వివేకానందును ఉపన్యాసాలు-1

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కొలంబో[మార్చు]

నేను చేసిన ఈ అల్పకార్యం నాలో స్వతసిద్ధంగా ఉన్న శక్తివలన జరిగింది కాదు.ఈ నాప్రియతమం పరమ పవిత్రం అయిన భారత భూమినుండి వెడలి పాశ్చాత్య దేశాలలో నన్ను సదా అనుసరిస్తూ వచ్చిన ప్రొత్సాహ, అభిమాన కారణంగా జరిగిందే. ఈ పని వలన పాశ్చాత్యంలో కొంత మేలు జరిగిన మాట నిజమే! కానీ, దీని వలన విశేషంగా నాకే మేలు జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఇదివరకు బహుశా చిత్తోద్రేకం వలన కలిగిన అభిమానం ఇప్పుడు నిశ్చితాభిప్రాయం యొక్క స్థిరత్వాన్ని, ప్రామాణికం యొక్క పటుత్వాన్ని పొందింది.
గౌరవనీయుడైన అధ్యక్షుడు చెప్పినట్లే, ప్రతి హైందవుడు భావించే విధంగానే ఈ దేశం కురుక్షేత్రం, పుణ్యభూమి అని పూర్వం నుండి నేను కూడా భావిస్తన్నాను. ఈ నాడు ఇక్కడ నిలచి ఆ మాట నిజమని యదార్ధమైన నిశ్చితాభిప్రాయంతో, దృఢవిశ్వాసంతో చాటుతున్నాను. ధన్య పుణ్యభూమి ఈ లోకంలో ఏదైనా ఉంటే భగవత్సాంగత్యాన్ని సాధించటానికై యాత్ర్లలు చేస్తూ ఆ పరందామాన్ని పొందే సమయంలో చేరవలసిన స్థలం ఈ భుమిలో ఉంటే మానవ సంఘం సాధుశీలాన్నీ, పవిత్రతనూ, ఔదార్యాన్నీ, శాంతి జీవనాన్ని అలవరచుకోవడంలో పరమోన్నత మార్గాన్ని అందుకోజాలిన దివ్యక్షేత్రం ఎక్కడైనా ఉంటే, హృదయ పరిశీలనాన్ని పురికొల్పి సమున్నత ఆధ్యాత్మిక పీఠంపై చేర్చే మేలి సీమ ఎక్కడైనా ఉంటే అది మన భారత దేశమే. అంతే కాదు అన్నిటికంటే దివ్యదృష్టిని ఆధ్యాత్మిక పుష్టిని ఇచ్చే పుణ్యభూమి ఈ భారతదేశమని అనక తప్పదు. ఇక్కడ అతి పురాణకాలానుండి మహామత కర్తలు బయలుదేరారు. ఎన్నోసార్లు వారు ఈ భూలోకాన్నంతా నిర్మలం శాశ్వతం అయిన ఆద్యాత్మిక ధర్మప్రవాహ జలాలతో నింపి పవిత్రీకరించారు. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం ప్రపంచం మొత్తాన్ని ముంచి వేసిన వేదాంత సాగర తరంగ రాశి ఈ దేశం నుండే వెలువడింది. బౌతికం భవవద్విముఖం అయిన