సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆయుర్వేద ధర్మములు
శారీరము మొదలగు గ్రంథము లావిష్కరింపబడినవి. ఆంధ్రదేశములో ముఖ్యముగా నభ్యసింపబడునవి “వైద్య చింతామణి” “బసవరాజీయము" అను రెండు పెద్ద గ్రంథములు కలవు. ఇవి స్వతంత్రములు కావు. పూర్వ గ్రంథములలో నుండి యుద్ధరింపబడిన విషయములతో నిండియున్నవి. నాడీజ్ఞానము మొదలగు అష్టస్థాన పరీక్షలు కర్మవిపాకము, జ్యోతిషాభిప్రాయము మొదలగు విశేషములు వీనిలో వర్ణింపబడినవి.
ఇంకను చికిత్సారత్నమను బాలురకు స్త్రీలకు కలుగు రోగముల చికిత్సలను బోధించు గ్రంథమును, చికిత్సా సార మను గోపాలదాసుచే రచింపబడిన గ్రంథమును కలవు.
రసతంత్రమునందును అనార్ష గ్రంథములు కలవు. వానిలో రసరత్న సముచ్చయము (వాగ్భట విరచితము), రసేంద్ర చూడామణి (సోమదేవ విరచితము), రససారము (గోవింద భిక్షు విరచితము) రప రత్నాకరము (నిత్యనాథ విరచితము) అనునవి ముఖ్యమయినవి. ఇంకను ఆయుర్వేద ప్రకాశము, రసేంద్రసార సంగ్రహము, రస సంకేత కలిక, రస కౌముది, లోహమంజరి, మొదలగు బహు గ్రంథములు కలవు.
నొ. రా. శా.
ఆయుర్వేద ధర్మములు :- ధర్మములు శాశ్వతములు. అనగా దేశ కాల వయః ప్రకృతి భేదముల ననుసరించి ఎప్పటికప్పుడు మార్పు చెందించుటకు వీలుచాలనివి. జగద్ధార్యమగు ధర్మపదమునకు ప్రతివ్యక్తియు నియమితమగు నిత్య కర్మాచరణమున వర్తించుటను తెలియచేయునది యని యర్థము. ధర్మములు- మానవ జీవిత సంపత్ప్రభా భాసకములు, చిరాయు రారోగ్య సంపన్నములు, ధర్మము లన్నింటియందును ఆయుఃపాలనము ముఖ్యమగుటను, జీవితకాలమును తెలియజెప్పి యుక్తాచరణమున ధర్మార్థ సుఖసాధన మగు ఆయుఃపాలనము చేయుటయందు నేర్పరితనమును బోధించుటచే ఈ ధర్మములు ఆయుర్వేద ధర్మము లని పేర్కొనబడినవి.
ఆయుర్వేద ధర్మములు కేవల సామాజికములుగా గాని, వర్ణ, వర్గీకరణములుగా గాని రూపొందింపబడి నిర్ణయింపబడినవి కావు. ఇవి సర్వమానవ సౌఖ్యావహములు. ప్రాణిమాత్ర జీవనోజ్జీవనములు. శాశ్వతములు. "శరీర మాద్యం ఖలు ధర్మసాధనం" ధర్మసాధనకు శరీరము మొదటిదిగా చెప్పబడినది. "శరీర రక్షణో ధర్మః" శరీరమును రక్షించుటయే ధర్మమని చెప్పబడినది.
"ధర్మసాధనంబు తనువు, ధర్మము పరి
జ్ఞానదాయి, యట్లుగాన తనువు
నోమవలయు మర్త్యుడేమిట నేమర
కాత్మహితముగోరి యనఘచరిత"
(మహాభారతము.శాంతి.)
శరీరమనగా నశించునదియని యర్థము. “శీర్యతే రోగాదినా ఇతి శరీరః. శాృ హింసాయాం" అని నిర్వచనము. శరీరము నందు అరువది అవయవములు కలవు. ఇందే యొక్కటి కొదువయైనను లేక పనిచేయకపోయినను సౌందర్య విహీనమై శరీరము యొక్క ఉనికియే కష్టముగ తోచును. శరీరమునం దాత్మ సుస్థిరముగా నుండవలయును. ఆత్మ నిలచి యుండునంతవరకు శరీరము నందన్ని అవయవములు సుసమాహితములై పనిచేయు చుండవలయును.
శరీరము - మనస్సు - ఆత్మ ఇవి ఒకదానినొకటి యెడబాయక కలసియుండునట్టి క్రియాత్మక మగు అవస్థావి శేషమునకు “ఆయువు" అని పేరు. ఆయుర్వేద ధర్మపముచ్చయమునందు మొదటి అధ్యాయము సద్వృత్తోపదేశము.(చ. సూ.1-46-47). ఆయుర్వేదమున చెప్పబడిన ఆ సద్వృత్తము నాచరించుటవలన ఆరోగ్యము, ఇంద్రియ విజయము అను రెండుఫలములు ఒకేసారి పొందనగును. అట్టి సద్వృత్త విశేషములను సమగ్రముగా నిందు పొందుపరచుచున్నాము :
1. "దేవ గో బ్రాహ్మణ గురువృద్ధ సిద్ధాచార్యా నర్చయేత్." దేవతలను, గోవులను, బ్రాహ్మణులను, తపోయోగ సిద్ధులను, విద్యా మంత్రోపదేశకులను, పూజించవలయును.
2. "అగ్ని మునచరేత్." హోమాది సత్క్రియా కలాపములవలన అగ్ని నారాధించవలయును.
3. "ఓషధీః ప్రశస్తా ధారయేత్." ఆరోగ్యదాయకములు, ఆయుర్వర్ధకములు, పవిత్రములు నగు ఓషధులను ధరింప వలయును. 4. "ద్వౌ కాలా వుపస్పృశేత్." దినమును ఉదయ సాయంకాలముల యందు రెండు వేళలను స్నానము చేయ వలయును.
5. “మలాయ నేష్వభీక్షం పాదయో శ్చ వై తుల్య మాదఛ్యాత్.” చంకలు, గజ్జలు, మున్నగు సంధులయంధును, పాదములయందును మలినము (మురికి) చేరనీయక శుభ్రముగా నుంచుకొనవలయును.
6. "త్రిఃపక్షస్య కేశ శ్మశ్రు లోమ నఖాన్ సంహార యేత్" ఐదు దినముల కొకసారి క్షారము చేయించు కొనవలయును.
7. “నిత్య మనుపహాతవాసా స్సుమనా స్సుగంధి స్యాత్." ప్రతిదినము ఉదికిన బట్టలను, సుగంధ ద్రవ్యములను ధరించి ప్రసన్నాత్ముడై యుండవలెను.
8. "సాధు వేషః." సభ్యతను తెలియ జేయు ఉడుపులను ధరించవలెను. “వస్త్రేణ వపుషా వాచా" యన్నట్లు తన మంచి నడవడికను తెలుపునట్టి అలంకారము కల్గియుండవలెనని భావము.
9. "ప్రసాధిత కేశః.” తల శుభ్రముగా దువ్వుకొని యుండవలయును, చింపితలగా వెండ్రుకలు చిక్కు పరచుకొని యుండరాదు.
10. “మూర్ధ శ్రోత్ర ఘ్రాణ పాద తైలనిత్యః" ప్రతి దినము తలకు నూనె రాచుకొనవలయును. చెవులలోను ముక్కులలోను తైలము వేసికొనవలెను. అరికాళ్ళకు తైలము రాచుకొనవలయును.
11. “పూర్వాభిభాషీ." పూజ్యులగు పెద్దలను (సకల జనులను) చూచినపుడు తానుగానే ముందు పలుకరించ వలయును.
12, “సుముఖః." సర్వదా ప్రసన్న వదనుడై యుండవలయును.
13. "దుర్గే ష్వభ్యుపపత్తా.” ఆపదలలో చిక్కినప్పుడు సమయోచిత ప్రజ్ఞచే చిక్కులను తప్పించుకొనునట్టి ధైర్యము గలిగి యుండవలయును,
14. "హోతా." హవిరాదులచే అగ్నిని ఆరాధించ వలయును.
15. “యష్టా" దేశ క్షేమంకరము లగు యజ్ఞముల నొనర్పవలయును.
16. “దాతా.” కలకొలది దానధర్మములను చేయ వలయును.
17. "చతుష్పథానాం నమస్కర్తా." నాలుగు త్రోవలు కలియు ప్రదేశములందు, సావధానుడై నమస్కారము చేయ వలయును.
18. “బలీనా ముపహర్తా." బలి మంగళ పూజాదులచే దేవతల నారాధించవలయును.
19. “అతిథీ నాం పూజకః." అతిథులు నర్చించవలయును.
20. "పితౄణాం పిణ్ణదః.” పితరులకు ఇష్టమృష్టాన్నము లోసంగ వలయును.
21. "కాలే హిత మిత మధురార్ధ వాది." సమయము ననుసరించి హితముగను, మితముగను, సంతోషకరము గను మాట్లాడవలయును.
22. "ధూమపః." సుగంధ ద్రవ్యములచే ధూమ విర ప్రకారము పొగపీల్చవలయును.
23. “వశ్యాత్మా,” వశీకృత చిత్తుడై యుండవలయును.
24. “ధర్మాత్మా.” నియత కర్మాచరణము కలిగి యుండ వలయును.
25. " హేతా వీర్షుః." కార్యసాధన (హేతువు) యందు పట్టుదల కలిగియుండవలయును.
26. “ఫలే నేర్షుః.” ఒకనికి కలిగిన ఫలమందు అసూయ పడరాదు.
27. “నిశ్చింతః - నిశ్చితః." ఎల్లప్పుడు విచారము చేయకూడదు, లేక సంశయరహితమైన ఆత్మ కలిగియుండ వలయును.
28, "నిర్భీకః." భయరహితుడై యుండవలయును
29. "ధీమాన్." వివేక వంతమగు బుద్ధికలిగి యుండవలెను.
30. "హ్రీమాన్." పనికిరాని చెడ్డపనులు చేయుటలొ లజ్జితుడై యుండవలెను. (చేయరాదు)
31. “మహోత్సాహః." మంచిపనులు చేయుటలొ ముందంజ వేయువాడై యుండవలయును.
32. “దక్ష." క్రియా నిర్వహణ సమర్థుడై యుండ వలయును.
33. “క్షమావాన్," ఓరిమి కలవాడై యుండ వలయును. 34. "ధార్మికః." సత్కార్యములను మాత్రమే చేయువాడుగా నుండవలయును.
35. “ఆస్తికః." వేదవిహిత నిష్ఠలయందు నమ్మకము కలవాడై యుండవలయును.
36. “వినయ బుద్ధి విద్యాభిజన వయోవృద్ధి సిద్ధా చార్యాణా ముపాసితా." వినయము, వివేకము, విద్యా వైభవము, కులీనత, వయః పరిణతి, ఆత్మసిద్ధిగలవారిని, శాస్త్రమంత్రోపదేశకు లగు ఆచార్యులను ఆరాధించువాడుగా నుండవలయును.
37. "ఛత్రీ." గొడుగు,
38. "దండీ.” కట్టి,
39. "మౌళీ." తలగుడ్డ, (టోపి)
40. “సోపానత్కః." పాదరక్షలు కలవాడై .
41. "యుగమాత్రదృగ్విచరేత్.” రెండు బారల దూరము (4 గజములు) ముందుచూపు కలిగి సంచరించు చుండ వలయును.
42. "మంగళాచారశీలః . ” పవిత్రమగు నడవడికయు, స్వభావమును కలిగియుండవలెను.
43. "కుచేలాస్థి కంట కామేధ్య కేశ తుషోత్కర భస్మ కపాలస్నాన భూమీనాం పరిహర్తా." చింపిపీలికలు, ఎముకలు, ముండ్లు, మలమూత్రములు, వెండ్రుకలు, వరిపొట్టు, బూడిద, కుండ పెంకులుగల ప్రదేశములను స్నానము చేసిన నీరు ప్రవహించుప్రదేశములందును సంచరించరాదు.
44. "ప్రాక్ శ్రమాత్ వ్యాయామవర్జీ స్యాత్.” బడలిక కలుగు వరకును వ్యాయామము చేయరాదు.
45. "సర్వప్రాణిషు బంధుభూత స్స్యాత్." సమస్త ప్రాణులయందును బంధు ప్రేమ కలిగి యుండవలయును.
46. క్రుద్ధానా మనునేతా." కోపము చెందిన వారిని మంచిమాటలతో అనునయించవలయును.
47. "ఖీతానా మాశ్వాసయితా." భయపడిన వారిని ఊరడించువాడుగా నుండవలయును.
48. “దీనానా మభ్యువపత్తా. దీనులు (చెడిన స్థితి గలవారు) అగువారిని ఉద్ధరించి స్వస్థులగునట్లు జేయువాడుగా నుండవలయును.
49. "సత్యసంధః." చెప్పినమాటను నిలబెట్టుకొను దీక్షగలవాడై యుండవలయును.
50. "సామప్రధానః" మంచితనము గలవాడుగా నుండవలయును.
51. "పరపురుష వచన సహిష్ణుః." ఇతరుల దుడుకు మాటలను ఓర్మితో సహింపవలెను.
52. "అమర్షఘ్నః" అసహన గుణము పోగొట్ట వలయును.
53. "ప్రశమగుణ దర్శి." శాంతి శమదమాది గుణములు కలిగి యుండవలయు.
54. "రాగద్వేష హేతూనాం హన్తా.” ఇచ్ఛాద్వేషములను కలుగజేయు కారణములను విడచి వేయ వలయును.
55. “నానృతం బ్రూయాత్." అబద్ధము చెప్పరాదు.
56. “ నాన్యస్వ మాదదీత." ఇతరుల ద్రవ్యమును అప హరింపరాదు.
57. "వాన్యస్త్రీయ మఖిల షేత్.” పర స్త్రీలను కోరరాదు,
58. "నాన్యశ్రియం." ఇతరుల సంపద కోర తగదు.
59. “న వైరం రోచయేత్." ఇతరులతో ద్వేషము నభిలషింపరాదు.
60. “న కుర్యా త్పాపం." చెడుపనులు చేయరాదు.
61. “న పాపే౽పి పాపీ స్యాత్." అపకృతి చేసిన వారి యందైనను తిరిగి అపకారము చేయు తలవుంచరాదు. . 62. "నాన్యదోషాన్ బ్రూయాత్." ఇతరుల తప్పులను బయలు పెట్టరాదు.
63. "నాన్యరహస్య మాగమయేత్." ఇతరుల రహస్యములను వెల్లడిచేయరాదు.
64. “నాధార్మికై ర్న నరేంద్రద్విపై స్సహాసీత." దుష్టప్రవర్తన గలవారితోను, రాజద్రోహులతోను కలసి యుండరాదు.
65. “నోన్మత్తెః న పతితై ః న భ్రూణహ స్తృభిఃనక్షు డ్రై ః నదుష్తైః పిచ్చివారు, కులభ్రష్టులు, గర్భపాతకులు,.నీచులు, చెడ్డవర్తనగలవారలతో కూడియుండరాదు.
..
65. "న దుష్టయానా వ్యారోహేత్." పొగరుపట్టిన వాహనములపై ఎక్కరాదు. . 67, “నజానుసమం కఠిన మాసన మధ్యాపీత." మోకాటియెత్తు కలిగి కఠినముగా నున్నట్టి ఆసనములపై కూర్చుండరాదు.
68. “నా నాస్తీర్ణ మనుపహిత మవిశాల మనమం వా శయనం సంపద్యేత." పరిశుభ్రమైన బట్టలు పరువక, దిండ్లు పెట్టక, వెడలుపులేక, మెత్తదనము లేక యున్నట్టి మంచముపై పడుకొనరాదు.
69. "న గిరి విషమ మస్తకే ష్వను చరేత్." పర్వత శిఖరములందును, ఎగుడుదిగుడులుగా నుండు గట్లు మొదలగు చోట్ల సంచరిం పరాదు.
70. “న ద్రుమ మారో హేత్," చెట్లపై నెక్కరాదు.
71. “న జలోగ్రవేగ మవగా హేత్." ఎక్కువ వేగముగా ప్రవహించు జలములయందు స్నానము చేయరాదు.
72. “న కులచ్ఛాయా ముపాసీత.” ఇతరుల మైనీడలో నిలువరాదు.
73. "నాగ్న్యుత్పాత మఖితళ్చరేత్." చెలరేగి మండుచున్న అగ్నికి దగ్గరగా పోరాదు.
74. “నోచ్చైర్హ సేత్.” అట్టహాసము (బిగ్గర) గా నవ్వరాదు.
75. "నశబ్దవంతం మారుతం ముంచేత్. "చప్పుడగునట్లు (అపాన) వాయువును విడువరాదు.
76. "నానావృతముఖో జృమ్యాం క్షవధుం హాస్యం వా ప్రవర్తయేత్." నోరు తెరచుకొని ఆవులించుట, తుమ్ముట నవ్వుట పనికిరాదు.
77. "ననాసికాం కుష్ణీయాత్. " శబ్దమగునట్లు ముక్కు నెగ పీల్చరాదు.
78. "న దంతాన్ విఘట్టయేత్.” పండ్లు కొరక రాదు.
79. *న నఖాన్ వాదయేత్." గోళ్ళతో గోళ్ళను వాయించరాదు. . 80. "నాప్ధీ న్యభిహవ్యాత్." ఎముకలతో ఎముకలను కొట్టరాదు.
81. "న భూమిం విలిఖేత్." చేతులతో భూమిని రాయ రాదు.
82. “న ఛింద్యా త్తృణం.” గోళ్ళతో గడ్డిని త్రుంప రాదు.
83. "నలోష్టం మృద్నీయాత్." చేతులతో మన్ను నలుపరాదు.
84. “న విగుణ మదై శ్చేషేత.” కాళ్ళు చేతులు నడుము మున్నగు అవయవములతో వికృత చేష్టలు చేయరాదు.
85. "జ్యోతీం ష్యనిష్ట మమేధ్య మశస్తంచ నాకే వీక్షేత." వెలుగుగల వస్తువులను, ఇష్టములేని వానిని అసహ్యములు పనికిరానివి యగు ద్రవ్యములను చూడ రాదు. (మలమూత్రములను, శవమును చూడరాదని భావము.)
86. “న హుంకుర్యా చ్ఛవం. శవమును జూచి హుంకరింపరాదు.
87. "నచైత్య ధ్వజ గురు పూజ్యా శస్త ఛాయ మాక్ర మేత్." దేవాలయము, ధ్వజ స్తంభము, గురువులు పూజ్యులు మున్నగువారి నీడలయందును, కుష్ఠాది దీర్ఘ రోగుల నీడలయందును నిలువరాదు.
88. “న క్షపాను అమరసదన చైత్య చత్వర ఛతుప థోపవన శ్మశా నాఘాత నా న్యాసేవేత.”దేవాలయముల యజ్ఞశాలలు, ముంగిళ్ళు, నాలుగు త్రోవలు కలిసి చోటులు, నగరబాహ్యోద్యానములు, శ్మశానముల వధ్యస్థానములు మొదలగు చోటులందు రాత్రులు వసించరాదు.
89. "నైక శూన్యగృహం న చాటవీ మను ప్రవిశేత్ పాడుపడిన యిండ్లయందును, అడవియందును ఒంటరి ప్రవేశింపరాదు.
90. "న పాపవృత్తాన్ స్త్రీ మిత్ర భృత్యాన్ భజేత చెడు నడవడికగల స్త్రీలను, మిత్రులను, భృత్యుల ఆదరింపరాదు.
91. “నోత్తమై ర్విరుధ్యేత." యోగ్యులగు వారి విరోధము పెట్టుకొనరాదు.
92. “నావరా నుపొసీత.” హీనులగువారి స్నేహము చేయరాదు.
93. “న జిహ్మం రోచయేత్ .”క పట వ ర్త ను ల సహింపరాదు.
94. నావార్య మాశ్రయేత్." దుష్టుల నాశ్రయింప రాదు. 95. "న భయ ముత్పాదయేత్." వట్టి అల్లరులను బుట్టించి జనులను భయ పెట్టరాదు.
96. "న సాహ సాతిస్వన్న ప్రజాగర స్నాన పానా శనా న్యానే వేత.” తన శక్తికి మించిన పనిని చేయ బూనుట, అధిక ముగా నిద్రించుట, మేల్కొనుట, స్నానము చేయుట, నీళ్ళు త్రాగుట, భుజించుట యనునవి చేయరాదు.
97. "నోర్ధ్వబాహు శ్చిరం తిష్టేత్ ఎక్కువ కాలము గొంతు కూర్చుండరాదు. (మునిగాళ్ళపై కూర్చుండ రాదనుట.)
98. "న వ్యాఖా నుపసర్వేత్.
99. "న దంష్ట్రాణః.
100. "నవిషాణినః." పాములను, కోరలు గల క్రూరజంతువు లను, నిడివియు వాడి యునైన కొమ్ములుగల జంతువులదరి జేరరాదు.
101. "పురోవాతాత పావశ్యాయతీవ్రవాతాన్ జహ్యాత్.” ఎదురు గాలిలోను, ఎదురెండయందును, మంచి మంచు నందును, పెద్దదగు ఎదురుగాలియందును పోరాదు.
102. "కలిం నారభేత." అనవసరముగా ఇతరులతో తగవులాడరాదు.
103. "నాసునిభృతోగ్ని ముపాసీత.”
104. “నోచ్ఛిష్ట నాధఃకృత్వా ప్రతాపయేత్." అజాగ్రత్తగా అగ్ని నారాధింపరాదు. అగ్నిని నోటితో నూది రగుల్కొల్పరాదు. స్థండిలము లేక వట్టిచోట అగ్నిని ప్రజ్వలింప చేయరాదు.
105. "నావిగతక్షమః నానాప్లుతవదనః ననగ్న ఉపస్పృశేత్ ." బడలిక చెందియు, ముఖము కడుగుకొనకయు, దిగంబరుడయ్యును స్నానము చేయరాదు.
106. "న స్నానశాట్యా స్పృశే దుత్తమాంగమ్” స్నానముచేసిన బట్టతో తల తుడుచుకోరాదు.
107. “న కేశాగ్రా ణ్యభిహన్యాత్" తలవెండ్రుకలను జాడింపరాదు.
108. "నోపస్పృశ్య తఏవ వాసనీ బితృయాత్” కట్టి విడచిన బట్టలను తిరిగి కట్టరాదు. '
109. "నాస్పృష్ట్వా రత్నాజ్య పూజ్యమంగళ సుమనోభి నిష్క్రమేత్" ఇంటినుండి బయలుదేరునపుడు రత్నములు, నేయి, గోవు, పూజ్యములు, మంగళకరములు నగు ఇతర ద్రవ్యములు, పువ్వులు ఎదురైనచో వానిని చేతులతో తాకి వెళ్ళ వలయును.
110. "నపూజ్య మంగళా న్యపసవ్యం గచ్ఛేత్" పూజ్యములగు గోవులు మంగళకరములగు ఇతర ద్రవ్యములు ఎదురైనపుడు వాటికి ప్రదక్షిణముగా వెళ్ళ వలయును. (గౌరవనీయులగు వారికందరికి ప్రదక్షిణి కృతముగా ఎడమవైపుగా వెళ్ల వలయును.)
111, "నేతరా ణ్యనుదక్షిణం" అమంగళములగు ద్రవ్యములు, శవము, మున్నగునవి ఎదురైనపుడు వాటికి అప్రదక్షిణముగా వెళ్లవలెను. (కుడిభాగమున వెళ్లవలయును.)
112. (1) "నారత్న పాణి” చేత రత్నాంగుళీయకములను ధరింపకయు,
- (2) “నాస్నాతః” స్నానము చేయకయు,
- (3) “నోపహత వాసాః” ఉతికిన బట్టలు కట్టుకొనకయు
- (4) “నాజపిత్వా సంధ్యాది ఉపాసన చేయకయు
- (5) నాహుత్వా దేవతాభ్యః" దేవతలకు ఆహుతులు వేయకయు
- (6) “నానిరూప్య పితృభ్య" మాతా పితరులకు పెట్టకయు
- (7) "నాదత్వా గురుభ్యః" పూజ్యులను ముందు భుజింప చేయకయు
- (8) “నాతిథిథ్య!” అతిథుల కీడకయు
- (9) “నోపాశ్రితేభ్యః”అనుసరించుకొనియున్న వారిని భుజింప జేయకయు
- (10) “నాపుణ్యగన్ధః" సుగంధ ద్రవ్యముల నలందు కొనకయు
- (11) “నామాలీ” పుష్పధారణ చేయకయు
- (12) “వాప్రక్షాళిత పాణిపాద వదనః" చేతులు, కాళ్ళు, ముఖము కడుగుకొనకయు
- (13) “నా శుద్ధముఖ” చక్కగా పుక్కిలించి యుమియకయు
- (14) “నోదఙ్ముఖః" ఉత్తరాభిముఖముగా కూర్చుండియు
- (15) “నవిమనాః" మన స్తిమితము లేకయుండియు
- (16) “నాభక్తా శిష్టా శుచి శుధిత పరిచరః" అయిష్టులు, అయోగ్యులు, శుచిత్వము లేనివారు, ఆకలిగొన్న వారు ఎదుట నున్నపుడును
- (17) “నాపాత్రే ష్వమేధ్యాసు” అపరిశుభ్రము లైన పాత్రలయందును
- (18) “‘నా కాలే.” సమయము కాని సమయమందును
- (19) “నా దేశే.” ఉచితముగాని స్థలమునందును
- (20) "నాకీణ్ణి” పదుగురున్న చోట
- (21) “నాదత్వాగ్ర మగ్నయే. వైశ్య దేవాదికము లాచరించకయు
- (22) "నాప్రోక్షితం ప్రోక్షణోదకై !.” మంత్రోదకముచే పవిత్రము చేయకయు
- (23) “మం త్రైరనభిమంత్రితం.” ఆపోశనము చేయకయు
- (24) “నకుత్సయన్.” కోపముతోను (తిరస్కరింపకయు)
- (25) "నకుత్సితం.” చెడిపోయినట్టియు (నింద్యమై నట్టియు)
- (26) “నప్రతికూలో పహిత మన్న మాదరీత" అనుకూలముగ లేని వారివలన అమర్చబడి నట్టియు, అన్నమును భుజింపరాదు.
113. "నపర్యుషిత మన్యత్ర మాంసహరిత శుష్క శాకఫల భక్షేభ్యః" మాంసము, పచ్చికూరలు (అల్లము, నిమ్మకాయ, కంద, ముల్లంగి మొదలగునవి హరితశాకములని వాడబడును.) వరుగుచేయబడిన కూరలు, పండ్లు, అతిరసాలు మున్నగు మృతతైల పక్వములగు భత్యములు తప్ప నిలవయున్న పదార్థములను తినరాదు.
114. “నా శేషభుక్స్యా దన్యత్ర దధి మధు లవణ సక్తు సలిల సర్పిభ్యః" భుజించునపుడు పెరుగు, తేనె, ఉప్పు, సత్తుపిండి, నీళ్ళు, నెయ్యి- అను వీటిని మిగుల్చ రాదు.
115. “న నక్తం దధి భుంజీత." రాత్రియందు పెరుగు తినరాదు.
116. (1) "న సక్తూ నేకా నశ్నీయాత్.” ఒక సత్తు పిండిని మాత్రమే కడుపునిండ భుజింపరాదు.
- (2) "న నిశి" రాత్రియందుగాని, .
- (3) “న భుక్త్వా" భుజించిన పిమ్మట గాని,
- (4) “న బహూర్." అనేకసార్లధికముగా గానీ,
- (5) “నద్విర్నోద కాన్తరితాన్." భోజన కాలములందు
గాని మధ్యమధ్య నీళ్లు త్రాగుచుగాని, సత్తుపిండిని తినరాదు.
117. “నచ్ఛిత్త్వాద్విజై ర్భషయేత్.” సరిగా పండ్లతో నమలకయే భక్షింపరాదు.
118. (1) “ నానృజుః క్షుయాత్.” తుమ్మునపుడు
- (2) “నాధ్యాత్" భుజించునపుడు,
- (3) " నాకయీత.” పడుకొనిన యప్పుడు శరీరమును వంక రటింకరగా మెలికలు తిప్పియుంచక నిటారుగా నుండవలయును.
19. “న వేగితోన్య కార్యస్స్యాత్." మలమూత్రములను బిగపట్టుకొని యితర పనులు చేయరాదు. (ఇచట వేగములు 13 కలవు; అవి యివి :
(1) అపాన వాతము (2) మలము (3) మూత్రము (4) తుమ్ము (5) ఆకలి (6) దప్పి (7) నిద్ర (8) దగ్గు (9) బడలిక వలన కలిగిన ఆయాసము (10) ఆవలింత (11) కన్నీరు (12) వమనము (13) శుక్రము ఇవి ఎవ్వియు నిరోధింపరాదు అని ఆయు ర్వేదము.
120. 'నవాయ్వగ్ని సలిల సోమార్క ద్విజగురు ప్రతిముఖం నిష్ఠీవికావాతవర్చో మూశ్రణ్యుత్సృజేత్ ” ఎదురుగాలిలో, అగ్ని సమీపమున, ఉదక సమీపమున, సూర్యచంద్రుల యొక్కయు, బ్రాహ్మణులు, గురువులు మొదలగు పెద్దల యొక్కయు ఎదుటను ఉమియుట, అపాన వాయువు విడచుట, మలమూత్రములను చేయుట తగదు.
121. “న పస్థాన మనమూ త్రయేత్" పలువురు నడచు త్రోవయందు మూత్రము చేయరాదు.
122. (1) " నజనవతి " (2) " నాన్న కాలే ” (3) "న జపహోమాధ్యయన బలి మంగల క్రియాను శ్లేష్మ సింఘాణకం ముంచేత్." పదు గురుగల చోటను, భోజనముచేయు సమయము నందును, జపము హోమము అధ్యయనము చేయు సమయములందును, స్థలములందును బలినొసగుచోటను, శుభకార్యములు జరుగుచున్నపుడును, ఉమియుట, చీదుట తగదు.
123. (1) "న స్త్రీయ మవజానీత." అతివను అవమానింపరాదు.
- (2) "నాతివిస్రంథ యేత్." అతి చనువు చూపరాదు.
- (3) "న గుహ్య మనుశ్రావయేత్." దాచతగిన రహస్యములు స్త్రీలకు వినిపించరాదు,
- (4) " నాధికు ర్యాత్.” ఆమెకు సర్వాధికారము ఒసంగరాదు.
- (5) “న రజస్వలాం" రజస్వలయైనట్టియు
- (6) “నాతురాం" వ్యాధిబాధితురాలగునట్టియు
- (7) “నా మేధ్యాం” అపరిశుభ్రతగలిగినట్టియు
- (8) “నాశస్తాం” యోగ్యురాలు కానట్టియు
- (9) " నానిష్ట రూపాచారోపచారాం" అనాకారియు సహింపరాని నడవడిగలట్టిదియు, ఇష్టములేని పరిచర్య చేయునట్టిదియు అను ఈ లక్షణములు గలిగినట్టియు,
- (10) “నాదక్షాం.” తన శక్తిసామర్థ్యములకు తగనట్టియు,
- (11) ‘“నాదక్షిణాం” తన కనుకూలవతి కానట్టియు
- (12) “నా కామాం” తనయందు ప్రీతిలేనట్టియు
- (13) “నాన్యకామాం” ఇతరుని ప్రేమించినట్టియు
- (14) “నాన్యస్త్రీయం” ఇతరుని వశమునందున్నట్టియు
- (15) “నాన్య యోనిం" తన జాతికి భిన్నమగుజాతి కలిగినట్టియు స్త్రీని
- (16) “నాయోనౌ” యోనిగాని ప్రదేశమందును
- (17) “నచై త్య చత్వర చతుష్పథో పవన శ్మశానాఘాత సవితౌషధి ద్విజ గురు సురాలయేషు." ధర్మ,శాలలు, రచ్చపట్టులు, పురోపపనములు, శ్మశానము, వధ్యస్థానము, నీళ్ళగది, ఓషధులు భద్రపరచిన ప్రదేశము, బ్రాహ్మణగురు గృహములు, దేవాలయము, అను నిటిస్థలములందును
- (18) "న సంధ్యయోః." (19) “నాతిథిషు.” సంధ్యా సమయమందును, నిషిద్ధములుగు తిథులయందును (సురతమునకు నిషేధించిన తిథులని భావము.)
- (20) “నాశుచిః." తాను శుభ్రముగా నుండకయు
- (21) “నాజగ్ధ భేషజః.” బలకరములగు ఔషధములను సేవింపకయు
- (22) “నాప్రణీతసంకల్పః." మనసునం దిచ్ఛలేకయు
- (23) “నా నుపస్థిత ప్రహర్షః." సంతోషము లేకయు
- (24) "నాభుక్తవాన్" భుజింపకయు
- (25) “నాత్యాళితః" అతిగ భుజించియు
- (26) “న విషమస్థః.” వ్యత్యస్తముగ నుండియు
- (27) "న మూత్రోచ్చార పీడితః.” మూత్రము నిరోధించియు
- (28) “నశ్రమ వ్యాయా మోపవాసక్షమాభిహతః." శ్రమచెందియు, సాముచేత, ఉపవాసముచేత బడలిక చెందియు
- (29) “నారహని వ్యవాయం గచ్ఛేత్." చాటు లేని తావులందును స్త్రీ సంభోగము చేయరాదు.
ఇట్లు మంచి నడవడికను (సద్వృత్తమును) గురించి చెప్పబడిన ప్రధాన ధర్మసూత్రములందు సూట యిరువది మూడు ధర్మములు మాత్రమే యిచట చూపబడినవి. ఈ సూత్రములలో సూ. 112 నందు 25, సూ. 116 నందు 4, సూ. 118 యందు 2, సూ. 122 నందు 2, సూ. 123 నందు 28, ప్రధాన ధర్మ గర్భితములగు మరికొన్ని విశేషధర్మములు వివరింపబడినవి, ఇందు 112వ ధర్మమున మంచి నడవడి కలవాడు భుజింప తగని అన్నవిశేషములును, 116 నందు వరి, జొన్న, మొక్కజొన్న మొదలగువాటి పేలాలపిండిని ఉపయోగింపవలసిన విధులు, 118 యందు శరీరమును వంకర టింకరగా నుంచి చేయతగని పనులు, 122 నందు ఉమియుటకు, చీదుటకు తగని ప్రదేశములు, 123 నందు అతివలయెడ వర్తింపవలసిన విధినిషేధములు చెప్పబడినవి. ఇట్లు' సూత్రగర్భితములైన ధర్మములు 61 కలవు; ఇవియు మూలధర్మములును కలసి 184 అయినవి. ఇవిగాక యీ సద్వర్తనమున తెలియదగిన ధర్మము లింకను 147 కలవు. ఇవన్నియు చేరిన మొత్తము సద్వర్తనమునందు మూడువందల ముప్పది యొకటిగా ధర్మములు నిరూపించబడినవి. ఇవి యిట్లుంచి యింకను తెలియచేయ వలసిన ధర్మముల సంఖ్య 1180 మిగిలి యున్నవి. అవి యివ్వి :
1. స్వస్థవృత్తమునందు (ఆరోగ్యవంతుడు నిత్య జీవనమునందు) రాత్రిందివములయం దనుస రించవలసిన ధర్మములు ...40
2. షడృతువులందును అనుసరించవలసిన విశేష ధర్మములు. ...24
3. వేగధారణము, త్రివర్గసాధనము, మున్నుగా దృఢసత్వ సంపన్నమగు శరీరములో దీర్ఘ జీవితమును సుఖమయముగా గడపి, వేదోదితమగు మనుష్యానందమును సంపూర్ణముగ ననుభవింపగల సమర్ధతను ఇహఫల సాధనముగా భోధించు ధర్మములు ...950
4. స్వర్గసుఖ సాధన ధర్మములు ...34
5. అపవర్గానుభూతి హేతువులగు ధర్మములు ...56
6. శాశ్వత అజరామరానంద సందోహ దివ్య తనుత్వ సంసాధక ధర్మములు ..76
- మొత్తము ...1180
- పూర్వోక్తములు 331
- వెరశి మొత్తము...1511
ఇట్లు పదునై దువందల పదునొకండు ఆయుర్వేద ధర్మములు కలవు. ఇవన్నియు చరకము ప్రమాణముగా గలవి. ఈ ధర్మములను చరక సంహిత యందలి సూత్ర విమాన, శారీర, ఇంద్రియ స్థానములందును, చికిత్సా స్థానమునగల మొదటి యధ్యాయమునందును చూడనగును, చరక సంహితయందులేని ఆరోగ్య ధర్మములు మరెచ్చటను లేవు. పురాణములు మొదలగు ఇతరము లందు గల ఆయుర్ధర్మములు ఈ సూత్రముల ననుసరించియే సమకూర్పబడినవి.
“చికిత్సా వహ్ని వేశస్య స్వస్థాతురహితం ప్రతి.”
యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్క్వచిత్."
(చ. స.10.88)
స్వస్థ, ఆతుర, హితముగోరి అగ్ని వేశునిచే రచింపబడిన ఈ సంహితయందు ఏది చెప్పబడినదో అది అన్నింటను చెప్పబడి యుండును. ఇందు చెప్పబడని విషయము మరియెచ్చటను లభింపదు, అని యిట్లు ప్రతిజ్ఞ చేసి శ్రీ అగ్ని వేశుడి చరక సంహితను ముగించెను. అగ్ని వేశునిచే సమకూర్పబడిన యీ సంహితయే, చరక సంస్కృతమై చరకసంహిత యనబడుచున్నది. చరకసంహిత యను ఆయుర్వేద ధర్మ సర్వస్వము.
సాహిత్య సమాలోచనమునకును, విశేష విజ్ఞాన సముపార్జనమునకును, ప్రజ్ఞాన్వితులగు జిజ్ఞాసువులు సావధానులై అమూలాగ్ర మొక పర్యాయము చరకసంహితను పఠించి ఉభయలో కార్థ ఫలసిద్ధు లగుదురుగాత.
'ఆయుర్వేదో ఒమృతానామ్”
వే. తి. వేం· రా. స్వా
ఆరణ్యకములు :- వేదము మంత్రబ్రాహ్మణాత్మకము. ఆ బ్రాహ్మణముల యనుబంధము లారణ్యకములు. అథర్వబ్రాహ్మణమునకు దప్ప తక్కిన మూడు బ్రాహ్మణములకు నారణ్యక గ్రంథము కనబడుచున్నది. సామ బ్రాహ్మణమునకు దాని చివరనున్న శుక్రియ కాండమే ఆరణ్యక మనబడుచున్నది. అట్లే శుక్ల యజుశ్శాఖకు శతపథబ్రాహ్మణ అంతిమ కాండ మే ఆరణ్యకము. కఠ మైత్రాయణీయాది శాఖలకు ఆరణ్యకములేదు కౌషీత కారణ్యక మన్న పేరుమాత్ర మున్నదిగాని, ఆ గ్రంథము మృగ్యము. ఇంక తైత్తిరీయారణ్యకము, ఐతరేయారణ్యకము ననెడి రెంటి విషయము. తైత్తిరీయారణ్యకము తక్కిన అన్నిటి కంటెను ప్రాచీనము. “అరణ్యే ౽ధీయీరన్” అను నిందలి వాక్యమును బట్టి ఇది అరణ్యములో అధ్యయనము చేయదగినదని తెలియుచున్నది. కాని ఇందలి - సావిత్ర - నాచికేత చాతుర్హోత్ర వైశ్యసృజ - భాగములకు ఈ నియమములేదని పూరా చార్యుల మతము. ఇందలి పది ప్రపాఠకములలో కడపటి నారాయణోపనిషత్తు. మొదటి తొమ్మిదియు ప్రాచీనములు. ఈ ఆరణ్యకము యజ్ఞోపయోగిగా కనవచ్చినను జీవేశ్వర తత్త్వబోధకములైన ఉపనిషత్తులును, వివి విజ్ఞానదాయకములైన ఇతర విషయములు నిందు కన వనుట నిజము.
ఇందలి మొదటి ప్రపాఠకము 'ఆరుణ కేతుకము' అనబడును. దీనినే, అరుణమందురు. ఆరోగ్య కాములగు వారు ఇందలి మంత్రములు పఠించుచు సూర్యనమస్కారము లొనర్చెడి యాచారము నేటికిని భరతఖండమంత