శ్రీ దత్త దేవం శిరసా నమామి

వికీసోర్స్ నుండి
పల్లవి:
శ్రీ దత్త దేవం శిరసా నమామి శ్రీ దత్త రాజం మనసా స్మరామి

చరణం:
శ్రీ అత్రి ఘనయోగ ఫలభూత దేహం సితరస్మి దూర్వాస సహజాత యుగ్మం
నిజమాతృ భవబంధ నిర్మోహ దక్షం నిజ భక్త రక్షార్థ సహ్యాద్రి వాసం

జంభాఖ్య సంహార పరిపాలితేంద్రం వేద ప్రదానోప కృత బ్రహ్మ దేవం
ప్రహ్లాద పరిపాల మవధూత రూపం యతివేష సంబుద్ధ యదు రాజ రాజం

శ్రీ విష్ణు దత్తార్పి తాత్మీయ మంత్రం నిజ బోధ నోన్మోచి తాలర్క రాజం 
శ్రీ కార్తవీర్యాఖ్య వరదాన వీరం భృగురామ బోధిత త్రిపురా రహస్యం

కారుణ్య పరిపూత నృప ధర్మకీర్తిం సద్భద్రశీలీకృతాత్మీయ భక్తం 
ఆయుర్మహారాజ వరదాన ధీరం ఆజన్మ పరిపుష్ట నహుషాధి రాజం 

శ్రీ పాద శ్రీ వల్లభాకార గమ్యం నరసింహ యతిరాజ రాజావతారం 
శ్రీ సచ్చిదానంద నిత్య ప్రకాశం శ్రీ సచ్చిదానంద నిత్య ప్రకాశం