శతకకవులచరిత్రము/ప్రథమభాగము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు.

శ్రీరామచంద్ర పరబ్రహ్మణేనమః

శుభమస్తు

అవిఘ్నమస్తు.

శతకకవులచరిత్రము.


పండితారాధ్యులు.

సర్వమతములకు ఖండనము లున్నవి. కాని మతమును సంపూర్ణముగ ఖండించువారు వేఱు- అభిప్రాయములలోఁ గొంచెము భేదము లున్నవారు వేఱు. రెండవతరగతివా రున్నమతమునందలి లోపములనే సంస్కరించెదరు. బసవన్న వేదాదరణము లేకుండ, జాతిభేదములులేని వీరశైవమతమును స్థాపించినప్పుడు ద్విజేతరుల కామతము నచ్చినప్పటికిని, బాహ్మణులలోఁ జాలమంది శైవమత ప్రియులు కూడ జాతిని విడనాడి కర్మబాహ్యులై జంగములలోఁ గలసిపోవుట కిష్టపడలేదు. ఆయభిప్రాయమును వెల్లడించి వీరశైవమతమును సంస్కరించుటకుఁ బ్రయత్నించినవాఁడు పండితారాధ్యులు. ఇతఁడు బసవన్న స్థాపించిన వీరశైవమతము నందలిలోపములు — అనఁగా బ్రాహ్మణు లామతములోఁ జేరకుండుట కడ్డముగానున్న రెండుప్రధాన విషయములను సంస్కరించె నని చెప్పవచ్చును. బసవన్న చెప్పినట్లు జాతిని, వేదములను (కర్శలను) నిరాకరింపకుండ నితఁడు వీరశైవము సాంగముగ నంగీకరించె నని చెప్పవచ్చును. ఇతఁడు తనమతవ్యాప్తి కనేక గ్రంథములు రచియించెను. మనకుఁ బస్తుత మిచ్చట ప్రసక్తిగల గ్రంథము "శివతత్త్వసారము.”[1] శివతత్త్వసారము కంద పద్యములలోఁ బండితారాధ్యులవారు వ్రాసి యున్నారు. దొరకినంతవఱకు 489 పద్యము లున్నవి. ప్రతిపద్యము చివరను శివుని సంబోధించియున్నాఁడు. కాని పెక్కుపద్యములలో శివునికిఁ బర్యాయపదములగు (1) సర్వానందా (2) మహేశా (3) రుద్రా (1) అజా (5) సురమునీంద్రవరేణ్యా (6) సమస్తకామాతీతా (7) హరా (8) నిరుపమమహిమా (9) అతిలోకా (10) దురితారాతీ మొదలగుపథముల వాడినాఁడు. ఐనను “శివా” యనుసంబోధనమే హెచ్చుగా వాడినందున నిది శివసహస్రముగ వ్రాసియుండిన నుండవచ్చును. పాకృతశతకములు వ్రాసిన జైనులవాఙ్మయానుసార మిది వ్రాసియుండిన ప్రారంభశతకములలో మన కదృష్టవశమున మిగిలి యుండిన "సహస్రము” లేశ మగుటచే నిందుఁ గొన్నివిషయములు శతకవాఙ్మయారంభస్థితి నూహింప నవకాశమిచ్చుచున్నవి. ఆంధ్ర శతకములలోఁ బ్రధానప్రత్యేకలక్షణముగఁ బరిణమించిన యేకమకుటము దీనిలోఁ బ్రారంభమైనది. ఇప్పటికి మకుటము గ్రంథమంతట నొకటే యుండక సంబోధనము పర్యాయపదసూచితమయ్యు దోషములేనట్లుండుటఁ జూడ నీగ్రంథము శతకారంభస్థితినిఁ దెలుపుచున్నది. ఇందలి మకుటము పర్యాయపదసంశోభిత మగుటవలననేగాక కొన్నిఁటికిఁ బద్యమునడుమనే సంబుద్ది వచ్చుటచేతను, కొన్నిపద్యములలో సంబుద్ది లేకపోవుటచేతనుగూడ శతకమకుట మిప్పటికి స్థిరపడలేదని యీకాలమునందలి యితరశతకము లట్టివి దొరకువఱకును నిర్ణయింపవీలగుచున్నది. ఆకాలమునందును దరువాతనుగూడ నూఱుకాని నూటయెనిమిదికాని పద్యము లుండక, యధికముగ నున్నను దీనిని శతక మనియే పండితులును ప్రజలునుగూడ వాడుచుండిరి. కావున శతాధికపద్యము లున్నను, తక్కువయున్నను చాటుకృతులను శతక వాఙ్మయ మని సర్వసాధారణముగ వాడవచ్చు నని ద్యోతక మగు చున్నది. చాటుకృతులలోఁ జేరన ముక్తకాదికావ్యములు మొదలు సహస్రములవఱకు శతకవాఙ్మయమని సాధారణసాంకేతికముతో నీగ్రంథమునఁ గొన్నిచోట్ల వాడుట కిదియే కారణము. పండితా రాధ్యచరిత్ర మని పాల్కురికి సోమనాథుఁడు ద్విపదలో రచియించి యున్నట్లు మన మెఱుఁగుదుము. అదిగాక పిడుపర్తి సోమనాథుఁడు బసవపురాణమునం దిట్లుచెప్పియున్నాఁడు.

"సీ. విరచించె జైమిని వేదపాదస్తవం
                  బొకపాదమున వేదయుక్తి నిలిపి
      హరభక్తి వైదికం బని శ్రుతు లిడి చెప్పెఁ
                  బ్రతిభ సోమేశుఁ డారాధ్యచరత
      సరవి శ్రీనాథు: డాచరిత పద్యప్రబం
                 ధము చేసె ద్విపదలు తఱచునిలిపి "

కావున శ్రీనాథాదులుకూడ నీపండితారాధ్యచరిత్రము వ్రాసినట్లు కనఁబడుచున్నది. ఈగ్రంథము లన్నియు మనశివతత్త్వసారప్రణీత యగు మహాకవిపండితారాధ్యులచరిత్రములే! ఇట్టి చరిత్రములలో మొట్టమొదటిదైన పాలుకురికి సోమన్నగ్రంథమునం దీశివతత్త్వసారము శతక మనియే యుండెను.

"ద్వి|| శతకంబు శివతత్త్వసారము దీప
       కళికమహానాటకము నుదాహరణ||"
                                  -పర్వతప్రకరణము (369).

ఈపాదములకు "శతకమును శివతత్వసార మునుగూడఁ జేసి యుండవచ్చుననియు, శివతత్త్వసార మందువలన శతకము కానక్కఱలే"దనియుఁ గొంద ఱందురుకాని యదియే సిద్ధాంత మనుట కట్టివా రీకవి వ్రాసినశతకమును జూపవలసియుందురు. ఈశతకము మసకిప్పటి వఱకుఁ దెలియకయున్నను పూర్వలాక్షణికు లీగ్రంథము నెఱిఁగియున్నట్లు (1) గణపవరపు వేంకటకవిప్రయోగరత్నాకరము (2) అనందరంగరాట్ఛందము నిందలి పద్యముల నుదాహరించియుండుటచే సాక్ష్య మిచ్చుచున్నవి. అందుదాహృత మైనయీక్రిందిపద్యము ప్రస్తుతము . శ్రీలక్ష్మణరావుగారు ప్రకటించిన శివతత్త్వసారమునందు లేనందున నిందలిపద్యము లింకను నుండియుండవలె నని వా రూహించుచున్నారు, ఈ పేజి వ్రాయబడియున్నది. ఈ పేజి వ్రాయబడియున్నది. ఈ పేజి వ్రాయబడియున్నది. ఈ పేజి వ్రాయబడియున్నది.

“కం|| ఆయతి త్రిపురాంతక దే
        వా యని పిలుచుటయుఁ గటక మంతయు వినఁగాఁ
        బాయక కిన్నర బమ్మయ
        కోయని యెలుగీవె తొల్లి యురగాభరణా!!"

ఈయూహ కవి శివతత్త్వసారమును సహస్రముగా వ్రాసియుండు నను నాయూహకు బలమిచ్చుచున్న ది.

ఈకవిని "పండితారాధ్యు”లని "ఆరాధ్య దేవర ” యని “మల్లికార్జునుఁ" డని "పండితయ్య”యని పలువిధములఁ బిలిచెదరు. పాలుకురికి సోమన్న పలుమారు పండితారాధ్యు లీగ్రంథము వ్రాసెనని చెప్పుటచేఁబ్రసిద్ధు లగుపండితులవారే యీగ్రంథమువ్రాసి రని నిర్ధారణ మగుచున్నది.

(1) "శివతత్త్వసారసంచిత మహమహిమ
     శివతత్వసార దున్శిచకృతిఁ బొగడు
                                          -దీక్షా ప్ర. పుట 62,

(2) శతకంబు శివతత్త్వసార మాదిగను
    గద్యపద్యంబు లాకాంక్షఁ జదువుచును
                                           -వాద ప్ర.పు 173.

(3)గీ. ఎట్టులనుచు సంశయింపక శివతత్త్వ
        సారగద్యపద్య సమితి శివుని
        మహిమ తెల్పునట్టిమల్లికార్జునపండి
       తయ్యగారిఁ దలఁతు ననుదినంబు”
                                            -అనుభవసారము.

ఇట్లు పాలుకురికి సోమన్న పండితులవా రీగ్రంథములు వ్రాసినట్లు చెప్పుటయేగాక యితని కందపద్యము లనేకము లాతఁ డనుకరించి యున్నాఁడు. ఒక్క సోమనాథుఁడే యన నేల? ఆకాలమునందలిశైవకవు లందఱు నట్లొనర్చినవారే! ఇందలి 338 పద్యముతోనన్యవాదకోలాహము నందలి 73వ పద్య మొకటిపోల్చిచూచిన సత్యము వెల్లడియగును, వేమన్న చరిత్రమునం దీతనిగ్రంథము వేమన్న చదివియుండు నని వ్రాసియుంటిని. ఇటీవలఁగొన్నిపద్యము లాతఁ డనుకరించినవి కనఁబడినవి. మచ్చు చూపెదను. కాని వేమన్న శివభక్తికలిగియుఁ బండితునివలెఁగాక కేవలాద్వైతభావముల వెల్లడించెను.

క|| నిన్నెఱుఁగుచు దన్నెఱుఁగని
    యన్నఁడు శివయోగమగ్ను డనఁబడు(మదిలో)
    నిన్నును దన్ను నెఱింగెడి
    యన్నఁడు శివయోగమగ్నుఁ డనఁబడును శివా.
                                                    --శివతత్త్వసారము 269.

తే|| నిన్నుఁ జూచెనేని తన్నుఁదా మఱచును
      తన్నుఁ జూచెనేని నిన్ను మఱచు
      నేవిధముగ జనుఁడు నెఱుఁగు నిన్నునుఁ దన్ను
      విశ్వదాభిరామ వినుర వేమ!!
                                      - 135 ఫుట " వేమన్న " 1922.

ఇంకను వేమన్న వాడిన "లలితశివతత్త్వపదమున” మొదలగు వాక్యము లనేకము లాతఁ డీగ్రంథము చదివి ఛాయల మెఱుఁగుపెట్టి గ్రహించెనని చూపవచ్చును. సోమనాథుని యనుకరణములకు శివతత్త్వసారమునందలి 387, 386 పద్యములతోఁ బండితారాధ్యచరిత్రము పర్వతప్రకరణము 405 పుట పోల్చికాని, శివతత్త్వసారమునకు శ్రీలక్ష్మణరావుపంతులుగారి పీఠికచదివిగాని చూడవచ్చును.

ఇట్లనేకప్రసిద్దాంధ్రకవులకు బిచ్చమువెట్టిన యీమహాకవి గ్రంథభాగ మిప్పటికైనఁ బ్రకటనమొందుట వాజ్మయప్రియులయదృష్టవిశేషమనుట యతిశయోక్తి కాదు. పండితునికాలమునుండియు నీ గ్రంథము శైవులలో మిక్కిలివ్యాప్తిలో నుండెను.

సోమకవి పండితారాధ్యచరిత్రమునం దీకవి యనేకేతరగ్రంథములు వ్రాసినట్లు మహిమాప్రకరణమునందుఁ జెప్పియున్నాడు. అవి లింగోద్భవదేవుగద్యము, రుద్రమహిమ, గణసహస్రమాల, అమరేశ్వరాష్టకము, పర్వతవర్ణనము ననునవి. ఇతఁడు కర్ణాటకభాషలో గణనహస్రనామము, ఇష్టలింగస్తోత్రము, బసవగీతలు ననుగ్రంథములు రచి యించినట్లుకర్ణాటకకవిచరిత్రమునందు వ్రాయఁబడియున్న ది. కావునఁ బైగ్రంథము లేభాషలో రచియించెనో తెలిసికొనలేము. ఇంక ననేకకృతు లీతఁడు రచియించెనని యనుమానించుట కనువగుమాటలు దీక్షా ప్రకరణము ఫుట 62 లో నున్నవి. పండితునిశివతత్త్వసారాదికృతులు వెనుకఁబడుటకు నశించుటకునుగూడఁ గారణములు తరువాతకవు లీతని సాంగముగ ననుకరించుటయే యని శ్రీలక్ష్మణరావుగారు చూపినకారణములు సత్యేతరములు కావు. (చూడు. పుట 13, 14, 16, 16 శివతత్త్వసారపీఠిక -)

పండితారాధ్యులు బసవన్నకు సమకాలికుఁడగుట నీతనికాలము నిర్ణయించుట కష్టకార్యముకాదు. బసవఁడు 1167 కీ|| శ || మృతి నొందెను. కావున పండితారాధ్యులు 12వ శతాబ్దమునడుమవాఁ డనవచ్చును. ఈశతాబ్దమే మన శతకవాఙ్మయారంభముగ నింతవఱకు దొరకిన గ్రంథములవలనఁ దెలియుచున్నది. పండితారాధ్యునితో సమకాలికులైన రాజులు (1) వెలనాటి చోడుఁడు 1163-1180 (2) ఉదయావనీశుఁడు 1162 (3) బుద్ధరాజు 1171, నను ముగ్గురురాజులకాలమువలనను పండితారాధ్యచరిత్రము నాతనికిఁబిమ్మట 60, 70, సంవత్సరములలో నున్న పాలుకురికి సోమనాథుడు వ్రాయుటవలనను, కన్నడకవి సోమరాజు కాలములవలననుగూడ 12 వ శతాబ్దమే యని శ్రీలక్ష్మణరావు గారు సకారణముగ నిర్ణయించియున్నారు. (చూడు పీఠిక పుట 16, 20) పండితారాధ్యచరిత్రమునందలి సంగతులవలనను, శివతత్త్వసారము నందలి కొందఱుభక్తుల ప్రసంగములను జూపి యీశతకము బసవన్న మరణానంతరము పండితుఁడు వ్రాసియుండవలె నని శ్రీలక్ష్మణరావు గారూహించిరి. (పీఠిక వుట 20)

పండితారాధ్యచరిత్రము పండితుని కరువది డెబ్బదిసంవత్సరములలోఁ బుట్టినదని శ్రీలక్మణరావుగా రనిరి. ఇంకను జేరువయని నే నూహించుచున్నాను. చరిత్రమునందలి సంగతులవలనఁ బండితుఁడు "గోదావరిమండలమునందలి భీమేశ్వరమున భీమేశ్వరలింగమున కర్చకుఁడగు భీమనపండితునికిఁ గొడుకని తెలియుచున్నది. గౌరాంబ యీతనితల్లి. [2] వీరిది ఋగ్వేదము, గౌతమగోత్రము, శ్రీశైలమల్లికార్జునదేవు నుపాసించినతరువాతఁ బుట్టినందున నీతనికి మల్లికార్జునుఁ డన్న పేరు పెట్టిరి.” (చూడు పీఠిక 21 ఫుట.)

ఈతనిగురువు కోటిపల్లి యారాధ్యదేవుఁడు, ఈయారాధ్యదేవర గురువు “అనాంతరయ్య."

పండితారాధ్యులు బాల్యమునుండియు విద్యావివేకసంపన్నుఁడై తనగురువుకడ సమస్తవిద్యలను, శైవమతరహస్యములను గ్రహించి, తనయనుభవముల గ్రంథముల వ్రాసి, జంగముల నారాధించుచు, భక్తులచరిత్రములను, మహిమలను వినుచు, తానుబోధించినట్లు నడుచుకొనుచు శివపూజాధురంధరుఁడై జీవితము గడపెనని చరిత్రమునందు సోమనాథుఁడు వివరముగ వర్ణించియుండెను. ఇదిగాక బసవనయంత వాఁ డీతని జందెము తీసి జూతివిడిచి తనమతము నందుఁ గలియుమని వార్త నంపఁగాఁ బండితుఁడు "భక్తిమీఁదవలపు బాహ్మ్యంబుతోఁబొత్తు బాయలేను నేను బసలింగ" యని ప్రత్యుత్తర మంపెనని శైవులలో వాడుకగలదు. ఈకథవలనఁ బండితుఁడెంతగొప్పవాఁడో- సత్యము నంగీకరించిన యీతని " బాహ్మ్యంపుఁ బొత్తు” వీడలేనిమతాభిమాన మెంతయోకూడ - వెల్లడియగుచున్నది. ఈతఁ డనేకసంస్థానములకుఁ బోయి యనేక బౌద్ధపండితుల నోడించి నట్లును, తీవ్రమగుమతప్రచార మొనర్చినట్లును దెలియుచున్నది. బౌద్ధపదపదాచార్యుఁ డీతనికి సమకాలికుఁడు. పండితుఁడు బసవసందర్శనార్థము బయలుదేరి కర్ణాటకమునకుఁ బోవుచుండగా దారిలో బసవఁడు మరణించెనని విని శ్రీశైలముసకుఁ దిరిగిపోయెను. ఆప్రాంతములందున్న వెల్లటూరునందే వృద్ధత్వమున బసవనతరువాతఁగొలది కాలమునకే పండితుఁడు మరణించియుండునని శ్రీ లక్ష్మణరావుగా రూహించుచున్నారు. ఈ యూహలకుఁ గారణము పండితారాధ్య చరిత్రమునందలి వ్రాతలే ! పండితారాధ్యునిమహిమలు, అతిమానుషము లగుకథలు, నెన్నియో చరిత్రమున వ్రాసియున్నారు. వాని సత్యాసత్యములు చర్చించుట కిది తావుకాదు. కాని శైవులలోఁ బండితునిసమకాలికులే యాతని యవతారపురుషునిఁగా భావించి పూజించిరని • పెక్కునిదర్శనములఁ జూపవచ్చును.

చందవోలుకైఫీయతులో (లోకలురికార్డ్సు సంపుటము 10-133 ) మల్లికార్జునపండితులు "వానస” వంశోద్భవులని యున్నది. మన కీవఱకు నన్నయమిత్రుఁ డగునారాయణభట్టు వానసవంశోద్భవుఁడని భారత కృత్యాది నున్న "పాయక పాశశాసనికి భారతఘోరరణంబునందు నారాయణునట్లు [3] వానసధరామరవంశ విభూషణు" డనువాక్యములవలనఁ దెలియును. మడికి సింగన తనవాసిష్ఠరామాయణములోఁ గందనమంత్రి "వాణసవంశాబ్దిసుధాకరుండును, గాశ్యపగోత్రపవిత్ర అబ్బనార్యతనూభవ కందనామాత్యుండు నాకు నతిస్నేహబాంధవుండు” నని వ్రాసియుండెను. ఈముగ్గురును వానసవంశోద్భవులే! ఈవంశవివరములఁ జారిత్రకపరిశోధకులు చర్చించెదరుగాక! గోత్రభేద ముంట నీమువ్వురు బందుగు లనవీలు కలుగుటలేదు. కర్ణాటకకవిచరిత్రము పండితయ్య వాణసవంశమువాఁ డనియే చెప్పుచున్నది.

ప్రస్తుత మాంధ్రదేశమునందు "ఆరాధ్యబ్రాహ్మణుల" మని చెప్పుకొనులింగధారు లీపండితుని సంప్రదాయమువార మని చెప్పుకొందురు. కాని పండితునిగ్రంథమునందు దొరకినభాగములో లింగధారణమునుగూర్చి యేమియుఁ జెప్పలేదు. ఇతఁడు శివభక్తినేప్రతిపాదించిన " ద్వైతి"యని శ్రీలక్ష్మణరావుగారు నిర్ధారణ మొనరించియున్నారు. ఇతని గ్రంథమునందు శివనింద చేయువారినిఁ జంపవలె ననియు, నట్టి గ్రంథములను నాశన మొనర్పవలయు ననియు ఖండితముగ వ్రాసియుండెను. పాలుకురికి సోమన్నకూడ శివమతము నొందనివారిని రాజులసాయమున హింసించినట్లును గ్రంథములు చెప్పుచున్నవి. ఈ కాలమునందు బౌద్ధులను, బౌద్ధజైనవాఙ్మయములను శైవులునాశన మొనర్చిరి.

ఈతనిగ్రంథము సలక్షణముగ నన్నయాదులమార్గముననే వ్రాయఁబడినది. నన్నయ వాడినపదజూలమును పద్యలక్షణములు నిందున్నవి. కొన్నిరూపములు పండితునికాలమునాఁటి విశేషములఁ జూపుచున్నవి. పండితునకుఁ గర్ణాటక సంప్రదాయానుసారము “వలపల గిలక ప్రాస" మిష్ట మని శ్రీలక్ష్మణరావుపంతులుగారు సెల విచ్చి యున్నారు. ఈసంప్రదాయము కర్ణాటాంధ్రభాషలఁ గవిత్వముచెప్పినవారికేగాక యితరాంధ్రకవులయందును గానవచ్చెడిని.

“అల్లన లింగమంత్రిసుతుఁ డత్రిజగోత్రజుఁ డాదిశాఖికం
 చెర్లకులోద్భవుండు” దాశరధీశతకము.

ఇచ్చట “ర్ల” యింటిపేరులోని దగుట "కంచెల్ల"కుల మని రూపాంతర మంగీకరింప వీలులేదు. కావున తెలుఁగుకవులే యీప్రాసమును గన్నడములోనికి బంపియుందురు. ఇది మనలాక్షణికులలోఁ గొందఱు చర్చించియున్నారు. శబ్దశాస్త్రము ననుసరించి సాధువే

ఈగ్రంథము నన్నయ తిక్కన్నలకు నడుమపుట్టినది. నన్నె చోడునికావ్యమీకాలము నందలిదే యైయుండు నని శ్రీ వీరేశలింగము పంతులుగారు క్రొత్తకూర్పుకవిచరిత్రములో వ్రాసిరి కాని తెలుఁగు కావ్యములలోఁ దిక్కన్నయే వష్ఠ్యంతములు మొదటవ్రాసినవాఁ డనుసిద్ధాంత మందువలనఁ బోవుటకు వారర్ధాంగీకారమునే వెల్లడించిరి. కాని యీశివతత్త్వసారమునందుఁ గృత్యాదికిఁ జివర 18,19, 20 పద్యములుమూఁడుమాత్రము "జయ మగు వేదంబులకును జయ మగుఁబం చాక్షరికిని జయ మగునిటలాశ్రయ మగుభసితంబునకును, జయమగుమాహేశ్వరులకు సతతము శివా" అని వ్రాసినదిచూడ షష్ఠ్యంతములు [4] వ్రాయుపద్ధతి తిక్కనకుఁబూర్వమే కలదని నిర్ణయమగుచున్నది. .

ఈతఁడువ్రాసినకావ్యమును స్థాలీపులాకన్యాయమున నించుక పరిశీలించెదముగాక ! గ్రంథారంభమున బ్రహ్మవిష్ణువులే నీమహిమ నెఱుఁగలే రనియైన" " శ్రీ పతివాక్పతిముఖ్య మహాపురుషులఁ” దలఁపెట్టి శ్రీకారముతోనే గ్రంథ మారంభించెను. మనకు దొరికినంతవఱకు గ్రంథములో నీక్రిందిపద్యములు శ్రీకారముతో నున్నవి. 1, 16, 71, 206, 299, 357, 359, 454, కృత్యాదిపద్యములుకొన్నితగ్గించి చూచినప్పుడీశ్రీకారములు కర్త నూఱేసిపద్యముల కొక్కటి వేసెనా యని యనుమానింప వీలగుచున్నది. లేఖకులు కొన్నిపద్యములు తారుమారు చేసియుండవచ్చును. 299వ పద్యము శ్రీకారముతో నారంభించి శివుని భృత్యులు గణాధిపతులను వారిచర్యలను వర్ణించుట కారంభించి 388 వ పద్యములో నిట్లు ఫలశ్రుతి చెప్పియున్నాఁడు.

క|| పరమేశ్వర నీ ప్రమథుల
    చరితలు సతతమును విన్నఁ జదివినఁ బ్రమథు
    స్మరణము చేసిన శుభములు
    దొరకొను దురితంబు లెల్లఁ దొలఁగు మహేశా||

388, 387 వపద్యములో దననామముకూడ చెప్పియున్నాడు

ఇట్లు ప్రత్యేకోపాఖ్యానములకు ఫలశ్రుతులు మనపురాణముల యం దుంట మనమెఱుఁగుదుము, కావునఁ బండితుఁడుకూడ నీప్రమథులచరిత్రము 87 పద్యములలోఁ గాక 100 పద్యములలోఁ జెప్పియుండునని నే ననుమానించుచున్నాను. నడుమఁ గారణము లేనిశ్రీకారము లయునికి యీగ్రంథ మీతఁడు నూఱేసిపద్యములో, నూటఎనిమిదేసి పద్యములో నియమ మేర్పఱచి వ్రాసియుండునని యనుమాన మొద వించుచున్నది. సంపూర్ణగ్రంథము చిక్కినప్పుడు దానిసత్యము తేలఁగలదు.

ఈతఁడు ప్రయోగించినపదజాలము, శైలి, కావ్యరీతులు నాకాలమునందుఁ బుట్టిన నన్నెచోడుని కుమారసంభవమునందును, బద్దెన నీతి సారముక్తావళియందును గనఁబడుచున్నవి. తిక్కనకంటె నిమిడికఁగ వ్రాసిన బద్దెనకందము లందముగ నున్న వని యొకసారి వ్రాసియుంటిని. ఆకాలమునాఁటి కందములసొగసు, వ్యర్థపదములులేమి, ఇమిడిక వ్రాఁతయు మన కీతనికావ్యమునందును బదర్శకమై నాఁటిసహజకవితా శక్తుల వెల్లడించుచున్నది.

పండితుఁడు పండితుఁడే యని చెప్పవలసినపనిలేదు. ఇతఁడు సంస్కృతభాషయందు వ్యాకరణము, తర్కము, వేదాంతము నభ్యసించుటయేగాక శ్రుతిస్మృతిపురాణవిజ్ఞాత యని యీతనిరచనమే వేనోళ్ళఁ జాటుచున్నది.

క|| పూని యతద్గుణసంవి
     జ్ఞానబహువ్రీహి మాన్పఁ జనుదెంచిన యణ్
     మానితషష్ఠీ తత్పురు
     షానూనసమాసమెఱుఁగ రజ్ఞులు రుద్రా!

క!! అమరఁగఁ బ్రపంచమిథ్యా
    త్వమ చెప్పెడువాది మున్ను దానికి సద్భా
    వము దానెఱుఁగక మిథ్యా
    త్వ మనాశ్రయ మెట్లు జెప్పఁదలపోయు శివా!

ఇట్టిక్లిష్టవిషయములఁ గూర్చి యింతయిమిడికఁగ వ్రాయఁగలపండితునిశక్తి యసాధరణ మైనదేకాని, మల్లికార్జునుఁడు వ్రాసినశైలి పామరులకుఁదెలియునది కాదు, ఇతనికావ్యము మఱుగుపడుటకుఁ గారణము సోమనాథాదులయనుకరణ మొకకొంతకావచ్చునుగాని యీతని రచనావిధానమునందును గొన్నిలోపములు లేకపోలేదు. ఆనాఁటి భాష యట్టి దనుకొంద మనిన నీతనికంటెఁ బూర్వఁడగు నన్నయ భారతము నందలినలోపాఖ్యానాదులు బాలురకుఁ బఠనార్హములై బద్దెన, నన్నెచోడ, మల్లికార్జునులగ్రంథములు కాకపో నేల? కావున . నీకవుల శైలి కఠినము. అన్వయకాఠిన్య మున్నది. ప్రాతవడ్డరూపములు కలవు. ఐనను పండితుల కివి యనేకవిషయములలో నమృత ప్రాయమైన వనుట కెంతమాత్రము ననుమానము లేదు. ఒండేమి, వేయేమి, మొదలగు పదములయం దీతనికిఁ బ్రీతి మెండు. కులశబ్ద మీతఁడును .సత్కులుఁ డను నర్థమున స్పష్టముగఁ బదితావుల వాడి యున్నాఁడు. విప్లవము, పండుగ, పావలు, కసి, పినుగులు, పిండకూడు మొదలగుపదముల కీనాఁటియర్థమే యానాఁడునున్నది. వక్కఁడు, ఓడు, ఆలరి, ఎయిదఁడు, ఆలాపు, ముద్దటలడిఁచిన, పాదఱి, సూడుపట్టె, త్రిప్పటము, నొడ్డణము, ప్రువ్వులు, బడరుఁడు, మొదలగుపదము లిప్పు డపురూపము లైపోయినవి.

ఇతఁడు సంస్కృతవాక్యములు శ్రుతులనుండి పద్యమధ్యమున నెక్కువుగ నిమిడ్చియున్నాఁడు. ఈసంప్రదాయము శైవకవులలోఁ దరువాతఁగూడ నెక్కువుగఁ గనఁబడును. "ఓడునఁ బోసినజలంబు; మంటఁ గని సీతు వాసినకంటెను; మీస మెదుకుల మెఱపుల్," మొదలగులోకోక్తులఁ గొన్ని వాడియుండెను.

ఈతని యన్యమతఖండనభాగములు మిక్కిలికఠినవాక్యములతో నిండియున్నవి. కాని యీతఁడు ప్రతిపాదించినభక్తి యుత్తమమైనది. వైష్ణవవిశిష్టాద్వైతులవలెనే యీతఁడు నాయకనాయకీభావముతో గూడినప్రేమమునే జీవాత్మపరమాత్మలసంబంధముగాఁ బ్రకటించిన టీక్రింది పద్యములు జూపవచ్చును.

క. దురితహర మనియు శుభములు
   దొరకొను ననియును దలంచి దురితారి భవ
   చ్చరణాబ్జభక్తిలలనా
   పరవశభావమున నిన్ను బ్రణుతింతు శివా!!

భక్తి "లలనాపరవశభావమునఁ" బ్రణుతింతు ననుటలోఁ బండితున కీభావము సంపూర్ణముగ లేదనువా రున్నను పండితునిభక్తి పైయంతరువులోనిదేయనియంగీకరింపకపోరు. "శివుఁడు విష్ణువరేణ్యుఁడు గోవిందవరేణ్యుఁడు" నని యీతఁడు చెప్పుటలోఁ గ్రొత్తలేదు. కేవల వైష్ణవులు కానివా రందఱును శివాధిక్యము నంగీకరించుచున్నారు. పైసమాస మీయర్థమునఁ బొసఁగునా? "

భక్తిపై నీతఁడు వ్రాసిన రెండుమూఁడు పద్యములు శైలికిఁ జూపెదను.

క. ఒక్కం డీశ్వరుఁ డని మది
   నిక్కముగా నెఱిఁగి భక్తి నిష్ఠావృత్తి౯
   ముక్కంటి నిన్నుఁ గొలిచిన
   ద్రిక్కక దొరకవె సమస్తదివ్యసుఖంబుల్|| 99

క. అరుదుగ భవత్ప్రసాద
   స్ఫురణము దొరకొనుశివభక్తి గాన ధుస్తరభవని
   ష్ఠురదుఃఖసముద్రసము
   త్తరణవహిత్రంబు భక్తి దానయ్యె శివా! 107

క. వసుమతిఁ జిత్రము జితచి
   త్తసంభవా"నకర్మణావతపసానజపై
   ర్న సమాధిభిరవ్య యనీ
   య సదృశభక్తి”కినిఁ బ్రియుఁడ వగు దీశానా|| 111

కన్నడకవి చరిత్రమునందీతని గూర్చివ్రాసిన విశేషములు.

"ఇతఁడు(పండితయ్య ) గణసహస్రనామముఇష్టలింగ స్తోత్రము, బసవగీత మొదలగు గ్రంథములు వ్రాసినట్లు తెలియుచున్న ది. గురురాజు వ్రాసిన సంస్కృత పండితచరిత్రము (15వ శతాబ్దము) నీలకంఠుని యారాధ్యచరిత్రము (15 శతాబ్దము ) సిద్ధనంజేకునిగురురాజచరిత్రము (16 శతాబ్దము) ఇవి మొదలైన గ్రంథములయందీక్రిందియంశము లీతనిగుఱించి తెలియుచున్నవి. (ఇచ్చట మనకుఁదెలిసినవిషయములే వివరించిరి. ఈతఁడు బసవనిభస్మము నంది; కర్ణాటకభాష రా నందే పై గ్రంథముల వ్రాసెను. ఈతనిగణసహస్రనామము మాత్రము దొరుకుచున్నది. తక్కినవి దొరకలేదు. గణసహస్రనామము వెలనాటిచోడునిసభలో హరనింద విన్నదోషము, బౌద్దాచార్యులతో వాద , మొనరించినప్పుడు కలి ఈ పేజి వ్రాయబడి ఉన్నది. ఈ పేజి వ్రాయబడి ఉన్నది. ఈ పేజి వ్రాయబడి ఉన్నది. ఈ పేజి వ్రాయబడి ఉన్నది. గినందున నది పోఁగొట్టుకొనుటకును, పరవాదిసంహరణదోషపరిహారము చేసికొనుటకును యీగ్రంథము వ్రాసె నని సిద్ధనంజేశుఁ డనుచున్నాఁడు. ఇందు ప్రమధగణ, రుద్రగణ, వృషభయోగాచార్యులు, అరువదిముగ్గురుభక్తులు, షోడశసుమతులు, దశగణ ప్రాచీనభక్తులు, మొదలగునామములు చెప్పియుండెను. (161--162 పుట.)

గణసహస్రనామము మహాపురుషులనామములే! అవి పండితారాధ్యచరిత్రమునందు సోమనాథుఁడు వ్రాసియున్నాఁడు. పేరులజాపితా యేభాషలో వ్రాసిన నేమి? అది యొకవేఱుకావ్యముగాఁ దలంప వీలులేదు. ఈతనిశైవవాఙ్మయము చేసినమార్పులు, ఉపకారములును ముందుముందుఁ జూచుకొనుచుఁ బోవుదము.

ఈపండితమల్లికార్జునుఁడే నన్నెచోడుని గురువగు మల్లికార్జునయోగి కావచ్చునని కొందఱుతలంచుచున్నారు. కుమారసంభవపీఠికలో నీవిషయము శ్రీ మా. రా. కవిగారు చర్చించి నన్నెచోడుని గురువు ముని యనియు, అస్ఖలితుఁ డనియు, బ్రహ్మచారి యనియుఁ జూపి, సంతానవంతుఁ డగుపండితయ్య నన్నెచోడునిగురువు కాఁజాలఁడని నిరూపించిరి. " పాల్కురికి సోముఁడు పండితమల్లయ యనియే సవిశేషముగాఁ జెప్పుచుండును. నన్నెచోడుఁ డెక్కడను మల్లి కార్డునునకుఁ బండితశబ్దమును జేర్చినవాఁడు కాడు” కావున పండితయ్య నన్నెచోడునిగురువు కాఁడని కవిగా రనిరి. ఈవాదములో సత్యము లేకపోలేదు. కాని పండితయ్య బ్రహ్మచారిగా నున్నప్పుడే నన్నెచోడుని గురువుగా నుండఁ గుమారసంభవము వ్రాయగూడదా? కుమారసంభవ మాశ్వాసాంతపద్యములలోఁ గవి గురువున కీక్రిందివిశేషము లున్నవి.

(1) శివతత్త్వజ్ఞానసన్మానను౯ 8. 195; (2) పరవాదీంద్ర ఘనాఘనానిలు; మహీసురేంద్రు 8. 197; (3) కవీంద్రు 9. 364; (4) బ్రహ్మకులాధీశుఁడు 10. 568; (5) అపరిమితవిద్యాపరిణతు 10. 780. (6} శివాగమవేది (7) అమోఘవచోనిధి 10. '781 (8) బ్రహ్మకులోత్తంసుఁడు (9) సంసార పదవియుక్తుండు 1008. a ఈవిశేషములలోఁ గొన్నిపండితయ్యకును బ్రసిద్ధ మైనవి. బాహ్మణుఁడు, కవి, పండితుఁడు, యతి, అమోఘవచస్కుఁ డన్నవి శివతత్త్వశబ్దముతోఁ గలిసి యనుమానమును బలపఱచుచున్నవి. నన్నెచోడుఁ డొకచోట శివు నిట్లు పేర్కొ నెను.

"(1) జంగమమల్లికార్జు౯ (2) జంగమమల్లయ;” కుమారసంభవము 8. 61; 8. 62 శివునకుఁ దనగురువునకు సమాననామముల వాడినాఁడు. ముని, జంగము, బ్రహ్మచారి యగుమల్లికార్జునుఁడు పండితమల్లికార్జునుఁ డనుట కింకను బలవత్తర మగుప్రమాణములు దొరకవలసియున్న దనియే ప్రస్తుతము నాయూహ ! అత్యధికముగఁ బూజనీయుఁ డగునీపండితునిరచన మాంధ్రభాష యందలిశైవవాఙ్మయమునకు, శతకవాఙ్మయమునకుఁ బునాదివంటిది. ఆంధ్రు లిది చదివినకొలఁది యింకను దీనిప్రాముఖ్యము తేటపడును.

పండితయ్యనుగూర్చి విశేషములు పాలుకురికి సోమన్న పండితారాధ్యచరిత్రమున నిట్లువ్రాసెను. చదువువారికి మనోహరముగనుండు న ట్లాతని ద్విపదలే యుదాహరించెదను.

శ్రీశైవసమయదేశకచక్రవర్తి ! పాశవిమోచనపటుకళామూర్తి
శుంభద్దిగంతవిశ్రుతసితకీర్తి | శాంభవదీక్షాభిజాతానువర్తి
ఉత్తమోత్తముఁడు సంయుతవీరభ క్తి | వృత్తచిత్తుఁడు చతుర్వేదార్థవేత్త
గహనసంసృతి శిరఃఖండన హేతు | మహితపంచాక్షరీమంత్రసిద్ధుండు
వేదాగమపురాణ విహితశాస్త్రోప | పాదితరుద్రాక్ష,భసితభూషణుఁడు
యమనియమాది వ్రతచారసార 1 శమదమోత్కృష్టనిష్ఠాగరిష్ఠుండు
నంతర్బహిర్ధ్యానయజనవంతుం డ | వాంతరయ్యయనంగహరగణాఢ్యుండు
వారిశిష్యుండు దుర్వారసంసార 1 దూరవీరవ్రతోద్దురవర్తనుండు
శైవధర్మోత్తమాచార్యుండు నతస | దైవంబునద్వైత తత్త్వతత్పరుడు
న్యాయవైశేషికోదాత్తశాస్త్రోప | పాయదర్శన పరిపాలనక్షముఁడు
స్వకృతావలోకనోత్సారితశిష్య ! నికరమలత్రయనిరపి తేంద్రియుఁడు
తంత్రాధిగతవీరతంత్ర స్వతంత్ర ! మంత్రాధిఘతరాజమంత్రసిద్ధుండు
వేద వేదాంతవివిధ పురాణోప | పాదితకేవలభక్తివర్ధనుఁడు

పండితనుతపాదపద్ముండు సుకవి | మండలవిబుధ సమాజ పూజితుఁడు
నారూఢకీర్తీశుఁడగు కోటిపల్లి | యారాధ్యుఁడనఁగలోకారాధ్యమూర్తి
యసమతదివ్యలోకారాధ్యశిష్య | విసరాగ్రగణ్యుండు వీరవ్రతుండు
చనుసరుద్రోనాత్రసంశయోయనఁగ | జనియించినట్టి సాక్షాద్రుద్రమూర్తి
పశుయోగవాదాది పరవాదివిసర ! విశసనప్రత్యక్షవీరభద్రుండు
దండితాఘుఁడు జగత్పావనకార | ణుండు విశ్రుత జగన్నుతసితకీర్త
అధికశాపానుగ్రహ సమగ్రబలస | మధిగత దివ్య పంచాక్షరీవేత్త
వావధూకానిక వాగ్బంధనక్రి | యావిశారదుఁడు లోకారాధ్యమూర్తి
పరగిశైవేదశ ప్రత్యయోయనఁగ | బరువడిజను దశ ప్రత్యయాన్వితుఁడు
ధన్యుండు దేశికోత్తముఁడు లోకైక | మాన్యుండు పండితమల్లికార్జునుఁడు ||
                                                                     -పుట 7పం! ఆరాధ్య చరిత్ర,

                  *            *            *            *.           *

"అలరుచు నసమలోకారాథ్యమూర్తి | అతులశాపానుగ్రహసమగ్రకీర్తి
 యతిచక్రవర్తి, నిరస్తాఖిలార్తి | పండితేంద్రుండు శుంభస్మహాభక్త
 సముదాయ శ్రీపాదజలజాత్ముఁడగుచు.” 269 పం|| ఆ|| చరిత్రము.

పాలుకురికి సోమనాథుఁడు.

ఇతఁడు బసవన్న స్థాపించి, పండితారాధ్యులు సంస్కరించిన వీరశైవమతమున కుద్ధారకుఁడు, ప్రచారకుఁడు నగుమహాకవియని చెప్పవచ్చును. శైవమతవ్యాప్తి కాదిని శైవులు జైనులఁ జూచి దేశభాషలలో నెక్కుడు వాఙ్మ యమును సులభకావ్యములుగ రచియించినారు. మతవ్యాప్తి కీతనిసులభవాఙ్మయ మాంధ్రకర్ణాటక దేశములయం దొనర్చిన కార్య మద్భుతమైనది. సులభవాఙ్మయముచే బ్రజాహృదయము నెట్లుమార్ప నగునో చూపుట కీతనిచరిత్రమునే చూపవచ్చును.

ఇతఁడు కర్ణాటాంధ్రభాషలయందును, సంస్కృతమునందును గూడ ననేకగ్రంథములను రచియించియున్నాఁడు. ఇత డష్టభాషాకవి యని బిరుదముకలవాఁడు. కవులచరిత్రము నూతనముద్రణమునం దీతనిగ్రంథముల పట్టికనుగూర్చి యిట్లు వ్రాసియున్నారు.

"పాలుకురికి సోమనార్యుఁడు బసవపురాణము, పండితారాధ్య చరిత్రము, అనుభవసారము, చతుర్వేద సారసూక్తులు , సోమనాథభాష్యము, రుద్రభాష్యము, బసవరగడ, గంగోత్పత్తిరగడ, సద్గురురగడ, చెన్నమల్లు సీసములు, నమస్కారగద్యము, వృషాధిపశతకము, మొదలయినగ్రంథములు రచియించినట్లు బసవపురాణ కావ్యమునం దీక్రిందిపద్యమునఁ జెప్పఁబడినది.

సీ! బసవపురాణంబు ♦ ఫండితారాధ్యుల
                చరితంబు ననుభవ ♦ సారమును చ
    తుర్వేదసారసూ ♦ క్తులు సోమనాథభా
               ప్యంబు శ్రీరుద్రభా ♦ ష్యంబు బసవ
    రగడ గంగోత్పత్తి ♦ రగడ శ్రీబసవాఢ్య
               రగడయు సద్గురు ♦ రగడడ చెన్న
     మల్లుసీసములు న ♦ మస్కారగద్య వృ
              షాధిపశతకంబు ♦ నక్షరాంక

గీ. గద్య పద్యము ల్పంచప్ర ♦ కారగద్య
    యష్టకము, పంచకము నుదా ♦ హరణయుగ్మ
    మాదియగు కృతు ల్భ క్తిహి ♦ తార్థబుద్ధిఁ
    జెప్పె నవి భక్తసభలలో ♦ జెల్లుచుండు !!

ఈకవిగ్రంథములలో బసవపురాణము, పండితారాధ్యచరిత్రము, అనుభవసారము - తెలుఁగు; అన్యవాదకోలాహలము, బసవనపంచగద్య. సోమనాథభాష్యము, -సంస్కృతము, తక్కినవి కన్నడము"

(223 పుట, నూతనముద్రణము, ఆంధ్రకవుల చరిత్రము..)

సోమనాథుని పైగ్రంథములలో నే నెఱిఁగియున్నంతవఱ కీక్రింది గ్రంథములు మన కిప్పుడు లభ్యము లగుచున్నవి. కవులచరిత్రలోని భాషావిభాగము సరియైనది కాదు.

1 బసవపురాణము (ద్విపద) తెలుఁగు ముద్రితము.

2 సోమనాథభాష్యము సంస్కృతము ముద్రితము

3అనుభవసారము (పద్యము) తెలుఁగు ముద్రితము

4 పండితారాధ్యచరిత్రము (ద్విప) తెలుఁగు ముద్రితము

5 చతుర్వేదసారము (పద్యము) తెలుఁగు ముద్రితము

6. వృషాధిపశతకము (పద్యము) తెలుఁగు ముద్రితము

ఇంతవఱ కీగ్రంథము లన్నియు రాజమహేంద్రవరమున భాండాగారమున నున్నవి.

7 చెన్నమల్లు సీసములు " " " " "

8 రుద్రభాష్యము

9 బసరగడ

10 గంగోత్పత్తిరగడ

11 శ్రీబసవాడ్యరగడ

12 సమస్కారగద్య

13 అక్షరాంకగద్య

14 సద్గురురగడ.

15 పంచప్రకారగద్య

ఈగ్రంథములు నేను చూడలేదు. ఇంకను గొన్నికన్నడగ్రంథములు వ్రాసినట్లు కన్నడకవిచరిత్రమునం దున్నది. ఈవ్యాసాంతమున నుద్ధ్రుత మైనభాగమును జూడుఁడు. అందుఁ గన్నడగ్రంథముల వివరములు తెలియఁగలవు. సోమనాథునిగ్రంథములు కొన్ని కన్నడమునను, సంస్కృతమునను గూడఁజిక్కుచుండవచ్చును. ఈతనిబసవపురాణమే కర్ణాటకబసవపురాణమువ్రాసిన భీమకవి మాతృక.

పాలుకురికి సోముఁడు ప్రథమప్రతాపరుద్రునికాలమువాఁ డని కవులచరిత్రమునందు వివరముగఁ జర్చించియున్నవిషయ మగుట నిందుఁ దిరిగి చర్చింపలేదు. 1222 లో నున్నసోమరాజు తనయుద్భట కావ్యములోఁ బాలుకురికి సోమన్నను బొగడియుంట దీనికిఁ జర్చ యవసరము లేదు.

ఇవిగాక యీతఁడు కర్ణాటకభాషయందు సోమేశ్వరశతకాదులు వ్రాసినట్లు తెలియుచున్నది. కొందఱు పరిశోధకులు సోమేశ్వరశతకము పులిగిరి సోమన్నకృత మనుచున్నారు.[5] పైపద్యములోఁగూడ నీసోమనాథశతకము పాల్కురికి సోమన్న కృత మని చెప్పియుండలేదు. ఐనను కన్నడసోమనాథశతకమునుండి యొండురెండు పద్యములఁ జూ పదను. ఇవికన్నడపద్యసారము నుండిగ్రహించితిని. ఈ విషయము (29-6-1917) లో నేను కృష్ణాపత్రికలోఁ బ్రకటించియుంటిని.

మ!! "రవి యాకాశకె భూషణం రజనిగం చంద్రం మహాభూషణమ్
       కువరం వంశకె భూషణం సరసి గంభోజాళి గెవభూషణం

       హవి యజ్ఞాలిగె భూషణం సతిగె పాతివ్రత్యవే భూషణమ్
       కవి యాస్థానకె భూషణం హరహరా! శ్రీ చెన్నసోమేశ్వరా!!

మ!! చెరిపారణ్యక పక్షిగొందు తరుగొడ్రాగల్ ఫలంతీవిదా
       మరగల్ పుట్టవె పుష్ప మొందు బళలల్ భృంగక్కె వూవిల్లవే
       దురుళన్ సత్కవి గోర్వగర్విపుసియం తాంపేళ్ దొడెం లోభరిం
       ధరయున్ దాతరు పుట్టరే హగహరా! శ్రీ చెన్నసోమేశ్వరా!!"

ఇందు మొదటి పద్యమునకర్థము:-

“ఆకాశమునకు రవిభూషణము, రాత్రికిఁజంద్రుఁడుభూషణము, వంశమునకు పుత్రుఁడుభూషణము, కాసారమునకుఁ బద్మములుభూషణము, యజ్ఞమునకు నేయి భూషణము, సతికిఁ భాతివ్రత్యము భూషణము, ఆస్థానమునకుఁ గవి భూషణముకదా. హరహరా ! శ్రీచెన్నసోమేశ్వరా!”

ఈతఁడు కవియగుటయేగాక గొప్పపండితుఁ డని సోమనాథభాష్యము సాక్ష్య మీయఁగలదు. ఇతని భక్తు లగుపిడుపర్తిసోమనాధుఁడు బసవపురాణపద్యకావ్యమును మఱియొకకవి యన్యవాద కోలాహలములును సోమనాథుని పేరకృతుల నిచ్చిరి. పిడుపర్తి బసవకవి తనప్రభులింగలీల పద్యకావ్యము గద్యలో "ఇది శ్రీమత్పాలుకురికి సోమేశ్వరవరప్రసాదలబ్ద కవితాచాతుర్యుఁ" డ నని వ్రాసికొని భక్తినిఁ జూపియున్నాఁడు. అనేకశైవకవు లీతనిదైవమువలె నారాధించి కావ్యాదినిఁ బ్రశంసించియున్నారు.

ఇతడు భృంగిరిటగోత్రజుఁడు. జంగమలింగార్చనావిశారదుఁడు. సంగీతశాస్త్ర పారంగతుఁడు. యతీశ్వరుఁడు, శైవదేశికుఁడు, "వేదవేదాంగవేత్త, వేదభాష్యకారుఁడు, అతిదయాంతఃకరణుఁడు, మంచితార్కికుడు, అతివిరాగసంపన్నుడు. ఆకాలమునందు రాజులను మంత్రులను తనవాక్కు చేతను, యుక్తిచేతను మెప్పించి దాసులనుగా, శిష్యులనుగాఁ జేసికొనినవాఁడు. శైవమతము నిరంకుశగమనము నొందున ట్లొనర్చినవాఁడు. మంచివిజ్ఞానశాలి.. అభినవవ్యాసుఁ డని శిష్యాళిచే బొగడ్తఁగ న్నవాఁడు. మిక్కిలిమేధావంతుఁడై యనేకశిష్యప్రశిష్యపరివృతుఁడై యుండువాఁడు. ద్వైతాద్వైత సిద్ధాంతములఁజర్చించుటలోమంచి ప్రవేశము కలవాఁడు. ఈవిశేషణము లన్నియుఁ బిడుపర్తి సోమనాథుఁడు వ్రాసినబసవపురాణ, చంపూకావ్యము నందలియాశ్వాసాంతపద్యములఁ జదివినవారి కతిశయోక్తులు కావని తెలియఁగలదు. బసవన్న చారిత్రకయుగము నందలి మహావీరుఁడు. ఆతనిచారిత్రమునకు దివ్య తేజస్సు కల్పించి సోమనాథుఁడు వీరపురుషా రాధన మునర్చి వీర శైవమతమును బ్రజ్వలింపఁజేసి మతముతో దేశ, దేవభక్తులఁ గలిపిన గొప్పరాజకీయ పరిజ్ఞాతయనియు, మహాపురుషుఁ డనియుఁ జెప్పవచ్చును. ఆతనిమతసిద్ధాంతములప్పటి దేశ, రాజకీయములననుసరించియు, జైనమతప్రాబల్యానుసారముగను, అతనిబుద్దికిఁ దోఁచినట్లు సంస్కరణముల గోరి, ప్రజలయం దాభావములు వ్యాప్తి నొందుటకు వలసిన వాఙ్మయమును దాటియాకులపై వ్రాసి, స్వయముగఁ జదివి, శిష్యులఁ బ్రోగుచేసి, రాజులను, మంత్రులను స్వాధీనము చేసికొని, దేశసంచార మొనరించి, యన్యభాషలనేర్చి, యందుఁ గావ్యములల్లి, వీర శైవముచే దేశము నుద్దరింపఁ, దల పెట్టినగొప్పనాయకుఁడు. యతీశ్వర్యుడై సర్వసుఖముల వర్జించి పాలుకురికి సోమనాథుఁ డొనర్చినపని యనన్యసామాన్యము. దాని మంచిచెడ్డలు, ఫలితమును విమర్శించుపని దేశీయచరిత్రకారునిది. కావున దేశజులు మనసోమనాథుని కవిగనేకాక యింక ననేకవిధములఁ బూజింపవలసినట్లు తోఁచక మానదు.

ఇతనిచరిత్ర మింకనుదెలియఁగోరువారి కనువుగ చంపూబసవపురాణము , కృతి నిచ్చుచు పిడుపర్తిసోమనాథుఁడు వ్రాసినయీతనిచరిత్రము. చదువుకొనుఁడు.

వీరశైవులలో నీతని దైవమువలె నారాధింతురు. ఈతనిద్విపదకావ్యములలోని మతాభిప్రాయముల నటుంచి చూచిన నీతఁడు వాడినశబ్దజాలము, శైలీప్రవాహము, వాడుకభాషా నిరంకుశత్వమును భాషాభిమానులు వేనోళ్లఁ బొగడుచుందురు. ఈ పేజి వ్రాయబడి ఉన్నది. ఈ పేజి వ్రాయబడి ఉన్నది బసవపురాణపద్యకావ్యమునందు సోమనాథునిచరిత్రమును కృతిపతి వర్ణనగా నొనరించి యుండెనుగదా. వీరశైవదీక్షాబోధ రచియించిన పిడుపర్తి బనవన యిట్లు సోముని, పండితయ్యను బొగడి యున్నాఁడు.

"సవిశేషశివతత్త్వపారాదికృతుల | శివభక్తి నిష్ఠించి సృష్టికిదృష్ట
 ముగ నిల్వుగన్నులు ముక్కంటిచేత | దగఁ బడసిన పండితస్వామిఁ గొలిచి
 బసవపురాణాదిబహుకృతు ల్జెప్పి ! వసుమతి వీరశైవముఁ బ్రతిష్ఠించి
 సకలమాహేశప్రసన్నతఁ గన్న సుకృతాత్ముఁ బాల్కుర్కి సోమేశుఁ బొగడి
 కావ్యము ల్జెప్పి శంకరు కృపఁగన్న | భవ్యుల శివకవిప్రవరులఁ దలఁచి."

ఇతఁడు ప్రభులింగలీలలు పద్యకావ్యముగ వ్రాసినబసవనకుఁ బూర్యుఁడు. ఈబసవన తనకావ్యము భరద్వాజగోత్రుఁడు, శైవ భక్తుఁడు, వీర బాణావనీనాథునికొడు కగుతిమ్మనృపాలునిపుత్రుఁ డగు వీరభూపాలనకు గృతి నిచ్చెను. ఈకవికొడుకేసోమనాథుఁడు. బసవపురాణము పద్యకావ్యముగ వ్రాయుటయేగాక ప్రభులింగలీలలు కర్ణాటకమునుండి ద్విపదగా భాషాంతరీకరించినాఁడు. "

ఈతఁడు శైవబ్రాహ్మణుఁడు. మొదట నారాధ్యుఁడుగా నుండి యుత్తరవయస్సున కేవలజంగముగా మాఱి సిద్ధిపొందినట్లును, జీవించి యుండఁగనే సమాధి ప్రవేశించి యదృశ్యుఁడైనట్లును భక్తులు వ్రాసి యుండిరి. ఈతఁడు సంస్కృతాంధ్రకర్ణాటక భాషలలోనేగాక మఱికొన్నిభాషలలోఁగూడ పద్యములను వ్రాసెను.

ఈతని వంశమునుగూర్చి యిదివఱ కనేక వివాదము లున్నవి. ఈ క్రిందివాక్యములవలన నీతనితలిదండ్రులనామములే యిదివఱకు సుస్పష్టముగఁ దేలలేదని తెలియఁగలదు.

(1) అనుభవసారమం దిట్లున్నది.

క. భృంగిరిటగోత్రుఁడను గురు | లింగ తనూజుఁడ శివకులీనుఁడ దుర్వ్యా
   సంగ వివర్జితుఁడ ....... | జంగమలింగప్రసాద సత్ప్రాణుండ౯!!

ఇందువలనఁ దనగోత్రము భృంగిరటగోత్ర మని, గురులింగ పుత్రుఁ డని, శివకులమువాఁడని చెప్పుకొనినట్లు కనఁబడును. కాని బ్రాహ్మణులలో నిట్టి గోత్రసూత్రములు, కులములు లేవు. అందు వలన నిందు సోమన్న తాను శివపుత్రుఁడ, శివగోత్రమువాఁడ, శివకులీనుఁడ, నని చెప్పిన భక్తివాక్యములుగా వీనినిఁ దలంపవలసియున్నది. ఏ మనఁగా?

(2) పండితారాధ్యచరిత్రమునం దిట్లు చెప్పుకొనె నని కవుల చరిత్రము నూతనముద్రణము 221 పుటలో నున్నది

"శ్లో!! గురులింగార్యస్య దయాహస్తగర్భ సముద్భవః
      బనవేశస్య తనయః బసవేశ్వర గోత్రకః
      శ్రీమత్పాల్కురికి సోమేశనామాహాం సర్వపిత్తమః
      పండితారాధ్య చరితాలంకృతాం కృషిమారభే
      తతశ్శ్రుణు నతామాత్య సూరనామాత్య శేఖర!!"

ఇందుఁ దాను గురులింగార్యునిఛాత్రుడఁని, బసవేశపుత్రుఁడ నని చెప్పుకొనినట్లు శ్రీపంతులుగారు భావించి మొదటికులగోత్ర వివరణమునకు భారతపద్యము నుదాహరించి గురువును జనకునిగాఁ గవి చెప్పఁజూచె నని సమర్థింపఁ బోయిరి. కాని యిందును సోమన్న తనకులగోత్రముల సరిగఁ జెప్పలేదు. బసవకులము, బసవగోత్రము ననియే భక్తివాక్యము లనుచున్నట్లు ఛాందసమే కనఁబడుచున్నది. సత్యముకాదు. ఏమనఁగా? కొన్ని పండితారాధ్య చరిత్రముల ప్రతులయం దీతఁడు [6] వీరపోచేశ్వరునికొడుకు నని చెప్పుకొనెను. అదియుగాక.

(3) పాలుకురికి సోమన్న తనబసవపురాణమును గర్ణాటకమునందలి గొబ్బూరగ్రహార జనోత్తముఁ డగుగొబ్బూరి సంగనామాత్యు నకుఁగృతి యిచ్చుచు నందుఁ దనకులమువిషయ మిట్లు చెప్పుకొనెను.

"ధర నుమామాతా పితారుద్రయనఁగ | బరగువేదోక్తి నీశ్వరకులజుండ
 శరణగణాశ్రయసకలస్వరూప | గురులింగవరకరోదరజనితుండ
 భక్తకారుణ్యాభిషిక్తుండఁ బాశ | ముక్తుండఁ గేవలభక్తిగోత్రుండు
 భ్రాజిష్ణుఁడగువిష్ణురామదేవుండు | లేజిష్ణువగు శ్రియాదేవియమ్మయును
 గారవింపఁగ నొప్పుగాదిలిసుతుఁడ ! వీరమహేశ్వరాచారవ్రతుఁడ
 ఖ్యాతిచేసద్భక్తి గలకట్టకూరి | పోతిదేవునిపదాంబుజషట్పదుండ
 సుకృతాత్ముఁ డగుకరస్థలముని శ్వేశు | ప్రకటవరప్రసాదకవిత్వయుతుఁడు
 పడగామురామేశు వరశిష్యుఁ డనఁగఁ | బడుచెన్నరామునిప్రాణసఖుండ
 సంభావితుఁడ భవిజనసమాచరణ! సంభాషణాది సంసర్గ దూరగుఁడ
 నలిబాల్కురికి సోమనాథుఁ డనంగ | వెలసినవాఁడ నిర్మలచరిత్రుండ"
                                                             (బసవపురాణము. పుట 3)

ఇందువలన నీతఁడు శ్రియాదేవి, రామదేవుల పుత్రుఁడనియు, కట్టకూరి పోతిదేవుని భక్తుఁడనియు, వడిగామురామేశుశిష్యుఁ డగు చెన్నరాముని సఖుఁ డనియుఁ దెలియుచున్నది. పండితారాధ్యచరిత్రమునం దిట్లు చెప్పుకొనెను.

"ధర నుమామాతాపితారుద్ర యనఁగ | పరపురాణోక్తి నీశ్వరకులజుండ
 పే రెన్నఁబడిన శ్రీ జెలిదేవ వేమ | 'నారాధ్యులను పరమారాధ్యదేవు
 మనుమనిశిష్యుండ మద్గురులింగ | ఘనకరుణాహస్తగర్భ సంభవుఁడ
 మును బసవపురాణమున నెన్నఁబడిన ! పెనుపారుభక్తుల పెంపుడుకొడుక'
 బసవపురాణప్రబంధ మ౯ పేర | బసవపురాణి య౯ పటిగలవాఁడ
 బసవనిపుత్రుఁడ బసవగోత్రుండ * * *** బసవన్నయిలుబుట్టు బానిసెకొడుక
 * * మసలక మాచెన్నమల్లికార్జునుని | బసవనామం బిడి భక్తి పెక్కు పను* *
 శుద్ధభక్తస్థల శ్రుతిమతాచార ! సిద్ధవీరవ్రత శీలాన్వితుండ
 నలిబాల్కురికి సోమనాథుఁ డనంగ | వెలయువాఁడను చతుర్వేదపారగుఁడ!!

పండితారాధ్యచరిత్రము తనముద్దుమఱఁదియు, నెచ్చెలికాఁడును, సాహిత్యపరుడును, బసవభక్తుఁడును, వీరపోచేశ్వరాచార్యునిశిష్యు డును, మంత్రియును, ఆపస్తంబసూత్రుఁడు, హరితసగోత్రజుఁడు నగు సూరనామాత్యునకుఁ గృతి యిచ్చెను. “గణసహస్రనామము దీపకతి చరిత్రము నీయారాధ్యబాహ్మణుఁడు వ్రాసె” నని పద్య----- వ్రాసిరి గాని యవి పండితయ్యకృతు లని సోమన్న యే చెప్పెను. కావున నీతనివి కానేరవు.

ఈతఁడు వ్రాసినగ్రంథములలో, జాటుకృతులు పెక్కు లున్నట్లు తెలియుచున్నను మనకుఁ జిక్కినవి స్వల్పము. అందు ముఖ్య మైనవి (1) వృషాధిపశతకము (2) చెన్నమల్లుసీసములు (3) చతుర్వేదసార సూక్తులు[7]

ఇందలివృషాధిపశతకము (108 పద్యములు) చంపకోత్పల మాలాసంఘటిత మైనభక్తిశతకము, ఇది బసవేశ్వరునిశివస్వరూపునిగా నెంచి యాతనిసంబోధించి చెప్పినది. "బసవా ! బసవా! బసవా! వృషాధిపా ! " అని మకుటము. నూఱువిధంబుల స్తుతింతు నని కవి యనుచున్నాఁడు.

“నోరికి వచ్చినట్టు లోకనూఱువిధంబులఁ బ్రస్తుతింతు నే
 నేరుతు నేరఁ బొమ్మనక నీపయి పొచ్చము లేనిమచ్చిక౯
 గారవ మొప్ప మత్ప్రుణుతిఁగైకొనఁగాఁ దగు గారవింపు నిం
 పారఁగఁగూర్మిఁ బూని బసవా బసవా బసవా వృషాధిపా!! 106

ఈశతక మీతఁడు బసవపురాణము రచియించినది. ప్రజలు మెచ్చుటఁ జూచి, భక్తులు బసవన్నను స్తుతించుట కనువుగానుండున ట్లిది వ్రాసియుండె నని యీ క్రిందిపద్యమువలన ద్యోతక మగు చున్నదిగావున నీశతక మీతఁడు బసవపురాణానంతరమే వ్రాసి యుండెను.

"బసవఁడు ప్రీతిఁ గైకొనియె భక్తి మెయిన్ విరచించినాఁడు మున్
 బసవపురాణ మంచుననుఁ బ్రస్తుతిసేయుదు రట్లుఁగాన నీ

యసమయాధురీణతకు నంకిలిపాటు ఘటిల్లకుండ న
స్వసిఁగొని బ్రోవుమయ్య బసవా” 107

పండితమల్లికార్జునుఁడు బసజస్తుతిగాఁ గొన్నికావ్యములు రచియించె నని మనము తెలిసికొనియున్నాము. ఆవిషయము సోమనాథుఁ డీక్రింది.పద్యమున సూచించెను.

“దండితవాదియై శివుఁడె దైవముగాకని కన్నులిచ్చి తా
 నిండుమనంబుతో నిలువుకన్ను లు దాల్చి పోల్చు మా
 పండితమల్లికార్జునుఁడు బ్రస్తుతి సేయఁగ నేర్చు
 నిన్ను నెవ్వండు నుతింపనేర్చు బసవా!" 100

బసవడే శివుడు. శివుఁడే తనవల్లభుఁ డని సోమనాథుఁడు పల్కుచు విశిష్టాద్వైతులనాయక నాయకీభావభరిత మగుభక్తి నీతఁడును బ్రకటించియున్నాఁడు. బసవఁడు "భక్తికళత్రుఁ డ” ని చెప్పుటయే గాక యీక్రిందిపద్యమున స్పష్టపఱచెను.

“నాయొడయండ నావిభుఁడ నాహృదయేశ్వర నామనోహరా
 నాయిలువేల్ప నాపరద నాగురులింగమ నాదుజంగమా
 నాయదినాథ నావరుఁడ నన్నుఁ గృపామతి బ్రోవు మయ్య దే
 నా యమిబృందవంద్య బసవా” 105

ఇట్లు “నాహృదయేశ్వర!” “నామనోహరా"యనివాడినపదములే సోమునిభ క్తినిఁ బ్రకటింపఁ జాలియుండును.

ఇతఁడు పలుభాషలలోఁ బండితుఁ డగుట, వేర్వేఱుభాషలలో స్తుతించినయెడల ఫలప్రద మని యట్లొనర్చియున్నాఁడు.


సంస్కృతభాష

చూర్ణితమన్మధాయ పరిశోభితభస్మవిలేపనాయ సం
పూర్ణమనోరథాయ గతపూర్వభవాశ్రితవర్ణనాయ ని

ర్వర్ణనిరాసకాయ సశివాయ నమో యని సంతతంబు ని
న్వర్ణనసేయువాఁడ బసవా!! 58

ద్రావిడ భాష

పరమనె యన్ను యాండవనె పన్నుదయానె యనాథనాథ నే
పెరియనె పేనివుండవనె పేరుదయాయనే పేరుజెప్పనే
తరిమురియాయనె యనుచు ద్రావిడభాషమతింతు నిన్ను మ
ద్వరకరుణావిధేయబసవా. 59

కన్నడ భాష

హసుళియనన్న రక్షినువు హారయ దెవ్వవనీవనందు మ
న్ని సువడి నిమ్మడింగలిగెనిమ్మబ్రసాదిత నిమ్మతోత్త నే'
కసిగతియంచు భక్తినిను కన్నడభాష నుతింతు సద్గుణ
వ్యసన శరణ్యమయ్య బసవా. 60

నవార్య భాష:-- (మహారాష్ట్రము.)[8]

దేవతరీతు హేచిగురుదేవమణూనతరీతు మ్రోచిగో
సానితరీతు హేచితుమసాచిప్రసాదయమీకృపాకరా
యీవరదాయ యంచునుతియించెద నిన్ను నవార్యభాష
దేవా నినుతార్యలోక బసవా. 61

జాను తెనుంగు

-

పలుపొడతోటిచీరయును పాపసరుల్ నిరుమోము కన్ను వె
న్నెల తలచేతికుత్తుకయునిండిన వేలుపు టేరుపల్కు పూ
సలుగలరేనిలేఖపని జాను తెనుంగునవిన్నంచెద౯
వలపుమదిం దలంతు బసవా. 62

ఇదియే యచ్చ తెలుఁగని తరువాత వారుతలంచి క్రొత్తమాటలఁ జేర్చిరి.

అరుదుమణిప్రవాళము

సంస్కృత ద్రావిడ పదముల సమ్మేళనరచనమున కఱవ లీపేరు వాడెదరు.

అరుళగిరిప్రసాదము దయానభవద్గుణవర్ణన నిల్సి నా?
వెరపుననేస్మరామి పరమేశ్వర రేగణవర్య యంచు ని
ట్లరుదుమణి ప్రవాళమున నంకనజేయుదు నిన్ను మన్మనో
వరకరుణావిధేయ బసవా. 64

ఇట్లు మణిప్రవాళము, వాస్ధేయమణిప్రవాళము నందును స్తుతించుటయేగాక " పెక్కుభాష” లఁ గలిపి యొకపద్యమునఁ గూడ స్తుతించియున్నాఁడు.

ఈతఁ డంత్యనీమయుక్తముగవ్రాసిన పద్యములు శతకారంభమున మిక్కుటము. ఈశతకమే పోతన్న యంత్యనీమములకు సర్వేశ్వర శతకముతోపాటు భిక్ష పెట్టియుండవచ్చును.

ఆర్యవితానవర్య భువనాధికశౌర్య యుదాత్తసత్పథా
చార్య యవార్యవీర్య బుధసన్నుతచర్య విశేషభక్తితా
త్పర్య వివేకధుర్య పరిపాలితచౌర్య శరణ్యమయ్య దు
ర్వారయనూనధైర్య బసవా!! 74

వినుత నవీనగాన గుణవిశ్రుతభక్తివిధేయ కాయ య
త్యనుపమగణ్యపుణ్య నయనాంచల దూరభవోపతాప స
ద్వినయవికాసభాస సముదీర్ణశివైక్యసుఖైక పాక దే
వ నను భరియింపు మయ్య బసవా ! 36

ఈశతకాంతమున నీతఁడు ఫలశ్రుతి నిట్లు చెప్పియుండెను.

అకుటిలలీల జంగమసమగ్రదయాకలితప్రసాదిపా
యకురికి సోమనాథుఁ డతిలౌల్యమున౯ బసవన్నదండనా
లుకునకు నొప్పుళత్కమర్పణఁ జేసె నివిం బఠించువా (?)
డికి వినువారికిం గలుగు శ్రీయువు నాయువు భక్తి ముక్తియు౯ || 108.

పాలుకురికి సోమనాథుఁడు గానకలాప్రవీణుఁ డనియు, స్వరూప మిట్టిదనియు నింక ననేకవిశేషము లీక్రిందియాశ్వాసాంత పద్యముల వలనఁ దెలిసికొనవీ లగుచున్నది.

భృంగిరిటగోత్రసంభవ జంగమలింగార్చనానిశారదవలస
త్సంగీతశాస్త్రపారగ గంగోత్పత్తిప్రకారకావ్యధురీణా. 3. 451
                                     పి. సోమనాథుని బసవపురాణము,

ఇందువలన సోముఁడు సంగీతశాస్త్రజ్ఞుఁ డనియు, గంగోత్పత్తిర గడ శైవులు సరసకావ్యముగ నెంచువా రనియు, బహుశః సోముఁడు తనద్విపదకావ్యముల సంగీతమునఁ బాడి ప్రజల నాకర్షించియుండుననియుఁ దలంపవీలగుచున్నది.

పాలుకురికి సోమన్న బాహ్య వేషము నీక్రిందిపద్యము తెల్పును.

శ్రీభశితత్రిపుండ్రక పరీతవిశంకటఫాలు జాట జూ
టీభరదారు నిర్మలపటీపటలావృతదేహు నక్షమా
లాభరణాఖిలాంగు బసవాక్షరపాద పవిత్రవక్త్రుఁ జి
చ్ఛోభితచిత్తు, బాల్కురికి సోమయదేశికుఁ బ్రస్తుతించెద౯

పాలుకురికి సోమన్న వర్ణనము పిడుపర్తి సోమనాథకవి తన బసవపురాణకృత్యాది నొనర్చియున్నాడు.

సీ. లిపి లిఖింపకమున్న యపరిమితార్థోక్తి, శక్తి యాతనిజిహ్వ జరుగుచుండు
    ఛందోధి కరణాది సరణి చూడక మున్న, మది నుండఁ గావ్యనిర్మాణశక్తి
    భాష్యసంతతులు చెప్పంగఁ జూడకమున్న , రుద్రభాష్యక్రియా రూఢి వెలయుఁ
    దర్క శాస్త్రాదివిద్యలు పఠింపకమున్న, పరపక్షనిగ్రహప్రౌఢి వెలయు

తే. నతని నుతియింప నాఁబోఁటి కలవి యగునె, జైనమస్తక విన్యస్త శాంతశూల
    కలిత బిజ్జలతలగుండు గండిబిరుద, శోభితుఁడు పాల్కురికి సోమనాభిధుండు!!

పాలుకురికి సోమన్న గురువు విశ్వనాథుఁ డనుటకు సాక్ష్యము.

క. అతఁడు గురువరకరసం, జూతుండై విశ్వనాథు సన్నిధిఁ గవితా
    చాతురి యెఱింగి బసప, ప్రీతిగ రచియించి నట్టికృతు లెవ్వియన౯ !! 126

ఓరుగల్లులో బసవపురాణపఠనము నాక్షేపించినవారిని జయించి, శిష్యులకు డొంకిప ఱ్ఱగ్రహార మిప్పించి తాను కన్నడమునకు సోమన పోయె నని బసవపురాణమునందే యున్నది. ఈతఁడు గంగ గోదావరి చెంగట నున్న పాల్కురికిలో సమాధి రచించుకొని సిద్ది నొందెను. ఇతఁడు యతి (1. 79.) నవ్య వ్యాసుఁడు (1. 186.) ఇతఁడు తన గ్రంథమున 'ఆతత బసవపురాతన భక్తగీతార్థసమితియె మాతృక గాఁగ' బసవపురాణము వ్రాసితి నని కృత్యాదినిఁ జెప్పుకొనెను.

పాలుకురికి సోమనాథునిగ్రంథములలో నత్యద్భుత మైనవిషయము లున్నవి. మతవిషయము లక్కఱలేనివారికి దేశ, భాషా, వాఙ్మయ, సాంఘిక, రాజకీయ విషయము లెన్నియో తెలిసికొన వీలగుచున్నది. కాని యీతనికావ్యము లింతవఱ కంతగాఁ జదివిన పరిశోధకులు కనఁబడరు. బసవపురాణకృతిపతి యగు గొబ్బూరి సంగనామాత్యునిగూర్చికాని, అనుభవసారకృతిపతి యగు గోసగి నారయాఖ్యు (త్రిపురారి)ని గూర్చికాని మనకు వివరములు తెలిపినవారు లేరు. పాలుకురికి సోమనాథునిగురువు విశ్వేశుఁ డని సోమన్న యే వ్రాసిన యీక్రిందిపద్యభాగములవలనఁ గూడ దెలియఁ గలదు.

ఈవిశ్వేశుఁడే బెలిదేవి వేమనారాధ్యుల మనుమఁ డై యుండును.

“కుశలు౯ విశ్వేశు విమలగురుహరు శరణు౯”. 1
                                            అనుభవసారము.

“విమలచిత్ప్రపూర్తి విశ్వేశువరమూర్తి , వినయవర్తి భువనద
విభు కరస్థలంబు విశ్వేశుకారుణ్య, జనిత వినుత కావ్య శక్తి యుతుఁడు"
"చరలింగ ఘనకరస్థలి విశ్వనాథ ” 2
                                          అనుభవసారము.

"వరకృపాంచిత కవిత్వ స్ఫూర్తిఁబేర్చి”
                                బసవపురాణము గద్య. 3

ఈనడుమ ననేకవివాదములకుఁగారణ మైన "రేవఁడు” శబ్ద మీవిధముగ ననుభవసారమునం దున్నది.

క. వంటని దుర్వ్యసనంబుల, పెంటకుఁ గా కీశుభక్త వెరవునకుంగా
   కుఁటఁ జెడు భక్తివాసన, రెంటికి నెడతాకి చెడ్డ రేవనిభంగి౯ .

ఈసామెతనే తరువాతవా రనుకరించినట్లు తోఁచుచున్నది.

సుమతిశతకమున కనుకరణమో, లేదా యీతనినే సుమతి శతకకర్త యనుకరించెనో చెప్పలేము కాని యట్టిభాగము లీతని గ్రంథముల నున్నవి.

“కలనాఁడె ధనము ప్రాయము, గలనాఁడె జవంబుబలము కలవాఁ డెవిని
 శ్చలమతియు గతియుఁ దనకు౯, గలనాఁడె భజింపవలయుఁ గరుణానిలయు౯”
                                                                          అనుభవసారము.

ఈపద్యము ననేకాంధ్రకవు లనుకరించుచువచ్చిరి. సోమనాధుని గ్రంథము లన్నియునుఁ జదివిన నిట్టివై చిత్ర్యము లెన్ని యో తెలియఁ గలవు.

ఈక్రిందిపద్యమును వేమన్న యనుకరించె ననవచ్చును.

క. అడుగమి నిచ్చుట యుత్తమ! మడిగినయెడ నీఁగిణయెన్న నగు మధ్యమ మ
   ట్లడిగిన మెయ్యొ (య్య?)రపుల దా|నిడుటయె యధమంబు భక్తియెడఁద్రిపురారీ.
                                                                        అనుభవ సారము.

ఆ. అడుగ కర్థ మిచ్చునతఁడు బ్రహ్మజ్ఞాని| అడుగ నర్థ మిచ్చునతఁడు త్యాగి
    అడుగ నియ్యలేనియాతఁడె పెనులోభి | విశ్వదాభిరామ వినుర వేమ!!
                                                                     వేమన పద్యములు

తిక్కనకంటెఁ బూర్వుఁ డైనసోమనాథునియనుభవసారము నందు షష్ఠ్యంతము లున్నవి. కావునఁ గవులచరిత్రము తిక్కనయే మొదట షష్ఠ్యంతములు వ్రాసె నని స్థాపించి, యాస్థాపనమునకు సరిపడనిచాముండికావిలాసాదులషష్ఠ్యంతముల నెపమునఁ గల్పితగ్రంథము లనినమాటలు నిలుచుట లేదు నేను చూచినకొలఁది నీకవిగ్రంథము లెన్నియో విశేషములతో నున్నట్లు కనుగొంటిని. పరిశోధకు లిఁకనైన నీతని యితరగ్రంథములు శ్రద్ధతోఁ బఠింపవలసియున్నది. ఈతనిపండి తారాధ్యచరిత్రకృత్యాదిని "ప్రాసోవాయతిర్వా" యనుటవలన నితని నాఁటికే తెలుగుఁఛందోగ్రంథము లున్నట్లు తెలియఁగలదు.

ఈతని కించుమించుగా సమకాలికుఁ డని తలంచుచున్న నన్నెచోడుఁడేకాక బద్దెన్న కూడ నీతని పద్యముల వంటివి వ్రాసెను. నన్నెచోడ బద్దెన్నలకాల మింకను సంశ యాస్పదము లగుట నెవ్వరెవ్వరి నను కరించిరో తెలియదు.

క. "బలిమికిఁబాడి, తపంబున | కలుగమి, సిరికోర్పు, విద్యకభిమానము, వా
    గ్బలమునకు బొంకువొరయమి, కులమునకాచారమొప్పుఁగొమరురభీమా!! లోకనీతి. 5

క. హీనునకుబలిమి, పరా ధీనునకుసుఖంబు, దుర్మతికిరిపుజయ, మ
   జ్ఞానికిఁబరమును, నలిగెడు వానికి సైరణ,యసంభవము బద్దినృపా" లోకనీతి. 6
                                                                        బద్దినీతులు

వీనినిఁ బోలియున్న సోమనాథుని పద్యములు.

క. "నురువడికిఁదెలివి; భక్తికిఁ| బరిచర్య, గృతార్థమతికిభయమును ; ప్రతత
    త్పరతక చలనమును; దగస| చ్చరితకు నిస్ప్రుహయు; నొప్పుసద్భక్తినిధీ!! 48

క. వలవునకుఁదలఁపు; పేతకు| నలయమి; పలుకులకువినయ; మారాధనక
   గ్గలమగుసన్మానము; మతి| కలిమికి వినికియును; నొప్పుకరుణాంబునిధీ!! 49
                                                                       అనుభవసారము,

ఇట్లేనన్నెచోడుని కుమారసంభనమునం దొరయూరిపురవర్ణనమునందలి “కల్కోఁడికూఁతలు, కల్పొన్నవిరులు" మున్నగుసమానాంశము లున్నవి.

"ఈతఁ డారాధ్యచరిత్రము, బసవపురాణము, అన్యవాదకోలాహలము, బసవనపంచగద్య, సద్గురురగడ, చెన్నబసవరగడ, శరణు బసవరగడ, వీనిని కల్పించి సకలవేదాగమపురాణ వాక్యముల నుంచి యిరువదియైదు ప్రకరణములుగ సోమనాథభాష్యమునందు సంగ్రహించి ప్రకటించెను.” అని భైరవేశ్వరకావ్యముకథాసూత్రరత్నాకరము నందున్నది. "జ్యోతిర్మయశాంభవీజ్ఞాన దీక్షాబోధ యొక్క పరమరహ'శ్యార్థమును” సంగయ్య అనేశరణునికి 160 వచనములలో సంగ్రహము చేసి ఉపదేశ మొనర్చెను. ఇవేకాక యీతఁడు శీలసంపాదనము, సోమేశ్వరశతకము, సహస్రగణనామము, అను గ్రంథములుకూడ వ్రాసియుండెను. పైనఁజెప్పినగ్రంథములలో ఆరాధ్యచరిత్రము, బసవపురాణమును తెలుఁగు, అన్యవాదకోలాహలము బసవన్న పంచగద్య, సోమనాథభాష్యము, యివిసంస్కృతము, పంచగద్యలలో నచ్చటచ్చట కన్నడ కందపద్యము లున్నవి. . తక్కినరగడలు, వచనములు, శీలసంపాదనము, సోమేశ్వరశతకము, సహస్రగణనామము కన్నడ భాషలో వ్రాసెను,

ఈతనికి తత్త్వవిద్యాకలాప, కవికాసార, అన్యవాదకోలాహళ, ప్రత్యక్షభృంగీశావతార మొదలగుబిరుదులు కలవు. ఇతఁడు బసవనికి బిమ్మట 30 సంవత్సరములలో నుండెను. కర్ణాటకభాషలో సోమనాథుఁడు వ్రాసినగ్రంథము లిప్పటికిఁ జిక్కుచున్నవి.” అనువిషయములు కర్ణాటకకవిచరిత్రలో వ్రాసియున్నారు.

బద్దెన

బద్దెన వ్రాసిస నీతిసారముక్తావళిలో నీతఁడు తన్నుఁదానే యీ క్రిందినామముల సంబోధించుకొనినాఁడు. (1) బద్దిభూపతీ (2, బద్దన (3) కీర్తినారాయణుఁడా (4) ఉదారవైరోచనుఁడా (5) బద్దెన రేంద్రా (6) రాజమనోజభూభుజా (7) నరేంద్రచతురాననుఁడా (8) వివేక చతురాననుఁడా (9) కార్యచతుర్ముఖా (10)నన్నేచోడనరేంద్రా (II) దశదిశాభరణాంకా (12) పరపక్ష భైరవా (13) నన్ననగంథవారణా (14) వివేక భూషణా (15) రాజరాజమనోజా (16) కొమరురభీమ. ఇందుఁ గొన్ని కేవలగుణవాచకములు, బిరుదులు నై యున్న వి. ఇవి యన్నియుఁ గవివరముగఁ జెప్పుకొనినవే!కొంద ఱివి పరులను సంబోధించె ననవచ్చును గాని కవి కొన్ని తన్ను, కొన్ని యితరులను సంబోధించి గ్రంథము వ్రాయువాడుక లేదు. అట్టిసంప్రదాయము మృగ్యము. ఈబిరుదులలోఁ గీర్తినారాయణాదు లొరయూరుపురాధీశు లగుచోడవంశజుల కున్నట్లు నిదర్శనము లున్నవి. ఈవిష్ణుభక్తుఁ డగుకవి, శివభక్తుఁ డగు కుమారసంభవకర్త కాఁడు. వీరిరువురు చోడులు, సూర్యవంశుజులు, సుమతిశతకము వ్రాసితి నని బద్దెన చెప్పినట్లు మా.రా. కవిగా రుదాహరించినపద్యములో "శ్రీవిభుఁడ” ననుపదము రాజుపరముగ నర్థము చప్పవచ్చును గాని "లక్ష్మీవల్లభపదపద్మారాధకుఁ" డగుకవి యిట్లు “లక్ష్మికి మగఁడ” నని స్ఫురించునట్లు వ్రాసికొనునా?

రుద్రదేవుఁడు వ్రాసిననీతిసారమునందు బద్దెన పద్యము లుండుటచే బద్దెన 1150 క్రీ. శ. లో నున్నరుద్రదేవునకుఁ బూర్వుఁ డనుచున్నారు. భువనైకల్లుమనికి సామంతుఁ డగుభద్రభూపాలుఁడు (బద్దెన?) 12 శతాబ్దమువాఁడని శ్రీచిలుకూరి వీరభద్రరావుపంతులుగా రాంధ్రులచరిత్రమున వ్రాసిరి. కాకతీయరుద్రమదేవి సామంతుఁడుగా క్రీ. శ. 1261 సంవత్సరమున జిన్న రాజ్యమును బాలించిన బద్దెన యంతపూర్వుఁడు కాఁడని శ్రీజయంతి రామయ్యపంతులుగారు వ్రాసిరి. వీరు స్యూయలు పట్టిక ననుసరించి మూలము తెప్పించి ప్రకటించిన శాసనములో నున్న "వీరనారాయణచోడబద్దిగదేవరాజు” మనబద్దెన యని శ్రీ రామయ్య పంతులుగారి యూహ. బద్దెన గ్రంథమునం దున్న 16 బిరుదులలో నొక్కటియైన శాసనమునఁ గనఁబడదు. కేవలము బద్దెననామమును బట్టియే కాలనిర్ణయము చేయవలసినచో శక్తివర్మశాసనము నందొక బద్దెన కలఁడు. కావున నీతనికాలము సందేహముగనే యున్నది. "శ్రీవిభుఁడ" అనుపద్యము బద్దెన దే యైనచో నట్టి శతకము మఱియొకటి యుం డునా? సుమతిశతకపువ్రాఁతప్రతులనింకను బరిశీలింపవలసియున్నది.

సుమతిశతక మాబాలగోపాలమునకుఁ బఠనీయమై చిరకాలమునుండి యాంధ్రదేశమున రాజ్యము చేయుచున్నది. ముద్రణ మారంభమైనది మొద లాంధ్రమున నిది యెన్నివేలప్రతు లందినదో చెప్పుటకు వీలులేదు. ఇంతప్రచారము గలయీశతకకర్తృత్వ మింత వఱకు మనకుఁ దెలియదు. పోనిం డిది యేకాలమునందుఁ బుట్టి సదో కూడఁదెలియదు. కొన్ని లక్షణగ్రంథములలో సుమతిశతకము భీమ కవికృత మని 'యుదాహరణము లిచ్చెదరు. అట్లుదాహరించిన పద్యము లొకటి రెండు నేను పోల్చి చూడఁగా నాకవి ప్రస్తుత సుమతిశతకమునందుఁ గాన్పింపలేదు. ఒకటి చూపెదను.

"క. కాదన్నవాఁడె కరణము | వా దడచినవాఁడె పేడి వసుధేశూకడ౯
    లే దన్నవాఁడె దనపరి! గాధలు పెక్కాడువాఁడె కావ్యుఁడు సుమతీ!!"

ఈ లక్షణగ్రంథ మెప్పటిదో తెలియదు. కాని యీపద్యము భీమన్నగారి సుమతిశతకము లోని దని"దథ” లకుఁ బ్రాసమైత్రికలదని చూపుట కీయఁబడినది. (పరిషత్పత్రిక సంపుటము 6, పుట 456 చూడుము) ఈ పద్యము ప్రస్తుత సుమతిశతకమున లేదు. ఈ భీమన్నగారినే వేములవాడ భీమకవి యని మనవా రీశతక కర్తృత్వ మాతని దని యుండియుండవచ్చును. ఈతఁ డేభీమన్నయైనను సుమతిశతక మీతనిది వేఱని తోఁచుచున్నది. సుమతి యను జైనముని యొకఁడు కలఁడు. "వేమా!" యని “కవిచౌడప్పా!" యని తమకుఁ దాము సంబోధించుకొనుకవులవలె 'సుమతి' యను జైనముని దీనిని రచించియుండు నేమో యని యొకప్పుడు నేను సందేహించితిని. కాని యది సత్యమైనట్లు నిదర్శనమలు లేవు.

ఇట్లు భీమన్న, జైనమునికర్తృత్వము లీసుమతిశతకమునుండి తొలఁగిపోఁగా నిఁక నిది కర్తలేని శతక మనవలసివచ్చుచున్నది. ఇట్లుండఁగా నీ నడుమ శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు తాము వెలువరించిన నీతిశాస్త్రముక్తావళి (?) లో నీక్రింది పద్యమును బ్రకటించిరి. ఈపద్యమైన వారికి దొరకిన యాగ్రంథము ప్రతు లైదారింట నొకదానియందుమాత్ర ముస్నదఁట. పద్యము వినుడు.

“క. శ్రీవిభుఁడ గర్వితారి
      క్ష్మావరదళనోపలబ్ధ జయలక్ష్మీ సం
      భావితుఁడ సుమతిశతకముఁ
      గావించిన ప్రోడఁ గార్యకమలాసనుఁడ౯"

ఈనీతిశాస్త్ర ముక్తావళియే "నీతిసారముక్తావళి " యని ఇంకొక ప్రతిలోనుంట నిది యాంధ్రపరిశోధక మహామండలివారు ప్రకటించియున్నారు. శ్రీకవిగారిగ్రంథమునందుఁ బ్రకరణవిభాగము లేదు. పాఠములు మాఱియున్నవి. ఆరెండు గ్రంథములు పోల్చిచూచినవారికి వివరములు తెలియఁగలవు. ఈగ్రంథమును వ్రాసినవాఁడు 'బద్దెన' యనుచోడుఁడు. ఇతఁడు నన్నెచోడుఁడని నామాంతరము వాడుకొనెను. ఇదిగాక పెక్కు బిరుదులు కలరాజు, సూర్యవంశజుఁడు, కుమారసంభవము వ్రాసిన నన్నెచోడుఁ డీతఁడుకాడు. అతఁడు శివభక్తుఁడు. ఇతఁడు విష్ణుభక్తుఁడు.

మాకు దొరికిన ప్రతియందు పైరామకృష్ణకవిగారి పద్యము లేదు. కావుననతఁడు సుమతిశతకము వ్రాసెనా? లేదా? యనునది పరిశీలనార్హము. రెండుగ్రంథములను దగ్గఱబెట్టుకొని పరిశీలించినచో భాష యందు, పాకమునందు, శైలియందును, మిక్కిలిగ వ్యత్యాసము కనబడుచున్నది.

రెండు గ్రంథములు నేకకర్తృత్వము లనుటకు వీలు కనఁబడదు. ఐనను సుమతిశతకము బాల్యకృత్యమనియో, బాలురకొఱ కుపయోగింప వలె నని యిట్లు, సులభముగ వ్రాసెననియో, తలంపవచ్చు ననుకొందమన్న నాసందేహమునకును బ్రత్యవాయములు, లేకపోలేదు. అవి విచారించెదము గాక !

కాలనిర్ణయము.

బద్దెన కీ. శ. 1070 సంవత్సరము వాఁడని శ్రీ కవిగారి యభిప్రాయము. శ్రీ జయంతి రామయ్య పంతులవారియభిప్రాయానుసార మీతఁడు 1261 క్రీ. శ. న నున్నవాఁడు. ఈరెండు వాదములును సందేహాస్పదములే గాని సునిశ్చితములు కావు. శ్రీరామయ్యపంతులుగారు “వీరనారాయణ చోడబద్దిగ దేవరాజులే” మనబద్దెనయందురు. ఆతని శాసనము ననుసరించి ఈతనికాలనిర్ణయ మొనర్చిరి. ఆతఁడు నీతఁడు నొక్కఁడేయనుట కాధారములు లేవు. ఐనను పైసంగతి విచార్యము. కేవలము నామమునుబట్టియే నిరువురొక్కటి యనవచ్చు ననిన శక్తివర్మ పభుపఱ్ఱుశాసనములో "బద్దేమశ్చ మహారాజో మద్యానో బలిణే” యని యొక బద్దెన్నను బేర్కొనియున్నారు. ఈశాసనము కీ. శ. 1003 — 1015 లోనిది. ఈ బద్దెన యాతఁడేల కాఁ గూడదు? మనబద్దెన కీర్తినారాయణుఁడా!” అని సంబోధించుకొని నాఁడు కాని వీరనారాయణుఁడ నని చెప్పుకొనలేదు. కీర్తినారాయణుఁడు దేవుఁడుకూడ నున్నట్లు తెలియుచున్నది. కావున బద్దెనకాల మింక ననిశ్చత మనియే చెప్పవలసియున్నది.

ఇది బాలురకొఱ కుద్దేశించె ననుటకును గొన్ని యాటంకములు కనఁబడుచున్నవి. సుమతిశతకము నందలియీక్రిందివాక్యములు బాలురకొఱ కుద్దేశించె ననఁజాలము. (1) "పొలయలుక నాఁటి కూటమి."

(2) "చేడెల యధరామృతంబుఁ జెందనినోరు౯”

“25. కడు బలవంతుం డైనను”

"38. ఎక్కువ చదువులు చదివిన”

"54. తలమాసిన నొలుమాసిన ”

"95. వెలయాలి వలనఁ గూరిమి.”

మొదలగు పద్యములు బాలురకొఱకుద్దేశించినట్లు కనఁబడదు. పైఁగా బద్దెన నీతులపద్యమొకటి యిట్లున్నది. "బాలబోధకు౯" కావున నెద్దిబాలబోధ కని యనుమానముకలుగుచున్నది. ఈపద్య మన్నిప్రతులఁ గనఁబడదు. అర్థమును జింత్యము.

కావున శ్రీ కవిగారు సుమతిశతకమును బద్దెన వ్రాసె నను వాదము రెండువిధముల సందేహాస్పద మగుచున్నది. భాషయు, శైలియు, విపరీత మగుభేదమును బొందుట యొకటి, సుమతిశతకకాల నిర్ణయమును, బద్దెన కాలనిర్ణయమును సులభముకాకపోవుట రెండవది. ఐనను స్థూలముగ బద్దెనకాలము నిర్ణయమైనట్లే, సుమతిశతకము నందలిమాటలనుబట్టి దానికాలనిర్ణయ మొనర్పఁ బ్రయత్నించి చూతము. వేఱాధారములు లేనప్పుడీ క్రింది మార్గముకంటె నన్యము కనఁబడదు. కాలనిర్ణయమునకు వీలైన తుఱకపదము లెవ్వియు నిందు నేఁ జూచినంతవఱకుఁ గనఁబడలేదు. ఇతర సాధనములకుఁ బ్రయత్నింతము. మనము చూడఁబోవునట్టి యాధారములు స్థూలవిభాగమునకు వీలగు నా యనుసందేహముతో - నాశతోఁ - జేయుప్రయత్నములే కాని యివి సిద్దాంతములు కాఁజాలవనియు, సిద్ధాంతీకరిప నీ వ్యాసకర్త యభిలాషము కాదనియు, సత్యనిర్ణయమున కొనర్చు సత్ప్రయత్నము లనియు సహృదయు లెఱుఁగకపోరు. ఈక్రింది వెఱ్ఱిప్రయత్నములకు నవ్వకుండుటకై పైయుపోద్ఘాత మవసరమైనది.

(1) శతకమునందుఁ బద్యము లకారాదిగ వ్రాసియున్నాఁడు. ఇట్టినియమము శతకవాఙ్మయ మభివృద్ధి యైనసిమ్మటనైనఁ గావచ్చును. ప్రారంభమున నిందున్ననియమ మెఱుఁగక తరువాతవారు విడిచియుండవచ్చును. ఇట్టినియమము కనఁబడుచున్న భాస్కర, వేణుగోపాలశతకములు 15వ శతాబ్దమునకుఁ బూర్వపువైనట్లు తోఁచదు. కావున నీ నియమమువలననే యిది ప్రాచీనశతక మనుటకు వీలులేదు. ప్రాచీనపద్యములవలె నిందు ప్రాసలోఁగూడ నఱసున్న పాటించి యున్నపద్యము లగుపడుచున్నవి. కావున నీ రెండు నియమములవలన నిదిప్రాచీనశతక మైనఁ గావచ్చును. ఇందాధునిక మని చెప్పుటకు వీలైనపదజాలము లేక పోవుటకూడ దీని ప్రాచీనతకే సాయపడుచున్నది.

(2) ఇందు పెక్కుచోట్ల "ఒక యూరికి నొక కరణము” (22) “కరణము కరణము సమ్మిన" (29) "కరణము సాదైయున్నను.” (31) అని కరణము పదము చాలమారు లుపయోగించినాఁడు. “కరణము” సంస్కృతశబ్దము. కరణీకములు, కరణములు నెప్పటినుండి యుండెడివారో తెలియుసాధనము లున్నచో నీశతక మప్పటికిఁ బిమ్మటి దనవచ్చును. ప్రాచీనప్రబంధములలో “గణకవిద్య” యని కరణీకమును గూర్చి కాఁబోలు మంత్రికులము వారినిఁగూర్చి వ్రాసినట్లు కొన్నినిదర్శనములు చూపవచ్చును. కాని గణకుని కరణ మనిపిలుచుట యెప్పు డారంభమయ్యెనో తెలియదు. ఈ శతకమునందే మఱియొకచోట నీక్రింది పద్యమున్నది.

క. నరపతులు మేరఁ దప్పిన | దిరమొప్పఁగ విధవయింటఁ దీర్పరి యైన౯ !
   గరణము వైదికుఁడైనను | మరణాంతక మానుగాని మానదు సుమతీ. 62

ఇట్లు వైదికుఁడు కరణ మైన మరణాంతక మగు ననుటయు, చాలపద్యములలో “కరణములను" పొగడుటయు “మంత్రి లేనిమండలాధిపతి తొండములేని యేనుఁగువంటివాఁ”డని (84) యు, "కాఁపు ------- మయిన కరణాలకు బ్రతుకు లే” దని (81)యు "మంత్రి గల వాని రాజ్యము తంత్రము సెడకుండ నిలుచు"(85) ననియు, నియోగు లపైఁ బ్రీతి కనఁబఱచుటయుఁ జూడ నీశతకకర్త మంత్రికులమువాఁడుకాని, తత్ప్రియుఁడుకాని కావచ్చునని తోఁచుచున్నది. ఈపైపద్యము లన్నిఁటియందును సత్యముంట నివి కేవల మితరకవికూడఁ జెప్పియుండవచ్చును. వైదికుఁడు కరణము కారా దనునీతి సరియైనను కాకపోయినను, భావము లట్టివి గోపరాజు రామప్రధానికి బిమ్మట రావలెను. రామప్రధానికథ సత్యమైనచో నాతనికాలము క్రీ. శ. 1185 అగుచున్నట్లు కొన్నినిదర్శనములు కసఁబడుచున్నవి. (చూడుఁడు శ్లోకములు, చాటుపద్యమణిమంజరి) "గోత్రశాస్త్రాంబరేందూనాంసంఖ్యాబ్దే శాలివాహనే” మొదట విప్రులనుండి వేఱుపడి యాఱువేలమందినియోగులు కరణీకవృత్తిలోఁ బ్రవేశించి, నియోగిశాఖ వేఱుపడినపిమ్మటఁ గొంతకాలమునకుఁగదా వైదికుఁడు కరిణీకమునకుఁ బనికిరాఁడనుమాట పుట్ట వలసినది. కావున నీమాట వ్రాసినసుమతిశతకము 12వశతాబ్దమునకుఁ జాలతరువాత కావలసియున్నట్లు తోచుఁచున్నది.

(3) ఇందు "కాఁపు"' శబ్దముకూడ రెండుమూఁడుసార్లుపయోగించియున్నాఁడు. "కాఁపు" శబ్దమునకుఁ బ్రస్తుతము కేవలము " తెలఁగా” యని, శూద్రుఁ డని యర్థ మున్నను "కాఁపు కరణము” లని పూర్వము వాడుకలో నుండెను. అనఁగాఁ బ్రస్తుతము “మునసబు కరణము” లనునట్లే కొంతకాలమునకుఁ బూర్వము "కాపు కరణము” లనుట కలదు. తుఱక ప్రభుత్వములో "మునసబు” అనుపదము మనకు వచ్చినది. "మున్సిఫ్” అనివాడుటయుఁ గలదు. కావునఁ దుఱకప్రభుత్వమునకుఁ బూర్వము “మునసబు" పదమునకు మాఱుగా కాఁపు, శబ్దము వాడియుందురు. కావుననే యీక్రింది పామరపదమునం దాసత్యము వెల్లడియగుచున్నది. తగవులాడినభార్య భర్తననుచున్నది.

"కాఁపూ కరణం నాపట్టయితె? ఏలా కొడతావు కొట్టర! మగఁడ|"

ఇటులఁ గాఁపుశబ్దము గ్రామాధికారి పరమని స్పష్టము. మునసబులు కొండెకాండ్రయిన సనియే యాక్రిందిపద్యము నందలి 'కాఁపు' శబ్దమున కర్థము తీయవలసినట్లు తోఁచుచున్నది.

క. పొరుగునఁ బగవాడుండిన ! నిరవొందగ వ్రాతకాఁడె యేలిక యైనన్
   ధనఁ గాఁపు కొండె మైనను | కరణాలకు బ్రతుకు లేదుగదరా సుమతీ. 81

ఇప్పటికిని గ్రామపరిపాలనమునందు మునసబుకరణము లైకమత్యము చెడినచోఁ గరణమునకు వచ్చుకష్టములు వేఱుగ నిర్వచింప నక్కఱలేదు. అనఁగా గ్రామాధికారి యగుమునసబునకు వ్యతిరేకముగఁ గరణము, దుష్టుఁడయ్యు నేమియుఁ జేయఁజూలఁడు. పూర్వము పెత్తనదార్లను కాఁపు లుండుటయు, వారికిఁ గరణము బాసటయై, లెక్కలు వ్రాసి, నాయపడుటయు, గ్రామపాలనము సుఖముగ నుండి ప్రభుత్వము సాగుటయు మనపెద్దలు చెప్పుదురు. కావునఁ బ్రస్తుతము “మునసబు" పదము గ్రామాధికారికి వాడిన తుఱక ప్రభుత్వమునకుఁ బూర్వ మీశతకమువ్రాసి యుండవలసినట్లు కనబడుచున్నది. అనఁగ స్థూలముగ 12, 15 శతాబ్దముల నడుమ నిది పుట్టి యుండవచ్చును. బద్దెనకూడ 12, 13, శతాబ్దములవాఁడని కొంద ఱనుచున్నారు. కావున వ్యతిరేక నిదర్శనములు లేనంతవఱకు బద్దెన దీనికర్తయని శ్రీ కవిగారిపద్యానుసారము నమ్మవలసివచ్చుచున్నది. స్థితిగతు లీవిధముగ సందేహాస్పదముగ నుండఁగ నీనడుమ నొక విచిత్రవిషయము కనఁబడినది. అది శ్రీకవిగారిసిద్ధాంతమును బలపఱచునది. కావున వారివాదమును ఖండించుట కింతకంటెఁ బ్రబలవాదము మానవలసివచ్చినది. విజ్ఞులుకూడఁ బరికించెదరుగాక!

కర్తృత్వము సరియా?

ఆంధ్రసాహిత్య పరిషత్పుస్తకభాండాగారము నె 1679రు తాటియాకుగ్రంథములోఁ బ్రసిద్ధ మగు నీక్రింది. సుమతిశతక పద్య మిట్లున్నది.

(1) సుమతిశతకము నందున్న విధము.

"పతికడకుఁ దన్నుఁగూర్చిన | సతికడకును వేల్పుకడకు సద్గురుకడకు౯
 సుతుకడకు రిత్తచేతుల | మతిమంతులు చనరు నీతిమార్గము సుమతీ. 67

(1) పరిషత్తువారి తాటియాకుప్రతిలో నొకచోట

"సుతుకడకు తన్నుఁగూర్చిన ! సతికడకును వేల్పుకడకు సద్గురుకడకున్
 మతియుతులు రిత్తచేతుల ! పతికడకుంబోవఁజనదు బద్దెనరేంద్రా!

ప్రసిద్ధ మైనసుమతిశతకపద్య మిట్లీప్రాచీనలేఖకుఁ డేలమార్చెనో-బద్దెనీతులలోవలె నీ సంబోధన ముండుటకుఁ గారణమేమో తెలియుటలేదు. ఈతాటియాకులవ్రాఁతవలన శ్రీకవిగారేగాక సుమతిశతకము బద్దెన దనువారు ప్రాచీనులుకూడఁ గలరని నిర్ణయమై దీనివలన శ్రీకవిగారివాధము కొంచెము బలమగుచున్నది. నేనిదివఱ కొనర్చిన వ్యతిరేకవాద మీకారణమున నిటవివరింపక మానితిని. ఇప్పటికిని చాలవఱకు సందేహముగనే యున్నయీవాదము సాధనాంతరములచేఁ దేలు నని తలంచెదము.

(4) ఇంకొక పద్యమును వినుఁడు.

(1) "క. నమ్మకు సుంకరిజూదరి| నమ్మకు మగసాలివాని నటువెలయాలి౯"
(2). "వెలయాలు సేయుబాసలు| వెలయఁగ నగసాలిపొందు వెలమచెలిమియు౯”

ఇట్లు కంసాలిని, వెలయాలిని, వెలమలను, గర్హించియున్నాఁడు. ఈజాతుల గర్హించినదానియందలి సత్యాసత్యములతో, బ్రస్తుతము మనకు నిమిత్తములేదు, ఒక్కరి యనుభవముచేఁగాని, యనేకులయనుభవముచేఁ గాని యొకజూతి నొకరుగర్హించుట యేరికినిఁ దగదు. ఐనను బ్రస్తుతము మన కావిమర్శనముతో నిమిత్తములేదు.

(5) కంసాలురు 12 వ శతాబ్దమునకుఁ బూర్వము గజపతి రాజ్యమున కరణములుగా నుండినట్లు గోపరాజు రామన్నకథ నుడువుచున్నది. కావునఁ గంసాలురయం దనిష్టముకూడఁ దరువాతనే కలిగినదా? ఇట్టి స్థూలసందేహములతోఁ గవికాలనిర్ణయము సూక్ష్మముగఁ గానిమాటసత్యమే కానిబుద్ధిమంతుల కిట్టి దృష్టితోఁ బరిశీలన మొనర్చినప్పుడు మంచి నిదర్శనములు పొడఁగట్టిన తెలియఁజేసి సత్య నిర్ణయమునకుఁ దోడ్పడుదు రని వ్రాసియున్నాను.

ఇతరవిషయములు.

సుమతిశతకము నీతులనిధి. భాష, శైలి, పాకము, నతిమృదు మధురము లనుటకంటె నధికముగఁ జెప్పవలసినది లేదు. పద్యము తేట తెల్లముగ నుండి, వేమనపద్యములవలె, నరఁటిపండువలె విడిపోయి, పండితపామరజనైక వేద్యముగ నుండును.

ఇట్టి మహాశతకమునందును స్వల్పముగ దోషములు కనఁబడు చున్నవి.

(1) అనవసరపదములు.

“గట్టిగ ద్రవ్యంబు గలుగఁ గదరా సుమతీ!” 44

మిక్కిలి బిగువుగ నుండు సుమతిశతకములో నొక్కపదమైనఁ దీయుటకు వీలుండదు. అట్టియెడ నొకటిరెండునెఱసు లుండిన నవి లేఖకదోషములై యుండనోపును.

(2) వ్యాకరణదోషములు.

"నారే నరులకు రత్నము”. 65

"మెచ్చునదె నేర్పు వాదుకు”

నారియే యనఁగా వనితయే యని కవియభిప్రాయము. ఇట్టివి ప్రౌఢప్రయోగములుగ స్వీకరింపవలసినది లేనిది భాషాతత్త్వవేత్తలు నిర్ణయించెదరుగాక !

శతకమునందుఁ గవి చాలచోట్ల వేశ్యలను, స్త్రీలను గర్హించి యున్నాఁడు. వేశ్యాగర్హణ మేకాలమునందును గోరఁదగినదే కాని, “కులకాంతపై వట్టితప్పు ఘటియించిన సిరియుండ” దని మనల భయపెట్టినయీతఁడే స్త్రీలను నమ్మరాదని, స్త్రీలకు రహస్యములు చెప్పవలదని, కోమలికి విశ్వాసము సున్న యని చెప్పినమాటలు నవనాగరకులకుఁ గష్టముగ నుండునని తోఁచుచున్నది. ఇందలి సంసారానుభవములు, బందుగులు, మిత్రులు, రాజులు, మంత్రులు, రసికులు, వీరికి సంబంధించి చెప్పిన విషయములు కవిలోకానుభవమును, దూరదృష్టిని మనకు వెల్లడించి కవి ప్రతిభాశాలియని తోఁపింపఁ జేయుచున్నవి.

ఈకవి కొన్ని పద్యములు కేవలము సంస్కృతశ్లోకముల ననుసరించి వ్రాసియున్నాఁడు. ఒండురెం డుదాహారణముల నిచ్చెదను. (1) స్త్రీధర్మములలో "శ్లో !! కార్యేషుదాసీ, కరణేషుమంత్రీ" అను శ్లోకమునకుఁ దెలుఁగుసేఁత.

కం. పని సేయునెడల దాసియు ! ననుభవమున రంభ మంత్రి యాలోచనలం
     దనభుక్తియెడలఁ దల్లియు ! ననఁ దనకులకాంతయుండ నగురా సుమతీ. 68

(2) భర్తృహరి శ్లోకములకుఁ దెలుఁగుసేఁతలు.

కం. పాలను గలసినజలమును | బాఁ విధంబుననె యుండుఁ బరికింపంగాఁ
     బాలచమి జెఱచుఁ గావున ! బాలనుఁ దగువానిపొందు వలదుర సుమతీ. 75

“యద్దాత్రానిజఫాలపట్టలిఖితమ్ స్తోకంమహాద్వాధనమ్” అను శ్లోకమునకు దెలుఁగు.

కం. పెట్టినదినములలోపల ! నట్టడవులకైన వచ్చు నానార్థములుం
     బెట్టనిదినములఁ గనకపు ! గట్టెక్కిన నేమీలేదు గదరా సుమతీ!! 80

"మేరౌచనాతోధికమ్” అనువఱకుఁ గడపటి పాదమునఁ దెచ్చినాఁడు. "కూడేపశ్యపయోవిధా” మొద లుత్తరార్థము కందపద్యములో నిముడకఁ బోలు విడిచినాఁడు.

కొన్నిపదముల ప్రయోగము విశేషము.

"లావొక్కింతయులేదు” పోతన్నగారు 'బల' మను నర్థమున వాడిరి. ఈకవి "లావుగలవానికంటెను భావింపఁగ నీతీపరుఁడు బలవంతుఁ డగు” నని వ్రాసినాఁడు. గంజాము విశాఖపురి మండలములలో 'లావు అనుశబ్దము "అధిక" మను నర్థమున వాడెదరు. "తీపి మాలావుగావుంది” అనఁగా నధికముగా నున్నదని. ఈ శబ్దమునుబట్టి కవిమండలము నిర్ణయ మగునా ?

క. వీడెము సేయనినోరుదు | జేడెల సుగుణములు మెచ్చిచెప్పనినోరు౯ (2)
   బాడఁగ రానినోరును ! బూడిద కిరవైనపాడుబొందర సుమతీ!! 94 |

ఈ 'బొంద' శబ్దము దూష్యార్థమున గుంటూరు కృష్ణామండలములో వాడెదరు. "ఏందిరా? నీబొంద!” అని వాడుక. ఈ శబ్దమునుబట్టి కవిజన్మస్థాన మూహింప నగునా ? వరిపంట లేనియూరు రుద్రభూమివంటి దని నిందించు చున్నాఁ డీతఁడు గుంటూరు మొదలైన మెట్టసీమలవాఁడు కాఁజాలఁ డన నగునా?

ఈక్రిందిరెండు పద్యములును మనవారు వినోదముగఁ జదివి సంతసించి మనప్రభుపుల జీవితములతో, బోల్చుకొందురుగాక!

క. మేలెంచనిమాలిన్యుని, మాలను నగసాలివాని మంగలి హితుఁగా
   నేలిన సంపతిరాజ్యము, నేలఁగలసిపోవుఁగాని నెగడదు సుమతీ. 99.

క. వేదరపుజాతి గానీ, వీసము దాఁజేయనట్టివ్యర్థుఁడు. గానీ
   దాసికొడు కైనఁగానీ, కాసులు గలవాఁడె రాజుగదరా సుమతీ, 103.

కవిరాజు రాజుకంటె నధికుఁ డనుట కీతఁడు రాజుల గోటమీటు వ్రాతలే నిదర్శనములు. కవికిఁ గావలసినది సత్యముకాని ధనము కాదు. సత్యప్రియుఁ డగుసుమతిశతక కర్తసేవ నాశక్తికొలఁది యాతని గ్రంథపఠనముచే నొనరించుకొంటిని. చదివినప్పుడు నాకుఁ దట్టిన యభిప్రాయముల వెల్లడించితిని. ఇందు నాయభిప్రాయములలో దోషము లున్నచో నాయపాండిత్యమే వెల్లడికావలెఁగాని యాంధ్రులకుఁ బూజ్యపదార్థ మగుశతకమునకు గౌరవము తగ్గదు. సుమతిశతకము నందలినీతులు నాంధ్రబాలురు బాలికలు పెద్దలుకూడఁ జదివి, యాచరించి ధన్యు లగుచున్నారు. కాఁగలరు.

క. "పలుదోమి సేయువిడియము, తలఁగడిననాఁటినిద్ర తరుణులయెడలం
    బొలయల్కనాఁటికూటమి, వెలయింతని చెప్పరాదు వినురా సుమతీ!

ఈసుమతిశతకము శ్రీరామస్తుతితో నారంభ మగుటచేతను, విప్రులఁ బూజ్యార్థమున వాడినందునను దీనికర్తృత్వము జైన మునిది కాదని శ్రీ బండారు తమ్మయ్యగారు వ్రాసి యున్నారు. వా రట్లువ్రాయుటకుఁ బూర్వమే నేను జైనముని దని యనుమానించి నది సత్యము కాలేదని పత్రికలోఁ బ్రకటించియుంటిని. ఇప్పటికైన నీతిసారముక్తావళి, సుమతిశతకములఁ జక్కగఁ జదివినవా రవి యేక కర్తృత్వము లని యంగీకరింపఁజాలరు. - ఐనను. వ్యతిరేకసాక్ష్యము లేనంతవఱకు శ్రీ. మా. రా. కవిగారిపద్యము ననుసరించి బద్దెనయే దీనికర్త యని తలంచుచుందుముగాక !

శ్రీతమ్మయ్యగారే వ్రాసిన యీక్రిందిసంగతులవలనఁ బాలుకురికి సోమనాథునిగ్రంథమునందు సుమతిశతకచ్ఛాయలు కనఁబడుచున్నవి. సత్యమేకాని యవి యెవరినుండి యెవ్వరు గ్రహించిరో చెప్పఁజాలము. సోమనాథునిగ్రంథములలో శివతత్త్వసారము కుమారసంభవము మున్నగుగ్రంథ భాగములు పెక్కు లుదాహృతములైయున్నవి. కావున శతకకర్తనే సోమనాథుఁ డనుకరించె నని యేల యనరాదు?

"ఈబద్దె భూపాలుఁడు క్రీ. శ. 1251 ప్రాంతమువాఁడని కొన్ని శాసనములవలనఁ జరిత్రజ్ఞులు తేల్చియున్నారు. ఇందులకు మఱియొక దృష్టాంతముగూడఁ గలదు. ఈ కవిగూడఁ దనకించుమించుగ సమకాలికు లయిననన్నెచోడ తిక్కనాదికవులవలెనే జాతీయకవితా నిర్మాణశేఖరుఁ డగుపాలికురికి సోమనాథునిగ్రంథములను జదివి యాతని ననుకరించినాఁడు, మచ్చున కీక్రింది దృష్టాంతమును జూడుఁడు.

ద్వి. నల్లవో భామల యుల్లం బెఱుఁగక| గొల్లవాఁడైనను గోరునే కవయ
     నొల్లని వెలయాలి నొల్లనినృపతి| నొల్లని చెలిఁబాయ నొల్లఁడేనియును
     గొల్లండు వాఁడెగా కెల్లడజాతి| గొల్లఁడు గొల్లండె గొల్లడేనియును!!
     (పాల్కురికి సోముని పండితారాధ్య చరిత్రము ప్రకరణము 2)

క. ఒల్లనిసతి నొల్లనిపతి | నొల్లని చెలికాని విడువ నొల్లనివాఁడే
   గొల్లండు గాక ధరలో| గొల్లండును గొల్లఁడౌనె గుణమున సుమతీ.

పాలకురికి సోమనాథుఁడు క్రీ. శ. 1192 ప్రాంతమువాఁడు. బద్దెభూపాలుఁ. డాతని తరువాత రమారమి డెబ్బది సంవత్సరములకు వెలిసినవాఁడు, కావున సుమతిశతక మిప్పటి కాఱువందల యేఁబది యేండ్లకుఁ బూర్వము రచింపఁబడి అప్పటినుండి ప్రచారములో నున్నట్టు లెంచవచ్చును. ” బం. త. ఆంధ్రపత్రిక. సారస్వతానుబంధము.

బద్దెనకాల మిదివఱకు నిశ్చితము కాలేదు. ఆసంగతి పైన వివరించియున్నాను. సోమన్న పెద్దగ్రంథములు వ్రాయవలసినవాఁడు. చిన్నశతకముకొఱకు సుమతిశతకకర్త యీయనుకరణ మొనరించి యుండె నని సిద్ధాంతీకరించుట పునాదిలేనిగోడపై బొమ్మవేయటవం పుట:Shathaka-Kavula-Charitramu.pdf/132 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/133 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/134 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/135 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/136 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/137 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/138 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/139 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/140 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/141 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/142 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/143 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/144 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/145 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/146 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/147 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/148 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/149 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/150 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/151 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/152 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/153 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/154 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/155 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/156 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/157 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/158 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/159 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/160 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/161 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/162 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/163 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/164 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/165 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/166 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/167 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/168 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/169 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/170 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/171 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/172 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/173 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/174 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/175 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/176 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/177 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/178 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/179 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/180 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/181 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/182 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/183 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/184 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/185 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/186 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/187 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/188 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/189 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/190 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/191 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/192 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/193 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/194 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/195 పుట:Shathaka-Kavula-Charitramu.pdf/196

  1. * ఈగ్రంథ మిటీవల గవర్నమెంటు ఓరియంటలు లైబ్రరీవారు సంపాదింప దానిని శ్రీ కే. వి. లక్ష్మణరావుపంతులుగారు విపులమగుపీఠికతోఁ బరిషత్పత్రికలోఁ బ్రకటించిరి. అందలివిషయము లిందుబాహృతమైనవి.
  2. చతుర్మఠనిర్ణయ మను సంస్కృతగ్రంధము.
  3. ఈపాఠ మిట్లుభారతమువారి (మల్లేశ్వరపుఁబండితులు) ప్రతిలో నున్నట్లు నేను కనుగొని 5, 6 సం||రముల క్రితము ప్రకటించితిని.
  4. ఇది రా. సా. గిడుగు రామమూర్తి పంతులుగారి తలంపు. నాకును బ్రమాణముగ నే తోఁచినది.
  5. "Palukuriki Soma (C 1195) was a learned scholar born at Palkuriki in the Godaveri District. After defeating in controversy the Vyshnava Sastris there, he removed to Kalleya in the Kanarese country. He wrote more especially in Sanskrit and Telugu. A Telugu Basavapurana by him is said to have formed the basis of Bhima Kavi's Basavapurana. Among his Kanarese Works there is said to have been a Sataka, and some have identified this with the wellknown and widely read Someswara Sataka, an attractive cento of verses on moral subjects. This work is however so loose and faulty, in grammar and style that Mr. Narasimha Chariar thinks it could not have been written by one who, like Palkuriki Soma, was acquainted with Sanskrit. He also points out that Lingayats themselves do not include it in the list of writings by Palukuriki Soma. Besides which, the author never calls himself Palukurike Soma, but implies that he belonged to Puligire (Lakshmiswer). The date of Paligire Soma is not certainly known, but he may have belonged to this period.". Pp. 44 Rice's Kan Lit.
  6. ఆంధ్రులచరిత్రములో శ్రీవీరభద్రరావుపంతులుగారు కృతిపతి వివరములు కవి కంటఁగట్టిరి. సోమన్న వీరపోచేశ్వరుని కొడు కనిలేదు. కృతిపతి తండ్రి వీరపోలేశ్వరుఁడు.
  7. ఇది బసవన్న వ్రాసినదానికిఁదెలుఁగనియువీరశైవము శ్రుతిసమ్మతమనియు సమర్థించును.
  8. దీనినే "ఆరెభాష"యందురు.