వృక్షశాస్త్రము/మదనగింజల కుటుంబము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పూతకి:- గుబురు మొక్క ఆకులు బల్లెపాకారము మూడు పెద్ద యీనెలున్నవి. ఆకుల కడుగువైపున రోమములు గలవు. కణువుపుచ్చములున్నవి.


మదనగింజల కుటుంబము.


ఈ కుటుంబములో గుల్మములును గుబురు మొక్కలును గలవు. ఆకులు ఒంతరి చేరిక, లఘు పత్రములు, సమాంచలము, కొన్నిటికి గణుపు పుచ్చములున్నవి. పుష్పములు మిధునములు, సరాళము, రక్షక పత్రములు 5 ఉండును. కొన్నిటిలో నివి అడుగున కలిసి యున్నవి. మొగ్గలో అల్లుకొని యుండును. ఆకర్షణ పత్రములు 5; కొన్నిటిలో మాత్రము 4 రక్షక పత్రములు, 4 ఆకర్షణ పత్రములు, గలుగు చున్నవి. ఆకర్షణ పత్రములు వృంతాశ్రితములు ఇవి మెలివెట్టి నట్లుండును. కింజల్కములు ఆకర్షణ పత్రములన్ని యుండును. గొడ్డు కింజల్కములు కూడ గలవు. కింజల్కముల మధ్యనైదు గ్రంధి కోశములున్నవి. అండాశయములో 3.....5. గదులుండును. కీలములు 3....5 గింజలపై పొర తరచుగా రెక్కల వలె వెడల్పై యుండును.

మదనగింజలు:- మొక్కలను హిందూస్థానము నందెక్కువగా బెంచు చున్నారు. ఈ మొక్కయు నన్నిపైరుల వ లెనె కాయలుగాయగానె ఎండిపోవును. దాని గింజలను, గింలనుండి తీసిన చమురును ఔషధములలో వాడుదురు. ఇవి రెండును, అన్నిరకముల మూత్ర వ్వాధులకును బని చేయును. మరియు పుండ్లకు గాని నొప్పులకు గాని పట్టు వేసిన దగ్గును.

అడవిగోరింట: ఒక్కయు చిన్నదియె. ఇది పడమటి కనుమల ప్రాంతముల ఎక్కువగా బెరుగు చున్నది. దీని కొమ్మలను నీళ్ళలోనుడక బెట్టి ఆ కషాయములో గొన్ని మందులు కలిపి జిగట విరేచనములు, అజీర్ణము, ఉబ్బు జబ్బులకు నిత్తురు.

ఆసుపత్రులందు శస్త్రములు చేయు నప్పుడు నొప్పి పెట్టకుండ రాచెడు కొకేను ఈ కుటుంబములోని యొక మొక్క ఆకుల నుండి చేయుచున్నారు. ఆ మొక్కలు మన దేశములో నొకటి రెండు చోట్లనే పెంచు చున్నారు కాని ద్రవము తీయుట కు బై దేశములకే పంపు చున్నారు.


పల్లేరు కుటుంబము.


ఈ కుటుంబపు మొక్కలు మన దేశములో నంతగా లేవు. దీనిలో గుల్మములు, గుబురు మొక్కలేగాని పెద్ద చెట్లు లేవు. ఆకులు అభిముఖము చేరిక, ఒంటరి చేరిక, కూడ గలదు. వీనికి కణుపు పుచ్చములున్నవి. కొన్నిటిలో నివి ముం