Jump to content

వేటూరివారి పీఠికలు - రెండవభాగము

వికీసోర్స్ నుండి
(వేటూరివారి పీఠికలు/రెండవభాగము నుండి మళ్ళించబడింది)


శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి సంపూర్ణ గ్రంథావళి

125వ జయంతి ప్రచురణలు

సుభద్రాకళ్యాణము




పరిష్కర్త

శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి



ప్రచురణ

శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠం

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి

2012

SUBHADRA KALYANAM

By Thallapaka Thimmakka.


T.T.D. Religious Publications Series No.

@ All Rights Reserved

2012

Copies : 1000

Price.Rs...............

Published by

Sri L.V. Subrahmanyam,I.A.S.,

Executive Officer,

Tirumala Tirupati Devasthanams,

Tirupati -517 501

D.T.P. SVPSVP., T.T.D. Tirupati.




Printed at

Tirumala Tirupati Devasthanams, Press.

Tirupati.

సుభద్రాకళ్యాణము


తాళ్లపాక తిమ్మక్క





పరిష్కర్త

శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి



ప్రచురణ

శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠం

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి

2012


శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి సంపూర్ణగ్రంథావళి


125వ జయంతి ప్రచురణలు


వేటూరివారి పీఠికలు

రెండోభాగము



గ్రంథకర్త

శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి




ప్రచురణ

శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠం

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి

2012


శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారి సంపూర్ణగ్రంథావళి


125వ జయంతి ప్రచురణలు


వేటూరివారి పీఠికలు

రెండోభాగము



గ్రంథకర్త

శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి




ప్రచురణ

శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠం

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి

2012

VETURIVARI PEETHIKALU

By Sri Veturi Prabhakara Sastri


T.T.D. Religious Publications Series No.


© All Rights Reserved

2012

Copies 1000

Price.Rs...............

Published by


Sri L.V. Subrahmanyam,I.A.S.,

Executive Officer,

Tirumala Tirupati Devasthanams,

Tirupati -517 501

D.T.P. SVPSVP., T.T.D. Tirupati.




Printed at

Tirumala Tirupati Devasthanams, Press.

Tirupati.

ఓం నమో వేంకటేశాయ

ముందుమాట

ఎల్.వి. సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్.

-2012

కార్యనిర్వహణాధికారి,

తి.తి.దేవస్థానములు,

తిరుపతి.

శ్రీ వేటూరిప్రభాకరశాస్త్రిగారు జగద్విఖ్యాత శతావధానులగు శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారి శిష్యరికంలో సంస్కృతాంధ్ర సాహిత్యాలను అభ్యసించారు. అపారమైన పాండిత్యాన్ని సంపాదించి సుప్రసిద్ధ పండితునిగా, కవిగా, విమర్శకునిగా, పరిశోధకునిగా, బహుగ్రంథపరిష్కర్తగా ప్రసిద్ధిని పొందారు. మాస్టర్ సి.వి.వి గారి యోగసాధనలో సిద్దులై వారి యోగవిద్యతో వ్యాధిగ్రస్తులైనవారి నెందరినో రక్షించి వారికి ప్రాణభిక్ష పెట్టిన మహనీయులు. మహాతపస్వి.

శ్రీ శాస్త్రిగారు మొదట మదరాసులో తెలుగుపండితునిగా కొంతకాలం పనిచేశారు. పిమ్మట 1910 నుండి 1939 వరకు మద్రాసు ప్రభుత్వ ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారంలో తెలుగు పరిశోధక పండితపదవినలంకరించారు. ఆ 29 సం॥ల కాలంలో వారు పరిశోధకులకు పంటపొలాలన దగిన అముద్రిత గ్రంథ వివరణసూచికలు (Descriptive Catalogues ) 20 సంపుటాలు నిర్మించారు. శాస్త్రిగారు ఆ కాలంలో స్వయంగా 20కి పైగా ఉత్తమ గ్రంథాలను పరిష్కరించి పరిశోధనాత్మక పీఠికలతో ప్రచురించారు. తర్వాత తి.తి.దే., ఓరియంటల్ కళాశాలలో ఆచార్యులుగా పనిచేశారు. తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తన రాగిరేకులను పరిష్కరించి తొలిసారిగా వెలుగులోనికి తెచ్చిన వారు వీరే! అన్నమాచార్యోత్సవాలకు శ్రీకారం చుట్టినది వీరే. ఎంతోమంది శిష్యులను పండితులుగా తీర్చిదిద్దారు. వారికి జ్ఞానభిక్షను ప్రసాదించారు.

బహుముఖప్రజ్ఞాశాలి, ఉత్తమ పరిశోధకులు, ఆత్మదర్శనులు, నిరంతర యోగసాధకులు, కవి, రచయిత, శాసన పరిశోధకుడు అయిన శ్రీ ప్రభాకరశాస్త్రిగారి సాహిత్యకృషిని గుర్తించి తి.తి.దేవస్థాన యాజమాన్యం 2007వ సం॥లో శ్వేతభవనంలో "శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠాన్ని” స్థాపించి, వారు రచించిన ముద్రిత, అముద్రిత గ్రంథాలను తి.తి.దే ద్వారా ప్రచురించి ఆంధ్రసాహితీ లోకానికి అందించడానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఈ పీఠం "తెలుగుమెఱుగులు, మీగడతఱకలు, సింహావలోకనము, పూలవిందు, ప్రజ్ఞాప్రభాకరము - గురుపూజ, అన్నమాచార్యచరిత్ర పీఠిక, కేయూరబాహుచరిత్ర, వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయసూచిక” అనే గ్రంథాలను ప్రచురించింది.

ప్రస్తుతం ఫిబ్రవరి 7, 2013 వ తేదీన శ్రీ ప్రభాకరశాస్త్రిగారి 125వ జయంతి సందర్భంగా శాస్త్రిగారి "వేటూరివారి పీఠికలు" అనే గ్రంథము మహాభారతంలోని కథను ఆధారం చేసుకొని ద్విపద కావ్యంగా రచింపబడింది. తెలుగువారి పలుకుబళ్ళు, నుడికారాలతో నిండిన సుభద్రాకళ్యాణం పాడుకోవడానికి సులభంగా ఉండి ప్రజల్లో మిక్కిలి ప్రాచుర్యాన్ని పొందింది.

శ్రీ ప్రభాకరశాస్త్రిగారి 125వ జయంతి సందర్భంగా ఆవిష్కరింపబడుతున్న ఈ గ్రంథాన్ని సాహిత్యభాషాభిమానులందరు తప్పక పఠించి ఆదరించగలరని ఆశిస్తున్నాము.


(ఎల్.వి. సుబ్రహ్మణ్యం)

ఓం నమో వేంకటేశాయ

ముందుమాట

ఎల్.వి. సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్.

-2012

కార్యనిర్వహణాధికారి,

తి.తి.దేవస్థానములు,

తిరుపతి.

శ్రీ వేటూరిప్రభాకరశాస్త్రిగారు జగద్విఖ్యాత శతావధానులగు శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారి శిష్యరికంలో సంస్కృతాంధ్ర సాహిత్యములను అభ్యసించారు. అపారమైన పాండిత్యాన్ని సంపాదించి సుప్రసిద్ధ పండితునిగా, కవిగా, విమర్శకునిగా, పరిశోధకునిగా, బహుగ్రంథపరిష్కర్తగా ప్రసిద్ధిని పొందారు. మాస్టర్ సి.వి.వి గారి యోగసాధనలో సిద్దులై వారి యోగవిద్యతో వ్యాధిగ్రస్తులైనవారి నెందరినో రక్షించి వారికి ప్రాణభిక్ష పెట్టిన మహనీయులు. మహాతపస్వి.

శ్రీ శాస్త్రిగారు మొదట మదరాసులో తెలుగుపండితునిగా కొంతకాలం పనిచేశారు. పిమ్మట 1910 నుండి 1939 వరకు మద్రాసు ప్రభుత్వ ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారంలో తెలుగు పరిశోధక పండిత పదవినలంకరించారు. ఆ 29 సం॥ల కాలంలో వారు పరిశోధకులకు పంటపొలాలన దగిన అముద్రిత గ్రంథ వివరణసూచికలు (Descriptive Catalogues ) 20 సంపుటాలు నిర్మించారు. శాస్త్రిగారు ఆ కాలంలో స్వయంగా 20కి పైగా ఉత్తమ పరిశోధన గ్రంథాలు పరిష్కరించి ప్రచురించారు. తర్వాత తి.తి.దే., ఓరియంటల్ కళాశాలలో ఆచార్యులుగా పనిచేశారు. ఎంతోమంది శిష్యులను పండితులుగా తీర్చిదిద్దారు. వారికి జ్ఞానభిక్షను ప్రసాదించారు.

బహుముఖప్రజ్ఞాశాలి, ఉత్తమ పరిశోధకులు, ఆత్మదర్శనులు, నిరంతర యోగసాధకులు, కవి, రచయిత, శాసన పరిశోధకుడు అయిన శ్రీ ప్రభాకరశాస్త్రిగారి సాహిత్యకృషిని గుర్తించి తి.తి.దేవస్థాన యాజమాన్యం 2007వ సం||లో శ్వేతభవనంలో "శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠాన్ని” స్థాపించి, వారు రచించిన ముద్రిత, అముద్రిత గ్రంథాలను తి.తి.దే ద్వారా ప్రచురించి ఆంధ్రసాహితీ లోకానికి అందించడానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఈ పీఠం "తెలుగుమెఱుగులు, మీగడతఱకలు, సింహావలోకనము, పూలవిందు, ప్రజ్ఞాప్రభాకరము - గురుపూజ, అన్నమాచార్యచరిత్ర పీఠిక, కేయూరబాహుచరిత్ర, వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయసూచిక" అనే గ్రంథాలను ప్రచురించింది.

ప్రస్తుతం ఫిబ్రవరి 7, 2013 వ తేదీన శ్రీ ప్రభాకరశాస్త్రిగారి 125వ జయంతి సందర్భంగా శాస్త్రిగారి “వేటూరివారి పీఠికలు" అనే గ్రంథము 2వ సంపుటమును శ్రీ ప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠం ద్వారా తి.తి.దేవస్థానం ప్రచురించింది.

ఈ పీఠికా సంపుటంలో క్రీడాభిరామం, ఉత్తరహరివంశము, హరవిలాసం, గోవిందరామాయణము, వేంకటేశ్వరవచనములు, శృంగార సంకీర్తనములు, అన్నమాచార్య చరిత్ర, ఆంధ్రామరుకము, ధనుర్విద్యా విలాసము, సుభద్రాకళ్యాణము మొదలైన గ్రంథాల పీఠికలు, ఉపోద్ఘాతము, తొలిపలుకులు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ ఎంతో వైవిధ్యం కలిగిన రచనలు. ఇటువంటి శాస్త్రిగారి మహత్తర రచనలు సాహిత్య పరిశోధకులకు చక్కని మార్గదర్శకాలవుతాయి. సాహిత్య జిజ్ఞాసువులు ఈ పీఠికలను పఠించి మనోవికాసాన్ని పొందగలరు.

శ్రీ ప్రభాకరశాస్త్రిగారి 125వ జయంతి సందర్భంగా ఆవిష్కరింపబడుతున్న ఈ సంపుటములు సాహితీ ప్రియులకు, పరిశోధకులకు, సాహిత్య విద్యార్థినీ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతాయి. కనుక ఈ గ్రంథాలను సహృదయ పాఠకులందరు చదివి, చదివించి శాస్త్రిగారి సాహితీ సౌరభాలను పదిమందికి పంచిపెట్టగలరని ఆశిస్తున్నాను.


(ఎల్.వి. సుబ్రహ్మణ్యం)

మనవి

(మణిమంజరి ప్రచురణలో ఉన్నది. యథాతథం)

శ్రీ ప్రభాకర సంపూర్ణ గ్రంథావళిలో మూడవ కుసుమముగా “వేటూరి వారి పీఠికలు” (1910-1928 సం|| మధ్యకాలమునాటివి) మొదటి భాగముగా 1985లో వెలువడినది. ఇప్పుడీ గ్రంథము రెండవ భాగముగా 1929-1950 సం॥ల మధ్యకాలములో కూర్చిన పీఠికలన్నిటిని కూర్చుకొని వెలువడుచున్నది. ఈ రెండు సంపుటములలో శ్రీ ప్రభాకరుల పీఠికా రచనలన్నియు (మాకు లభ్యమైనంతవరకు) వెలువడినట్లే.

ఈ రెండు సంపుటములలోను శ్రీ ప్రభాకరులు ఇతర గ్రంథాలకు తాము కూర్చిన పీఠికలనే (సమీక్షలు, అభిప్రాయాలతో సహా) కాలక్రమాన గ్రహించినాము. సృజనాత్మక గేయరచనలకు తాము కూర్చుకొన్నమున్నుడుల నిందు చేర్చలేదు. అట్టివి ఆయా సృజనాత్మకరచనలతో విడిగా వెలువడనున్నవి.

ఈ సంపుటమున దాదాపు 41 గ్రంథములకు శ్రీ శాస్త్రిగారు కూర్చిన పీఠిక లున్నవి. వీనిలో క్రీడాభిరామము మొదలుగా, ఆంధ్రకామందకము వరకు ప్రముఖ గ్రంథాలొక పదనెన్మిదింటికి (ప్రాచీనులవి. అర్వాచీనులవి వెరసి) ప్రభాకరులు కూర్చిన పీఠికలు ప్రసిద్ధము లున్నవి. తక్కినవి అర్వాచీనుల రచనలకు ప్రభాకరులందించిన అభిప్రాయములు మున్నుడులు, ఆశీస్సులు, అభినందనలు, ప్రశంసలు, సమీక్షలు మున్నగునవి ఉన్నవి.

పీఠికలు తొలిసంపుటము 345 పుటల గ్రంథము. ఈ రెండవ సంపుటము ఇంచుమించు 480 పుటల గ్రంథము. మొత్తము 800 పుటలకు పైపడిన ఈ గ్రంథము ఒక సంపుటముగా వెలువరించుట సాధ్యముకాక ఇట్లు రెండు సంపుటములలో నేటికి సంపూర్ణముగా వెలువరించుటైనది. శ్రీ ప్రభాకర సంపూర్ణ గ్రంథావళిలో పీఠికలకు సంబంధించిన సంపుటములివి రెండును సంపన్నములైనవి. ఇట్లే శ్రీవారి రూపక రచనలన్నియు సంపూర్ణముగా వెలువడినవి. తక్కినవానిలో చాటు పద్యమణిమంజరి సంకలనము పెంపుచెందిన క్రొత్త కూర్పు నేటికి రెండు సంపుటములు మాత్రమే వెలువడినది. అవి మరి రెండు మూడు సంపుటములలో సంపన్నము కావలసియున్నవి. శ్రీ ప్రభాకరుల వ్యాసపరంపరలో నేటికి వ్యాసమంజరి ఒక సంపుటము వెలువడినవి. 'వ్యాస ప్రభాకరము' అను మరియొక సంపుటము తొలికూర్పును మాకు తోడ్పాటు నందించు సుహృద్భావముతో హైదరాబాదు ఆంధ్రసారస్వతపరిషత్తువారు ఇటీవలనే ప్రకటించినారు. ఇవికాక ఇట్టివి మరి రెండుమూడు సంపుటములు వెలువడిన గాని శ్రీ శాస్త్రిగారి వచన (వ్యాస) రచనలిన్నయు సంపూర్ణ గ్రంథావళి కెక్కినట్లు కాదు. వాని కూర్పునకు, ప్రచురణకును యత్నములు సాగుచున్నవి. ఇవికాక వారి పద్యకృలతులు, గాలికబుర్లు, సామెతలు, మార్జినల్ నోట్సు, లేఖలు, సంపాదిత పరిష్కృత గ్రంథములు వగైరాలు మరికొన్ని కూర్పు నందుకొని వెలువడవలసి యున్నవి. ఈ పనులన్నియు ముగిసిననాడు గాని శ్రీ ప్రభాకర సంపూర్ణ గ్రంథావళి ప్రకటనము సుసంపన్నము కాజాలదు. దీనికి వ్యయప్రయాసలధికము కావలయును. ఇప్పటికి ఇంచుమించు ఇరవై సంపుటములు వెలువడినవి. మరి యిరువదింటికి పైగా వెలువడవలసినవి కలవు. ఈ దిక్కున పరిశోధన సాగినకొలది ప్రచురింపవలసిన గ్రంథముల సంఖ్య పెరుగుచుండుట, గ్రంథసామగ్రిని విశ్లేషించుటలోను కూర్చుటలోను సమయము కావలయుట, ఈ రంగమున శ్రమించు పరిశోధకులకును, గ్రంథసంపాదకులకును వ్యవధి చాలకపోవుట, ప్రెస్సుల జాప్యము, ఆర్ధిక లోపము వంటి కారణములచేత అనుకొన్నవన్నియు అనుకొన్నంత తేలికగా వేళకు నిర్వాహము చెందకున్నవి. అచిరకాలములో ఈ ఇక్కట్లు కడచి లక్ష్యము నెరవేరునని భావింతుము. నేషనల్ ఆర్కైవ్సు వారి నుండి 1986-89 సం॥లలో లభించిన ఆర్థికసహకారము ఈ లక్ష్యసాధనలో మాకు ఎంతో తోడ్పిడినది. అది వలసినంతగా, వరుసగా మరికొంతకాలము నిలువక సాగివచ్చుననియు, ట్రస్టు వారి ప్రభాకర సంపూర్ణ గ్రంథావళి ప్రకటన లక్ష్యము నెరవేరు ననియు ఆశింతుము.

గ్రంథములను అచ్చుకు దెచ్చుట ఒక యెత్తు, వానినమ్మి సొమ్ము రాబట్టుకొనుట ఇంకొకయెత్తు. గ్రంథాలయ సంస్థలవారు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వములవారు గ్రంథముల కొనుగోలు విషయమున మరికొంత ఉదారముగా వ్యవహరించినచో గ్రంథములు చెల్లుబడియగును. అట్లు వచ్చు రాబడిని పెట్టుబడి పెట్టి ట్రస్టు లక్ష్యముల నెరవేర్చుట కనుకూలపడును. అట్టియదను అచిరకాలములో కలుగునుగాకని కోరుదము.

ఈ పీఠికల సంపుటములలో చేరదగిన ప్రభాకరుల రచనలను పెక్కింటిని ట్రస్టువారే కూర్చి యుంచిరి. మరికొన్నింటిని అభిప్రాయాదులను మా మిత్రులు డా॥ ముదివేడు ప్రభాకరరావుగారు సేకరించి పంపిరి. వారు పంపిన వానిని ప్రచురణాది వివరముతో మేమట్లే స్వీకరించితిమి. శ్రమకోర్చి వానిని శ్రద్ధతో అచ్చునకు సిద్ధముగా వ్రాసి పంపినందుకు వారికి మా కృతజ్ఞతలు. మా దృష్టికి రాని యిట్టి రచనలు మరికొన్ని యుండవచ్చును. అట్టి వానిని పాఠకులు గుర్తించి తెలిపినచో మలి ముద్రణమున కృతజ్ఞతతో స్వీకరింపగలము.

మా కోర్కెను మన్నించి ఉభయ భాషలలోను గ్రంథప్రశంస లందించిన విమర్శవిశారదులు శ్రీ॥ హెచ్. రాజేంద్రప్రసాద్ (ఛీఫ్ పోస్టు మాస్టర్ జనరల్, హైదరాబాదు) గారికిని, డా॥ అక్కిరాజు రమాపతిరావు (డిప్యూటీడైరెక్టర్, తెలుగు అకాడమీ, హైదరాబాదు) గారికిని కృతజ్ఞతాభి వందనము లర్పించుచున్నాము.

శ్రీ ప్రభాకర సంపూర్ణ గ్రంథావళిలో నీ పీఠికా సంపుటము సంపన్నమగుటకు తోడ్పడినవారి కందరికిని ధన్యవాదము లర్పించుచున్నాము. ప్రత్యేకముగా తిరుమల తిరుపతి దేవస్థానమువారి సౌహార్ధము నీ సందర్భమున కొనియాడుచున్నాము. అచ్చు కూర్పున శ్రద్ధ వహించి ఈ సంపుటమున కీ రూపునిచ్చిన యస్వీ ప్రింటర్సు హైదరాబాదువారి నభినందించుచున్నాము.


ఇట్లు

వేటూరి ఆనందమూర్తి

సంపాదకుడు.

సర్వంకషమనీష

(మణిమంజరి ప్రచురణలో ఉన్నది. యథాతథం)

డా॥ అక్కిరాజు రమాపతిరావు

శ్రీ శాస్త్రిగారు ఆత్మదర్శనులు. సర్వతోముఖమైన పాండిత్యం వారిది. ఏదైనా ఒక విషయం చెప్పటాని కుపక్రమించినప్పుడు కొత్తకోణం ఒకటైనా చూపించటమూ కొత్తదైన ఆవిష్కారాన్ని ఒకటైనా ప్రతిపాదించటమూ వారు చేసుకున్న ప్రతిజ్ఞ. ఇది ఎంతోకష్ట సాధ్యమైన విషయం. అయినా ఈ ప్రతిన వారి విషయంలో అవితథంగా సాగింది. ఆధునిక తెలుగు సాహిత్యంలో వ్యాఖ్య, సమీక్ష, విమర్శ, కావ్య విషమఘట్ట అర్థతాత్పర్య నిర్ణయం, సాహిత్యచరిత్ర, కవికాలాది, కర్తృత్వ వినిర్ణయాది విషయాలలో వారి మాట ఘంటాపథం. మత, చారిత్రక, సాంస్కృతిక, పురాతత్వ, ఆలయశిల్ప విజ్ఞాన ఆధారస్థ సమీచీన సమన్వయంలో వారి ప్రతిభ మేరలేనిది. ప్రజ్ఞా చక్షువు అనే మాట వారికి అన్నివిధాలా అనువర్తిస్తుంది.

అంతర్ముఖ సమారాధ్యత ఆయన చిత్తవృత్తి. ఏదైనా ఒక విషమఘట్టం, సమన్వయం కాని సమస్య ఎదురవుతే దాని సమాధానాన్ని వారు నిమీలిత నేత్రులై అంతఃకరణం ద్వారా ఆవిష్కరించేవారు, అని వారిని సన్నిహితంగా ఎరిగున్న పరిశోధనప్రవణులు, అంతరంగకోటిలోని వారూ చెప్పుతున్నారు. ఈ విధంగా వారు ఎన్నో ప్రతిపాదనలు చేశారు. అవి సాహిత్య చరిత్ర పురాతత్త్వ అపరిష్కృత, అసమన్వయీకృత విషయాలను నిర్ణయించటానికి తోడ్పడ్డాయి.

శాస్త్రిగారి వచన రచన 'లలిత విస్తరం'. వారి సూత్రఫక్కిక 'ప్రజ్ఞాపారమితం.' 'నన్నయది పురాణశయ్య. తిక్కనది కావ్యశయ్య. నన్నయ భారతభాష నాగమ సూత్రస్మృతి భాషనుగా భావించుచో దిక్కన భాషను గాళిదాస కావ్యభాషనుగా బరిగణింపవచ్చును. నన్నయ దొక ఋషిమార్గము. తిక్కనదొక రసమార్గము' ఇత్యాది వారి సాహిత్య దర్శనం తరువాత కాలంలో సుప్రసిద్ధ విమర్శకులకు ఆనంద చక్షురున్మీలితం చేసింది. విశ్వనాథవారు కల్పవృక్షకావ్యావతారికలో 'ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి, తిక్కన్న శిల్పపు తెనుగుతోట' అని శాస్త్రిగారి దర్శనాన్నే అనువదించారు. ఆయన స్వయంగా కవి. పండితుడు. భాషాతత్త్వ జిజ్ఞాసి. కొత్తపాతల మేలు కలయికను బాగా ఆకళించుకొన్నవారు. మానవ స్వభావాన్ని అచ్చస్వచ్ఛ హృదయంతో అర్థం చేసుకొన్నవారు. సంప్రదాయ మార్గంలో అభ్యుదయగామి. అభ్యుదయ పథంలో సంప్రదాయ నిర్మాత. తెలుగుభాషా సాహిత్యాలకు సంబంధించి ఆయనంత పరిశోధించినవారు సమకాలికులలో వేరొకరు లేరనే చెప్పవచ్చు. జనజీవనాన్ని వారు ఒప్పరికించలేదు. జానపద విజ్ఞానాన్ని చిన్నచూపు చూడలేదు. బాలభాష నుంచి బ్రహ్మ విద్య వరకు మానవ జీవిత సమాహార పరమార్థం వారికి హృద్యం. కరుణార్ద్రమైన, కృతజ్ఞతా సౌగంథ్య బంధురమైన వారి వ్యక్తిత్వం వారి రచన లన్నిటా ఉదాత్త మధురంగా కనపడుతూనే ఉంటుంది.

శ్రీ శాస్త్రిగారు తమ ఇరవై ఏళ్ళ వయసుననే సాహిత్య కృషి ప్రారంభించారు. అరవై ఏళ్ళ వయసు వరకు నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నారు. మధ్యకాలంలో కొంత ఉదాసీనత కలిగినా, ఈ సాహిత్యం, సమాజబాధ్యత, పరమార్థ కృషికి దోహదకారులా అన్న విచికిత్స వారికి కలిగినా, మద్రాసు నుంచి తిరుపతిలో ప్రాచ్య పరిశోధన సంస్థ పండితులుగా కుదురుకొన్న తర్వాత శ్రీ వేంకటేశ్వర వాఙ్మయ ప్రకాశన కృషిలో చరితార్థమైన ఉపకారం చేశారు తెలుగువారికి శ్రీ శాస్త్రిగారు.

ఈ పీఠికా సంకలనంలో ఐదు శతాబ్దుల తెలుగు సాహిత్య క్రమ పరిణామ వికాసం కనపడుతుంది. శ్రీనాథుడి క్రీడాభిరామం మొదలుకొని దుర్భాక రాజశేఖర శతావధానిగారి రాణాప్రతాప చరిత్ర వరకు శాస్త్రిగారి ఒరగల్లు తెలుగు సాహిత్యంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను సమీక్షించింది. విలువ కట్టింది. రత్నాలను కృత్రిమ రత్నాలను వెంటనే పోల్చుకోగల సాహిత్య ఆపణికులు శాస్త్రిగారు. ఈ సంకలనంలో వారి లేఖిని నుంచి వెలువడినవి సమీక్షలైతేనేమి, పీఠికలైతేనేమి, అభిప్రాయాలైతేనేమి, ప్రోత్సాహవాక్యాలైతేనేమి మొత్తం 41 రచనలు చోటుచేసుకున్నాయి. ఈ రచనలలోని వైవిధ్యం ఎంతో హృద్యం. శ్రీ శాస్త్రిగారు పూనుకొని వెలువరించకపోయినట్లైతే తెలుగు వారికి క్రీడాభిరామం కనుమరుగైపోయేదే. కాకతీయుల చరిత్రకు సంబంధించినవీ, భాషా సాహిత్యాలకు సంబంధించినవీ అయిన ఎన్నో అపూర్వమైన విషయాలు దక్కకుండా పోయేవి. అన్నమాచార్య చరిత్రకు శ్రీ ప్రభాకరశాస్త్రిగారు కూర్చిన పీఠిక యీ సంకలనంలో అన్ని రచనలకన్నా ఎక్కువ పెద్దది. ఆ తర్వాత పెద్దరచన ఈ క్రీడాభిరామ పీఠికే. క్రీడాభిరామం ప్రచురించేనాటికి శ్రీ శాస్త్రిగారి వయసు నలభై సంవత్సరాలు మాత్రమే. అయితే అప్పటికే 'తెలుగుసాహిత్యాన్ని అంతా చుళుకించిన అగస్త్యులా ఏమి శాస్త్రిగారు' అన్నంత అబ్బురపాటు కలుగుతుంది ఈ పీఠిక చదివిన వారికి. ఈ గ్రంథాన్ని పరిష్కరించడం ప్రకటించడం మరొకరికి మరొకరికి సాధ్యమయ్యేపనికాదు. దీని కాధారమైన ఒకేఒక తాళపత్రప్రతి లభించింది. అదికూడ చాలదోష భూయిష్ఠం. అనన్వితం. అంతేకాక వివాదాస్పద గ్రంథ కర్తృకం. ఇటువంటి గ్రంథాన్ని పరిష్కరించి ప్రకటించారు శాస్త్రిగారు. 'తునాతునకలై దురుద్ధరమయియున్న తంజావూరి తాళపత్ర ప్రతిని బరిశోధించి గ్రంథపాతములను దప్పులను బెక్కింటిని నేను జక్కబరచుకొని యుంటిని. నా దగ్గరనున్న పాఠములు పోయెనేని యిక నీ గ్రంథమును సరిపరచుట శక్యము కాదనియే నా నమ్మకము. తంజావూరి తాళపత్రప్రతి ముక్కలు ముక్కలై మిక్కిలి రూపుచెడియున్నదిగాన దానినిబట్టి యిక దత్తత్పాఠములనుద్ధరింప గుదురదు. ప్రత్యంతర మింతవరకెక్కడను దొరకలేదు.” అన్నారు వారు. శ్రీనాథుడి ఇతర కృతులాధారంగా చేసుకొని క్రీడాభిరామం శ్రీనాథుడి కృతమే అని స్థాపించారు శాస్త్రిగారు. ఈ పరిశ్రమ అత్యంతాద్భుతావహమూ ఆహ్లాదజనకమూ కూడానని ఈ పీఠిక చదివిన వారికి తెలుస్తుంది. శ్రీనాథుడి రచనాశైలికి ప్రయోగవైచిత్రికిక ఆకరమైన సంస్కృత మహా కావ్యాల నుంచి నాటకాల నుంచి అంతరత సాక్ష్యం చూపిస్తూ క్రీడాభిరామం తప్పక శ్రీనాథుడిదేనని నిరూపించారు. కాశీఖండం, భీమఖండం, హరవిలాసం, శివరాత్రి మాహాత్మ్యం, నైషధాల నుంచి శ్రీనాథుడి పలుకుబళ్ళను చూపి క్రీడాభిరామం శ్రీనాథుడిది కాదనటానికి వల్లకాదని నిష్కర్షించారు శాస్త్రిగారు. శ్రీనాథుడికి సాతవాహన సప్తశతి మీద ప్రీతిగదా! ఆ మూలప్రాకృత సప్తశతిలోని గాథా వర్ణనలను శ్రీనాథుడు క్రీడాభిరామంలో ఏవిధంగా అనుకరించిందీ చూపారు శాస్త్రిగారు. ఇటువంటి అశ్లీల రచనను శ్రీనాథుడి వంటి మహాకవి, మహాపండితుడు ఆమోదిస్తాడా అన్న దానికి సంస్కృత సాహిత్యం నుంచి, ప్రాకృత సాహిత్యం నుంచి తగిన ఉపపత్తులు చూపారు. శ్రీనాథుడి కవిసార్వభౌమతకు ఆయన నిరంకుశత్వమూ, నవ ప్రియత్వమూ కారణాలుగా చూపారు. అతివేల శృంగారాన్నీ ముమ్మాటికీ అశ్లీమైన వర్ణనలను ఉదాహరించటానికి శాస్త్రిగారు పొందిన సంకోచం, మనస్విత మెచ్చదగినవి. కాని, ఆభాసవిమర్శకులు చేసిన విమర్శలను దృష్టిలో ఉంచుకొని శ్రీనాథుడి చాటువులుగా పరిగణితములయ్యేవాటి నెన్నిటినో ఈ పీఠికలో వారుదాహరించారు. కామవల్లీ మహాలక్ష్మి పేరుతో పిలువబడే కామేశ్వరికథను కూర్చారు. ఓరుగల్లు విశేషాలను తెలియజేస్తూ ఆనాటి సాంఘిక చరిత్రనంతా విశదంగా తెలియజేశారు. శ్రీనాథుడి ప్రయోగాలను ఆయన అర్వాచీనులైన మహాకవుల అవే ప్రయోగాలతో తైపారువేసి చూపారు. క్రీడాభిరామంలోని కొన్ని పదాలకు ప్రయోగాంతర సాధనాలతో అర్థాలు చెప్పారు. శ్రీ శాస్త్రిగారి సౌజన్యము, మనస్విత ఎటువంటివంటే అంతకుపూర్వం ఇరవై ఏళ్ళ కిందట శ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారు క్రీడాభిరామాన్ని ప్రకటించిన విషయం ప్రస్తావిస్తూ “వారి యనుజ్ఞగొనియే నేనీ గ్రంథమును సంస్కరించి యుపోద్ఘాతము వ్రాసి యచ్చునకిచ్చితిని" అన్నారు. శ్రీనాథుడి కవితా వైభవ 'సర్వస్వ' రచనగా ఈ పీఠిక అనుసంధానితమైంది. ఇంతేకాకుండా కాకతీయుల ఇలవేలుపైన కాకతమ్మనుగూర్చి కొన్ని పదాల అర్థాలను గూర్చీ ప్రశస్తమైన అనుబంధం చేర్చారు శాస్త్రిగారు. ఇప్పుడీపీఠికా సంకలన ప్రకటన కర్తలై, తండ్రికి తగిన తనయులు ఆచార్య ఆనందమూర్తిగారు ఒక అనుబంధం కూర్చారు. ఇందులో క్రీడాభిరామ ప్రకటనానంతరం కర్తృత్వాన్ని గూర్చీ, శబ్దార్థాలను గూర్చీ వచ్చిన విమర్శలను సమీక్షించి సిద్ధాంత న్యాయం చేశారు శ్రీ ఆనందమూర్తిగారు. కాకతమ్మను గూర్చి ఈ అనుబంధంలో కొత్త విషయాలు ఉటంకించారు. ఏకవీరాదేవి ఆరాధన కొంకణదేశంలోనూ ఉన్నట్లు సి.డి. దేశముఖరి స్వీయచరిత్రలో ఉంది. మాహురగ్రామం మహారాష్ట్రంలో నెలకొని ఉన్నది కాబట్టి మహారాష్ట్ర వీరగాథలు, జానపద గాథాసాహిత్యం ద్వారా కాకతమ్మ, ఏకవీరులకు సంబంధించిన కొత్త సంగతులేవైనా తెలుస్తాయేమో పరిశీలించవలసిందిగా సాంఘిక సాహిత్య చరిత్రకారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. పీఠికా సంకలనంలో క్రీడాభిరామాన్ని గూర్చిన శ్రీ శాస్త్రిగారి పీఠిక వెలకట్టరానిది. మౌలికమైన మహాప్రాతిభమైన కృషి కాబట్టి దీనినిగూర్చి కొంత విపులంగా ఇక్కడ ప్రసక్తం చేయటం జరిగింది.

పూజ్యపాదులు శ్రీ ప్రభాకరశాస్త్రిగారి ఈ పీఠికల సంకలనంలో మూడు వంతులు శ్రీ వేంకటేశ్వరస్వామి సాహిత్యం, మూడు వంతులు ప్రాచీన కావ్య ప్రబంధ దేశి సాహిత్య సమీక్షలతోపాటు మూడు వంతులు ఆధునిక సాహిత్య అనుశీలనం కనపడటం విశేషం. వారిది సమగ్రమైన మూర్తిమంతం. పూర్ణయోగం. అందువల్ల దేనినిగూర్చి సంభావించినా అట్టుపుట్టానవాళ్ళతో సహా పాఠకులకు తెలియజేస్తారు. చిన్న అభిప్రాయం, లఘు సమీక్ష అయినా పర్యాప్తంగా ఉంటుంది. వారి అభిప్రాయాన్ని ఆశించిన వారికీ, తరవాత దానిని అవలోకించిన వారికీ కూడా తృప్తికరంగా ఉంటుంది. అహమిక, మమకారం, స్వీయమతాభినివేశం, పట్టుదల, ప్రాగ్ నిర్ణయం కనపడవు వారు ఏవిషయాన్ని ప్రస్తావిస్తున్నా. ఈ పదం అర్థం ఇది కాబోలు, ఇంతవరకు ఈ విషయాన్ని నిర్ధారించగల ఆధారాలు లభించలేదు, ఈ ప్రయోగానికి ఇదమిత్థ నిర్ణయ సమర్థమైన ఆకరంలేదు, ఇత్యాదిగా పరమ సాధుసుందరంగా వారి ఆత్మీయ వచస్సు విరాజమానమవుతుంది. సాధారణంగా సంస్కృత పండితులకు సంప్రదాయ పరినిష్ఠిత విద్వద్వరేణ్యులకు గతకాలము మేలు అనే దృక్పథం ఉంటుంది. వ్యాకరణం పట్ల పూర్వ పూర్వకవి ప్రయోగ శిరోధార్యత పట్ల మొగ్గు ఉంటుంది. కాని, శ్రీ ప్రభాకరశాస్త్రుల వారికి సంస్కృత సాహిత్యం పట్ల ఎంత ప్రీతి ఉన్నదో ప్రాకృతం పట్ల అంత మమత్వమూ ఉన్నది. దేవాలయం శిల్పం పట్ల, ఆగమ శాస్త్రాల పట్ల ఎంత అభిరుచి ఉన్నదో పాటిదిబ్బలపైన, అక్షరాలు అరిగిపోయిన బండరాళ్ళపైన, పాడుపడ్డ గుళ్ళలోని పాతగిల్లిన శాసనాలపట్ల అంత ఆసక్తి ఉన్నది. నాటి ప్రజా జీవితాన్ని బాగా తెలుసుకొంటేనే కాని, సామాజిక సాంస్కృతికమైన పరిణామాలను నిరూపించలేమని వారి అభిప్రాయం. అదీ భాషా సాహిత్య పరిశోధనలో వారి తాదాత్మ్యం.

బాలసాహిత్యం విలువ ఎటువంటిదో పిల్లల వాచకపు పుస్తకాలు ఎట్లా ఉండాలో సుమారు డెబ్భై ఏళ్ళనాడే శ్రీ శాస్త్రిగారు చెప్పిన విషయాలు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తాయి. ఈనాడు సంఘంలో పసివయస్సుననే నేర్చుకొనే విషయాలు అర్ద్రభావ సంగతం కాకపోవడం, వాటిలో సృజనాత్మకోద్దీపన లేకపోవడం సాంస్కృతికమైన ప్రాతిపదికవికసనం బుడుత బుద్ధులలో చేకూర్చలేకపోవడం వారు ప్రస్తావించారు. “ఉన్నత కవితా వాహినికి బాల వాఙ్మయ మూటపట్టని చెప్పవచ్చును" అంటారు వారు.

ఇందులో నాచన సోముని ఉత్తరహరివంశానికి, శ్రీనాథుడి హరవిలాసానికి శ్రీ శాస్త్రిగారు కూర్చిన పీఠికలు పరిమాణంలో చిన్నవైనా గుణవత్తరాలు. నన్నయ భట్టారకుడి ధారాశుద్ధీ, తిక్కన భావగాంభీర్యం సోమనాథుడి కవితలో కనపడుతున్నా శయ్యాసౌభాగ్యం అతిమాత్రమై అర్ధసౌలభ్యం కొంతవరకు కొరవడిందని శ్రీ శాస్త్రిగారి వంటి మహావిద్వాంసులు మాత్రమే చెప్పగలరు. కవికాలాదికాన్ని గూర్చి పూర్వ హరివంశపు ఉనికి సంభావ్యతను గురించి అనేక విషయాలు చర్చించి నాచన సోముని కవితాగుణాన్ని సిద్ధాంతీకరించారు. 'ఆంధ్రకవులలో చిత్ర కవిత్వమును వెలయించిన వారిలో నీతడే ప్రథముడుగా గానవచ్చుచున్నా డన్న విషయాన్ని నిరూపించారు. హరవిలాసంలో శ్రీనాథుడు కాళిదాస కుమార సంభవాన్ని అనుకరించే సన్నివేశాలలో ఏవిధంగా 'పాడు' చేసిందీ 'పాడి' చేసిందీ హృద్యంగా వివరించారు. మూలాతిశాయి సౌందర్య సంపాదకములని కొన్ని ఘట్టాలు చూపారు. 'పై శ్లోకమునకు శ్రీనాథుని తెలుగు పద్యము సరియయినదికాదు' 'నన్నయ భట్టారక పద్యానుకరణోత్సహమున శ్రీనాథుడు కాళిదాస శ్లోకరసభావౌచిత్యానుశీలనమును మరచినాడు' అన్నారు. "అధ్వాన ' పదాన్ని గురించి శ్రీ శాస్త్రిగారు చేసిన చర్చ వారి సర్వతోముఖవిద్వత్తకు తారకాణగా నడిచింది. "కర్ణాటమున బంపకవి విక్రమార్జున విజయములో 'అధ్వాన పదపరిశ్రమ శ్రాంత' యని ప్రయోగమున్నది. తన్ముద్రాపకు లాయధ్వాన పదమును మార్గార్థముగా గ్రహించిరి. మార్గమని, మార్గమనియేని యర్ధముగల సంస్కృత శబ్దమని, అధ్వశబ్దపు దత్సమ రూపమనియేని గ్రహించినను శ్రీనాథుని 'యధ్వానపుంబట్టు' సమర్దితమగును. వ్రాతప్రతి పాఠము పరిగ్రాహ్యమే కావచ్చును. కాని తెల్గుననిక నెక్కడను నీ 'యధ్వానము' నాకు గానరాలేదు” అన్నారు వారు. దీనిని బట్టి వారి అపారపాండితీ పరిశ్రమను పోల్చుకోవచ్చు 'కోహళి' అని పదం అర్ధం గూర్చి చర్చిస్తూ ఈ పదప్రయోగం శ్రీనాథుడూ, నాచన సోమన మాత్రమే చేశారనీ మురారినాటక శ్లోకభాగం దీనికి మూలమనీ' సంస్కృతాంధ్రములలో నాకీ పదమింకెక్కడను గానరాలేదు' అనీ శ్రీ శాస్త్రుల వారు చెప్పారు. కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయ యక్షగానానికి మధుర కవితలు అనే పేరుతో పీఠిక వ్రాస్తూ తెలుగు సాహిత్యంలో యక్షగానాల స్థానాన్నీ, దేశి సాహిత్య ప్రశస్తినీ గూర్చి అపూర్వ హృద్యమైన విషయాలెన్నో తెలిపారు. “దేశి రచనలలో నుండి సింగి, సింగడు, కోణంగి, దరువు అనునవి నటీనటులుగను, విదూషకుడుగను, ధ్రువగను సంస్కృత నాటకముల జేరెనేమోయని కూడ యోజింపదగి యున్నట్టున్నది." అని పురా ద్రావిడ భాషల ప్రభావం సంస్కృతంపైన కూడా ప్రసరించకూడదా అనే విచికిత్సను భాషాశాస్త్రలవేత్తల పరిశోధనల కన్నా ముందుగానే శ్రీ శాస్త్రిగారు ప్రతిపాదించారు. ఇది వారి విశాలహృదయానికీ సత్యాన్వేషణకు నవీన దృక్పథ స్వాగతానికి తార్కాణం. గిడుగు సీతాపతిగారి భారతీశతకానికి ఉపోద్ఘాతం వ్రాస్తూ వ్యావహారికభాషా వాదాన్ని సర్వాత్మనా సమర్ధించారు శ్రీ శాస్త్రిగారు. మొయిలురాయబారము అనే శ్రీ త్రిపురాన వేంకటసూర్య ప్రసాదరావుగారి మేఘసందేశ గేయరూప ఆంధ్రీకృతిని సమీక్షిస్తూ మేఘదూతానికి “నూఱింటి దాక ననుకరణములు నిరువదింటి దాఁక వ్యాఖ్యలు వెలసినవి కాని, యా యనుకృతులేవియు దీనికి దీటు గాజాలకపోయెను. మేఘసందేశము జాతిరత్నమే, అనుకరణములెల్ల బోతరత్నములే” అని వివరిస్తూ “భారతీయుల యెల్ల భాషలలోను నింకనెన్నో ఖండాంతర భాషలలోను నిది పరివర్తితమై చిత్తరువులతో గూడ ముద్రితమై వెలసినది. మన దేశమున నే నెఱిగినంతలో నింతకుముం దిది వంగభాషలోను హిందీభాషలోను బద్యరూప పరివర్తనములతో జిత్రములతో ముద్రితమైనది” అని శ్రీ శాస్త్రి గారు సర్వభారతీయ భాషల ఆధునికతా పరిశీలనంలో కూడా అగ్రేసరంగా ఉన్న విషయం విదితం చేస్తున్నారు. ఉత్తమకవిత తత్త్వం ఏమిటో గోవింద రామాయణానికి (ఉత్తరకాండ అనువాదం) తొలిపలుకు రూపంగా ఆవిష్కరించారు శాస్త్రిగారు. శ్రీ వెంకటేశ్వరసాహిత్యానికి సంబంధించిన ఆరు రచనలున్నాయి ఈ సంకలనంలో. తాళ్ళపాక కవులను గూర్చిన సమగ్ర సమాచారం ఈ పీఠికా సంకలనం ద్వారా తెలుస్తుంది.

చిన్నయసూరిని స్మరిస్తూ లోకంలో ఒక్కొక్క పనికోసం ఒక్కొకరు జన్మిస్తారు అని శ్రీ దువ్వూరి వేంకటరమణశాస్త్రిగారు రమణీయంగా నివాళించారు. ఇదేవిధంగా తాళ్ళపాక కవులను గురించి ముఖ్యంగా సంకీర్తన సార్వభౌములైన అన్నమయ్యను గూర్చి శ్రీ ప్రభాకరశాస్త్రి గారు వెలయించిన చారిత్రక విశేషాలు, తిరుపతి దేవాలయంలోని తాళ్ళపాక అరనుంచి రాగిరేకుల సముద్ధరణం వారు ఈ ఘనకార్యంకోసం తిరుపతి చేరారేమో ననిపిస్తుంది. వేంకటేశ్వర వచనములు, శృంగార సంకీర్తనములు, వేంకటేశ్వర లఘుకృతులు, అన్నమాచార్య చరిత్ర, ఆంధ్రామరుకము, తాళ్ళపాక తిమ్మక్క సుభద్రాకళ్యాణము శ్రీ శాస్త్రిగారు తమ పీఠికలతో ప్రకటించారు. తాళ్ళపాక తిరువేంగళప్పకృత అమరు కాంధ్రీకరణానికి శ్రీ శాస్త్రిగారు వ్రాసిన పీఠిక పరిణామంలో చిన్నదే అయినా చాలా విలువైనది. "ఈ శతకశ్లోకములు నూఱును నేర్పరియగు చిత్రకారుడు చదివినచో నూఱు చిత్రములు చిత్రింపగలడు" అన్నారు వారు. అది ఇప్పుడు నిరూపితమైంది.

ధనుర్విద్యావిలాసమనే గ్రంథం కృష్ణమాచార్యుడనే కవి రచించాడు. ఇది మరీ ప్రాచీన గ్రంథం కాదు. కాని, వేటూరి వారు విపులమైన పీఠికతో వెలువరించిందాకా ఇందుకు సంబంధించిన మహత్తరమైన విషయాలెన్నో తెలుగు వారికి తెలియవు. ఈ గ్రంథ ప్రచురణలో వారి పరిశ్రమ చాలా అక్కజం గొలుపుతుంది. వారి వివిధ శాస్త్ర పాండిత్యం, సమన్వయ కౌశలం ఈ పీఠికలో అడుగడుగునా పొడకడుతుంది. సమకాలీన ఆంధ్రసాహిత్య ప్రపంచానికి శ్రీ శాస్త్రిగారిపట్ల ఉండే గౌరవ ప్రపత్తులు వారు అనేక ఆధునిక కావ్యాలకు కూర్చిన పీఠికలు, సమీక్షలు, పరిచయాలు, అభిప్రాయాలు వల్ల తెలుస్తున్నది. కవిరాజు శ్రీ పాదకృష్ణమూర్తి శాస్త్రిగారి శ్రీ కృష్ణ భారతం పై శ్రీ శాస్త్రిగారు వెలువరించిన అభిప్రాయం ఈ సంకలనంలో ఉంది. అదే విధంగా ఆకుండి వ్యాసమూర్తి శాస్త్రిగారి వ్యాసభారత నవనీతం గూర్చిన సమీక్ష కూడా ఉంది. చిదిరెమఠం వీరభద్రశర్మగారి శివపంచస్తవి, తుమ్మల సీతారామమూర్తిగారి ధర్మజ్యోతి, కరణం అశ్వత్థరావుగారి దండకరామాయణం, శుభ్రవేటి తిప్పాజోశ్యులుగారి వేదభూగోళం, మల్లంపల్లి వీరేశ్వర శర్మగారి కాంచీఖండం, బయిరెడ్డి సుబ్రహ్మణ్యంగారి గాంధీశతకం. నందిరాజు చలపతిరావుగారి మంగళగిరి మాహాత్మ్యం, కొండూరు వీరరాఘవాచార్యులుగారి శిల్పదర్శనం, ముదిగొండ నాగవీరేశ్వర కవిగారి శివపురాణం, ముదివర్తి కొండమాచార్యులుగారి ధర్మదీక్ష, బులుసు వేంకటేశ్వరులుగారి మహర్షి జీవితకథామృతం, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, మాదిరాజ విశ్వనాథరావు కవిద్వయ కృత విక్రమాంకదేవ చరిత పద్యానువాదం గూర్చి శ్రీ శాస్త్రిగారు వెలువరించిన సమీక్షలు అభిప్రాయాలు, ఆమోద ప్రోత్సాహాలు ఈ పీఠికా సంకలనంలో చేరాయి.

శ్రీ ప్రభాకరశాస్త్రిగారి మనస్విత, భావసౌకుమార్యం, సాధుప్రవృత్తి, దయాదాక్షిణ్య మాధుర్య హృదయ గాంభీర్యం, దుర్భాకరాజశేఖర శతావధానిగారి రాణాప్రతాప సింహ చరిత్రపై వారు వెలువరించిన సమీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఎల్లలెరుగని వారి ఔదార్యం ఈ సమీక్షలో ప్రతిపదసుందరంగా భాసించింది. గడియారం వేంకట శేషశాస్త్రిగారి శివభారతాన్ని గూర్చి కూడా శాస్త్రిగారు హృద్యమైన సౌశీల్య సుందరమైన అభిప్రాయం వెలువరించారు. ఇంకా వేదాంత దేశికుల వారి హంస సందేశానికి శ్రీమోచర్లవారి అనువాదం, మల్లంపల్లి మల్లికార్జున కవిగారి భోగేశ్వర మాహాత్మ్యం, శ్రీ వావిళ్ళ వేంకటేశ్వరశాస్త్రిగారి అభినందన సంపుటం బులుసు వేంకటరమణయ్యగారి కువలయానందసారాలకు వేటూరి వారి పీఠికలు, అభిప్రాయాలు ఈ పీఠికా సంకలనంలో చేరాయి . అన్నిటికన్నా విశేషం ద్రావిడ వేదమైన నాలాయిరంలో గోదాదేవి విరచిత మొదటి ముఫ్ఫైపాశురాలను “తిరుప్పావై” అంటారు. ఇందులో పదిపాశురాల ఆంధ్రానువాదం మాత్రమే శ్రీనివాస గురుని రచన లభించగా తక్కిన ఇరవై యింటిని శ్రీ శాస్త్రిగారు పూర్తిచేసి సప్తపదులు అనే పుస్తక రూపాన ప్రకటించారు. ద్రవిడ భాషలో కూడా శ్రీ శాస్త్రిగారి లోతైన పరిశ్రమ ఎటువంటిదో ఈ సప్తపదులకు వారు కూర్చిన పీఠికను బట్టి తెలుస్తుంది. 'భగవద్గుణాను భవానంద పరవశమై యామె తన భర్త శ్రీ రంగనాథ స్వామియేనని వినోదించుచు లౌకిక రీతిచే నవివాహితగానే యాయుష్కాలము గడిపి యుండవచ్చును” అని ఆముక్త మాల్యదా శ్రీ రంగనాథుల అనుబంధాన్ని శ్రీ శాస్త్రిగారు కొత్తరీతిన వ్యాఖ్యానించారు. ఇది వారి ఆధునిక స్వతంత్ర హేతువాద భావ ధోరణిని సూచిస్తున్నది. ఆంధ్ర కామందకమనే నీతిశాస్త్ర సంకలనాన్ని పరిష్కరించి ప్రకటిస్తూ విలువైన పీఠికను కూర్చారు వారు. ఇటువంటి పీఠికా సరస్వతికి ఒక పీఠికాపుష్పాన్ని సమర్పించే అవకాశం కలిగించిన ఈ సంకలన ప్రకాశకులైన ఆచార్య వేటూరి ఆనందమూర్తి గారికి కృతజ్ఞుణ్ణి. శ్రీ ప్రభాకరశాస్త్రిగారి సారస్వత మూర్తికి నమస్కారము.


అక్కిరాజు రమాపతిరావు

హైదరాబాదు

4-5-1990

PATH-BREAKER AND A TREND-SETTER

PRABHAKARA SASTRI

H.Rajendra Prasad

Chief post Master general

Andhra Pradesh

Hyderabad-500001

The depth and extent of influence exerted on the contemporary Telugu literary criticism and research by Sri Veturi Prabhakara Sastry will perhaps never be determined with any degree of exactitude, Nor because we, the modern- day beneficieries of his indefatigable labours are sensitive to or unaware of the invaluable legacy of scholarship bequeathed by him. In fact, the pioneering skills and near - total mastery demonstrated by Prabhakara Sastry in the twin - spheres of literary criticism and research are generally so well recohnised that we, at times, tend to actually take them for granted. It has been noted that men are apt to quote from Shakespeare and the Bible, more by instinct and as a matter of routine habit, without any particular awareness of the origins of the source of such quotations - an abiding evidence of universal and continuing validity of these never - known-to-fail sources themselves! So it is, one imagines, with Prabhakara Sastry. He strode the world of modern Telugu literary criticism in the manner of a gaint, path - breaker and a trend-setter who evolved his own ground - rules and ranged freely, with distinct authority, over his chosen fields, for other lesser of less - gifted men merely to emulate and obey. And none of the many critics and researchers who came after him could claim to be free of the wholesome and utilitarian critical influences emanating from his tireless labours and astounding scholar ship. Such claims, if made, would probably look scarcely less. than pretentious! Prabhakara Sastry's unremitting efforts served to lightup, repeatedly, many little-known or obscure nooks of our immense literary treasures and brought to light as many unknown or neglected nuggets of Telugu literary heritage.

Prabhakara Sastry pursued his tasks and prodigious labours over a span of four decades. His efforts were for the most part single-handed. They came also at a time when such undertakings were largely unassisted and unencouraged by any but the most perfunctory sponsorships and patronage, depending almost entirely on the personal munificence of local rulers of princes with a flair for the literary, the exploratory or the artistic. And although the avenues for explorations were vast, the aids and methodology for such questings were vastly considerably less than what we have got accustomed to in our own times. A direct consequence of situations so unpropitious as these was that the success and effectiveness of a scholar and researcher depended wholly on his personals tenacity and - importantly - on the calibre of his mental processes and the clarity of his thought. Such, however, was the intellectual stature of Prabhakara Sastry, and such the unflagging brilliance of his mind and thought, that he converted every lack of organised and institutional patronage into a shining route to informed artistic-literary quest. It might in truth take a long time before the full import or beneficiant impact of Prabhakara Sastry's untiring exertions and amazing scholarship are fully realised and assessed by the grateful successor - generations of scholars and researchers.

The varied (and often voluminous) writings of Prabhakara Sastry were published in different journals over a period of three decades. Many of those journals are extinct, and those which have not ceased publication are difficuly now to get (the old numbers) by. Some of his writings were not published at all. Consequently, sizeable portions of his critical output may well have been lost, if determined efforts were not made to retrieve, collect and publish them afresh. Fortunately for all who value excellence of human thought and greatness in literature, Manimanjari Publications, decided to undertake the laudable venture of publishing the complete works of Prabhakara Sastry. So far 20 Books have been published. As part of that venture Prabhakara Sastry's critical introductions to classics have all been compiled in two volumes. The first volume in the series, covering the years 1914 - 1928, comprising sixteen pieces of his writing on subjects as diverse as drama, history, poetry, puranas and some miscellaneous compilations, besides selected prefaces and interpretative essays, were published a few years ago (1955). The Current Volume, the second in the series. consists of Sri Sastry's published and unpublished writings during 1928-1950.

Any discussion of the multi-sided accomplishments of Prabhakara Sastry would seem to automarically necessitate an early mention of the many celebrated prefaces flowing from his prolific pen at variors points of time during his illustrious career. These were often long and elaborately-sculpted pieces of pure brilliance. The prefaces of Prabhakara Sastry - like those of Bernard Shaw- in themselves constitute an impressive subgenre of creative writing. Often employed to "introduce" to the lay reader a long-forgotten or barely- rememberred literaty composition, and often quite the longer than the original work so sought to be introduced, these prefaces, inevitably, were pieces of distilled wisdom and discernment. Interestingly, Arudra, one of our brightest literaty personages, referring to these prefaces, observed: "Not Shaw am I, nor a Prabhakara Sastry..." While many of his numerous prefaces are deservedly famous. It is also interesting. and rare, that a whole new play be triggered by any one of them. But such a rare thing did indeed happen when, inspired by Prabhakara Sastry's preface to "Basava Puranam" Viswanatha Satyanarayana, the doyen among modern poet- play wrights, was moved to write his famous play, "Trisulam"

"Kreedabhiramamu" had been regarded as the legendary work of Vallabharaya. This view regarding its authorship had found wide acceptance until Prabhakara Sastry propunded a contrary- view that the author of this dramatic poem was indeed none other than Sreenatha, and not his patron as had been believed for a long time. The close analysis and critical scrutiny employed to examine the stylistic peculiarities of the work (besides its syntax, imagery, structure and the idiom) and the inferences drawn from such exercise, bespeak of the originality and sharpness, the eclecticism as well as the exploratory side of Prabhakara Sastry's critical prowess.

With considerable effort and equal tenacity, this extraordinary scholar collected, then delineated - and thereby eventually succeeded in propagating many a fine specimen of folk-compositions and children's songs. All this contributed meaningfully to the great acceptability attained by this genus of popular literature. "Mugdha Madhura Vangmayamu" is a valuable place of perceptive writing pertainging to this category. Nachana Somana was not one of the determined and dedicated of scholars. His best-known work, "Uttara Hari Vamsamu" is a long and complex poem. Prabhakara Sastri not merely edited the difficult poem with competence and discemment but also provided an illuminating commentary on it the sureness and deft manner in which he proceeds to 'dete' the author and his work with the aid of many fascinating literary and historical insights is truly remarkable. Quite another milestone in the same mould is his impeccably-crafted preface to Sreenatha's "Hara Vilasamu". Indeed it may be safely asserted that no more authoritative and scrupulously-composed critcal study of Sreenatha and his works was ever attempted by anyone then what was written by Prabhakara Sastry with such telling success.

It is not commonly realised that the contribution of Telugu poets to the grown and development of ’Yaksha-Gana' was quite considerable. Prabhakara Sastry's analysis and elucidation of "Sugreeva Vijayamu" represents his esteem for and deep understanding of the Yaksha-Gana, genre of popular art which flourished in large parts of south Indea, including the Andhra desa. He was also a firm supporter of the idea that Telugu language should be liberated from the shackles of pedantic and artificial constraints and be invested with the naturalness of the spoken word. In this respect, he was an ally of man like Gurajada Appa Rao, Gidugu Rama murti and J.A. Yates all of whom strove hard and long to try and invest Telugu litererary language with conversational ease and fluidity, and divesting it of excessively scholarly of stilted cramps. A sample of his views and concerns in the area of language-i.e form is found in his introduction to "Bharati Satakamu" included in the volume. It bears close and repetitive reading for its and clear-headed thoughts lucid exposition.

It would somehow seem as if Prabhakara Sastry had come to develop and entertain steady and mystically repetitive connections with the Lord of Tirupathi : five of the pieces in the volume pertain directly of obliquely to the dominant deity of Andhra Desa, Venkateswara. Prabhakara Sastry's pioneering

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse