సంగీత జ్ఞానము భక్తివినా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

ధన్యాసి రాగము - ఆది తాళం


పల్లవి

సంగీత జ్ఞానము భక్తివినా - సన్మార్గము గలదే ? మనస !


అనుపల్లవి

భ్రుంగి నటేశ సమీరజ ఘటజ మ -

తంగ నారదాదు లుపాసించు


చరణము

న్యాయాన్యాయములు దెలుసును, జగములు

మాయామాయమని దెలుసును, దుర్గుణ

కాయకాది షడ్రిపుల జయించెడి

కార్యము దెలుసును, త్యాగరాజునికి