వేమన పద్యాలు ఓ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని[మార్చు]

ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని
భావ మిచ్చి మెచ్చు పరమ లుబ్ధు
పంది బురద మెచ్చుఁ బన్నీరు మెచ్చునా?
విశ్వదాభిరామ వినర వేమ!

ఓగుబాగెఱుఁగని యుత్తమూఢజనంబు[మార్చు]

ఓగుబాగెఱుఁగని యుత్తమూఢజనంబు
లిలను ధీ జనముల నెంచుటెల్ల
కరినిజూచి కుక్క మొఱిగిన సామ్యమౌ
విశ్వదాభిరామ వినర వేమ!

ఓజమాలుపొలతి యోలిమాడలు చేటు[మార్చు]

ఓజమాలుపొలతి యోలిమాడలు చేటు
పోటికెడలుబంటు కూటి చేటు
పనికిమాలినతొత్తు బత్తెంబు చేటురా
విశ్వదాభిరామ వినర వేమ!వేమన పద్యాలు
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |