వృక్షశాస్త్రము/తేయాకు కుటుంబము
99
వు. ఇది సదా పచ్చగానుండి ఇంపుగొలుపు చున్నది. ఇది సంవత్సరము పొడవున పుష్పించును. పువ్వులకు మనోహరమగు వాసన గలదు. కృష్ణుడు గోపికా వస్త్రముల నపహరించి దీనిపై నెక్కెనని చెప్పుట చేత మనకాదరణీయము నైనది. దీని గింజలనుండి చమురు తీసి కొన్ని చోట్ల నౌషధముగ నుపయోగించు చున్నారు. అది కీళ్ళు నెప్పులు, పుండ్లు మొదలగు జబ్బులకు పైన రాసినచో గుణమిచ్చునందురు. దీని కలపయు బాగుగనే యుండును. పెట్టెలు, కుర్చీలు, తెరచాప కొయ్యలు, పనిముట్లు మొదలగునవి చేయుటకు బనికి వచ్చును.
- నాగకేసరము
- .... చెట్టు కూడ మిగుల అందముగా నుండును. ఆకులు అభిముఖ చేరిక. కురుచ తొడిమ, బల్లెపాకారము. పువ్వులు పెద్దవి. తెల్లగా నుండును. దీని వాసనయు మనోహరముగుగ నుండును.
తేయాకు కుటుంబము.
తేయాకు కుటుంబము చిన్నది. దీనిలో నన్నియు గుబురు మొక్కలు. ఆకులు ఒంటరి చేరిక, లఘు పత్రములు, పువ్వులు పెద్దవి. వానికి చేటికి లుండును. రక్షక పత్రములు, ఆకర్షణ పత్రములు అయిదేసి యుండును గాని నాలుగు మొదలు తొమ్మిదింటి వరకు గూడ గలుగు చుండును. ఇవిమొగ్గలో
100
నల్లుకొనినట్లయినను మెలిమెట్టినట్లయినను ఉండును. కింజల్కములు చాల గలవు. అండకోశము ఉచ్చము. దానిలో...దులు మూడు మొదలు అయిదు వరకు నుండును.
తేయాకు.
తేయాకు:.... మొట్టమొదట ఇంగ్లీషు వారికి చీనా దేశమునుండి ఎగుమతి యగుచుండెను. కాని కొంత కాలము జరిగిన పిమ్మట అచ్చట నుండి వచ్చుటకు కొన్నియిబ్బందులు వచ్చెను. తేయాకు ఒకచీనా దేశములోనె పెరుగు చుండుటవ 101
న గలుగు కష్ణమును బోతొట్టుటకు మన దేసమునందు గూడ ఆమొక్కలను బెంపవలసినది మొదట, ఈస్టిండియా కంపెని వారు గవర్నరు జనరలగు వారను హేస్టింగునకు దెలియ జేసిరి. కాని అప్పుడెందు చేతనో అశ్రద్ధయయ్యెను. బెంటింగు ప్రభువు వచ్చిన తరువాత తేయాకు పైన శ్రద్ధ హెచ్చెను. చీనా దేశమునకు గొందరును బంపి, మొక్కలను, గింజలను దీని సంగతెరిగిన యా దేశస్తుల గొందరును రప్పించి హిమాలయ పర్వత ముల వద్దను, అస్సాములోను దాని నాటించెను. ఈ లోపుననే అస్సాములో తేయాకు మొక్క పెరుగు చున్నట్లు కాన వచ్చెను. దాని సంగతి తెలియ జేయవసయునని ప్రభుయ్వము వారు కొందరిని నియోగించిరికాని, వారిలో వారికి యభిప్రాయ భేదము రాగ నేసంగతియు జాల కాలము వరకు దేల లేదు. తరువాత ఈ మొక్కల యాకును బాగుండుట గని దీనిని పైరు చేయ గవర్నమెంటు వారంగీకరించిరి. కాని కొంత కాలమైన తరువాత యా వ్యాపారమంతయు నమ్మిచేసిరి. దీని మూలమున గవర్నమెంటు వారికి చాల ధనము వ్వయమై యుండ వచ్చును. కాని తేయాకు మూలమున, నదివరకు నేవ్వయములో లేని అయుదు లక్షల యెకరము లిప్పుడు వ్యవసాయములో నున్నవి, 600,000 మంది జనులకు ఉద్యోగములు గలిగినవి. ఇప్పుడు తేయాకు మీద పెట్టుబడి 300,000,000 రూపాయలు. 102
తేయాకు మొక్క నుండి మనకు గావలసినది లేత యాకులే. సంవత్సరము పొడవున లేత యాకు దొరకుట దుర్ఘటమే కాని సాధ్యమైనంత వరకు అది చాల వచ్చునట్లు జూడవలెను. తేయాకును మొట్టమొదట పైరు చేసి నపుడు కొందరు హిమాలయ పర్వతముల మీద బాగుగ బెరుగు ననియు కొందరు అస్సాములో బాగుబ పెరుగు ననియు చెప్పుచు వచ్చిరి. కాని నిజమైన సంగతి, యా మొక్కలు యన్ని చోట్లను బెరుగ గలదు. దానికి విస్తారము శీతలమ క్కరలేదు. ఉష్ణమును అంతగా కూడదు. తరచుగా వర్షములు మాత్రముండ వలెను. నేలయు సాధారణముగ నుండవలెను గాని మిక్కిలి గట్టిగ నున్నచో వేళ్లు బారుట సులభము గాదు కనుక, అట్టి చోట్ల బెరుగలేదు. నేలలో విస్థారముగ తేమ నుండ రాదు. నీరింకుచు సార వంతముగనున్న నేలలేవైన పనికి వచ్చును. ఎండకు నెండి పగులుచు, నీరింకనీయని నేలలు బొత్తుగా పనికి రావు.
తేయాకు మొక్కలను గింజలు పాతియే పైరు చేయుదురు. కొమ్మలు పాతి పెంప జూచిరి గాని, అవి వేళ్ళు బారి పెరుగుట కష్టమయ్యెను. దీని విత్తనములకై, కొన్ని చెట్ల యాకులను కోయక వానినెదుగ నిత్తురు. అవి ముప్పది నలుబది 103
అడుగులెత్తు వరకు గూడ బెరుగును. వాని కాయలు పెద్ద వగుటకు సంవత్సరము పట్టును. విత్తనములను, నాలుగైదు అడుగుల వెడల్పున మళ్ళు చేసి ఎరువేసి, అరడుగు దూరమున బాతెదరు. అది వరకచ్చోట చెట్లుండినచో వాని మొదళ్ళను బూర్తిగ లాగి వేయవలెను. రాళ్ళున్నచో వానిని త్రవ్వి వేయవలెను. అదివరకక్కడ తేయాకు మొక్కలే మొలచి నచో నెరువు బాగుగ వేయ వలయును. ఆరు మాసములో సంవత్సరమో ఈ మళ్ళలో నున్న తరువాత వానిని దీసి పొలములో బాతుదురు. పాతు నప్పుడు ఒక దాని కొకటి నాలుగడుగుల కంటె దగ్గర గానుండుట గాని, అయిదడుగుల కంటె దూరముగా నుండుట గాని మంచిది గాదు. ఇట్లు పాతిన యెడల ఇంచుమించు ఎకరమునకు 2,000 మొక్కలు పట్టును. ఇప్పుడు చాల చోట్ల త్రిభుజాకారముగను నాలుగున్నర అడుగుల దూరమునను బాతు చున్నారు. చేలలో నీ దూరములను మొక్కలు పాత వలసిన చోట్లను యానవాళ్ళు పెట్టుకొనిన తరువాత గోతులు తీసి మళ్ళలో నుండి చిన్న మొక్కలను దెచ్చి పాతవలెను. వానిని దెచ్చునపుడడుగున కొంత మట్టితో గూడ దీసికొని రావలెను. తల్లివేరెటైనను వంగి యున్నచో దానిని వంగిన చోటగోసివేయుటమంచిది. పిల్ల వేళ్ళను విప్పారియున్న వానిని దగ్గిరగా దీసికొని రారాదు. మరియు నవి మళ్ళ 104
లో నెంతలోతుననున్నవో యంత లోతుననే పాతవలెను. ఎక్కువ లోతుగ బాతినచో మొక్కకు హాని వచ్చును. పైకిబాతిన యెడల వేళ్ళుపైపైననే యుండి చచ్చి పోవుట తటస్థించును. వీనిని పాతగనే వర్షముకురిసెనా , చేయవలసిన పని వాని చుట్టు గడ్ది మొక్కలను లేకుండ జూచుటయే. ఒకవేళ వర్షము కురియకున్నచో నీరు పోయవలెను. వీనికి నీటి యాధారము బాగుగ నుండ వలెను. చేలలో ముప్పది నలుబది యడుగుల దూరమున మూడడుగులు లోతు గల కాలువలుండవలెను.
తరువాత, తేయాకు మొక్కలను గత్తిరించుట మిక్కిలి జాగరూకతతోజేయవలెను. హిందూస్థానము నందు మార్గశిరము, పాల్గుణ మాసముల మధ్య కత్తిరించు చుందురు. గాని దక్షిణ దేశమునందట్టి నియమిత కాలము లేదు. మొక్క లెదుగని కాలములో గత్తిరించుట మంచిది. ఏడాది మళ్ళలో బెరిగిన మొక్కలను చేనులో నాటిన నొక నెలకును, ఆరునెలలలో బెరిగిన దానిని ఆరునెలలకు గత్తిరించ వలెను. అస్సాము తేయాకును ఆరంగుళముల ఎత్తులోపునను మణిపూరు తేయాకును ఎనిమి దంగుళముల ఎత్తులోపలను గత్తరింపరాదు. ఆ దుబ్బు నుండి మూడు నాలుగు కొమ్మలు బయలు 105
దేరును. వానిని రెండేండ్ల వరకు కత్తిరింప కూడదు. మూడవ యేట పదునాలుగో పదునెనిమిదియో అంగుళము లెత్తు పయిన గత్తిరింతురు. అటు పిమ్మట ప్రతి సంవత్సరము నిరుడు కత్తిరించిన దాని కొకటి రెండంగుళము లెత్తుగా గత్తిరించ వలెను. బహుశః లేత చిగుళ్ళంత కంతకు తగ్గిపోవుచుండును. అప్పుడు మరల మొక్కను 12, 15 అంగుళముల ఎత్తుపైన గత్తిరింప వలసి వచ్చును. బాగుగా నెదుగవని తోచిన కొమ్మలను లాగి వేయుట మంచిది. నీరసముగా నుండి, నేల మీద పడియున్న వానీ త్రుంపి వేయవలయును. చచ్చిన కొమ్మల సలే యుండనీయ రాదు. గుబురు ప్రక్కనున్న కొమ్మలను మధ్యగా నున్న వానిని ఒకటే ఎత్తునకు గత్తిరించ వలెను. క్రొత్తగా నేర్పడిన దారువు రెండంగుళముల కంటె నెక్కువుండరాదు.
అట్లు కత్తిరించిన రెండు మూడు నెలల వరకు సుమారు తొమ్మిది అంగుళముల ఎత్తున క్రొత్త కొమ్మ లెదుగును. అప్పుడు వానిని త్రుంపుదురు. మధ్యనున్న కొమ్మమీద రెండాకులున్నప్పుడే త్రుంపుట నారంభింతురు. చివరనున్న రెండాకులులనే గోయుదురు. వానిని గోయుటకు ఆకులను పట్టుకొని లాగరు. మనకు కావలసినది లేత ఆకులును చిగుళ్ళును గా 106
వున కొమ్మ మీద నింకను లేతరెమ్మలు వచ్చునట్లు చూడవలెను. కావున ఆ రెండాకుల నుంచి బొటనివ్రేలు గోరుతో ఆ చిగురు త్రెంపి వేయుదురు. అట్లు చేయుటవలన, మిగిలిన యాకుల వద్ద నుంచి రెమ్మలు బయలు దేరును. మధ్య కొమ్మమీద నెంతయెత్తున నున్న యాకులను బెరికితిమో చుట్టు నున్న కొమ్మల మీద కూడ అంత యెత్తున నున్న వానినే బెరుకుట మంచిది. ఈ విధమున ఆరేడు మారులు కూడ చిగుళ్ళను త్రుంప వచ్చును. అట్లు త్రుంపుటలో పెద్ద యాకును నొక్కటయిన మిగిల్చి త్రుంపుట మంచిది.
మొక్కలను బాతిన మూడు నాలుగేండ్లలో ఆకంతగా రాదుగాని , ఆరవ యేటి నుండి అయిదు వందల పౌనులు ఆకు వచ్చును.
ఈ మొక్కలకు అరిష్టములును జాలకలవు. పురుగులు పట్టుచుండును. అవి వేసవి కాలమం దాకులరసము పీల్చివేయును. కొన్ని రకముల బూజు కూడ వీనిలో ప్రవేశించును. కొన్నిటిపై గంధకపు పొడియు, గొన్నిటిపై సున్నము, గంధకము కలిసి కాచిన నీరును చల్లుదురు. వాని వలన కొంచెము నయమగు చుండును. 107
చెట్టునుండి కోయగనే ఆకు కాచి త్రాగుటకు బనికి రాదు. పచ్చిగానున్నప్పుడు దాని యందు బసరువాసన తప్ప మరేమియు లేదు. దానిని సిద్ధము చేయుటకు తంతు చాల గలదు. అదంతయు గొంత కాలము వరకు జేచితోడనే చేయుచు వచ్చిరికాని, తరువాత తరువాత యంత్రములను గల్పించి వాని సహాయమున సులభముగా జేయుచున్నారు.
ఆకునుగోసి తేగానె చల్లని చోటను నెండ దగులని చోటను వానిని పలుచ పలుచగా నార బోతురు. ఆకు సాధారణముగ నిరువది గంటలలో వడలును,. ఇంతకంటె నెక్కువ కాల మట్లుంచిన యెడల మంచి వాసన పోవును. కాని యెక్కక్కప్పుడు అంత వడల కుండ నున్న యెడల మరి కొంత సేపట్లుంచవలయును. వడలిన యాకును దీసి యొక బల్లమీద వేసి యంత్రములు రాక పూర్వము చేతులతో రాసెడి వారు. ఆరాపిడి తగులుటవలన ఆకులోనున్నపసరు కొంచెము పైకి వచ్చును. ఎక్కువ రసము వచ్చిన కొలదిఘాటుటెక్కువ యగును. ఆకునకు గాలి సోకాగనే వాని యందు కొన్ని మార్పులు గలుగు చున్నవి. ఆకంచునందు గోథుమ వర్ణముగా నగును. ఆఆకును దీసి మిక్కిలి పరిశుభ్రముగను, చల్లగను తేమగ నున్న చీకటిగదులలో సంగతి సందర్భములను బట్టి రెండు మొదలు ఆరు గంటలవరకు బెట్టుదురు. అప్పటికి తే 1-8
యాకునకు సువాసన వచ్చును. అట్లెంత కాల ముంచ వలెనో కొంతెమనుభవ మున్న యడల ఆకును జూడగనే చెప్పవచ్చును.
తరువాత ఆకునంతయు దీసి వెచ్చబెట్టెదరు. ఇట్లు వెచ్చబెట్టుటకును యంత్రములు గలవు. మిక్కిలి వేడిగా నున్న గాలిని యాకులపై బారనిచ్చెదరు. ఆకు మూడు వంతులు తడి యారిన పిదప వేడిని తగ్గింతురు. అటు పిమ్మట దాని దీసి జెల్లెడవంటి దానిలో బోసి నొక్కుదురు. ఆకంతయు సమముగా తెగును. జల్లెడ కంతలు సన్నముగా నున్న యెడల ముక్కలును సన్నముగానే యుండును. ఆకును రకములవారిని నేర్పరచి పెట్టెలలో బెట్టి యంగళ్ళకు బంపుదురు. ఈ పెట్టెల కన్ని రకములు చెక్కలు పనికి రావు. కొన్ని చెక్కలకు సువాసనను తగ్గించును. వానిలోపల పలుచని సీసము రేకు వేయుట మంచిది. మరియు ఆ పెట్టెలకు మూత గట్టిగా నుండవలెను గాని లేనిచో గాలి బీల్చుకొని వాసన తగ్గును. తేయాకును జేయుటకు మరికొన్ని పద్ధతులు గలవు. కొన్నిచోట్ల ఆకును కోయగనే అరబోయక వెచ్చబెట్టుదురు. పైన చెప్పినదే మనదేశములో విశేషముగ నున్న పద్దితి.
ఆంగ్లేయ సంపర్కము తగిలిన యప్పటినుండి ఇంగిలీషు విద్య వ్యాపింప నారంభించి నప్పటినుండియు మనము 109
తేయాకు కషాయము త్రాగనేర్చితిమి. అది సువాసనగను పాలును పంచదారను గలుపుదుము గాన, రుచిగను నుండుట నిజమే. అది అప్పటికి చురుకును బుట్టించి నిద్దుర రాకుండ చేయును.
గుగ్గిలపు కుటుంబము:
గుగ్గిలపు చెట్లు మన దేశములో విరివిగానె పెరుగుచున్నవి.
- ఆకులు
- - లఘు పత్రములు. ఒంటరి చేరిక. అండాకారముగ నైన నిడివి చౌక పునాకారముగనైన యుండును. సమాంచలము. విషమరేఖ పత్రము. కొన, వాలము గలదు.
- పుష్పమంజరి
- ... కొమ్మలచివరలనుండి గాని, కణుపు సందుల నుండి గాని మధ్యారంభ మంజరులగు రెమ్మగెలలు, పుష్పములు ఉపవృంతములు మిక్కిలి పొట్టివి, పువ్వులు లేత పశుపు రంగు.
- పుష్పకోశము
- ... సంయుక్తము. గొట్టము పొట్టి. తమ్మెలు సన్నము. మొగ్గలో అల్లుకొనియుండును.
- దళవలయము
- ... అసంయుక్తము. 5. కొంచెము బల్లెపునాకారముగ నుండును. మంచి వాసనయే గలదు. వృంతాశ్రితము.
- కింజల్కములు
- ... ఏబది గలవు. పుప్పొడితిత్తులు రెండు గదులు. కింజల్కములు వృంతాశ్రితములు.
- అండకోశము
- ... అండాశయము ఉచ్చము 3 గదులు గలవు. ఒక్కొక్క దాని యందు రెండేసి యండము లున్నవి. కీలము పొట్టి. కీలాగ్రములు మూడు చీలికలు, కాయ ఎండి పగులును.