శశికళ/అనర్హత
< శశికళ
Jump to navigation
Jump to search
అనర్హత
వెదకలేనే రాణి నిన్నూ
వేదనా పూర్ణ మీ బ్రతుకులోనూ!
వెదకలేనే రాణి నిన్నూ!
వదలలేనే కలలు
నిదరలేదే మనసు
చెదిరె హృదయము శాంతి
కుడురుకొనెనే క్లాంతి
వెదకలేనే రాణి నిన్నూ!
కదిలించి బ్రతుకంత
విదిలించి బంధనలు
చదల కెగయగ దేవి
దెసలంటు రెక్కలేవి
వెదకలేనే రాణి నిన్నూ
వేదనా పూర్ణమీ బ్రతుకు లోనూ!