శశికళ/పూలబాలిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పూల బాలిక


పూల వనమున కలిసినామూ
         నారాణి నేనూ
పూల పరిమళములో మెలిసినామూ !
         పూల .......

పూలలో ఉదయించి
         పూవులా తానిలిచి
పూలజల్లుల నన్ను
         సోలించె నాదేవి !
                పూల......

తనకొరకు నే వెదికి
         జనపధములే తిరిగి
వనరు నా బ్రతుకులో
         వనల లక్ష్మియై వచ్చె !
                పూల......

తనవనము తానంట
         తన పూలు తానంట

తన పూలగంధముల
            నన తేనియలె తాను !
                     పూల......

నాసందిటను ఒదిగి
            నన్ను వనమున త్రిప్పి
పూల పుప్పొడులలో
            సోలు తన్నే చూపె
                    పూల......

ఏపూవు తాల్చినా
           నా పొందిటను తానె
ఏగంధ మలదినా
           ఏకమటనేఁ దాను

                    పూలవనమున కలసినామూ
                                     నారాణి నేనూ
                    పూలపరిమళములో మెలిసినామూ !