శశికళ/ఇంతలో...

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఇంతలో...

పదివారములుకాదొ దేవీ !
                    ఇంతలో
మది విరుగు నిరసనాదేవి !

హృదయాన కుమిలేటి
వ్యధ పోదు మంటలగు

         కధగా మిగిలె ప్రేమ
         కలలె ఇక నాకేమొ !
                పది వారములు.......

ఏనాటికీ కళలు
ఎన్నటికి నీ కలలు
   
         సౌందర్య పూజ, ఆ
         నంద హారతి నీకు
               పది వారములు......

శిల్ప దేవికి నీకు
చిత్ర విద్యను పూజ

          నినుకొలుచు నా బ్రతుకు
          నిలుపుదువె ఈ సిలుగు
                   పది వారములు.....

పాట కై నా హృదిని
పసిడి పల్లకి చేసి
         మేళవించెడి తంత్రి
         ఫెళ్లుమని తెంపుదువె !
                  పది వారములు......

ఆశాపరీమళము ఆరీపోవగ నీకు
ఆశాంతముల నలము
         ఆశయా శోక సుమ
         మే శమించు శోకమున
                 పదివారములు కాదొ దేవీ !
                                      ఇంతలో
                 మది విరుగు నిరసనా దేవీ !