాభిత్వము. ఇది రెండు భాగములుగా నున్నది. లోగడ అరిస్టాటిలు చే వివరింపబడిన విషయములు సాపేక్షముగా అనుమానాస్పదములుగాను అశాస్త్రీయములుగాను ఉండెను. అందుచే అర్కి మెడీను ఇందు వివరించిన విషయములు సిద్ధాంత పూర్వకములై యాంత్రిక శాస్త్రమునకు పునాదులుగా భావింపబడుచున్నవి. ఈ గ్రంథమునందలి మొదటి భాగములో పదునేను ప్రతిపాదనలును, ఏడు సిద్ధాంతములును (Postulates) కలవు. రెండవ భాగ మందు పది ప్రతిపాదనలు కలవు. (1) రెండు భారములు, (2) సమానాంతర చతుర్భుజము, (3) త్రిభుజము. (4) సమలంబ చతుర్భుజము, అను వాటి యొక్క గరిమ నాభినిగూర్చి నేడు వాడుకలోనున్న నిరూపణలతో ఇతని నిరూపణలు సమానముగా నున్నవి.

6. పరవలయ (Parabola) వైశాల్యము. ఇందు ఇరువదినాల్గు ప్రతిపాదనములు కలవు. “పరవలయము యొక్క ఖండవైశాల్యము, ఆ ఖండమునకు సమానమైన కొలతలతో కూడిన ఆధారము, లంబముగల త్రిభుజము యొక్క వైశాల్యములో 4/5 వంతు ఉండును" అనుటకు రెండు నిరూపణములు ఇయ్యబడినవి.

7. తేలెడివస్తువులు; ఇది రెండు సంపుటముల గ్రంథము.

8. సొమ్నైటిసు (Psamnites) ఇసుకను లెక్కించు సాధనము (Sand reckoner). ఇది సంఖ్యా పరిభాషలతో కూడిన గ్రంథము.

9. విధానము (Method): ఇది 1906 లో కనుగొనబడినది. ఇది ఒక ముఖ్యమైన గ్రంథము. ఇందు ఆర్కి మెడీసు యాంత్రిక పద్ధతులను వివరించెను. వీటిచే ఆతడు అనేక నిర్ణయములు చేయగలిగెను.

10. సమతల రేఖాగణిత శాస్త్రమునందలి ప్రతిపాదనములు.

ఆర్కిమెడీసు పైన పేర్కొనబడిన విషయమునేకాక త్రాసు, కప్పీలు, ఖగోళశాస్త్రము, కాంతియొక్క వక్రీభవనము మొదలగు విషయములలో కూడ కృషి సల్పినట్లు తెలియుచున్నది.

పూర్వకాలపు యాంత్రిక నాగరకతకు ఆర్కిమెడీసు స్థాపకుడై యున్నను, సైరకూసు రక్షణ సంస్థను ఆయత్త పరచుట వలన అతనికీర్తి నల్దిక్కుల వ్యాపించియున్నను ఆతనికి యాంత్రికసాధనములపై ప్రబలమైన అనాదరము ఉండెడిది. కావున వాటియెడ ఆతనికి గల ద్వేషము -ఆతడు వాటిని ఎక్కడను వ్రాసి పెట్టియుండకపోవుటచే విదితమగుచున్నది. ఇట్టి యాంత్రిక పరిశోధనలు కేవల శాస్త్రజ్ఞుని కీర్తిప్రతిష్ఠలకు లోపము నాపాదించు నని అతడు తలంచెను.

రోమను సేనానాయకుడగు మార్సిలను సైరకూసు నగరమును జయించునాటికి ఆర్కి మెడీను తన అవసాన దశ యందుండెను. విజయమునొందిన రోమను నాయకునకు ఆర్కిమెడీసుపై గాఢాభిమానము ఉండెను, అతడు ఆర్కిమెడీసును తీసికొని రావలసినదిగా ఆజ్ఞాపించెను. మార్సిలను ఆర్కిమెడిసును ఆదరించు తలపుతోనే అతనీ పిలిపించెను. కాని మార్సిలను ఆజ్ఞయందలి సద్భావ మును గ్రహింపజాలని రోమను సైనికుడొకడు, ఆర్కి మెడీసును కలిసికొని అతనిని తన వెంట రావలసినదిగా ఆజ్ఞాపించెను. కాని మహామహుడగు ఆర్కి మెడీసు శూన్యమనస్కుడై కొంతతడవుండెను. ప్రేపితుడైన సైనికుడు ఆతని శూన్య మనస్కతను అర్థము చేసికొన లేదు. అతడు దానిని ఆజ్ఞా తిరస్కారముగా భావించి వెంటనే అతనిని కత్తితో పొడిచి చంపెను. పిదప ఆర్కిమెడీసు యొక్క దుర్మరణమునకై ఆ రోమను - సేనానాయకుడు మిక్కిలి దుఃఖించెను. సుప్రసిద్ధుడగు ఆ శాస్త్రజ్ఞుని భౌతిక దేహము గౌరవపూర్వకముగా పాతిపెట్టబడెను. అతని సమాధి పై ఒక శిల స్థాపింప బడెను. ఆశిలపై నొక చిత్రము వ్రాయబడెను. అందు ఒక స్తూపము, దానిలో నొక గోళము లిఖింపబడెను. ఎందుచేతననగా ఆర్కిమెడీసు గోళము యొక్కయు దానిని ఆవరించియుండు స్తూపము యొక్కయు ఘనపరిమాణములకు గల సంబంధములో తాను కసిపెట్టియున్న వి శేషము అన్ని విధముల ముఖ్యమైన దానినిగా భావించెను.

త.స.న

ఆర్థిక ఖనిజములు*:- ఉపోద్ఘాతము :- భూమిపై దొరకు ఖనిజ సంబంధమైన వస్తువులను మానవులనాదిగా నుపయోగించుచుండి రను విషయ మెల్లరకు విదితమే. మొట్టమొదట వాడిన వస్తువులలో గొడ్డండ్లు, కత్తులు మొదలగు సామగ్రిని తయారుచేయుట కుపయుక్తమైన చెకుముకి రాయి (flint, chert etc.), స్పటికపురాయి, పలుగురాయి, లేక పిండిరాయి (quartz) మొదలైన వాటిని పేర్కొనవచ్చును. బలపపురాయి (steatite) సున్నపురాళ్ళు (lime stones) మొదలైన మెత్తనిరాళ్ళు చిప్పలు, తోట్లు మొదలైనవి చేయుట కుపకరించిరి. తదుపరి పలురకములగు మన్నులతో కుండలు, పెంకులు చేయబడినవి. క్రమక్రమముగా రంగుమన్నులు, బంగారు, రాగి, మొదలగు లోహములు కూడ ఉపయోగింపబడుచు వచ్చినవి.

వివిధ దేశపు ప్రజలలో నాగరకత ప్రబలుచు వచ్చిన కొలది అంతకంతకు ఖనిజములు అత్యధికముగా ఉపయోగింప బడుచు వచ్చినవి. ఖనిజముల ఉపయోగము లెక్కువైనకొలది, వాటిని వెదకి, భూమినుండి త్రవ్వి తీయుపద్ధతులు గూడ క్రమముగా నభివృద్ధి చెందసాగినవి. ఖనిజములను గురించిన సమస్యలు, వాటి సాధనలు విజ్ఞాన శాస్త్రములలో నొక భాగముగా పరిణమించినవి. ఇదియే ఆర్థిక ఖనిజములకు సంబంధించిన భూగర్భ శాస్త్రము (Economic Geology).

భూగర్భశాస్త్రరీత్యా భూమి పైభాగము సుమారు 40 మైళ్ళ లోతువరకు, రాతిమయమై యున్నది. దీనిలో చాలభాగము లక్షలాది సంవత్సరముల క్రితము శిలాద్రవము (magma) ఘనీభవించుట వలన నేర్పడిన రాళ్ళు (Igneous rocks). ఇవిగాక యిసుక, ఒండుమట్టి మొదలైన పదార్థములు నీటి ప్రవాహములద్వార సముద్రములలోనికి కొట్టుకొనిపోయి అచ్చట చాల కాలము తరువాత గట్టిపడి శిలలుగామారి, యుగాంతము లందు వచ్చు భూచలనములలో నీటి పైభాగమునకు వచ్చిన రాళ్ళుగూడ ఉన్నవి (Sedimentary rocks). పై రెండురకముల రాళ్ళు శీతోష్ణ పరిణామముల వలనను పీడనము (pressure) చేతను మార్పుచెంది పలురకములగు ఇతర శిలలు గూడ నేర్పడినవి (metamorphic rocks).

ఇట్లు భూమిపై నున్న శిలలన్నిటిని ముఖ్యముగా మూడు రకములుగా విభజింపవచ్చును. ఈ శిలలన్నియు చాలవరకు పలువిధములగు ఖనిజనముదాయములే. ఈ ఖనిజములలో పారిశ్రామికముగ నుపయోగపడునవి చాల తక్కువ. అవిగూడ పలురకములగు శిలలతోగూడి యనేకచోట్ల నున్నను ప్రకృతిలో కొన్ని కొన్ని చోట్లనే అవి కేంద్రీకరింపబడి యున్నవి. అట్లు కేంద్రీకరింపబడి లాభదాయకముగా నుపయోగింప బడగలిగినప్పుడే వానిని 'ఆర్థిక ఖనిజము' లనదగును. ప్రస్తుతము తెలిసి యున్న సుమారు 1400 ఖనిజములలో 200 మాత్రము ఆర్థిక ఖనిజములుగా పరిగణింపబడుచున్నవి.

ఆర్థిక ఖనిజములు - వాని విభజన - ఆర్థిక ఖనిజములను, ముఖ్యముగా మూడురకములుగా విభజింపవచ్చును (1) ధాతు ఖనిజములు (metallic ores). (2) అలోహ ఖనిజములు (non-metallic minerals). (3) ఆంగారిక ఖనిజములు (minerals of organic origin). ధాతు ఖనిజ


  • భారతీయ భూతాత్త్విక సమీక్ష డైరెక్టరుగారి అనుమతితో.