Jump to content

వావిలాల సోమయాజులు సాహిత్యం-4/సంస్కృతి/గడియారము

వికీసోర్స్ నుండి

గడియారము

భారతీయుల సంవత్సరము ప్రధానంగా సౌరమానాన్ని అనుసరించి పరిగణితమౌతున్నది. భారతీయుల సిద్ధాంతాన్ని అనుసరించి సూర్యుడు క్రాంతి వృత్తము (Ecliptic) నిర్ణీతమైన వర్తులముపై గమిస్తాడు. ఈ క్రాంతి వృత్తము 27 భాగాలుగా విభాజితమై ఉంది. ఒక్కొక్క భాగానికి ఒక నక్షత్రమని నామము.

సూర్యుడు అశ్వినిలో ప్రవేశించటంతో భారతీయుల సంవత్సరం ఆరంభిస్తుంది; రేవతితో అంతం పొందుతుంది. వైదికకాలంలో కూడా సంవత్సరపరిగణనం ఇదేవిధంగా ఉండేది. ఋగ్వేద సంహితలలోనూ, యజుర్వేద సంహితలలోనూ ఈ విషయాన్ని నిరూపిస్తూ అనేక మంత్రాలు కనిపిస్తున్నవి. ఉదా :

అభోద్యగ్నిర్ణ ఉదేతి సూర్యో వ్యుషరశ్చంద్రా మహ్యామో అర్చిషా |
ఆయుక్షతా మశ్వినీ యాతవే రథం ప్రాసావి ర్దేవః సవితా జగత్పృథ

(ఋగ్వే. 1.154.1)

పాసాత్యౌ చిత్రా జగతే నిధానౌ
ద్యావా భూమీ చరధః సం సఖాయౌ |
తా వాశ్వినీ రాసభస్వా హవం మే
శుభసృతీ ఆగతం సూర్యయా సః ॥

(తైత్తిరీ యారణ్యకము (1.10.2)

వీటిని బట్టి వైదికకాలంలోని సంవత్సరము సూర్యుడు అశ్వినిలో ప్రవేశించినప్పుడే ప్రారంభ మైనదని మనకు అర్థమౌతున్నది. అంటే వేదకాలారంభం నుంచీ నేటివరకూ సంవత్సరం ఒకేరకంగా ఆరంభమై, అంతం పొందుతున్నదన్నమాట.

సంవత్సరము రెండు భాగాలు: దేవ అహస్సు, దేవరాత్రి. దేవ అహస్సులో సూర్యుడు అశ్విని నుంచి పునర్వసు మీదిగా చిత్ర చేరుకుంటాడు, దేవరాత్రిలో చిత్రనుంచి ఉత్తరాషాఢ మీదుగా మరల అశ్విని చేరుకుంటాడు.

సంవత్సరానికి - వసంతము, గ్రీష్మము, వర్ష, శరత్తు, హేమంతము, శిశిరము - ఆరు ఋతువులు. వసంతము సౌర సంవత్సరంతోనే ఆరంభ మౌతుంది.

సంవత్సరము వసంతంతో ఆరంభిస్తుంది.

“సౌరాగవస్త్రై ర్జరరక్షః వసంతో వసుభిస్సహ
సంవత్సరస్య సవితోః ప్రైషకుత్ప్రథమః స్మృతః"

అన్న తైత్తిరీయ వాక్యాన్ని బట్టి (1.3.2) వైదిక కాలంలో కూడా ఇలాగే వసంతారంభాన్ని గురించి, వత్సరారంభాన్ని గురించి భావించారని వ్యక్త మౌతున్నది.

"ద్వాదశారం నహి తజ్జరాయ వర్వర్తి చక్రం పరిద్యామృతస్య
ఆపుత్రా అగ్నే మిధానాసో అత్ర సప్త సతాని వింశతిశ్చ తస్యుః”
(ఋగ్వేదమ్ - 1.23.11)


సుబ్రహ్మఃణ్యోం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యామ్ ఇంద్రాగచ్ఛ హరివ
ఆగచ్ఛ మేధాతేథౌః మేషవృషణ శ్వస్య మేనౌ

భారతీయుల "సౌర చాంద్ర వత్సరానికి” (Luni-Solar year) మాసాలు పన్నెండు. అశ్విని మొదలు రేవతి వరకూ ఉన్న ఈ సంవత్సరానికి మూడు వందల అరవై (360) నక్షత్ర దినాలుగా విభజించారు. ఈ విభజన సూర్యుడు కాంతి వృత్తంమీద ఒక డిగ్రీనుంచి మరొక డిగ్రీ వద్దకు నడిచే కాలాన్ని మాత్రమే తెలియజేస్తవి. ఈ మూడు వందల అరవై నక్షత్ర దినాలు కూడా ఋగ్వేద సంహితా కాలంనాటివే.

ద్వాదశ ప్రథమ శ్చక్రమేకం త్రీణి నఖ్యాని క ఉతశ్చి కేత
తస్మిన్యాకం త్రిశతాన శంకమోర్పితా షష్ఠి ర్నిచలాచలాసః

ఈ 'నక్షత్రదినము', 'స్థల-కాలము' (Space-Time) గ విభజితమైంది.

"క్షౌద మభ్రం నివేశిత్ క్వాయమ్ సంవత్సరాం మిధః
క్వాహక్వేయం దేవరాత్రీ, క్వమాసా ఋతవః శ్రితాః
అర్ధమాసా ముహుర్తాః నిమేషా సృరిభి స్సహ”

అని తైత్తిరీయారణ్యకంలో ఉంది.

వారంలోని దినాలకు 'శక'మనీ తత్సంబంధమైన జ్ఞానానికి 'శకం జ్ఞాన' మనీ అన్నారు. ఋగ్వేద సంహితలో (మండలము 1, అనువాకము 22 సూక్తము 6 సూత్రము 48.) సంవత్సరానికి పన్నెండు నెలలయ్యే 360 శకాలున్నట్లు ఉన్నది. తైత్తిరీయారణ్యకంలో వారాల వరుసను గురించి ఇలా ఉన్నది (ప్రశ్న - అనువాకము

3. పంచతి 1)

"అస్య వాడస్య పరితస్య మొతుస్తస్య భ్రాతా మధ్యమో అస్త్యశ్నః
తృతీయో భ్రాతా ఘృత పృష్టో అస్యా త్రాతస్యం విశపతిం సప్త పుత్ర"

ఋగ్వేద సంహితమూ, తైత్తిరీయారణ్యములనూ, వారముల క్రమాన్ని గురించి విపులంగా చెప్పి ఉంది; మిగిలిన సిద్ధాంత గ్రంథాలు వీటిని విశదీకరించినవి. దీనిని బట్టి వారాలను భారతీయులు గ్రీకుల వద్దనుంచి గ్రహించారని భావించటం పొరబాటు. వత్సర ప్రమాణాన్ని గురించి పోపు గ్రెగరీ (1582) కాలంవరకూ పాశ్చాత్యులు ఎరుగరు. గ్రీకుల ఆ కాలమే వత్సర ప్రమాణాన్ని క్రీ.శ. 1752 వరకూ ఇంగ్లండు అంగీకరించలేదు కూడాను.

(అసంపూర్ణం)