వికీసోర్స్ చర్చ:కవిత్వము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కీర్తి శేషులు బ్రహ్మశ్రీ విస్సా వెంకట రావు గారు, తూర్పు గోదావరి జిల్లా, ఆలమూరు తాలూకా, పినపళ్ళ గ్రామ వాసులు, కో ఆపరేటివ్ బ్యాంకు కొత్తపేటలో పనిచేశారు, వీరు కవి, రచయిత, ఆకాశవాణి సమస్యాపూరణాల్లో వీరు పేరు అప్పటి శ్రోతలకు బాగా తెలుసు, వారి రచనల్లో మచ్చుకి కొన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి భావ పద్య సుమాలు 1) శ్రీ పురుషోత్తమా, సుగుణ శేఖర, సుందరరూప, మాధవా!

  పాపవిదూర, భక్త జన బాంధవ, ఆశ్రిత పారిజాత మా
  తాపసవందితా, నిఖిల దానవమర్ధన, లోకపావనా
  శ్రీ పరమాత్మ నిన్ పొగడ, సేవకుడెంతట వెంకటేశ్వరా!

2) ఆపద మొక్కులాడనుచు, అచ్యుతుడంచు, ననంతుడంచునిన్

  శ్రీపతి, శంఖచక్రధరు, శేష గిరీశ, నివాసుడంచుని 
  న్నాపయి, శ్రీనివాసుడని, యంబుజనాభుడు శేషతల్పుడన్
  బాపురే ఎన్నోనామముల భక్తులుకొల్తురు వేంకటేశ్వరా!

3) తాపసి, అబృగోత్తముడు, తన్నగ, నీదగు వక్షమందునన్

  సైపుచు నీవు నాయతికి, చల్లగపాదములొత్త లక్ష్మియున్
  సైపక, నల్గి, నిన్విడచి, చయ్యనచేరె ధరాతలంబుకున్
  తోపగలేక, భారమును తోడనెచేరితి వీపు దాత్రికిన్.

4) ఆకసరాజు పుత్రికను, అల్లన పెండిలియాడి, పద్మతో

 ప్రాకట వైభవంబొసగ, భక్తుల పాలిటి తోడునీడవై
 సాకుచునుంటివీవు, మము చల్లగ తిర్పతి తిర్మలేశ్వరా
 నీకెనసాటి దైవమిల నెవ్వరు మాకిక వెంకటేశ్వరా!!

5) కలియుగమందు, మానవులు కల్మషచిత్తులు, నీచకర్ములున్

 తెలియగలేరు దైవమును, తెల్వినిగోల్పడి యంచునీవిటుల్
 శిలవయి, వెల్గినావు, మము, సిగ్గిలజేయగ, వేంకటాద్రిపై
 అలుకనువీడి మాకునిక నండగనిల్చి శుభంభులీయవే!

6) పెండిలికోసమై, యలకుభేరుని,యొద్దనుచేసినట్టి యా

 మెండగు అప్పు భారమును మోయగజాలక, వడ్డి తీర్పగన్
 దండిగ వడ్డికాసులను, ధర్మమ, భక్తులనుండిచండ, నీ
 యండనె లక్ష్మియున్న యటులప్పుల భారము తప్పునే ప్రభూ!

7) జ్యోతిగనిల్చి లోకముకు, చూపవె వెల్గును జ్ఞానదాయివై

  ద్యోతక మౌనునీమహిమ, దుష్ట జనాళికి, భక్తకోటికిన్
  ఖ్యాతిని గాంచెడిన్, భరతఖండమ ఖండతపో ధరిత్రిగా
  జాతి, కహింసయున్ గరిపి, శాంతిన గూర్చెడి విశ్వదాత్రిగా!

8) సారవిహీనమైన భవసాగర మీదుట దుస్తరంబు, యే

  తీరుగ, జూతువోదయను, దీనపయోనిధి, వేంకటేశ్వరా!
  దారిని జూపుమయ్యనను దాసునిగాగొని, కావుమయ్య, నా
  భారము నీదెసుమ్మీ, ననుపాలనుముంచెదో నీటముంచెదో!

9) ఆపదలొందువేళ, నినునార్తశరణ్యడవంచు, నాపదల్

  బాపెడిదైవమంచు కడుభక్తిగ శక్తి కొలంది మ్రొక్కుచున్
  దాపుకువచ్చి వేడుకను దర్శన భాగ్యమునొంది నీకడన్
  ఆపదముడ్పులన్నిటిని, యర్పణజేతురు నీకునమ్రులై!

10) ఆకలిదప్పులన్ మరచి, యాస్తికులెందరో, యాత్మశాంతికై

   ప్రాకుచు, దొర్లుచున్ శ్రమకు బాల్పడి కొండలనెక్కి వచ్చి నీ
   వాకిట జేరినిల్చెదరు, వాపిరి గొంచును ధర్మనార్ధమై
   సాకెదవందరిన్, దయను, సంతసమొప్పగ వేంకటేశ్వరా!

11) కొండనుజేర, బస్సులను, కూర్చిరి, భక్తుల మేలుకోసమై

  ఎండకు వానకున్ వెరవ కెందరో భక్తులు పాదచారులై
  కొండకు వత్తురయ్య, తమ కోర్కెలు, తీరిన కారణంబునన్
  వెండియు, నీ కృపారసము వేడ్కను చిల్కవె భక్తకోటిపై!

12) దారి పొదుంగునన్

13) కొండల నేడు నెక్కి యటకొల్వునుదీర్చుట కోపమాప్రభూ

   గుండెలచేతబట్టుకొని గుప్పిట జీవములుంచి, నీపయిన్
   మెండగు భక్తితోజనులు మెల్లగవత్తురు కొండలెక్కి, నీ
   వండగనుండ, నేమిభయ, మార్త శరణ్యుడ వేంకటేశ్వరా!

14) బాధలనొందువేళ కడుభాగ్యులు పేదలు నొక్కటేగదా

   వేదనజెందుచున్ మదిని వేయివిధంబుల నిన్ను వేడగా
   బాధలబాపి వారలకు భద్రత కూర్చవె పిల్చినంతలో
   సాదరమొప్ప భక్తులను సాకెడు మా యిలవేల్పునీవేగా!!

15) పేదరికంబె 16) అల్పుడ నర్భకుండ నిను నర్చన జేయగ జాలనిష్టతో

   నిల్పితి నీదురూపమును నిర్మలనాహృది పీఠమందు నే
   సల్పెద నామమంత్రమును సన్నుతి జేతును నీదుకీర్తనల్
   కొల్చెద భక్తి పుష్పముల కోమల భావసుమంబులన్ ప్రభూ !!

17) కలియుగ 18) పాపులు దుష్టవర్తనులు పాతకులైనను నిన్ను కొల్వగా

   కోపంబూనకందరకు కూర్తువు నిశ్చల శాంతిభద్రతల్
   బాపురే నీదయారస మపారమనూహ్యము తెల్పశక్యమే
   పాపులనుద్దరించి కడుపావనమూర్తుల జేతువందరిన్.

20) పంకజనాభ నిన్ను మది భావనచేసి నుతింతు నెప్డు నా

   వంకకు జూడవేల విధివర్తనమో మరి భక్తిలోపమో
   వంకరులున్న చెర్కుగడ వాటముగా రుచినంద జేయదా
   శంకనుమాని నీ చరణసన్నిధి నిల్వ శరణ్య మీయవే !!

21) ఆపదలందు మున్గితేలియాడెడు భక్తులకున్ పరీక్ష యో

   కోపము నిన్నారతముకొల్చి భజించుట యేమి మాయయో
   తోపదు మామనంబులకు తొల్గవు భాదలవొక్క నాటికిన్
   మాపయి చూపవే కరుణ మాన్పవె మా పరితాపభారమున్!! 

22) కర్మలచేత కల్గునని కష్టము సౌఖ్యము పాపపుణ్యముల్

   మర్మమెరింగియున్ నరులు మానకచేతురు ఘోరపాపముల్
   దుర్గతులైయఘంబులను దుష్టపు కర్మలచేయనేల స
   త్కర్మలపూని జీవితమూ ధన్యత గాంచక వేంకటేశ్వరా!!

23) మున్ను గజెంద్రుడా మొసలి ముష్కర చర్యకు పాల్పడంగ మా

   పన్న శరణ్య దీనజన బాంధవ కేశవ కావుమంచునిన్
   సన్నుతిజేయగా కరిని చయ్యన కావగ లేద చక్రివై
   సన్నుతమూర్తి మోక్షమిడి సత్కృపతోడుత వేంకటేశ్వరా!!

24) పాపులు నీతిబాహ్యులకు భాగ్యముభోగములబ్బుటేలనో

   నీపయి భారముంచి కడునిష్టగ నిన్విడనాడకుండగా
   నీపద సన్నిధిన్ నిలిచి నిన్ భజియించెడి వారికేలనో
   చూపవుయెట్టి యోగ్యతలు చోద్యముకాక మరేమిసత్ప్రభూ!! 

25) జూదరి లంచగొండులును చోరులు జారులు తాగుబోతులు

   న్మాదులరీతి నిత్యము నమానుష చర్యలు సల్పుచుండగా 
   కాదనువారులేరు సరికట్టడిసేయగ నీ ఒకండవే
   నీదయలేనిచో నిలువనీడయే లేదిక భక్తకోటికిన్.
26) తాతల నాటినుండి నినుదల్పగ మాయిలవేల్పు తండ్రిగా
   మాతగ మమ్మునేలు మహిమాన్విత దాయక కల్పకంబుగా
   చేతుము పూజలన్ వ్రతముచేతుము నిత్యమఖండ పూజలన్
   నేతగనిల్చి మాకిడవే నిత్య శుభంబుల నీప్సితంబులన్.

28) సర్పమునోట జిక్కి తనచావు నెరుంగనికప్ప తానటన్

   దర్పముతోడ ఋర్వులను దండి భుజించెడి మాడ్కి కాలమున్
   సర్పము నోట జిక్కియును సంపద సౌఖ్యము కేలపుత్తురో
   తిర్పతివాస నిన్గొలిచి త్రుప్తిపొందక వేంకటేశ్వరా!!!

29) కోరగలేదు భూములను కోరను భూరియశస్సు భోగముల్

   కోరలేదు సౌఖ్యమును కోరను భౌతికతుచ్ఛసంపదల్
   తేరగనిత్తువంచు నిను తెల్సియు కోరనవేవియున్ ప్రభూ
   కూరిమి ని కృపామ్రుతము కూర్చినచాలు భవాబ్ది దాటగన్!

30) ధర్మము గానమెందు కలిదారుణ మారణ దుష్టశక్తులే

   మర్మమెరుంగ నేరని యమాయక జీవుల హింసపెట్టెడిన్
   నిర్మలచిత్తులన్ పరమనీచులకు న్నెరగాక యుండగా
   ధర్మమునుద్ధరించి మము ధన్యులజేయవే వేంకటేశ్వరా! 

31) కంటికి యింపుగా జగతికల్పనజేసి ముదంబుమీరగా

   నంటియునంటనట్లుగను ఆవలలోపల నుంటివంటతన్
   కంటికగోచరంబగుచు కామిని కాంచనదూత విర్వురన్
   గెంటితినీవు మాకడకు గెలవగా వాటి నిముక్తికోసమై!!

32) కాయము పాంచబౌతికము కర్మలు చేయగ నుద్భవించె నా

   కాయములో సమర్చితివి కాననిదొంగల నార్వురన్ సదా
   మాయకులో పడంగని మమ్ములన్నేడ్చును బాహ్యదృష్టికే
   మాయనుగెల్వగాతరమె మాకును నీకృపలేక యుండియున్!!
 
33) అంగటనన్నియున్న మరియల్లునినోట శనన్నసామెతన్

   అంగట వస్తువుల్ ధరలు ఆకశమంటె సధర్మపాలనన్
   బంగరుపండుదేశమున పాపముపండుచునుండెనేడు మా
   ముంగట విస్తరుంచి తిన మూతికి బీగమువేయధర్మమే!!

34) ఇంటను బైట తస్కరులు నీగతిమమ్ముల దోచుచుండగా

   కంటికినిద్రదోచకను కాయలు కాచెను శాంతికోసమై
   కంటిని ముక్కును మూసుకొని కాంచనియట్టుల మౌనమూనక
   తుంటరిమూకలన్ దునిమి తోడుగా నీడగ నిల్వుమో ప్రభూ!!

35) సంపదలున్నచో కలుగుసంకటముల్ పలు రోగభాధలన్

   పెంపును జేయు పాపముల పెంచును దుఃఖము కష్టనష్టముల్
   సంపదలెన్నియున్న యవి శాంతినిగూర్పగజాల వెన్నడున్ 
   సంపదకోసమై నెరపుసంధ్యలు పూజలు నిష్ఫలంబులే ! 

36) పుట్టుచుచచ్చుచున్ మరల పుట్టుచు గిట్టుట కంటె మానవుల్

   పుట్టుకలేకపోవుటది పుణ్యము మోక్షము కావునన్ ప్రభూ 
   పుట్టినదాది కష్టములపోరును బాధల నొందకుండ ఏ 
   పుట్టుకలేని భాగ్యమును పొందుగా గూర్చుము వేంకటేశ్వరా!

37) ప్రభువులు పండితుల్ పరమభాగావతో త్తములైనగాని తా

   విభవముతోడ సంపదల వేడుకమీర సుఖింత్రుగాక నీ 
   యభయముకోరుకున్న నవియన్నియు కల్లలు కల్పితంబులే 
   శుభములు నీపదార్చవలె సూరిజనావళికి ముక్తి మార్గముల్.

38) భక్తియెలేని పూజలవి పత్రికిచేటనిచెప్పు సామెతన్

   భక్తులు కామ్యసిద్ధికయి ప్రార్ధనపూజలు సల్పుచుందు రా 
   యుక్తిని నీవెరింగి పరమోన్నతిగూర్తువు వాంచితంబులన్
   ముక్తిని గోరకుండుతది మూర్ఖతకయేయగు వేంకటేశ్వరా!!

39) నీటను నానినట్టి యొకనిప్పులపెట్టెను యగ్గిపుల్లతో

   ధాటిగా గీసినన్ వెలిగి దర్శనమీయదు నిప్పురవ్వయున్ 
   కోటులజన్మలెత్తి తగ కూడగబెట్టిన దుష్టకర్మల 
   న్నీటనుమున్గి భక్తి మెయి నిన్ను తలంచిన మోక్షమబ్బునే !

40) ముక్తియు మోక్షమంచు తగముక్కునుమూసి జపించినంతనే

   దక్కునే ముక్తి మోక్షములు దక్కునె శాంతియొకింత యేని ఆ 
   శక్తిని వీడగావలయు సంపద సౌఖ్యములందు యన్నిటన్ 
   ముక్తి యనంగ నర్దమది మోహమువీడుట లోకవాంఛలన్!!! 

41) స్వార్ధపు చింతవీడి నిజశక్తిని మానవసేవ సల్పుచున్

   అర్ధము కామ మోహముల నన్ని జయించియు సత్వచిత్తుడై
   వ్యర్ధపు లొకవాసనల వాంఛల నెల్ల పరిత్యజించి మో
   క్షార్ధిగదైవచింతనల సల్పెడు భక్తులు ధన్యులేగదా!!

42) కన్నులు రెండు పాపులట కానగలేవట నీదు తేజమున్

   కన్నులు మూసిధ్యానమున కానగవచ్చని నీదురూపమున్
   సన్నుతి చేయుచుంటి జలజాతవిలోచన నాదుదృష్టికిన్
   తిన్నగదర్శనంబొసగి దీవెనలీగదె వేంకటేశ్వరా!!

43) పుట్టుకనిచ్చి పెంచి తగుపోషణకల్పన జేసినట్టి నీ

   పట్టున భక్తి యేర్పడెను భావమునందున నిన్ను నిల్పి నే 
   గుట్టుగ నెల్ల వేళలను కొల్చుచునుంటి మహానుభావ! నే 
   పట్టినపట్టు వీడనిక పంతముసేయక కానరాగాదే!!

44) అందముకెల్ల మూలమయి, ఆభరణంబులకన్న మిన్నయై

   విందును గూర్చెడిన్ కురుల వేడుకనిత్తురు మ్రొక్కుగానాటన్
   పొందుగభక్తి తత్పరత పూరుషులన్ మగువల్ వినమృలై
   అందునపుణ్యమేమొగద అర్పణచేయగ కుంతలమ్ములన్!!

45) ఆస్తియు పాస్తియున్ సకలయాభారణంబులు మాకు నీవెగా

   ఆస్తికులై సదాహృదిని అంకితమిచ్చుటగాక నీకు యే
   ఆస్తులునీయగాగలము అర్పణగానిక భక్తి యొక్కటే 
   ఆస్తియు మాకదన్ మిగిలె నారసిగైకొను, వేంకటేశ్వరా!

46) పిలచిన పల్కు దైవమువు పేదలపెన్నిది పారిజాతమా

   తలచినవెంట కోరికలు తప్పకతీర్తువు జాగుసేయకన్ 
   తెలివి యొకింత లేని మము తీరిచి దిద్దియనుగ్రహించి మా 
   కలుషములెల్ల బాపి కనికరము జూపవె వేంకటేశ్వరా!

47) చేసితి దానధర్మములు చేసితినేన్నియు తీర్థయాత్రలన్

   చేసితి పుణ్యకార్యముల జేసితి నెన్నియొ దైవపూజలన్ 
   చేసితి నన్ని చేతినొక చిల్లియు గావ్వాయు లేకపోయినన్ 
   చేసితినంటిగాని యవిచేసినదంతయు నీవెగా ప్రభూ!

48) దేహపుతుచ్ఛ సౌఖ్యముల దేలుచుమున్గుచు మోసపోకనా

   శ్రీహరినామమంత్రమును చిత్తమునన్ స్మరించుచున్ సదా 
   ఆహరి పాదపద్మముల నాశ్రయమొంది భజించువారికిన్
   శ్రీహరి మెచ్చినవారలకు శ్రీఘ్రమెనీయడె ముక్తి మోక్షముల్.

49) తప్పులుచేయ మాకుపని దండనచేయగ నీకు చెల్లు యే

  తప్పును చేయకుండ మముతండ్రిగ తీరిచి దిద్దకుండినన్
  తప్పులు నాచరించుటయె తప్పదు మాకిక జీవితాంతమే 
  మెప్పును చేయగా నొసగు మోర్మి వివేకము వేంకటేశ్వరా!

50) పాలలోవెన్నరీతిగను పక్వఫలంబుల తీపిమాదిరిన్

   పూలనుతావియున్ వివిధపుష్పములందున జుంటితేనియుల్ 
   మాలలోదారమున్ యడవిమానులనగ్నియు దాగినట్లుగా
   లీలగదోచు దైవమిల లేదనుమాత్రము తానేలేకయున్ !

51) వేంకటరావు నముడను వేంకటనాధు వరప్రసాదుడన్

   శంకలు లేనివాడ నతిసత్వుడ నిర్మలచిత్తుడన్ సదా 
   పంకజనాభునిన్ పరమభక్తి నికొల్చి తపించువాడ యే
   వంకకు పోనివాడ నిను వాకొను చుందుమూడు ప్రొద్దులన్!

52) తెల్లని వెల్ల పాలనెడి తెల్విని గల్గినవాడ ప్రేమతో

   నెల్లరసమ్మువాడ పరమేశ్వర గర్వములేనివాడ నే 
   కల్లలులేనివాడ కలికల్మష హీను డమాయకుండ నీ 
   చల్లని ప్రేమగోరు ససాత్ముడ భక్తుడసత్వచిత్తుడన్!

53) చదువగలేదు కావ్యముల శాస్త్రమూలన్ ప టియింపలేదు నే

   మొదలెయెరుంగ పద్యముల ముద్దుగా కోర్చువిధాన మెన్నడున్
   పదముల కూర్పునందు యతిప్రాసల దోషములున్నచో ననున్ 
   పదములరీతి పండితులు సాదరమొప్ప క్షమింపవేడెదన్!

54) మంగళ మోశుభాంగ జయమంగళమో ఇలవేల్పుదైవమా

   మంగళమమ్మపద్మ జయమంగళమో యలివేలుమంగకున్
   మంగళ మాత్మవాసునకు మంగళమో సకలార్థదాయికిన్
   మంగళమాదిదేవునకు మంగళదాయికి తిర్మలేసుకున్!   
-----------------------

శ్రీ పురుషోత్తమా, సుగుణ శేఖర, సుందరరూప, మాధవా!

  పాపవిదూర, భక్త జన బాంధవ, ఆశ్రిత పారిజాతమా
  తాపసవందితా, నిఖిల దానవ మర్ధన, లోకపావనా
  శ్రీ పరమాత్మ నిన్ పొగడ, సేవకుడెంతట వెంకటేశ్వరా!

పురుషులలో ఉత్తమమైన, సుగుణాలు కలిగిన, సుందర రూపం కల ఓ మాధవా! పాపాలు దూరంచేసే, భక్త జన బంధువా, ఆశ్రయించిన వారికి కోరికలు తీర్చే కల్పవృక్షమా తపస్సు చేయు మునుల వందనాలు స్వీకరించే వాడా, సకల రాక్షసులను సంహరించి లోకాలను పవిత్రం చేసేవాడా ఓ శ్రీ పరమాత్మా నిన్ను పొగడడానికి నీ సేవకుణ్ణి ఐన నేను ఎంతటివాడిని తండ్రీ శ్రీ వెంకటేశ్వరా!

Sri Purushottama, Suguna Shekhara, Sundara Rupa, Madhava! Pāpa vidoora, bhakta jana bāndhava, āśrita pārijātamā Thapasa vandita, Nikhila Danava mardhana Loka pavana Sri Paramatma Nin pogada sevakudentata Venkateswara!

2) ఆపద మొక్కులాడనుచు, అచ్యుతుడంచు, ననంతుడంచునిన్

  శ్రీపతి, శంఖచక్రధరు, శేష గిరీశ, నివాసుడంచుని 
  న్నాపయి, శ్రీనివాసుడని, యంబుజనాభుడు శేషతల్పుడన్
  బాపురే ఎన్నోనామముల భక్తులుకొల్తురు వేంకటేశ్వరా!
 Āpada mokkulāḍanucu, achyutuḍan̄chu, nanantuḍan̄uchunin
  śrīpati, śaṅkhachakradharu, śēṣha girīśha, nivāsuḍan̄chuni 
  nnāpayi, śrīnivāsuḍani, yambujanābhuḍu śēṣatalpuḍan
  bāpurē ennō nāmamula bhaktulu kolturu vēṅkaṭēśwarā!

3) తాపసి, అబృగోత్తముడు, తన్నగ, నీదగు వక్షమందునన్

  సైపుచు నీవు నాయతికి, చల్లగపాదములొత్త లక్ష్మియున్
  సైపక, నల్గి, నిన్విడచి, చయ్యనచేరె ధరాతలంబుకున్
  తోపగలేక, భారమును తోడనెచేరితి వీపు దాత్రికిన్.

Tāpasi, abr̥ugōttamuḍu, tannaga, nīdagu vakṣhamandunan

  saipuchu neevu nāyatiki, challaga pādamulotha lakṣhmiyun
  saipaka, nalgi, ninviḍachi, chayyana chēre dharātalambukun
  thōpagalēka, bhāramunu thōḍane chēritini veepu dātrikin.

4) ఆకసరాజు పుత్రికను, అల్లన పెండిలియాడి, పద్మతో

 ప్రాకట వైభవంబొసగ, భక్తుల పాలిటి తోడునీడవై
 సాకుచునుంటివీవు, మము చల్లగ తిర్పతి తిర్మలేశ్వరా
 నీకెనసాటి దైవమిల నెవ్వరు మాకిక వెంకటేశ్వరా!!

Ākasharāju puthrikanu, allana peṇḍiliyāḍi, padmatō

 prāakaṭa vaibhavam bosaga, bhaktula pāliṭi tōḍu neeḍavai
 sākuchunuṇṭiveevu, mamu challaga tirpati tirmalēśwarā
 neekenasāṭi daivamila nevvaru mākika veṅkaṭēśwarā!!

5) కలియుగమందు, మానవులు కల్మషచిత్తులు, నీచకర్ములున్

 తెలియగలేరు దైవమును, తెల్వినిగోల్పడి యంచునీవిటుల్
 శిలవయి, వెల్గినావు, మము, సిగ్గిలజేయగ, వేంకటాద్రిపై
 అలుకనువీడి మాకునిక నండగనిల్చి శుభంభులీయవే!

Kaliyugamandu, māanavulu kalmaṣhachittulu, neechakarmulun

 teliyagalēru daivamunu, telvinigōlpaḍi yan̄chuneeviṭul
 śhilavayi, velgināvu, mamu, siggilajēyaga, vēṅkaṭādripai
 alukanuveeḍi mākunika naṇḍaganilchi śhubhambhuleeyavē!

6) పెండిలికోసమై, యలకుభేరుని,యొద్దనుచేసినట్టి యా

 మెండగు అప్పు భారమును మోయగజాలక, వడ్డి తీర్పగన్
 దండిగ వడ్డికాసులను, ధర్మమ, భక్తులనుండిచండ, నీ
 యండనె లక్ష్మియున్న యటులప్పుల భారము తప్పునే ప్రభూ!

Peṇḍilikōsamai, yalakubhēruni,yoddanuchēsinaṭṭi yāa

 meṇḍagu appu bhāramunu mōyagajāalaka, vaḍḍi teerpagan
 daṇḍiga vaḍḍikāsulanu, dharmama, bhaktulanuṇḍichaṇḍa, nee
 yaṇḍane lakṣmiyunna yaṭulappula bhāramu tappunē prabhū!

7) జ్యోతిగనిల్చి లోకముకు, చూపవె వెల్గును జ్ఞానదాయివై

  ద్యోతక మౌనునీమహిమ, దుష్ట జనాళికి, భక్తకోటికిన్
  ఖ్యాతిని గాంచెడిన్, భరతఖండమ ఖండతపో ధరిత్రిగా
  జాతి, కహింసయున్ గరిపి, శాంతిన గూర్చెడి విశ్వదాత్రిగా!

8) సారవిహీనమైన భవసాగర మీదుట దుస్తరంబు, యే

  తీరుగ, జూతువోదయను, దీనపయోనిధి, వేంకటేశ్వరా!
  దారిని జూపుమయ్యనను దాసునిగాగొని, కావుమయ్య, నా
  భారము నీదెసుమ్మీ, ననుపాలనుముంచెదో నీటముంచెదో!

9) ఆపదలొందువేళ, నినునార్తశరణ్యడవంచు, నాపదల్

  బాపెడిదైవమంచు కడుభక్తిగ శక్తి కొలంది మ్రొక్కుచున్
  దాపుకువచ్చి వేడుకను దర్శన భాగ్యమునొంది నీకడన్
  ఆపదముడ్పులన్నిటిని, యర్పణజేతురు నీకునమ్రులై!

10) ఆకలిదప్పులన్ మరచి, యాస్తికులెందరో, యాత్మశాంతికై

   ప్రాకుచు, దొర్లుచున్ శ్రమకు బాల్పడి కొండలనెక్కి వచ్చి నీ
   వాకిట జేరినిల్చెదరు, వాపిరి గొంచును ధర్మనార్ధమై
   సాకెదవందరిన్, దయను, సంతసమొప్పగ వేంకటేశ్వరా!

11) కొండనుజేర, బస్సులను, కూర్చిరి, భక్తుల మేలుకోసమై

  ఎండకు వానకున్ వెరవ కెందరో భక్తులు పాదచారులై
  కొండకు వత్తురయ్య, తమ కోర్కెలు, తీరిన కారణంబునన్
  వెండియు, నీ కృపారసము వేడ్కను చిల్కవె భక్తకోటిపై!

12) దారి పొదుంగునన్

13) కొండల నేడు నెక్కి యటకొల్వునుదీర్చుట కోపమాప్రభూ

   గుండెలచేతబట్టుకొని గుప్పిట జీవములుంచి, నీపయిన్
   మెండగు భక్తితోజనులు మెల్లగవత్తురు కొండలెక్కి, నీ
   వండగనుండ, నేమిభయ, మార్త శరణ్యుడ వేంకటేశ్వరా!

14) బాధలనొందువేళ కడుభాగ్యులు పేదలు నొక్కటేగదా

   వేదనజెందుచున్ మదిని వేయివిధంబుల నిన్ను వేడగా
   బాధలబాపి వారలకు భద్రత కూర్చవె పిల్చినంతలో
   సాదరమొప్ప భక్తులను సాకెడు మా యిలవేల్పునీవేగా!!

15) పేదరికంబె 16) అల్పుడ నర్భకుండ నిను నర్చన జేయగ జాలనిష్టతో

   నిల్పితి నీదురూపమును నిర్మలనాహృది పీఠమందు నే
   సల్పెద నామమంత్రమును సన్నుతి జేతును నీదుకీర్తనల్
   కొల్చెద భక్తి పుష్పముల కోమల భావసుమంబులన్ ప్రభూ !!

17) కలియుగ 18) పాపులు దుష్టవర్తనులు పాతకులైనను నిన్ను కొల్వగా

   కోపంబూనకందరకు కూర్తువు నిశ్చల శాంతిభద్రతల్
   బాపురే నీదయారస మపారమనూహ్యము తెల్పశక్యమే
   పాపులనుద్దరించి కడుపావనమూర్తుల జేతువందరిన్.

20) పంకజనాభ నిన్ను మది భావనచేసి నుతింతు నెప్డు నా

   వంకకు జూడవేల విధివర్తనమో మరి భక్తిలోపమో
   వంకరులున్న చెర్కుగడ వాటముగా రుచినంద జేయదా
   శంకనుమాని నీ చరణసన్నిధి నిల్వ శరణ్య మీయవే !!

21) ఆపదలందు మున్గితేలియాడెడు భక్తులకున్ పరీక్ష యో

   కోపము నిన్నారతముకొల్చి భజించుట యేమి మాయయో
   తోపదు మామనంబులకు తొల్గవు భాదలవొక్క నాటికిన్
   మాపయి చూపవే కరుణ మాన్పవె మా పరితాపభారమున్!! 

22) కర్మలచేత కల్గునని కష్టము సౌఖ్యము పాపపుణ్యముల్

   మర్మమెరింగియున్ నరులు మానకచేతురు ఘోరపాపముల్
   దుర్గతులైయఘంబులను దుష్టపు కర్మలచేయనేల స
   త్కర్మలపూని జీవితమూ ధన్యత గాంచక వేంకటేశ్వరా!!

23) మున్ను గజెంద్రుడా మొసలి ముష్కర చర్యకు పాల్పడంగ మా

   పన్న శరణ్య దీనజన బాంధవ కేశవ కావుమంచునిన్
   సన్నుతిజేయగా కరిని చయ్యన కావగ లేద చక్రివై
   సన్నుతమూర్తి మోక్షమిడి సత్కృపతోడుత వేంకటేశ్వరా!!

24) పాపులు నీతిబాహ్యులకు భాగ్యముభోగములబ్బుటేలనో

   నీపయి భారముంచి కడునిష్టగ నిన్విడనాడకుండగా
   నీపద సన్నిధిన్ నిలిచి నిన్ భజియించెడి వారికేలనో
   చూపవుయెట్టి యోగ్యతలు చోద్యముకాక మరేమిసత్ప్రభూ!! 

25) జూదరి లంచగొండులును చోరులు జారులు తాగుబోతులు

   న్మాదులరీతి నిత్యము నమానుష చర్యలు సల్పుచుండగా 
   కాదనువారులేరు సరికట్టడిసేయగ నీ ఒకండవే
   నీదయలేనిచో నిలువనీడయే లేదిక భక్తకోటికిన్.
26) తాతల నాటినుండి నినుదల్పగ మాయిలవేల్పు తండ్రిగా
   మాతగ మమ్మునేలు మహిమాన్విత దాయక కల్పకంబుగా
   చేతుము పూజలన్ వ్రతముచేతుము నిత్యమఖండ పూజలన్
   నేతగనిల్చి మాకిడవే నిత్య శుభంబుల నీప్సితంబులన్.

28) సర్పమునోట జిక్కి తనచావు నెరుంగనికప్ప తానటన్

   దర్పముతోడ ఋర్వులను దండి భుజించెడి మాడ్కి కాలమున్
   సర్పము నోట జిక్కియును సంపద సౌఖ్యము కేలపుత్తురో
   తిర్పతివాస నిన్గొలిచి త్రుప్తిపొందక వేంకటేశ్వరా!!!

29) కోరగలేదు భూములను కోరను భూరియశస్సు భోగముల్

   కోరలేదు సౌఖ్యమును కోరను భౌతికతుచ్ఛసంపదల్
   తేరగనిత్తువంచు నిను తెల్సియు కోరనవేవియున్ ప్రభూ
   కూరిమి ని కృపామ్రుతము కూర్చినచాలు భవాబ్ది దాటగన్!

30) ధర్మము గానమెందు కలిదారుణ మారణ దుష్టశక్తులే

   మర్మమెరుంగ నేరని యమాయక జీవుల హింసపెట్టెడిన్
   నిర్మలచిత్తులన్ పరమనీచులకు న్నెరగాక యుండగా
   ధర్మమునుద్ధరించి మము ధన్యులజేయవే వేంకటేశ్వరా! 

31) కంటికి యింపుగా జగతికల్పనజేసి ముదంబుమీరగా

   నంటియునంటనట్లుగను ఆవలలోపల నుంటివంటతన్
   కంటికగోచరంబగుచు కామిని కాంచనదూత విర్వురన్
   గెంటితినీవు మాకడకు గెలవగా వాటి నిముక్తికోసమై!!

32) కాయము పాంచబౌతికము కర్మలు చేయగ నుద్భవించె నా

   కాయములో సమర్చితివి కాననిదొంగల నార్వురన్ సదా
   మాయకులో పడంగని మమ్ములన్నేడ్చును బాహ్యదృష్టికే
   మాయనుగెల్వగాతరమె మాకును నీకృపలేక యుండియున్!!
 
33) అంగటనన్నియున్న మరియల్లునినోట శనన్నసామెతన్

   అంగట వస్తువుల్ ధరలు ఆకశమంటె సధర్మపాలనన్
   బంగరుపండుదేశమున పాపముపండుచునుండెనేడు మా
   ముంగట విస్తరుంచి తిన మూతికి బీగమువేయధర్మమే!!

34) ఇంటను బైట తస్కరులు నీగతిమమ్ముల దోచుచుండగా

   కంటికినిద్రదోచకను కాయలు కాచెను శాంతికోసమై
   కంటిని ముక్కును మూసుకొని కాంచనియట్టుల మౌనమూనక
   తుంటరిమూకలన్ దునిమి తోడుగా నీడగ నిల్వుమో ప్రభూ!!

35) సంపదలున్నచో కలుగుసంకటముల్ పలు రోగభాధలన్

   పెంపును జేయు పాపముల పెంచును దుఃఖము కష్టనష్టముల్
   సంపదలెన్నియున్న యవి శాంతినిగూర్పగజాల వెన్నడున్ 
   సంపదకోసమై నెరపుసంధ్యలు పూజలు నిష్ఫలంబులే ! 

36) పుట్టుచుచచ్చుచున్ మరల పుట్టుచు గిట్టుట కంటె మానవుల్

   పుట్టుకలేకపోవుటది పుణ్యము మోక్షము కావునన్ ప్రభూ 
   పుట్టినదాది కష్టములపోరును బాధల నొందకుండ ఏ 
   పుట్టుకలేని భాగ్యమును పొందుగా గూర్చుము వేంకటేశ్వరా!

37) ప్రభువులు పండితుల్ పరమభాగావతో త్తములైనగాని తా

   విభవముతోడ సంపదల వేడుకమీర సుఖింత్రుగాక నీ 
   యభయముకోరుకున్న నవియన్నియు కల్లలు కల్పితంబులే 
   శుభములు నీపదార్చవలె సూరిజనావళికి ముక్తి మార్గముల్.

38) భక్తియెలేని పూజలవి పత్రికిచేటనిచెప్పు సామెతన్

   భక్తులు కామ్యసిద్ధికయి ప్రార్ధనపూజలు సల్పుచుందు రా 
   యుక్తిని నీవెరింగి పరమోన్నతిగూర్తువు వాంచితంబులన్
   ముక్తిని గోరకుండుతది మూర్ఖతకయేయగు వేంకటేశ్వరా!!

39) నీటను నానినట్టి యొకనిప్పులపెట్టెను యగ్గిపుల్లతో

   ధాటిగా గీసినన్ వెలిగి దర్శనమీయదు నిప్పురవ్వయున్ 
   కోటులజన్మలెత్తి తగ కూడగబెట్టిన దుష్టకర్మల 
   న్నీటనుమున్గి భక్తి మెయి నిన్ను తలంచిన మోక్షమబ్బునే !

40) ముక్తియు మోక్షమంచు తగముక్కునుమూసి జపించినంతనే

   దక్కునే ముక్తి మోక్షములు దక్కునె శాంతియొకింత యేని ఆ 
   శక్తిని వీడగావలయు సంపద సౌఖ్యములందు యన్నిటన్ 
   ముక్తి యనంగ నర్దమది మోహమువీడుట లోకవాంఛలన్!!! 

41) స్వార్ధపు చింతవీడి నిజశక్తిని మానవసేవ సల్పుచున్

   అర్ధము కామ మోహముల నన్ని జయించియు సత్వచిత్తుడై
   వ్యర్ధపు లొకవాసనల వాంఛల నెల్ల పరిత్యజించి మో
   క్షార్ధిగదైవచింతనల సల్పెడు భక్తులు ధన్యులేగదా!!

42) కన్నులు రెండు పాపులట కానగలేవట నీదు తేజమున్

   కన్నులు మూసిధ్యానమున కానగవచ్చని నీదురూపమున్
   సన్నుతి చేయుచుంటి జలజాతవిలోచన నాదుదృష్టికిన్
   తిన్నగదర్శనంబొసగి దీవెనలీగదె వేంకటేశ్వరా!!

43) పుట్టుకనిచ్చి పెంచి తగుపోషణకల్పన జేసినట్టి నీ

   పట్టున భక్తి యేర్పడెను భావమునందున నిన్ను నిల్పి నే 
   గుట్టుగ నెల్ల వేళలను కొల్చుచునుంటి మహానుభావ! నే 
   పట్టినపట్టు వీడనిక పంతముసేయక కానరాగాదే!!

44) అందముకెల్ల మూలమయి, ఆభరణంబులకన్న మిన్నయై

   విందును గూర్చెడిన్ కురుల వేడుకనిత్తురు మ్రొక్కుగానాటన్
   పొందుగభక్తి తత్పరత పూరుషులన్ మగువల్ వినమృలై
   అందునపుణ్యమేమొగద అర్పణచేయగ కుంతలమ్ములన్!!

45) ఆస్తియు పాస్తియున్ సకలయాభారణంబులు మాకు నీవెగా

   ఆస్తికులై సదాహృదిని అంకితమిచ్చుటగాక నీకు యే
   ఆస్తులునీయగాగలము అర్పణగానిక భక్తి యొక్కటే 
   ఆస్తియు మాకదన్ మిగిలె నారసిగైకొను, వేంకటేశ్వరా!

46) పిలచిన పల్కు దైవమువు పేదలపెన్నిది పారిజాతమా

   తలచినవెంట కోరికలు తప్పకతీర్తువు జాగుసేయకన్ 
   తెలివి యొకింత లేని మము తీరిచి దిద్దియనుగ్రహించి మా 
   కలుషములెల్ల బాపి కనికరము జూపవె వేంకటేశ్వరా!

47) చేసితి దానధర్మములు చేసితినేన్నియు తీర్థయాత్రలన్

   చేసితి పుణ్యకార్యముల జేసితి నెన్నియొ దైవపూజలన్ 
   చేసితి నన్ని చేతినొక చిల్లియు గావ్వాయు లేకపోయినన్ 
   చేసితినంటిగాని యవిచేసినదంతయు నీవెగా ప్రభూ!

48) దేహపుతుచ్ఛ సౌఖ్యముల దేలుచుమున్గుచు మోసపోకనా

   శ్రీహరినామమంత్రమును చిత్తమునన్ స్మరించుచున్ సదా 
   ఆహరి పాదపద్మముల నాశ్రయమొంది భజించువారికిన్
   శ్రీహరి మెచ్చినవారలకు శ్రీఘ్రమెనీయడె ముక్తి మోక్షముల్.

49) తప్పులుచేయ మాకుపని దండనచేయగ నీకు చెల్లు యే

  తప్పును చేయకుండ మముతండ్రిగ తీరిచి దిద్దకుండినన్
  తప్పులు నాచరించుటయె తప్పదు మాకిక జీవితాంతమే 
  మెప్పును చేయగా నొసగు మోర్మి వివేకము వేంకటేశ్వరా!

50) పాలలోవెన్నరీతిగను పక్వఫలంబుల తీపిమాదిరిన్

   పూలనుతావియున్ వివిధపుష్పములందున జుంటితేనియుల్ 
   మాలలోదారమున్ యడవిమానులనగ్నియు దాగినట్లుగా
   లీలగదోచు దైవమిల లేదనుమాత్రము తానేలేకయున్ !

51) వేంకటరావు నముడను వేంకటనాధు వరప్రసాదుడన్

   శంకలు లేనివాడ నతిసత్వుడ నిర్మలచిత్తుడన్ సదా 
   పంకజనాభునిన్ పరమభక్తి నికొల్చి తపించువాడ యే
   వంకకు పోనివాడ నిను వాకొను చుందుమూడు ప్రొద్దులన్!

52) తెల్లని వెల్ల పాలనెడి తెల్విని గల్గినవాడ ప్రేమతో

   నెల్లరసమ్మువాడ పరమేశ్వర గర్వములేనివాడ నే 
   కల్లలులేనివాడ కలికల్మష హీను డమాయకుండ నీ 
   చల్లని ప్రేమగోరు ససాత్ముడ భక్తుడసత్వచిత్తుడన్!

53) చదువగలేదు కావ్యముల శాస్త్రమూలన్ ప టియింపలేదు నే

   మొదలెయెరుంగ పద్యముల ముద్దుగా కోర్చువిధాన మెన్నడున్
   పదముల కూర్పునందు యతిప్రాసల దోషములున్నచో ననున్ 
   పదములరీతి పండితులు సాదరమొప్ప క్షమింపవేడెదన్!

54) మంగళ మోశుభాంగ జయమంగళమో ఇలవేల్పుదైవమా

   మంగళమమ్మపద్మ జయమంగళమో యలివేలుమంగకున్
   మంగళ మాత్మవాసునకు మంగళమో సకలార్థదాయికిన్
   మంగళమాదిదేవునకు మంగళదాయికి తిర్మలేసుకున్!   

---------------------------

పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మరతాయచ భజతాం కల్పవృక్షాయ నమతాంకామధేనవే

శ్రీ రాఘవేంద్రా...గురు రాఘవేంద్రా నీ దీవెనే.....చల్లనా ... మధురం నీనామం మధరం నీరూపం శ్రీ రాఘవేంద్రా

మహిలో ధర్మం ... మనుపగనెంచి మాప్రభువైనావో..... మమతలు తెలిసి ...మనసులు మలచి మనుజులబ్రోచేవో..... మహిలో వెలసే నీలీల తెలిసే దేవేశా ... శ్రీ రాఘవేంద్రా

సతతము నిన్నే... చింతన చేసిన అతులిత వైభవము...... పతితుల గతివై - వ్యధలకు సుధవై బ్రతుకులు అతికేవో .... సతతము వెలసే నీలీల తెలిసే దేవేశా శ్రీ రాఘవేంద్రా .

ఎన్ని జన్మల పుణ్యమో - నిను కొల్చు భాగ్యంబైనది పరమపావనమైన నీదు సన్నిధానమె పెన్నిధి సన్నిధానమె పెన్నిధి  !!ఎన్ని జన్మల పుణ్యమో!!

కోరికొలిచే వారికెన్నో కోర్కెలను కురిపించినావు  !!కోరి !! నేరమెంచక నన్నుదయతో చేరదీసి బ్రోవరా  !!చేరదీసి !!  !!ఎన్ని జన్మల పుణ్యమో!!

మరణబాధను మాన్పినావు మరల ప్రాణం పోసినావు  !!మరణ !! పతితుడవై విలపించు బాపని

వ్యధలు బాపిన దైవమా   !!వ్యధలు !!  !!ఎన్ని జన్మల పుణ్యమో!!

మహిమలెన్నో చూపినావు మహిని దైవుడై వెలసినావు  !!మహిమ !! తుంగభద్రాతీర నిలయా రాఘవేంద్రా నీ దయా  !!రాఘ !!  !!ఎన్ని జన్మల పుణ్యమో!!

సేయనా చరణసేవా స్థితిమతినై ....నీస్మరణ,నీసేవ సేయనా నీపద ధ్యానము భవహరము నీనామము మధురము శుభకరము నీపద తాపము పాపము శాపమునైనా తొలగించేది ఘనవారము జన్మరాహిత్యమైన - జగతి ప్రధానమైన గురుసేవ సేయనా వేంకణ, అప్పణ, కనగదాసులు విధినిదాటకరుణించింది వేంకణ భూతప్రేతాల కదిలించేదీ ఈతిబాధల వదిలించేదీ భక్తులకోర్కెలకోట - ముక్తికి దగ్గిర బాట గురుసేవ సేయనా శ్రీరాఘవేంద్రాయనమః - దీరయతీశ్వర నమః పరమానందా - పావన యోగీంద్రా వరదా, సద్గుణ సాంద్రా దుష్టశిక్షణ పరిపాలింపగా శిష్ట రక్షణ భరియించే బిరుదులెన్నో గాంచినవాడా - తరమ నిన్ను కొనియాడ గురుసేవ సేయనా

నన్ను ఏలుకొందువని - నమ్మితి గురుదేవా ఎన్నటికి నోచు దేవా నీ సేవా ..దేవా నీసేవా నన్ను కరుణించుము నీ చల్లని చరణమ్ముల వేడుకొంటి ఆలకించవేలా - నన్నాదరించవేలా ఆదరించవేలా ఎందుకు దయచూడవు నా అంతరంగమందు వెలసి నా హృదయం తెలిసి - నామనవి ఆలకించి ..మనవి ఆలకించి నన్ను నీదయతో యెందరినో బ్రోచితివని వింటినయా నాడు నేరమేమి నా చింతదీర్పవేమి ..చింతదీర్పవేమి కామితఫలదాయవనుచు కలియుగాన వెలసినావు కావుము శ్రీరాఘవేంద్ర కరుణతోడ నన్ను..కరుణతోడ నన్ను నన్ను

చల్లనయ్యా రాఘవేంద్రా పలుకవేమయ్యా వేగనన్ను చేరదీసి - ఏలుకోవయ్యా చల్ల నిన్ను మరవని వాడను - నా మనసుతెలిసినవాడవు నన్ను బ్రోవ రావదేమి న్యాయమా స్వామీ, భారమా స్వామీ చల్ల రోగికి ఆరోగ్యమిచ్చి మూగాను మాటాడచేసి కుంటివానికి నడకనిచ్చే బంటువైనావా - నన్ను అంటుకున్నావా చల్ల అంధునకు కనుచూపునిచ్చి బధిరునకు వినుభాగ్యమిచ్చి పాలించినావు - పరమాత్మనీవు అలసిపోయావా నన్ను మరచిపోయావా ... చల్ల

మంగళ హారతి జయ జయ జయ మంత్రాలయ గురురాయా మంగళం జయ జయ జయ రాఘవేంద్ర స్వామీ నీకు మంగళం జయ జయ

భక్తపాల భయవిదార - వరదా కరుణాలవాల భాసుర వరయోగ సార - భావ విదూర మంగళం

శ్రీ సుధీంధ్ర కారసుజాత సేవిత పాదారవింద భూసురనుత విఖ్యాతా - దోషరహిత మంగళం

ఆహ్లాదకరా భవహర ఆశ్రిత జన పరిపాలా ప్రహ్లాదావతారా నీకు - ప్రతిదినము మంగళం

ఓం తత్సత్ ......ఓం శాంతి శాంతి శాంతిః శ్రీ రాఘవేంద్ర స్వామి

పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మరతాయచ | భజతాం కల్పవృక్షాయ నమతాంకామధేనవే ||భజన

శ్రీ రాఘవేంద్రా...గురు రాఘవేంద్రా నీ దీవెనే.....చల్లనా ... మధురం నీనామం మధరం నీరూపం | శ్రీ రాఘవేంద్రా | మహిలో ధర్మం ... మనుపగనెంచి మాప్రభువైనావో..... మమతలు తెలిసి ...మనసులు మలచి మనుజులబ్రోచేవో..... | మహిలో | వెలసే నీలీల తెలిసే దేవేశా ... | శ్రీ రాఘవేంద్రా | సతతము నిన్నే... చింతన చేసిన అతులిత వైభవము...... పతితుల గతివై - వ్యధలకు సుధవై బ్రతుకులు అతికేవో .... | సతతము | వెలసే నీలీల తెలిసే దేవేశా | శ్రీ రాఘవేంద్రా |.

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి ఓం శ్రీ గురు రాఘవేంద్ర చల్లనయ్యా.. సాయినాధా పలుకవేమయ్యా వేగనన్ను చేరదీసి ...ఏలుకోవయ్యా నిన్ను మరువని దానను.. నా మనసు తెలిసినవాడవు ననుబ్రోవ రావేమి...ఇది న్యాయమా స్వామి!!

శ్రీరాఘవేంద్రస్వామి భజన కీర్తనలు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః

మందార మూలే మణి పీఠ సంస్థం సువర్ణ దానైక నిబద్దదీక్షం ధ్యాయేత్పరీతం నవనిత్య సిద్థైర్ధారిద్ర్య దావానల కాలమేఘమ్!

దత్తాత్రేయ హరేకృష్ణ ఉన్మత్తానంద దాయక దిగంబరమునే బాల పిశాచ జ్ఞానసాగర!

మాలాకమండలు రథకరపద్మయుగ్మే మధ్యస్త పాణి యుగళే డమరు త్రిశూలే యన్యస్త ఊర్ద్వకరయోః శుభశంఖ చక్రే వందే తమత్రివరదం భుజషట్క యుక్తమ్!

కాషాయ వస్త్రం కరదండ ధారిణం కమండలుం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషిత భూషణాడ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే!

ఔదుంబరః కల్పవృక్షః కామధేనుశ్చ సంగమః చింతామణి గురోః పాదౌ దుర్లభౌ భువనత్రయే!

దత్తాత్రేయం త్రిమూర్తిం హృదయం మే మమః 1. కురిసింది వానా.. నా గుండెలోనా (పాట స్టైల్ )

శ్రీ రాఘవేంద్రా -గురు రాఘవేంద్రా నీ దీవెనే.......చల్లనా......... మధురం నీ నామం  !! శ్రీ రాఘవేంద్రా !!

మధురం నీ రూపం మహిలో ధర్మం - మనుపగనెంచి మా ప్రభువైనావో ............ మమతలు తెలిసి - మనసులు మలచి మనుజుల బ్రోచేవో ......... !!మహి!! వెలసే నీ లీల తెలిసే దేవేశా  !! శ్రీ రాఘవేంద్రా !!

సతతము నిన్నే - చింతన చేసిన అతులిత వైభవము...... పతితుల గతివై - వ్యధలకు సుధవై బ్రతుకులు అతికేవో....... !!సతతము !! వెలసే నే లీల తెలిసే దేవేశా  !! శ్రీ రాఘవేంద్రా !!.

2.ఆ మబ్బు తెరల లోన (పాట స్టైల్ ).

శ్రమించు మంత్రాలయము భూలోక నందనవనము దీవించు బృందావనము దీనావాలి కల్పద్రుమము శ్రీరాఘవేంద్ర వరము.  !! శ్రమించు మంత్రాలయము !!

వేదాల గానము - వాద్యాల నాధము ముంగిట్లో గణగణ గంటల నాదాలు మోగగా - వినువీదులంటగా  !!శ్రమించు మంత్రాలయము!!

అలభూమి సురులు - మంత్రాలుపాడగా అలరారే హారతు లమర అందాలు చిందగా - ఆనంద మందగా  !!శ్రమించు మంత్రాలయము!!

మధురాలు చిల్కగా - హృదయాలు పొంగగా భక్తులు నీ సంకీర్తనము గానమ్ము సేయగా - ధ్యానమ్ము సేయగా  !!శ్రమించు మంత్రాలయము!!

3. ఐనదేమో ఐనదిప్రియ గానమేదే ప్రేయసీ (పాట స్టైల్ ).

ఎన్ని జన్మల పుణ్యమో - నిను కొల్చు భాగ్యంబైనది పరమపావనమైన నీదు సన్నిధానమె పెన్నిధి సన్నిధానమె పెన్నిధి  !!ఎన్ని జన్మల పుణ్యమో!!

కోరికొలిచే వారికెన్నో కోర్కెలను కురిపించినావు  !!కోరి !! నేరమెంచక నన్నుదయతో చేరదీసి బ్రోవరా  !!చేరదీసి !!  !!ఎన్ని జన్మల పుణ్యమో!!

మరణబాధను మాన్పినావు మరల ప్రాణం పోసినావు  !!మరణ !! పతితుడవై విలపించు బాపని వ్యధలు బాపిన దైవమా  !!వ్యధలు !!  !!ఎన్ని జన్మల పుణ్యమో!!

మహిమలెన్నో చూపినావు మహిని దైవుడై వెలసినావు  !!మహిమ !! తుంగభద్రాతీర నిలయా రాఘవేంద్రా నీ దయా  !!రాఘ !!  !!ఎన్ని జన్మల పుణ్యమో!!

                                                                                                          • 4. పాడనా తెలుగు పాట (పాట స్టైల్ ).

సేయనా చరణసేవా స్థిరమతినై...నీ స్మరణ, నీసేవ !సేయనా!! నీపద ధ్యానము భావహారము నీ నామము మధురము శుభకరము  !! నీపద !!

తాపము పాపము శాపమునైనా తొలగించేది ఘనవారము జన్మరాహిత్యమైన - జగతి ప్రధానమైన గురుసేవ -  !!సేయనా చరణసేవా!! వేంకణ, అప్పన, కనగ దాసులు విధిని దాట కరుణించినది  !!వెంకన!!

భూతప్రేతల కదిలించేదీ ఈతి బాధల విదలించేదీ భక్తుల కోర్కెల కోట - ముక్తికి దగ్గిరబాట గురుసేవ - !! సేయనా - చరణసేవా!!

శ్రీ రాఘవేంద్రాయ నమః - ధీర యతీశ్వర నమః పరమానందా - పవన యోగీంద్రా వరదా, సద్గుణ సాంద్రా దుష్ట శిక్షణ పరిపాలింపగ శిష్ట రక్షణ భరియించే బిరుదులెన్నో గాంచినవాడా - తరమా నిన్ను కొనియాడ  !!గురుసేవ ...సేయనా చరణ సేవా !!

5. నేడు శ్రీవారికి మేమంటే పరాకా ...(పాట స్టైల్ ).

ఆహా! విన్నారా! సద్గురుని మహాత్యం మహిలో మహాప్రదానం - జన్మము తరించే విధం || ఆహా ||

మొదట ప్రహ్లాదుండై - ఉద్భవించాడు మదిని హరి నామామృతమే గ్రోలాడు తండ్రి నొప్పించాడు - హరిని మెప్పించాడు నృహరి ప్రత్యక్షం చేయించా డానాడు || ఆహా ||

మరల జన్మించె శ్రీవ్యాస రాయుండై మహిని పాలించె వేదాంత సామ్రాజ్యం గురుని ఒప్పించాడు - హరిని మెప్పించాడు నృత్యమాడించెను శ్రీకృష్ణుని ఆనాడు. || ఆహా ||

అవతరించేను శ్రీ రాఘవేంద్రుండై మూల రాముణ్ణి - మురపించినాడు మొదట దర్శించాడు - ఎదుట చూపించాడు అతడే మంత్రాలయ - బృందావను డీనాడు

ఈ క్రిందివి పల్లవి వలేపాడాలి. యెంత మాధుర్యం గురుదేవుని చరిత్రం మధురం మహాప్రసాదం మాయని మహా ప్రమోదం || ఆహా ||

6. పిలిచినా పలుకవు ఓ జవరాలా ...( పాట స్టైల్ ).

జయ జయ జయ మంత్రాలయ - నిలయా తనరెడు నీ లీల తరమా తెలియ ||జయ జయ||

ఫలరస పాత్రలో - పది మృతి జెందిన పసి బాలుడు నీ కృప చేత - నిద్దుర నుండి వేచిన విధముగ ముద్దుగా గున గున దోగాడేనా || జయ జయ||

బ్రతుకే బరువై - మృతినేకోరిన కనకదాసు నీ కృప చేతా - పదుగురు చూడగ - ప్రార్ధన చేయుచు ప్రాణము వీడి మోక్షము చేరేనా || జయ జయ||

బ్రతికిన సేట్యను - పాడిగట్టుకొని బ్రతికించుమని కొనిరాగా దుండుగులాడిన - కపటంబిదియని కనుగొని శవముగ - శపియించేవా || జయ జయ||

సత్యసాయి విస్సా; కవి, రచయిత;[మార్చు]

సత్యసాయి విస్సా - పరిచయం పేరు: సత్యసాయి విస్సా; కవి, రచయిత; ధ్యేయం: తెలుగు భాషా సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ. పదవులు: వ్యవస్థాపక అధ్యక్షులు-విస్సా ఫౌండేషన్; ఉపాధ్యక్షులు-గాయత్రి బ్రాహ్మణసమాఖ్య; కార్యదర్శి-నవ్యసాహితీ వేదిక. చదువు ; ఎం.ఎ. తెలుగు; (తెలుగు విశ్వవిద్యాలయం) వృతి: కేంద్ర ప్రభుత్వ రక్షణమంత్రిత్వ శాఖ లో ప్రవృత్తి: 1) ఆకాశవాణి హైదరాబాద్, దూరదర్శన్ హైదరాబాద్ లలో కవితా గానం, 2) అంతర్జాలం ద్వారా స్కైప్, మరియు పేస్ బుక్ మాధ్యమంగా దేశ, విదేశాల్లో తెలుగు భాషా సంతతి వారికి తెలుగు సాహిత్య బోధన ద్వారా వారికి తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన, ఆసక్తి, అనురక్తి కలిగేట్లుగా వారి వారి అవగాహనా స్థాయిలను బట్టి పద్యాలూ, పాటలు, కవితలు, రాగ, భావ యుక్తంగా ఆలపించి నేర్పించి ఇలా వ్యక్తి గత స్థాయిలో ప్రత్యెక శ్రద్ధతో ప్రత్యెక బోధనా పద్ధతులు అవలంబించడం. తెలుగు భాషా సాహిత్య బోధనా ద్వారా విద్యార్ధినీ విద్యార్ధులకు వ్యక్తిత్వ వికాస తరగతులను, గృహాలలో, దేవాలయాల్లో, ఉద్యానవనాలలో, పాఠశాలలో నిర్వహించడం. 3) అంతర్జాతీయ టోరీ (తెలుగు వన్) రేడియో లో ప్రతి శనివారం శ్రీ సంజీవ (మారిషస్) గారితో కలిసి కార్యక్రమములోపాల్గొనుట; 5) రేడియో కేక – అనంతపురం; SCUBE Radio TV లో'మణిసాయి సాహితీ యుగళ గీతిక" కార్యక్రమాల నిర్వహణ 6) అంతర్జాలం ఆసరాగా పేస్ బుక్, బ్లాగ్, యు ట్యూబ్ లో విస్సా ఫౌండేషన్ ఛానల్ నిర్వహణ. 7) జాతీయ అంతర్జాతీయ తెలుగు సాహిత్య కార్యక్రమాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనుట, విస్సా ఫౌండేషన్; గాయత్రి సమాఖ్య, నవ్య సాహితీ వేదికల ఆధ్వర్యములో స్వయముగా, సలహాదారుడుగా కార్యక్రమాల నిర్వహణ; 8) ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయా ప్రాంతాలలో వివధ పాఠశాలలకి వెళ్లి స్వచ్చంద తెలుగు ఉపాధ్యాయ పాత్రలో చిన్నారులకి శ్లోకాలు, పద్య శిక్షణ, మరియు తెలుగు భాష సంస్కృతులు పెంపొందేలా బోధించడం. 9) ఆలయాలలో, సభలలో వివిధ సందర్భాలు మరియు దైవ కళ్యాణమహోత్సవాలలో ఆ వైభవాన్ని వ్యాఖ్యానం చెయ్యడం, చిన్న చిన్న ప్రవచనాలు, ప్రసంగాలు. 10) కవిత, వ్యాసాలు, కధలు, వంటి ఇతర రచనా వ్యాసంగాలు. 11) వివాహాలకి పద్యరత్నాలు, ప్రముఖులకు సన్మాన పత్రాలు రాయటం, ఆలపించటం. 12) అవార్డులు, సన్మానాలు: TANA (Telugu Association of Narth America) సన్మానం, అవార్డులు (రెండుసార్లు); ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ; రసమయి; విశ్వసాహితీ; ఇంకా ఎన్నో జాతీయ అంతర్జాతీయ సంస్థల అవార్డులు, అనేకసన్మానాలు.