శశికళ/గౌరీశంకర శృంగావిర్భవ
< శశికళ
Jump to navigation
Jump to search
గౌరీశంకర శృంగావిర్భవ
గౌరీశంకర శృంగా విర్భవ
గంగాధర మంజులతర హస్తా
స్పందిత డమరుక దివ్య నినాదము
సుందర వదనా నీ గాంధర్వము.
పం కేరుహ సంభవ సాధ్వీ రుచి
రాంక స్థిత వీణా ఖేలాన
ర్తి తపాణీ కంకణ నిక్వాణ
శ్రుతి సంశ్లేషిత గీతాసామ్యము
అతి మోహనరూపా నీగానము.
యమునాతటి పాటలి తరు నీడను
సుమనోరజ సేవన మృదు వదనుడు
అతసీసుమ సంకాశతనుడు పరి
వృత సీమంతవతీ వ్రజబాలుని
మందార ముకుళ మధురాధర చుం
బ చ్ఛుభ వేణూ వేణూస్వన పరమాద్భుత
మందెను నీ సంగీతము దేవీ !