Jump to content

శాసనపద్యమంజరి (రెండవభాగము)/శాసనపద్యమంజరి (రెండవభాగము)

వికీసోర్స్ నుండి

శాసనపద్యమంజరి

ద్వితీయభాగము

—————

1

శ. స. 1046

ఇది గుంటూరుజిల్లా నర్సారావుపేఁటతాలూకాలోని నాదెండ్లగ్రామములో నొకపొలములోఁ బడియున్న ఖిన్నమయిన యొకఱాతిమీఁద చెక్కఁబడియున్నది. (A. R. 395 of 1915.)

శా.

శ్రీమద్ధర్మ్మపరాయణులు బుధజనాశీర్వ్వాదవంతులు దయా
ధాములు సర్వ్వజనానురక్తు లఘవిధ్వస్తాత్ము లుద్యద్యశో
రామారాములు వైశ్యవంశులు[1]గుబేరప్రాభవులు గోమినీ
భామాధీశపదాబ్దభక్తులు జగత్ప్రఖ్యాతతేజోధికులు.

1


ఉ.

లాలితవిత్తదాన్వయలలాముణ్డు పుణ్యయశోధనుణ్డు మొ
క్కోలకులోత్తముణ్డు పెనుంగొణ్డవిభుణ్డు ప్రభుణ్డు సత్యవా
క్శీలుణ్డు ధారుణిం గొసనిసెట్టికిం బ్రోలమకును సుతుణ్డు ల
క్ష్మీలలనేశ్వరస్తరణసేముషి గోమనయును ముదంబుతోను.

2


మ.

ధరణీశోత్తము ణ్డైనశ్రీశకనృపాబ్దంబులు రసోదన్వదం
బరచంద్రస్థితసంఖ్య మాఘసితశుంభత్పంచమిం బార్వ్వతీ
శ్వరు విశ్వేశ్వరు భక్తితో నిలిపి విశ్వస్తుత్యులై దేవమం
దిర మెత్తించిరి వంశవర్ద్ధనులు (నాది)ణ్డ్లం జిరస్థాయిగాను.

3

—————

2

శ. స. 1054

ఇది గుంటూరుజిల్లా సరసారావుపేఁటతాలూకాలోని తూపాడుగ్రామములో వినాయకుని యాలయము గర్భగుడిసమీపమున నిల్పఁబడిన నాగశిలమీఁద చెక్కఁబడియున్నది. (A. R. 441 of 1915.)

క.

శ్రీసహితుండు దూంబఱితిసు
శాసనుం డనియంకభీము చక్రము లీలా
వాసుండు సతుర్త్థ[2]కులగిరి
కేసరి గాపండు జగజ్జిగీషుండు పేర్మ్మిని.

1


చ.

అడపయు నందలంబు వివిధాతవారణకాహళావలిం
బడియము నాదిగాంగల న్రిపాలకచిహ్నలు బుద్ధవర్మ్మచేం
బడసినవాడు నాయకసభామణి సి(ద్దప)నాయకాంకుం డి
ప్పుడమిం దదీయవీరభటపుంగ్గవుమనుమం డుదాత్తసంప్పదను.

2


క.

సేవనియు సింగనయు జగ
దేవండుం (జోడ్ల)నుం[3] జూడ దీరిక మండ
క్ష్మావలయేశ్వరుపన్పునం
బావని రఘునాథుచేతం బనివడినక్రియను.

3


శా.

తన్నగ్గించుచు నెఱ్ఱమండణ్డు బుధాధారుండు పన్పంగ న
మన్నే(ట)౦గనయంబుల న్రిపులకు న్మార్ప్పెట్టి యోడించ్చి పే
ర్కొన్న న్మణ్డనగంధవారణసమాఖ్యుం జేసి తూంబఱ్తిపై
నెన్న న్వ్రిత్తిగ నాతుకూరు దయతో నిచ్చె న్నిజస్వామియును.

4


చ.

శకసమసంఖ్య వారినిధిసాయకఖేంు మితంబుగాంగ గా
ర్త్తికసితపక్షతేరసముం దీవ్రకరాము[4]నం దఖండదీ

పకమును సీతి[5]ఖండువులు భాతిగ విత్తియు (చ)౦ద్రసూర్య్యతా
రకముగ న్రిత్యవాద్యములు రాగముం గూడంగ నిచ్చె శూలికిని.

5


చ.

కర ముచితంబుతో నగరగాం డ్డడుగం జనగాద్యయెక్కశు
స్థిరమగు నాదివారమున చిందమలాడిన నెఱ్ఱమణ్డండిం
బరగిన యట్టి కాపసకుం బంకజలోచన (మ)౦డమాంబకుం
దిరముగం బుట్టెం గాపం డవధీరితపావనినాం బ్రసిద్ధుండై.

6


ఉ.

శ్రీవెలనాంటి గోంకన్రిపశేఖరు శ్రీకరుసిద్దిబేతవి
ద్రావణరావణాంతకపరాక్రము విక్రమచక్రి భూరితే
జోవిభవాభిరాముం డగు చోడన చక్రముం గొల్చి త్ప్రసా
దావహలీలం దాల్చిన మహాత్ముణ్డు గాపండు ధర్మ్మశీలు డై.

7


క.

చిరముగం దూబఱుత మహే
శ్వరునిం బ్రతిష్టించి రజతశైలము నా భా
సురముగ గుడి యెత్తించెను
గురుమతియై కాపనాయకుం డతిభక్తిని.

8

—————

3

శ. స. 1064

ఇది గుంటూరుమండలములో తెనాలితాలూకా వలివేరుగ్రామములో స్వయంభ్వేశ్వరస్వామి దేవాలయము నెదుట నొకఱాతిమీఁద చెక్కఁబడినది. (A. R. 676 of 1920.)

శా.

శ్రీరమ్యు(౦డ)గు గుండ్యబోయునికి సంసిద్ధంబుగా నుర్వ్వరను
శ్రీరామానిభదామమాంబికకు సత్సేవ్యుండు భవ్యుండు వొ
ల్పారం దా నుదియించె బోయు (౧)డెఱియం డాగుప్తజుం డాయనను
శూరత్వంబున దానశక్తినిం బ్రభను శుద్దాత్మికను దీరికను.

1

ఉ.

పెట్టె నఖండదీపములు వేర్కలఠావులనెల్లం దన్నుం జేం
బట్టిన యాశ్రితులు[6] బుధులు[7] బంధులం జేకొని ప్రోచె వైరులను
మెట్టి ధరిత్రియెల్ల నిరమిత్రము సేయంగం బూనె బేర్మ్మితో
దట్టుండు గోంకభూపతికిం దామనపుత్రుడు సచ్చరిత్రమెయిని[8].

2


క.

జలధిరసఖేందుశకసమ
ములుగా నెఱియండు మకరమున సంక్రాంతిని
వలివేరి[9]భండారికి ని
శ్చలమతి దీపంబు నిలిపెం జంద్రార్కముగాను.

3

—————

4

శ. స. 1066

ఇది కృష్ణాజిల్లా దీవితాలూకా గంటసాలగ్రామములో జలాధీశ్వరస్వామి యాలయమునెదుట నున్న యొకపాలఱాతిమీఁద చెక్కఁబడినది. (A. R. 848 of 1917.)

చ.

(మతలుకటిం)పగా శకసమంబులు దర్క్కరసాంబరేందుస
మ్మితముగ నుత్తరాయణనిమిత్తమునం దతిభక్తిం బార్వ్వతీ
హితునకు ఘంటశాలజలధీశ్వరదేవర కాదిమూర్త్తి కా
నతసురచక్రవర్తికి మనఃప్రభవారికిం జంద్రమౌళికిన్.

1


చ.

ధ... ... ... వర్ద్ధనసుధాకరుం డెఱ్ఱమసె . . . . . .
............ వనజాయతాక్షి యనంగాం దగు........ పుత్రుండై
తనకును దల్లిదండ్రుల ... ... వుగాం బెనుంగొండశాసనుం
డ... ... గోటకొమ్మన గుణాఢ్యు.........త్రయిన్.

2

క.

ఆపురహరునకు వలపల
డాపల శాశ్వతము లై బెడగడరంగా
దీపింపంగ వేంగినకుల
దీపకుండై రెం డఖండదీపము లిచ్చెన్.

3


క.

ఈగిరిశుదక్షిణోత్తర
భాగముల నహర్నిశములుం బాయక వెలుంగును
శ్రీగుణమణభూషణ ...
రాగముతోం (గో)రి ధవ ...

4

—————

5

శ. స. 1066

ఇది కృష్ణామండలము దీవితాలూకా గంటసాలలో జలధీశ్వరస్వామియాలయములో నొకపాలఱాతిస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (A. R. 848 of 1917.)

చ.

... ... దింపంగా శకసమంబులు దర్క్కరసాంబరేందుస
మ్మితముగ నుత్తరాయణనిమిత్తమున(౦) దతిభక్తిం బార్వ్వతీ
హితునకు ఘంట్టశాలజల(ధీశ్వ)రదేవర కాదిమూర్త్తి కా
నతసురచక్రవర్త్తికి మనఃప్రభవారికిం జంద్రమౌళికిన్.

1


చ.

ధనద(కులాబ్ది)వర్ద్ధనసుధాకరుం డెట్టమసెట్టికి ...
వనజాయతాక్షి[10] యనంగా[11] దగు(పమ) ... సుపుత్రుండై
తనకును దల్లిదండ్రుల(కుధర్మ్ము)వుగాం బెనుంగొండశాసనుం
........ ... కొమ్మనగుణాఢ్య... ... డిత్రయిన్.

2


క.

ఆపురహరునకు (వల)పల
డాపల శాశ్వతము లై బెడంగడరంగ్గా

దీపింపంగ వేంగినకుల
దీపకుండై రెండు ... దీపము లిచ్చెన్.

3


క.

ఈగిరిశుదక్షిణోత్తర
భాగముల నహర్న్నిశములుం బాయక వెలుంగను
శ్రీగుణమణిభూష(ణుం డ)ను
రాగముతోం గోరి ధర్మ్మర . . . .

4

—————

6

శ. స. 1083

ఇది శాసనపద్యమంజరి ప్రథమభాగములోని 48 వ శాసనము చివరభాగము. ఈశాసనము గుంటూరుమండలము నరసారావుపేటతాలూకా తిమ్మాపురముగ్రామము వీథిలో నొకనాగస్తంభముమీఁద చెక్కఁబడినది. (A. R. 443 of 1915.)

క.

పరమపరుండైన గొంకీ
స్వరునిం బ్రతిష్ఠించి ధర్మ్మపరుండై లక్ష్మీ
పరుండై సొక్కమసరణయ
ధరదానము భూసురులకు దత్తము సేసెను.

17


క.

పరిమల ... ... ... . . .
పరగిన పంచమహాశబ్ద[12]ప్రణవంబులతోం
గర మొప్పు ధూపఘంటెయు
సరనయ గోంకీశ్వరునికి(ళ్య)ము యిచ్చెను.

18


క.

యవడిల[13] దూబవాడం
గ్రమమున పణ్డీస్వరమునం గడుధన్యముగా
నమరం గొంకీస్వరునికి
విమలంబగు దీపవర్త్తి వెలయంగం బెట్టెను.

19

క.

గుడియును జెఱువును వనమును
నడరిన నల్లిండ్లుం గ్రితియు న(ల?)పెన్నిధియునుం[14]
గొడుకులను సప్తసన్తతి
నొడంగూడంగ నిలిపి సరనం డొప్పెం గీర్త్తిని.

20

—————

7

శ. స. 1061

పశ్చిమగోదావరీమండలములో పాలకొల్లుగ్రామమందు శ్రీరామేశ్వరస్వామి యాలయప్రాకారములోపల నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. South Indian Inscriptions Vol. V. 162.

క.

శ్రీరమణీయుండు సుజనా
ధారుండు విబుధనుతగుణనిధానుండు విజయ
శ్రీరమ్యమూర్త్తి గేతమ
గారాపుందనూజుం డభయకరుండు వొగడ[15].

1


క.

వెలనాంటికిం దొడ వనంగా
వెలసినకుఱుంగడలు గలుగు వీరుండు నిజదో
ర్బ్బలములను [16] బలిమియుం బాడియుం
గలవాం డధికారపదవి గలవాండు మహిని.

2


తరు.

శకమహిపాలకసంవత్సరములు
            శశినిదివియదిందుసంఖ్యగాం గీర్తి
సుకరుండు రాజేంద్రచోడనియిష్ట
            సుభటుండ్డు వెంగ్గడయ[17]సుతుండు సూర్య్యాక్కుం
డకలంక్కుం డైనక్షీరారామదేవుం
            డగుశంబునకు భక్తుండై శనిభవని

ప్రకటింప్ప నిష్కసప్తక మిచ్చె మొట్ట
            పఱితికాంపులకునుం బరగుసానులకు.

3

—————

8

శ. స. 1091, 1093

పైస్తంభముమీఁదనే చెక్కఁబడి యున్నది..

★ ★ ★ ★ ★

శ్లో.

శ్రీశాకేశ్వరవత్సరే విధునిధివ్యోమేందుసంఖ్యాన్వితే
కార్త్తిక్యాం రిపురాజభీకరశరస్సోయ న్నరేంద్రాగ్రణీః
క్షీరారామనివాసినే భగవతే సెర్వ్వాయ[18] సర్వ్వాత్మనే
ప్రాదా దాశశితారకం గుణనిధి ర్ద్దీపా వఖండ్డౌ ముదా.


క.

శ్రీయుతవక్షు శ్రీవరకవి[19]
గాయకనిధి సుంద్దరాంబికసుతుండు(ను)[20]
శ్రీయుక్తుం డనంగ నెగడిన
రాయపనాయకునికాన్త రాజాస్య మహిని.


సీ.

గుణనిధివియదింద్దుగణనశకాబ్దంబు
            లమరంగ్గ నుత్తరాయణనిమిత్త
మగుపుణ్యదినమున నబ్జాస్య నాచినా
            యకునకుం జిన్నమాంబకుం దనూజు
ప్రోలమ గణికావిభూషణి భక్తిం ద
            న్నేలినహరున కడ్డెండుమాని[21]
కహిభూషణునకు క్షీరారామవరపు
            పతికి నఖండదీపంబు నిలిపె

దీని జేకొని నడపంగ్గంబూనె నిందు
వెలసి యెప్పుడుం దమసానివృత్తింగా జే(ను)[22]
కంటనకు నగ్రజుడు జక్కనఘనుండు
దరతరంబులు నాచంద్రతారకముగా.

—————

9

శ. స. 1070(')

ఇది గంజాముమండలము పర్లాకిమిడితాలూకా ముఖలింగములో ముఖలింగేశ్వరస్వామి ఆలయములో ఆస్థానమండపము ఎడమవరుస మూఁడవస్తంభముమీఁద దక్షిణమువైపున చెక్కఁబడియున్నది. (South Indian Inscriptions Vol. V. No. 1075.)

సీ.

శ్రీకరశుభకర(కా)బ్ధములు వియ
            న్మారుతవ్యోమసోమస్తుతముగ
సితతరైకాదశి నుతభౌమదినమునం
            (గాని)[23]మాసంబునం గంసరిపుండు
(పా)లమున్నీరిలోం (బ)వ్వడించిన (తి)థిం
            బితృదేవతల కతిప్ప్రితిగాంగ
విశ్వేశండగు మదుకేశ్వరదేవర
            (కా)చంద్రతారక మగుచు న(మ్మి)
దివ్యమగు నఖణ్డదీపంబు వెట్టె జు
ట్టేశు కట్టానుంగ్గు[24] సాసనికుండు
ధీయుతుండ్డు గాపినాయకుకూరిమి
తమ్ముం డెఱి ... యన్వితుదర్మ్మనుతుండై[25].

—————

10

శ. స. 1071

ఇది రాజమహేంద్రవరములోని చిత్రవస్తుప్రదర్శనశాలలోని గిడ్డంగిలోఁ బడియున్న ఱాతిస్తంభముమీఁద చెక్కబడియున్నది. (A. R. 40 of 1912.)

స్వస్తి శ్రీశకవర్షములు 1071 ణ్డగు నేంటి సూర్య్య
గ్రహణనిమిత్తమున శ్రీమన్మహామండలిక బొద్దనకొడ్కు నారాయణ
దేవనిప్రధాని దత్యపెగ్గడ సోమనపట్టిసమున వీరభద్రేశ్వరమహాదేవరకు
నఖండదీపమునకు నిచ్చినమోదాలు 55 వీనిం జేకొని జన్నిబోయినియ
డపున అప్పన బోయినికొడ్కు సూర్య్యబోయుండు తనపుత్రానుపౌవు
త్రిక(ము) ఆచంద్రార్క్కము నిత్యమానెణ్డు నెయి వోయంగలవాణ్డు.


సీ.

భీమాపురము డాకరేమియు(న) మాడాలు
            గుడిపూండి యునుం బాలుకొలన వీర
భద్రేశ్వరంబున భావపట్టునం దాంబ్ర
            పురిం బి( )పురమునం బరంగు దూబ
ఘంటశాలాపురిం గౌతరంబునను నే
            లీశ్వరంబునను వేగీశ్వరమున
విజయవాటిక నుండవిల్లిని వేలుపూరం
            గర మొప్ప గొంటూరం గడలిపల్లి
కనకవలయములును ఘనలోహవరదండ
ములు నఖండదీపములునుం బెట్టి
మ(ఱ)లం బెక్కుగుడ్లుం జెఱువులు గొంటూర
నిలిపె మం(త్రి)౦మం(తి)౦(షు)భుజుండు[26].

1


శా.

భారద్వాజపవిత్రగోత్రుం(డు) జగత్ప్రఖ్యాతిగాం బెట్టెం బు
ణ్యార(౦)బ్భుం డొరిగాండివల్లభుండు దత్తామాత్యసోముండు దా
క్షారామప్రముఖోల్లసత్ప్రకటపంచారామతీర్త్థంబులన్
సారాఖండదశాప్తదీపకము లాచంద్రార్క్కతారంబుగాను.

2

—————

11

శ. స. 1074

ఇది బెజవాడలో మల్లేశ్వరస్వామి యాలయము నుత్తరద్వారమున నున్నమండపములో నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (A. R. 323 of 1919.)

సీ.

శరగిరిగగణేందుసమితసకరాజ
            వత్సరంబులు బెజవాడ (ఏ)లు
నయనిధి బొద్దననారాయణుని ధనా
            ధ్యక్షి నాగార్జ్జునుం డతని అత్త
గంటమ నిజకులకమలినీకలహంస
            గుణగణాలంక్రిత గోరి నిల్పె
మల్లేశ్వరునకు సామజదైత[27]చర్మ్మాంబ
            రున కద్రికన్యావరునకు లలిత
ఖండశశిధరున కఖండద్వీప[28]జ్వాల
(ఒ)నరి యొప్పి లీలం దనరి వెలుంగ
నర్చ్చ లిచ్చి కొ(ల్వ) నవితరభక్తి నా
చంద్రతారముగం బ్రశస్తముగను.

1

—————

12

శ. స. 1075

ఇది గుంటూరుమండలము నరసారావుపేఁటతాలూకా నాదెండ్లగ్రామములో మూలస్థానేశ్వరస్వామి యాలయములో ముఖమండపము కుడిప్రక్కరెక్కతలుపుమీఁద యున్నది. (A. R. 330 of 1919.)

క.

శ్రీరమణీరమణియ్యా
కారమహోదారధర్మ్మగౌవురవ[29]కులని

స్తార యనం బరగు బుద్దన
సూరబుధాధార ప్రియవచోరమ్య మహిని.

1


క.

బాలేందుశేఖరునకుం గ
పాలికి శూలికి లసత్కపర్ద్దికి ద్రిజగ
త్పాలి(తుం?) డగు నాదిండ్ల[30]
మూలస్థానుం డగు శంభుమూర్త్తికిని[31].

2


చ.

అమితగుణాభిరామసుగుణాభరణాభరణాభిరామదా
మమవరపుత్రి సూరమ రమారమ(ణీవి)యశ్రీ...దా
నమహి(మ)........ మెయి[32] నెగడి నాదిండ్ల[33] ... శశిమౌళికి ...
... ... ... ... ... ముద మొప్ప(౦గ) నిల్పె(౦) బొల్పుగాను.

3


స్వస్తిసకవర్షంబులు 1075 అగు నేంటి ... సంక్రాంతి నిమిత్య
మున........ నాదిండ్లమూలస్థానమహాదేవరకు అఖండవర్త్తిదీపమున
(కుం) బెట్టిన బిరుదుగద్యలు పండ్రెండు.

—————

13

శ. స. 1078

ఇది గుంటూరుమండలములో తెనాలితాలూకా పెరవలిగ్రామములో మల్లేశ్వరస్వామిగుడి ప్రాకారములోపల నున్న యొక్కఱాతిస్తంభముమీఁద నున్నది. (A. R. 664 of 1920.)

క.

శ్రీరమణుండు శౌర్య్యగుణో
దారుండు గొంకవిభుమామ దర్ప్పితరిపుసం
హారుండు ధీరుం డనందగు
మారయ పండండు గీతికామండనుడు మహిని.

1

క.

అనందగు దండేశుప్రియాం
గన గొమ్మమ విబుధమిత్రగణపరివారం
బున కెల్లను హ్రిదయానం
దనకారి యనంగ నెగడి ధారుణిమిందను.

2


క.

ఘనుండు నిడుమ్రాని కొమ్మయ
కును లీలావతియు ధైర్య్యగుణవతి యని పెం
పున నెగడిన మల్లాంబిక
కును సుత యనంగ బరగి[34] ధైర్య్యగుణసంస్తుతితోను.

3


సీ.

వననిధివేష్టితావనిలోనం గలయగ్ర
            హారంబులకు మణిహారలీల
మానైన పెరువలిమాధవదేవర
            కెత్తించె గుడి భక్తి యె(సం)గం గొమ్మ
మాంబిక తత్సూనుం డరు(చోడ)దండేశు
            డట్టెవునకు[35] నివేద్యమున కర్త్తి
తో రాజితం బగు నేరడ్లచెఱ్వు నా
            గ్నేయ...కు నంగడు నాయితముగం
బరగం( బాద)... ఖ్యనిరువుట్టి భూమి ర
వీందుతారకముగ నిచ్చెం ద్రైశ
తాగ్రజన్మసమితియనుమతంబున శకా
బ్దము విభాద్రిదిగ్మితమున వెలయ.

4


వ.

గడ్వ మడి ప్రేంపావ (ద)క్షిణంబునం బుట్టెండు భూమి దానిం
బూజారిమాధవభట్లు దేవరకు గొసవి నివేద్యంబున కిచ్చిరి.

—————

14

శ. స. 1094

ఇది గుంటూరుమండలము గుంటూరుతాలూకా పాములపాడులో మల్లికార్జునస్వామి యాలయమున కెదుట నందిస్తంభముమీఁద చెక్కబడినది.(A. R. 124 of 1917.)

ఉ.

శ్రీమహిలాభిరాముండు విశేషితకీర్త్తుండు గొమ్మం దర్త్థిచిం
త్తామణి దల్లిదండ్రులకు ధర్మ్మువుగా శివధర్మ్మయుక్తుండై
పాములపాట నొప్పంగం గపర్ద్దికి సజ్జనసంస్తుతంబుగా
ధీమణి వెట్టె నాత్మకులదీపక మైన యఖణ్డదీపమును.

1


ఉ.

చారుతరాబ్ధినంద్దఖ(ని)శాకరసంఖ్య శకాబ్దము ల్సనను
ధీరుండు గేతనాత్మజుండు ధీనిధి వాములపాటం గొమ్మం డి
ద్దారుణి నామృగాంకరవితారకమై చనం బెట్టెం బెంప్పున
న్మేరువు యుత్తరాయణనిమిత్తమునందు శశాంకమౌళికిని.

2

—————

15

శ. స. 1094

ఇది గుంటూరుమండలములోని పాములపాడుగ్రామములోని మల్లికార్జుస్వామి యాలయమునెదుట నందినాగస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (A. R. 123 of 1917.)

ఉ.

శ్రీజననాలయుండు బుధసేవ్యుండు వేముండు సద్గుణుండు మా
తాజనకద్వయంబునకు ధర్మ్మువుగా శశిమౌళిధర్మ్మి యై
రాజితచంద్రమౌళికిం దిరంబుగం బాములపాటం బెట్టె స
త్పూజితమై మహిన్నెగడం బొల్పగుచున్న యఖణ్డదీపమును.

1


ఉ.

వారక యానిశాకరదివాకరమై చనంగా శకాబ్దములు
ధారుణి వార్ద్ధినంద్దదివితారకనాథమితంబుగా మహిని
గౌరత నుత్తరాయణము గారమై యెఱగాంక్కపుత్రుం డు
త్సాంతదోషపుంజము విచారపరుణ్డు ధరాతలంబునను.

2

—————

16

శ. స. 1094

ఇది గుంటూరుమండలము పాములపాడుగ్రామములో మల్లికార్జునస్వామి యాలయమునెదుట నందినాగస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (A. R. 122 of 1917.)

ఉ.

పాములపాటిమణ్డనకుం బంకరుహానన యేడుమాంబకుం
గామనిభుండు గొమ్మన సుఖస్థితిం బుట్టి నిజాన్వవాయసు
త్రాముండు దల్లిదండ్రులకు ధర్మ్మువుగాం దనవృత్తిపై గ్రహ
గ్రామణిం బోల దీపక మఖణ్డితమై మహిం బర్వ్వి యొప్పంగాను.

1


క.

సరధి[36]నిధిఖేందుసక[37]
త్సరసంఖ్యలం గార్త్తిక(ము)న దవలిమపూర్న్న
స్థిరగురుదినమునం గొమ్మన
యురుతరదీపంబు శివున కొప్పంగ నిల్పెను.

2

—————

17

శ. స. 1094

ఇది గుంటూరుమండలము పాములపాడులో మల్లికార్జునస్వామి యాలయమునెదుట నందినాగస్తంభముమీఁద చెక్కఁబడినది. (A. R. 120 of 1917.)

ఉ.

కామనిభుణ్డు భీమనకుం గామవసాన్కిం[38] బుట్టి బంధుచిం
తామణి యైనకొణ్డం డు చిత(౦)బుగం బాములపాట సజ్జన
స్తోమనుతిం బ్రదీపకము ధూర్జ్జటి కెత్తె నఖండవర్త్తి యు
ద్దామయశఃప్రకాశి దమతల్లికిం దండృకి[39] ధర్మ్ము వేర్ప్పడను.

1

క.

జలధినవాంబరశశిసం
ఖ్యలmకు[40]నేండ్లు[41] గార్త్తికము పున్నమ ను
జ్వలగురుదినమునం గొణ్డం
డలఘుండు దీపంబు నిల్పె హరునకు వేడ్కను.

2

—————

18

శ. స. 1094

ఇది గుంటూరుమండలములో పాములపాడుగ్రామమందు మల్లికార్జునస్వామి యాలయమునెదుట నందినాగ స్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (A. R. 121 of 1917.)

చ.

విరచితకీర్త్తిలోలుం డగువెన్నపరడ్డికిం బ్రోలసానికి
న్వరసుతుండైన బొల్లన ధ్రువంబుగం బాములపాటం బార్వ్వతీ
శ్వరున కఖణ్డదీపకము సంద్రుండు సూర్య్యుండుం గల్గునంతాకా
దరణ వెలుంగ్గం బెట్టెం దనతల్లికి దండృకి ధర్మ్ము వేర్ప్పడను.

1


క.

గతినిధిఖేంద్దుశకాబ్ద
ప్రతతిం గార్త్తికము శుక్లపంచాదశి గో
పతిదినమున బొల్ల[42]
ణ్డతులితదీపంబు నిల్పె హరునకు వేడ్కను.

2

—————

19

శ. స. 1111

ఇది పశ్చిమగోదావరిమండలములో ఏలూరుతాలూకా తడికలపూఁడిలో గాంగేయేశ్వరస్వామి యాలయము కళ్యాణమండపములో నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (South Indian Inscriptions Vol. V. No. 202.)

సీ.

శ్రీశకవత్సరశ్రీశధరా(తళ)
            శశిధరమితము(గ్రాం)జైత్ర(బ)హళ

(ప)క్షత్రితీయ్యయు మేషసంక్రాంత్తినిమిత్తము(నం) వీరబలంజ్య
ధర్మ్మనిర(తుం)డు దాచ(నై)తమసెట్టి కబ్జాతనేత్రి గేతమాంబికకు
నుం బ్రీతితనూజుండు మహితగుణాఢ్యుండు మల్లిసెట్టి
భక్తి బె(ట్టె) నాండుం బల్లిహ(హరు)నకు నఖండదీప మాదరముగనే
యిరువ(ద్వి)నుమొదవులుం బ్రసిద్ధిగాంగ.

ఈపద్యమందు తప్పులు మెండుగా నున్నవి.

—————

20

శ. స. 1112

ఇది పశ్చిమగోదావరీమండలములో ఏలూరులో మసీదుస్తంభముమీఁద చెక్కఁబడినది. (South Indian Inscriptions Vol. V. No. 184.)

క.

తరణిశివశకసమంబు(ల
స)రసి[43] సోమేశ్వరునకు సంధ్యదీప[44]
లిరుసంధ్యలం జనం గ్గాటయ
వరపుత్రుం డమాత్యయయ్తి(వర)౦గం బెట్టెను.

—————

21

శ. స. 1121

ఇది పశ్చిమగోదావరీమండలమున ఏలూరుమసీదులో నొకస్తంభముమీఁద చెక్కఁబడి యున్నది. (South Indian Inscriptions Vol. V. No. 189.)

చ.

గురుమతి మంత్రి శ్రీధరునకుం గ్గొసనాంబకు నంద్దనుణ్డు సు
స్థితుండగు[45] భీమశౌరి సరసీపురి (నొ)ప్పిన సోమనాథదే
వరకు నఖణ్డదీపము ధ్రువంబుగ నేర్ప్పడ్డం బెట్టె రోహిణీ
శ్వరకరకైరవాప్తశశిసంఖ్యశకాబ్దము లుర్వ్విం బర్వ్వంగాను.

—————

22

శ. స. 1114(?)

ఇది పశ్చిమగోదావరీమండలములోని ఏలూరుమసీదులో నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (South Indian Inscriptions Vol. V. No. 186.)

సీ.

శ్రీశుభశకదరదిశవస్సరములు [46]
            వేదత్రి(లో)చనరుంద్ర[47]సక్య[48]
వెలయంగ వైశఖ విమలసప్తమియును
            సోమవాసరమున సుస్తిరముంగ
కొలని కేశవదే(వు)కొలికి[49] సుభటండు(ఎ)న[50]
            పోతికేతనల[51] ప్రీతితమ్ముం
డిహలోకమున సుఖ వింతియ[52]సాలు వొ
            మ్మని తల్లిదండ్రిని నత్లం[53] దలంచి
మదనసద్రిశుండు (కా)వన దివియప్రోలం[54]
డమరపురమున కర్తితో నరుగుచుండి
కొలనిసోమేస్వరునకును సలలితముంగా
సంధ్యదీపంబు వెటించ్చె సస్వతముంగ.


వరనాలుగు సిదెడసెట్టగోత్రవిలసద్ధిరుద్రసఖ్యల సురచితముగ సరసీపు

(అసంపూర్ణము)

—————

23

శ. స. 1114

ఇది పశ్చిమగోదావరీమండలమందు పాలకొల్లుగ్రామములో శ్రీరామేశ్వరస్వామియాలయములో నొకరాతిస్తంభముమీఁద చెక్కఁబడినది. (South Indian Inscriptions Vol. V. No. 173)

క.

మనుశివ(వత్సర)సంఖ్యం బయో[55]
జిని శ్రీసోమేశ్వరునకు శ్రీదుర్గ్గికిం చే
కొని రెణ్డుసంధ్యదీపము
లొనరంగ భణ్డరువుకొమరం డొగిం బెట్టె దగను.

—————

24

శ. స. 1123

ఇది పశ్చిమగోదావరీమండలములో ఏలూరుమసీదులో నొకస్తంభముమీఁద చెక్కబడి యున్నది. (South Indian Inscriptions Vol. V. No. 185)

చ.

పురకరకైరవాప్తశశిభూరిశకాబ్దము లొప్ప శాంర్జ్ఞికిని
సరసిపురంబులో నిలిపె సంద్ధియ[56]దీపము వెన్నిసెట్టికిం
దారుణియ ఘంట్టసాలపురి దారమకును[57] ఫల మొంద్ద వీరికిని
వరసుత యైనవాసమ ద్రువంబుగ నాశశితారకంబుగాను.


ఈసంద్యదీపము సేకొని కన్నమపణ్డితులు నామనయు రెణ్డు
సంధ్యల నడపంగ్గలవారు.

—————

25

శ. స.1123

ఇది పశ్చిమగోదావరీమండలము ఏలూరుమసీదులో నొకస్తంభముమీఁద చెక్కఁబడినది. (South Indian Inscriptions Vol. V. No. 179)

చ.

పరగంగమ్మ[58] వైశ్యనిధి భట్టిపురేశుండు ప్రోలిసెట్టి కం
బురుహదళాక్షి ప్రోలమసు[59]పుత్రుండు యాయ్తమసెట్టి పెట్టె శ్రీ
సరసిపురంబు క్రిష్ణునకు సంధ్ధియ[60]దీపము శాశ్వతంబుగాం
బురకరకైరవాప్తశశిభూశకద్బము[61] లుర్వ్వి పర్వ్వంగాను.


దీని సేకొని కన్నమపండితు నమనపండి(తు)లు నడవంగ్గలవరు.

—————

26

శ. స. 1124

ఇది పశ్చిమగోదావరీమండలములో ఏలూరుమసీదులో నొకస్తంభముమీఁద చెక్కఁయున్నది. (South Indian Inscriptions Vol. V. No. 183)

చ.

చిరముగ ఘంటసాల యెఱసెట్లపుగోత్రము వెన్నిసెట్టికిని
సరసిజనేత్రి దారమకు సత్సుత వాసన వెట్టెం బద్మినీ
పురమున సోమనాథున కపూర్వ్వముగా నిరుసంధ్యదీప మా
సరసిజగర్భ్బవక్త్రకరచంద్రశశాంకశకాబ్దసంఖ్యలను.

—————

27

శ. స. 1131

ఇది పశ్చిమగోదావరీమండలములో ఏలూరుమసీదులో నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (South Indian Inscriptions Vol. V. No. 177)

సీ.

శశిరామరుద్రశకసమములం గేశవ
            మం(డ్డ)లేశ్వరుబంటు మహిమ వెలయ

చం(ది)రు[62]దేవణ్డు దండ్డెమాంబికకును
            శ్రీయుతు ణ్డెఱ్ఱమనాయకునికిం
గౌరికి[63]పుత్రుణ్డు గొమరుగాం దనభార్య్య
            ముప్పమకును ధర్మ్ము వొప్పుచుణ్డ
సంద్ధియ[64]దీపంబు శాశ్వతంబుగం బెట్టెం
            గొలనిసోమేశున కెలమి వెలుంగం
చెలువుగాంగ దీనిం జేకొని కన్నన
పండితుండు నడపుచుణ్డువారు
బెడంగుగా నాచంద్ర[65]
తారకముగ నెల్లవారుం బొగడ.

—————

28

శ. స. 1131(?)

ఇది గంజాముమండలము శ్రీకాకుళముతాలూకా శ్రీకూర్మములో కూర్మేశ్వరస్వామియాలయము ఉగ్రాణపుగది కుడిప్రక్కస్తంభముమీఁద చెక్కఁబడి యున్నది. (South Indian Inscriptions Vol. V. No. 1256)

సీ.

గగణగుణాత్మేంద్దుగణనశకాబ్దము
            లు [66] సనం చైత్ర[67]సితషష్టిశశిదినమున
నఖలసురాసురేంద్రానర్గ్ఘ(ము)కుటాగ్ర
            సద్రత్నరంజ్జిత(చ)రణుండైన

కూర్మ్మనాథునకు సద్గుణి మాపగాము
            శాసనుం డుపమ(న్యు)సన్మునివరేణ్య
గోత్రుం డేతమనాయకునకుం గండెమకునుం
            దనయుండు వంశవర్ద్దనుండు ధర్మ్మ
విదుండు రేవన ఒంబరవెల్లినాగ
బంధమున విల్చి పుట్టెండు వం(ట్టి)[68]పొలము
దెలుపు మిగుల నఖణ్డప్రదీపమునకుం
దనరంగాం బెట్టె నాచంద్రతారకముగ.

—————

29

శ. స. 1133

ఇది గుంటూరుజిల్లా గుంటూరుతాలూకాలోని ఇప్పటముగ్రామములోని మల్లేశ్వరస్వామియాలయము నెదుట నున్నయొకఱాతిమీఁద నున్నది. (A. R. 88 of 1917)

సీ.

శ్రీశకరాజాభిశేకవత్సరములు
            పురరామచంద్రభూపరిమితముగ
నమరంగ్గం బౌష్యమాసమున పంచ్చాదశిం
            గమలాప్తదినమున విమలధర్మ్మ
మతి న్రిపచారిత్ర నుతికెక్కు గండ్డభూ
            పతిసుతుం డ్డౌదార్య్యమతిం దలంచి
సమ్మతుండై కోట ముమ్మడిదేవన
            రేంద్రుండ్డు విభవసురేంద్రసద్రిశుం
డభిమతార్త్థధర్మ్మవిభవశౌర్య్యోన్నతిం
దనరి వెలుంగ నిచ్చె మనుచరిత్రుం
డవని దేవతతికి భువి దాన మేర్ప్పడం
దరణి రజనికరసుతారముగ.

—————

30

శ. స. 1145

ఇది పశ్చిమగోదావరీమండలములో ఏలూరుమసీదులో నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (South Indian Inscriptions Vol. V. No. 178)

క.

సరసిపురి సస్వతంబై
శరవార్ధిశశాంకభూమిశంకెమెయి న్నీసు
స్థిరుండగు (వ)యపకొమన[69]

—————

31

శ. స. 1150

ఇది పశ్చిమగోదావరీమండలములో ఏలూరుమసీదులో నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (South Indian Inscriptions Vol. V. No. 192)

సీ.

శ్రీరమ్య మగుసరసీపురి సోమేశ్వ
            రునకును విష్ణుదేవునకు భక్తి
యమరంగ నిరుసంద్ధియలయంద్దు నెంతయు
            వెలుగంగ్గ ధారుణివ(ల)యనాయం
డగు కేశవాధీశు నతివ శ్రీగు(డు)పూండి
            గోకర్నదేవునకును ముదమునం
బ్రాసాద మెత్తించ్చి బహుధర్మ్మువులయంద్దు
            వరగిన మల్లా(౦బ) వరసుపుత్రి
వ్యోమసాయకభూసుధాధా(మ)సంఖ్యం
గార్త్తికము శుద్ధశివతిథిం గాంత్తిసహితుం
డగుగదాధరదేవని యైతమాంబ
(స)౦ధ్యదీపంబు లొగిం బెట్టె సాశ్వతముగ.

—————

32

శ. స. 1150

ఇది పశ్చిమగోదావరీమండలములో ఏలూరుమసీదులో నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (South Indian Inscriptions Vol. V. No. 193)

క.

అంబరశరశివసంఖ్యం ద్రి
యంబకవ...లకు దయామతితో నై
తాంబ సరసీపుర ...
దం బమరంగ సంధ్యదీపతతి వెట్టె.

—————

33

శ. స. 1166

ఇది గుంటూరుమండలము బాపట్లతాలూకా కొమ్మూరుగ్రామములో కాశీనాథేశ్వరస్వామి దేవాలయమునం దొకఱాతిమీఁద చెక్కఁబడియున్నది. (A.R. 826 of 1922)

సీ.

శ్రీయుత మైన కొమ్మురియగస్తేశ[70]
            విభునకు దీపంబు విస్తరిల్ల
నెసగుదీపావలి వసుధలో...౦చ
            నగతీశ్వర[71] స్వామి(క)ర్త్థితోడ
పురుషనిధానుండు సురరాజసద్రిశుండు
            ముత్తియనాయంక్కు పౌత్రుండ...[72]
బలుం డరివీరుల భంజిచి (పే)ర్కొన్న
            నాగినాయకుప్రియనందనుండు
అతులధర్మ్మమూర్త్తి యనుపమ ... తకీర్త్తి
కొండమాంబసుతుండు కో(ర్కి)తోడ

ప్రోలినాయకుండు వొల్పు(గా) దీపగం
బంబు నిల్పె భువనిం(?) ప్ర(స్తుతి)౦ప.


స్వస్తి శ్రీశకవంబు(లు) 1166 నేంట్టి పౌష్యబహుళ 9 ఆది
వారము నుత్తరాయణసంక్రాంతి నిమిత్యమునం- మొ.

—————

34

శ. స. 1177

ఇది పడమటిగోదావరిజిల్లా నరసాపురముతాలూకా ఆచంటగ్రామములో రామేశ్వరస్వామి యాలయము దక్షిణపుగోడలోఁ గట్టఁబడిన యొకఱాతిమీఁద చెక్కఁబడినది. (A. R. 700 of 1926)

శకవర్షంబులు 1177 గు నేంట్టి ఉత్తరాయణసంక్రాన్తినిమి
త్తమున (ఆసంట్టశ్రీరా)మీశ్వర శ్రీమహాదేవరకు రాజమరాజు ఎఱ్ఱ
లక్ష్మీరాజు వేంగీశ్వరుండు పినలక్ష్మీరాజు ... రును పెట్టిన అంఖండదీపము
నకు......


క.

ఇనశశిదిగ్గజతారక
వననిధికులశైలగగణవసుధాగ్నిసమీ
...కలయంత్తకాలము
వినుతంబై దీప్తి మిగిలి వెలుంగుచునుండును.

—————

35

శ. స. 1264?

ఈశాసనము కర్నూలుజిల్లా త్రిపురాంతకములోని త్రిపురాంతకేశ్వరదేవాలయములోని చీకటిమిద్దె తూరుపుగోడమీఁద చెక్కఁబడియున్నది. (A. R. 230 of 1905)

సీ.

శ్రీశకరాజ్యాభిషేకవత్సరములు
            జలనిధి(తర్క్కార్క్క)సంఖ్యం బరగం

ప్రవిమల[73](తరచిత్ర)భానువత్సరమ్బున[74]
            వినుతకార్త్తికమాసవిమలపక్ష
కలితపంచాదశిం గమనియ్య(తర)సోమ
            వాసరంబున బుధవర్ణనీయ
ల ........సముల్లాసంబు దీపింప్ప
            రత్నజాంబూనదరచిత మైన
వైజయంతి కుమారాద్రివాసునకును
అంబ్బికానాథునకుం ద్రిపురాంతకునకు
భక్తిం బ్రణుతించ్చి యెత్తించ్చెం బరమపుణ్య
సోమభూవరుపో(తాంబ) సుస్తిరముగ.[75]

—————

36

శ. స. 1299

ఈపద్యము శ్రీశైలములో మల్లికార్జునస్వామిదేవాలయములో నందిమండపమునకుఁ జేరియున్న మండపము కుడియెడమస్తంభములమీఁదఁ జెక్టఁబడినశాసనములో జివరఁ గనఁబడుచున్నది. (A. R. 20 of 1915)

సీ.

శ్రీపర్వతస్థలి చెలువగుశ్రీమల్లి
            కార్జునస్వామిగేహాంగణమున
మహనియ్యమగు వీరమంటపం అనెకప్ల[76]
            విలసితం బగుపుణ్యస్తలి నొప్ప[77]

కట్టించి జగనొబ్బగండ్డన్న వేమభూ
            విభుని...శ్వరధర్మవిభవకీర్త్తి
సకలదిక్కులు నిండి సాంద్రమై ఆచంద్ర
            తారకఃస్తితి నుర్వ్వి తనరజేశె
శాంకరాగమమంత్రదీక్షావిభూతి
దంచితా[78]చారుం డగుచున్న పంచభిక్షం
రామనసుతుండు నిర్మ్మ... వంశుండు
మల్లనాఖ్యుండు శివభక్తిమార్గరతుండు.

—————

37

శ. స. 1345

ఇది గోదావరీమండలము భీమవరముతాలూకా భీమవరగ్రామములో భీమేశ్వరస్వామిగుడియెదుట నున్నమండపములో నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (A. R. No. 460 of 1893)}

సీ.

ధరం జతుర్ద్ధాన్వయాభరణుండు దేవయ
            తనయుండు దూలశింగనఘనుండు
శకవర్షములు బాణసాగరరా(మే)౦ద్దు
            వరసంఖ్య నగు క్రోదివత్సరమున
అరుదారంగాం గువరారామ[79] భీమేశ్వ
            రునకు నొప్పార భూజనులు మెచ్చ
కళ్యాణచంద్రశేఖరమూర్త్తి౦ జేయించి
            యెలమిం బుట్టడు శేను[80] విలిచి పెట్టి
(త్రో)పుఘంటయుం గంచ్చునదీపగంభ
మును సమర్ప్పించ్చి గోవులం దనర నిచ్చి

పట్టుచీరయుం బళ్ళెంబు భక్తి నొసగెం[81]
దనద్దు[82]ధర్మంబు లాచంద్రతారక(ము)గా.

—————

38

శ. స. 1422

ఈపద్యము గుంటూరుజిల్లా బాపట్లతాలూకాలోని ఇడుపులపాడుగ్రామములోని చెన్నకేశ్వరస్వామిదేవాలయములో గరుడస్తంభముపై నాల్గువైపులను చెక్కఁబడియున్న యొకసంస్కృతశాసనమునం దిమిడియున్నది. (A. R. 802 of 1922)

వంశావళిపద్యము

సీ.

శ్రీయాజ్ఞవల్క్యప్రసిద్ధాన్వయమునందు
            ముఖ్యుండు దామయ్య ముత్తతాత
గురుభరద్వాజసద్గోత్రోద్భవుం డైన
            ధన్యుం డనంతయ్య తాతతాత
నిత్యసత్య ... ...వి మానాఖ్యుం ....
            ముత్తనాయ ... తండ్రితాత
భూరివైభవ ...గర్బ్భుం డీతం డనంగం
            దనరు కొండయమంత్రి తండ్రితండ్రి
మహిమతో దుర్మ్మంత్రిమానమర్ద్దనుం డైన
            ఘనుండు ముత్తయమంత్రి కన్నతండ్రి
పరమపాతివ్రత్యభాగ్యసంపన్నయౌ
            కమలాక్షి సింగాంబ కన్నతల్లి
అగ్రగణ్యులు కొండయామాత్యచంద్రుండు
            రమ్యవైభవుండు శ్రీరంగవిభుండు

తేజోబలారోగ్యధీసమగ్రుం డైన
            నయశాలి తిమ్మయ్య నంద్దనుండు
విభవాస్పదం బైన వినికొండతూర్పున
            తనరు నిడుపులపాడు[83] తానకంబ్బు
జలజలోచనుండు కేశవదేవుండు ...
            వేల్పు వెలయ దిమ్మయ ప్రోలవిభుండు.[84]

(తక్కినది స్పష్టముగాఁ దెలియుట లేదు).

—————

39

శ. స. 1522

ఇది గుంటూరుజిల్లా ఒంగోలుతాలూకాలోని ధర్మవరముగ్రామములో సీతారామస్వామియాలయమున కెదుట నున్న యొకఱాతిపైఁ జెక్కఁబడినది. (A.R. 841 of 1922)

సీసము.

వివిధసేనలం(దూ)రి[85] పెద్దగుంపులు సేసి
            (పదిరిగా)ల్చినయట్టిపాలెగాండ్ల
దుర్గాధిపులబిరుదులు రణావనిం గొట్టి
            పట్టించుకొనియెడుపాలెగాండ్ల
పూర్వాబ్ధిపర్యంతమును దాడి పెట్టిన
            పడమటిగట్ల పాలెగాండ్ల
జలదుర్గగిరివనస్థలదుర్గభూముల
            పట్టు గల్గినయట్టి పాలెగాండ్ల

మహితఘుమఘుమ ముమడిమొ మానినాడ[86]
మాత్రమునం బశ్చిమాంబుధి మహికి మిగులం
బరువు వెట్టించ్చి మహమందు పాదుశహప్ర
ధానవర్యుండు యెకలాసఖానవిభుడు.

ఇటువంటి యెకలాసఖానునింగారు అద్దంకిసీమలో ధర్మవరమునందు తనపేర యెకలాసఖానపుర మని పేట కట్టించి యీపేటకు కౌంలు ఇచ్చిన వివరం.

—————

40

శ. స. 1685

ఇది గంజాముమండలము శ్రీకాకుళముతాలూకా శ్రీకూర్మములో కూర్మేశ్వరస్వామియాలయము తిరుచుట్టుమండపములోని యిరువదిమూఁడవస్తంభము వాయవ్యమూల దక్షిణముఖముగా చెక్కఁబడియున్నది. (Sonth Indian Inscriptions Vol. V. No. 1203.)

స్వస్తిశ్రీ॥ శాలివాహనశకే గతాబ్దాః 1685 కాంగ్గా.


శ్లో.

శ్రీమత్కూర్మపురే సమస్తభువనఖ్యాతే మహాయత్నతః
శ్రీరామం నిజలక్ష్మణేన సహితం కర్త్తుం మహావైభవాత్
శ్రీరామానుజలక్ష్మణస్య సుతనో ర్భక్త్యా శు కూర్మాలయే
సర్వైశ్వర్యయుతే సమస్తశుభదే లోకైకనేత్రోత్సవే.

1


శ్లో.

శ్రీమద్భాష్యకులాబ్ధిసోమసుమహావేదాంతవర్య స్సదా
స్వాచార్యైకమనా స్సమస్తగుణయుక్ శ్రీమత్స్వభాన్వా(౦)హ్వయే
వర్షే మాసిచ జేష్ఠసంజ్ఞని నిజే చిత్తాఖ్యఋక్షే శుబే
శ్రీమత్పద్దశమీదినే శుభకరే వారేచ సోమస్యవై.

2


శ్లో.

సర్వోత్కృష్ట మపూర్వవస్తునిచయైః కృత్వా ప్రతిష్ఠాం శుభాం
తత్పూజాది మహోత్సవం సమతనో త్కీర్తివృద్ద్యై సదా.

శ్లో.

పూర్వం మహారాష్ట్రజనై ర్హృతోభూత్సౌమిత్రి రార్యాగ్రత ఏవ దుష్టైః
తదా ప్రభృత్యేవ సరామదేవః మహోత్సవస్థోపి బభౌ న కర్హిచిత్.
విజ్ఞాతతద్వేదవిదాం వరిప్టో వేదాంతవర్య స్త్వకరో త్ప్రయత్నం
శ్రీలక్ష్మణస్యాపి కృతౌ శుభాయాం సమస్తరాజన్యవరైరసాధ్యం.

2


శ్రీశంకరాఖ్యం రథకారమాశుసమాంహ్వయామాససురామతీర్థాత్
తేనైవ సర్వోత్తమశిల్పిసంవిదా సకారయామాస సులక్షణాకృతిం.

3


*

రాయాచార్యకృతా నాదౌ శ్లోకాన్ లిఖతవా నహం
తతో మద్రచితాః పద్యాః లిఖతం చ్ఛాంధ్రభాషయా.

1


శా.

ఆది న్మాధ్వు ల్రఘుపతిని రామానుజు న్భూమిపుత్రి
న్మేది న్మోదంబున సితగిరి న్నిల్పినంత్త న్మహారాష్ట్రుల్ దా
సౌమిత్రిశరగొనిన న్రూఢిగావింప్ప భాష్యం
వేదాంత్తాచార్యులు మగిడి దా వేడ్కతో జేయుమంన్నన్[87].

2


క.

కాకుస్థవంశజానుజు। చేకొని హరిభక్తు లెల్ల సేవించుట కై
శ్రీకూర్మక్షేత్రంబ్బున। వాకలపుడిశంక్కరుండు వరుస సృజించ్చెనూ.

3


చ.

అరయగ శాలివాహనశకాబ్దము లుర్వి పదారునూర్లపై
నిరవుగ నెన్బదేను గతియించిన వెన్క స్వభానునామవ
త్సరనిజశుక్రశుద్ధమున సార్ధకమౌ దశమి న్మృగాంకవా
సరమున చిత్తయందు నతిసౌఖ్యత సల్పిరి పూజలక్ష్ములనూ.

4


క.

శ్రీకూర్మేశ్వరుసాక్షిగ। మాకిచ్చిన భూమికలదు మహి నెవరైనన్
బూకరమున లేదనినను। చీ కాదని నడుపవలయు క్షితిపతులైననూ.


క.

తొలుతను రాయాచార్యులు। వెలయగ శ్లోకములు చెప్పి వెనుకను పద్యం
బ్బులు నే తెలుగున జెప్పితి। సలలిత కవి జదివి రెం(ట్టి)జాడల నెంచ్చునూ.


గీ.

పరగ నీరాతి పడమటిపలకయంద్దు। పఙ్తి తడబడి చెరిపియు పంక్తి మగిడి
చెక్కినాడను నను నింద్ద సేయవలదు। కలవు చేతప్పు లని మది దెలియవలయు.

గీ.

విగ్రహంబు చేసి వెలయంగ్గ పద్యముల్। జెప్పి స్తంభమునను చెక్కినాడ
యొప్పులుంన్న నుత్తము లగువారు[88] సంమతించ్చవలె నసంహ్యపడక.


జగద్గురవే నమః.


శ్రీ।

ఆదిన్మాద్వుల్ రఘుపతిని రామానుజున్ భూమిపుత్రి
న్మేదిన్ మోదంబ్బున సితగిరిన్ నిల్పినంత్తన్ మహారాష్ట్రుల్ దా
సౌమిత్రి శరగొనినన్ రూఢిగావింప్పభాష్యం.

తొలిపద్యంలో అక్షరసంధులు తెలియనివా(ర్)కి తెలిసేటందు కీమూడుచరణములు మల్లి పొల్లులు విడచెక్కినాడను.

—————

41

శ. స. 1732

ఇది గంజాముమండలము శ్రీకాకుళముతాలూకా శ్రీకూర్మములో కూర్మేశ్వరస్వామియాలయము తిరుచుట్టుమండపములో నిరువదియాఱవస్తంభము నుత్తరపువైపున చెక్కఁబడియున్నది. (South Indian Insoriptions Vol. V. No. 1212.)

సీ.

శాలివాహనశకశరదంబులును వేయే
            న్నూటత్రిదశకం బెలమ [89] రెండు
వరప్రమోదూతసంహృత్సర[90] వైశాఖ
            శుక్ల తదియ మరియు భాను
వారము మృగశిర(వ)నరనక్షత్రంబు
            రాశి మేషంబున రంమ్యముగను
శ్రీకూర్మనయక[91] శ్రీపాదస(న్ని)ధి
            దనర చామర్తి సీతయకు వేద్య

సుందరాపురవృర్త్తి ముందుగా ధనంబు [92]
            కోరి తా ఇచ్చి ధీరుడ వని
మాతృగోత్రోద్భవ మండ్డలతంమ్మన్న
            అరయంగ నిత్యపంచామృతంబు
శుభగుండై మిగుల భూసురవ(రు)ల్ బొగడంగ
            నభిషేక మొనరించె భక్తితోడి
అరయ సహస్రనామర్చన చామరం
            బును పంకణమును మరి ఘనసురంఠియు...
(యో?)గశేవల షోడశోపచారసమేత
            మైన పూజలు సల్పె మాన్యు డగుచు
ఆచంద్రతారార్క మవనియెందున పుత్ర
            పౌత్రాభివృద్ధియై ప్రబలియుడు
యెనుచు విజ్ఞానశాస్త్రంబు నెలమి
చదివినభూసురేందృలు ఈరీతి సంస్తుతింప్ప
విని కృతార్ధుడ నైని నన్వేడుకలరా(ర)
ధర్మ మిది యెని వినుతించె ధాత దివిని.


స్వదత్తాద్విగుణం పుణ్యం వరదత్తానుపాలనం.

—————

42

శ. స. 173(2)

ఇది గంజాముమండలము శ్రీకాకుళముతాలూకా శ్రీకూర్మములో కూర్మేశ్వరస్వామి యాలయము తిరుచుట్టుమండపములోని యిరువదిరెండవస్తంభము నుత్తరపువైపున చెక్కఁబడియున్నది. (South Indian Inscriptions Vol. V. No. 1202)

శ్రీ.


సీ.

శాలివాహనశకసంవ్వత్సరములు వె
            య్యేడు నూటాముప(దా)రువెళ [93]

గను ప్రెమోదూత[94]హయనవైశాఖ[95]
            శుద్ధ తృతీయార్కశుభదినమున
ముగశీర్ష[96]నక్షత్ర మేషలగ్నమునందు
            శ్రీకూర్మనాయక శ్రీపదములు
సంత్తతంబును బూజ జరిగించు మనుచు చా
            మర సీతారామమహిసురునకు
ముత్యగోత్రభవుడు మంధల తంమంన్న [97]
సుందరపువృర్త్తి[98] సూర్యసోము
లెంత్తగాల ముందు రంత్తపర్య(౦)తము
నాత్మ పుణ్యకీర్తు లలర నొసగె.

—————

43

శ. స.

ఇది గుంటూరుమండలము సత్తెనపల్లితాలూకా వేలువూరుగ్రామములో రామలింగేశ్వరస్వామి యాలయముదగ్గఱఁ బడియున్న యొకచితికిపోయినఱాతిమీఁద చెక్కఁబడియున్నది. (A. R. 588 of 1925.)

సీ.

...౦చ్చిప్రభ నొప్పి పెగ్గ......
            నిర్మ్మలభూరికీర్త్తి... ... ...
యాత్రయ ... పవిత్రుండు వ్రేకేటి
            పురవల్లభుండు గుణాకరుండు ఘనుండు

దనకులస్వామి నుద్ధతరాజగజరాజ
            మృగరాజవరు జగమెచ్చుగణ్డ
భూపాలు సబ్బాంబికాపుత్రు దన్నడ
            కేతవల్లభు జగద్గీతకీర్త్తిం
బ్రీతి(౦) గొలిచి తనసునీతివాచాలతం
గొం(గ) ఖడ్గములం బ్రగల్భతరని
యోగయో(గు)౦డై సమున్నతసంపదలు
దాల్చి నెగడె బుధులు దన్నుం బొగడ.

1


మ. వృ.

అనిశంబు(న్) దనబుద్ధిపేర్మ్మిం బలిం దంత్రావాప్తిం ...౦(ట్టి)౦చ్చుచుం
దసవిక్రాంత్తి నరాతివర్గ్గము (భు)జాదర్ప్పంబు భంజించ్చుచుం
దనదాక్షిణ్యవిశేషతను బుధుల మిత్రశ్రేణి రక్షించ్చుచుం
ద్దనరెం గేతధరాతలేశు శచివోత్తంసుండు వ్రోలం డిలను.

2

—————

44

శ. స.

ఇది చెన్నపురము సమీపమున పల్లవరము దగ్గఱ నున్న ప్రాఁతపల్లవరములో నొకనూతియొద్ద నొకఱాతిమీఁద చెక్కఁబడియున్నది. (A. R. 55 of 1909.)

సీ.

కసిమియ్యసాహేబు ఖన[99]కీర్త్తి రంజిల్ల
            షేకుహస్సానకు[100] చెల్వ మమర
పల్లావరంబ్బున ప్రఖ్యాత మైనట్టి
            పేట గావించెను పేర్మ్మితోడ

జగదేకవిఖ్యాతి జనపతు లెన్నంగా[101]
            సంత సాగించెను శాశ్వతముగ
సకలజనాధరసరణియై దనరంగ్గ
            భావిలు కల్పించెను[102] ప్రౌఢి మెరయ
సైదిభురాహేము సాహెబుపేరిట
            విభురాముభాగని వెలయజేశె
గంఠాపథంబ్బున గంభీర మైనట్టి
            చావళ్లు గట్టించ్చె (సాస్వ)తముగ
అనుచు వజ్రీలు (మ)న్నీ లు అభినుతింప్ప
వెలసితివి ధరలోన వినుతికెక్కి
శెఖు అలావబ్దిను[103] గర్భాబ్ది(స్రే)కరమున[104]
శేకు ముసామియ్య నృపాలశేఖరముంగా[105].

1

—————

45

శ. స.

ఇది గుంటూరుజిల్లా గుంటూరుతాలూకా మందడముగ్రామములో మల్లికార్జునస్వామియాలయములోని అమ్మవారిగర్భగృహము గోడమీఁద నున్నది. (A R. 104 of 1017).

ఉ.

(మొదటఁ గొంతభాగము పోయినది)
సూరమాంబికకు మిక్కిలి పుణ్యుం(డు) దారకీర్త్తిల

  1. "వంశ్యులు" అని యుండవలెను.
  2. "చతుర్త్థ" అని యుండవలెను.
  3. ఈయక్షరములు స్పష్టముగా లేవు.
  4. "దీవ్రకరాహము" అని యుండనోపు.
  5. "దీపకమున శీతి" అని యుండనోపు.
  6. చందస్సుచే "యాశ్రితుల్" అని ప్రథమాంతముగాఁ జదువవలెను. కాని యన్వయము కుదరదు.
  7. "బుధుల" అని యుండవలెను.
  8. "మైన్" అని యుండవలెను.
  9. "వలివేర్" అని యుండవలెను.
  10. "వనజదళాయతాక్షి" అని యుండవలెను.
  11. ఇచట వకారగకారములకు మైత్రి కల్పింపఁబడినది, దీని సాధుత్వము చింత్యము.
  12. "పంచమహాశబ్ద" అన్నచో గణము తప్పినది.
  13. ప్రాసము తప్పినది.
  14. "పెన్నిధియున్" అని యుండవలెను.
  15. గణము తప్పినది, "కరుండు వొగడంగన్" అని యుండనోపు.
  16. "ర్బ్బలమును" అని యుండవలెను.
  17. "వెంగ్గయ" అని యుండనోపు.
  18. "శర్వ్యాయ" అని యుండవలెను.
  19. "వక్షుండు వరకవి" అని యుండనోపు.
  20. గణము తప్పినది.
  21. "కర్ధేందుమౌళి" అని యుండనోపు.
  22. "వృత్తింగాను" అని యుండనోపు.
  23. కాని శబ్దము శూన్య మనునర్థమందుఁ బ్రయోగింపఁబడిన దని తోఁచుచున్నది.
  24. "కట్టనుంగ్గు" అని యుండవలెను.
  25. "సుతుండు" అని యుండవలయును.
  26. ఈపాదము స్పష్టముగా లేదు.
  27. "దైత్య" అని యుండవలెను.
  28. "దీప" అని యుండవలెను.
  29. "గౌరవ" అని యుండవలెను.
  30. ఇచట గణము తప్పినది.
  31. ఒకగణము లోపించినది.
  32. "మై" అని యుండవలెను.
  33. "నాదిడ" అని చదువవలయును గాఁబోలు.
  34. "యనంబరగి" అని యుండవలెను.
  35. "డద్దేవునకు" అని యుండవలెను.
  36. "శరధి" అని యుండవలెను.
  37. "శక" అని యుండవలెను.
  38. "సానికిం" అని యుండవలెను.
  39. "దండ్రికి" అని యుండవలెను.
  40. శ"కు" అని యుండవలెను.
  41. ఇచట గణము తప్పినది.
  42. గణము తప్పినది.
  43. "సరసీ" అని యుండనోపు.
  44. "సంధ్యాదీపం" అని యుండవలెను
  45. "స్థిరుండగు" అని యుండవలెను.
  46. "ధరాధీశవత్సరములు" అని యుండవలెను.
  47. రుంద్రశబ్డ మిచ్చట కుదురదు. ఒకటి యను నర్థమిచ్చు వేఱొకశబ్ద ముండవలయును
  48. "సంఖ్య" అని యుండవలెను.
  49. "కలికి" అని యుండనోపు.
  50. "భటుండెన" అని యుండనోపు.
  51. "కేతనలకు" అని యుండనోపు.
  52. "మింతియ" అని యుండనోపు.
  53. "నల్ల" అని యుండవలెనేమో.
  54. ఈపాదమందు చందోభంగము కలిగినది.
  55. గణము తప్పినది. "వత్సర" శబ్దమునకు బదులుగా "మిత" యని యుండిన సరిపోవును.
  56. "సంద్దియ" అని యుండవలెను.
  57. దారమకున్
  58. ఇంకొకగకార ముండవలయును.
  59. 'సు' కు బదులుగా 'కు' ఉండిన బాగుగా నుండును.
  60. "సంద్దియ" అని యుండనోపు. ఈపదము సంధ్యాశబ్దభవ మని గ్రహించునది.
  61. "శకాబ్ధము" అని యుండవలెను.
  62. "చందిరు" అన్నచో ఛందోభంగ మయినది. సరియైనపేరు తెలియదు.
  63. "గూరిమి" అని యుండనోపు.
  64. "సంద్దియ" అని యుండనోపు. ఇది సంధ్యాశబ్దభవము.
  65. ఈపాదములోఁ గొంతభాగము లుప్త మయినది.
  66. "ల్" అని యుండవలయును.
  67. స"నంజైత్ర" అని యుండవలయును.
  68. ఈశబ్దము రూపము సందేహాస్పదముగా నున్నది.
  69. ఇందు తప్పు లున్నవి. పద్య మసంపూర్తిగా నున్నది.
  70. |"శ్రీయుత మగుకొమ్మురీయగస్తీశ్వర(స్త్యేశ్వర)" అని యుండిన ఛందోభంగము కాకుండును.
  71. అగతి అనునది అగస్తికి తద్భవరూపముగా వాడఁబడినది.
  72. యతిభంగ మయినది.
  73. "బ్రవిమల" అని యుండవలెను.
  74. "వత్సరమున" అని యుండవలెను.
  75. "సుస్థిరముగ" అని యుండవలెను.
  76. ఈశబ్ద మేదియో తెలియుటలేదు.
  77. "స్థలిని నొప్ప" అని యుండనోపు.
  78. "అంచితా" అని యుండవలెను.
  79. "గుమారారామ" అని యర్ధము.
  80. "సేను" అని యుండవలెను.
  81. "నొసంగెం" అని యుండవలెను.
  82. "దనదు" అని యుండవలెను.
  83. "నిడ్పులపాడు" అని యుండనోపు.
  84. ఈపాద మిట్లుండవలయును.
    జలజలోచనుండు కేశవదేవుం డిలువేల్పు
    వెలయ దిమ్మయప్రోలవిభుండు........
  85. "గూర్చి" అని యుండవలయునేమో?
  86. దీనియర్ధము స్పష్టముగా లేదు.
  87. మొదటిపద్యములో ఛందోదోషములు పెక్కు లున్నవి.
  88. ఈపాదములో నొకగణము పోయినది, మొత్తముమీఁద నీకవిత్వము తప్పులతడక.
  89. "చెలిమి" అని యుండనోపు.
  90. "సంహ్వత్సర" అని యుండనోపు.
  91. "నాయక" అని యుండవలయు.
  92. ఈయుత్తరభాగములో ఛందస్సు తప్పినది.
  93. ప్రమోదూత సంవత్సరము 1732 వ శకసంవత్సరమునకు సరిపోవును.
  94. "ప్రమోదూత" అని యుండవలెను.
  95. గణభంగ మయినది.
  96. "మృగశీర్ష" అని యుండవలయును.
  97. గోత్రముపేరు మత్య లేక మత్స్య అని గాని పురుషునిపేరు ముందల తమ్మన్న అని గాని యుండవలెను. పైశాసనములో "మాతృగోత్రోద్భవ మండ్డలతంమ్మన్న" అనియున్నది.
  98. "వృత్తి" అని యుండవలెను.
  99. "ఘన" అని యుండనోపు.
  100. "హస్సానుకు" అని యుండనోపు.
  101. "లెన్నంగ" అని యుండనోపు.
  102. "బావులు కల్పించె" అని యుండనోపు.
  103. గణము తప్పిది.
  104. "శీతకరుండ" అని యుండనోపు.
  105. ఈపాదము "షేకు ముసమియ్య నరపాలశేఖరుండ" అని యుండనోపు.