శశికళ/రాగిణీమాల

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రాగిణీమాల

పాడెదను నీకునై పాటలను దేవీ !
వాకలై తేనియలు ప్రవహించు దేవీ !

             సుమబాల ప్రేమకై
             తమి మీరి ముగ్థుడై
             భృంగ బాలుడు పలుకు
             శృంగార కళ్యాణి

పాడెదను నీకునై పాటలను దేవీ !
వాకలై తేనియలు ప్రవహించు దేవీ !

             మధు మాస పికరాజు
             విధుర సంక్లేశియై
             గళమెత్తి కో యన్న
             కల రాగిణీ తోడి

పాడెదను నీకునై పాటలను దేవీ !
వాకలై తేనియలు ప్రవహించు దేవీ !

             వేసవిని పుట్టిల్లు వెడలిరా నలసించు
             వాహినీ సతి కొరకు
             వగలు పొగిలే కడలి
             ధ్వానమౌ దీపకము

పాడెదను నీకునై పాటలను దేవీ !
వాకలై తేనియలు ప్రవహించు దేవీ!