శ్రీరాముల దివ్యనామస్మరణ్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పల్లవి

శ్రీ రాముల దివ్యనామ స్మరణ జేయుచున్న జాలు ఘోరమైన తపములను ఘోర నేటికే మనసా

అనుపల్లవి

తారక శ్రీ రామ నామ ధ్యానము జేసిన జాలు వేరు వేరు దైవములను వెదుక నేటికే మనసా

చరణములు

1.భాగవతుల పాద జలము పైన చల్లుకొన్న జాలు భాగీరథికి పొయ్యేననే భ్రాంతియేటికే మనసా భాగవతుల వాగమ్ర్తము పానము జేసిన జాలు బాగు మీరినట్టి అమ్ర్త పానమేటికె మనసా

2.పరుల హింస సేయకున్న పరమ ధర్మమంతే చాలు పరులను రక్శింతునని పల్కనేటికే మనసా దొరకని పరుల ధనము దోచకయుణ్డితే చాలు గురుతుగాను గోపురము గట్టనేటికె మనసా

3.పరగ దీనజనులయందు పక్శముంచినదే చాలు పరమాత్మునియందు బ్రీతి బెట్టనేటికే మనసా హరిదాసులకు పూజ లాచరించిను చాలు హరిని పూజసేతుననే యహ మ దేటికే మనసా

4.జప తపానుశ్ఠానములు సలిపిరి మూడులకై బుధులు జగదీషుని దివ్యనామ చింతన కోసరమై మనసా సఫలము లేక యే వేళ జిందించే మహాత్ములకు జప తపానుశ్ఠానములు సేయనేటికే మనసా

5.అతిథి వచ్చి యాకలన్న యన్న మింత ఇడిన జాలు క్రతువు సేయ వలయు ననే కాక్శయేటికే మనసా సతతము మా భద్రగిరి స్వామి రామదాసుడైన ఇతర మతములని యేటి వతల దేటికే మనసా

.