వేమన పద్యాలు భ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

భోగంబుల కాశింపక[మార్చు]

భోగంబుల కాశింపక
రాగద్వేషంబు రంగుడదమలో
వేగమె మోక్ష పదంబును
రాగను నాతండు యోగిరాయుడు వేమా!

భాగ్యవంతురాలు పరులయాఁకలి దప్పి[మార్చు]

భాగ్యవంతురాలు పరులయాఁకలి దప్పి
దెలిసి పెట్టనేర్చుఁ దీర్ప నేర్చు
తర దుష్టురాలు తన యాఁకలినె గాని
పరులయాఁక లెఱుంగ దరయ వేమ!

భాగ్యహీనులకును వరుసవేది దొరుక[మార్చు]

భాగ్యహీనులకును వరుసవేది దొరుక
నదియు నిల్వదపుడు వదలుఁగాక
వానతోడ వచ్చువడగండ్లు నిలుచునా
విశ్వదాభిరామ వినర వేమ!

భాతవతులమనుచు పరగంగనెవ్వరు[మార్చు]

భాతవతులమనుచు పరగంగనెవ్వరు
వారినెరుగలేరు పరుసతోడ
ఆడుపాడువారలరయ భాగవతులా!
విశ్వదాభిరామ వినురవేమ!

భేదాభేదంబులకును[మార్చు]

భేదాభేదంబులకును
వాదంబై జనముచూడ వర్తించును నా
భేదాభేదము లుడిగిన
వేదాంత ధ్యాని యగుచు వెలుఁగుర వేమా!

భయమంతయు దేహముదే[మార్చు]

భయమంతయు దేహముదే
భయ ముడిగిన నిశ్చయంబు పరమాత్మునిదే
లయమంతయు దేహముదే
జయమంతయు జీవుఁడనుచుఁ జాటర వేమా!

భయముసుమీ యజ్ఞానము[మార్చు]

భయముసుమీ యజ్ఞానము
భయముడిగిన నిశ్చయంబు పరమార్థంబౌ
లయముసుమీ యీ దేహము
జయముసుమీ జీవుఁడనుచుఁ జాటర వేమా!


భవము సాగరంబు భార్యయౌ మకరంబు[మార్చు]

భవము సాగరంబు భార్యయౌ మకరంబు
చేప జలగ లగును శిశువులెల్ల
భవహరు తలపక పారమందగ లేరు
విశ్వదాభిరామ వినురవేమ!

భూతి దేహమందుఁ బూసిన నాయెనా[మార్చు]

భూతి దేహమందుఁ బూసిన నాయెనా
నిష్ఠ శివునియందె నిలుపవలయుఁ
గాని భస్మమందు గాడిదె పొర్లదా
విశ్వదాభిరామ వినర వేమ!

భూపతి కృప నమ్మి భూమి జెఱుచు వాఁడు[మార్చు]

భూపతి కృప నమ్మి భూమి జెఱుచు వాఁడు
ప్రజల యుసురు దాకి పడును పిదప
యెగర వేయ బంతి యెందాక నిల్చురా
విశ్వదాభిరామ వినర వేమ!

భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు[మార్చు]

భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దాన హీనుఁ జూచి ధనము నవ్వు
కదన భీతుఁ జూచి కాలుఁడు నవ్వును
విశ్వదాభిరామ వినురవేమ!

భూమిలోనఁ బుట్టు భూభార మెల్లను[మార్చు]

భూమిలోనఁ బుట్టు భూభార మెల్లను
తనువులోనఁ బుట్టు దత్వమెల్ల
శ్రమములోనఁ బుట్టు సర్వంబుఁ దానౌను
విశ్వదాభిరామ వినర వేమ!

భూమిలోనఁ బుణ్యపురుషులు లేకున్న[మార్చు]

భూమిలోనఁ బుణ్యపురుషులు లేకున్న
జగములేలనిల్చు సమయుఁగాక
నంత దఱచుదొరక రాడ నాడనెగాని
విశ్వదాభిరామ వినర వేమ!వేమన పద్యాలు
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |