వాడుకరి:Pavan santhosh.s/idea box
స్వరూపం
అమూల్ facts:
- దెబ్బకు దెబ్బ: భారత్ కు ఉచితంగా పాలపొడి ఇచ్చి, మార్కెట్ తయారయ్యాకా వ్యాపారం చేసుకుందామని యూరోపియన్ మిల్క్ యూనియన్ తనకు అనవసరంగా మిగిలిపోయిన పాలపొడి ఇస్తే - అదే పాలపొడిని అమ్మి ఈలోగా అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెషినరీ, మార్కెటింగ్ విధానాలు తయారుచేసుకుని భారతదేశంలో ఎన్నో కోపరేటివ్ సొసైటీలను బలపరిచారు.
- మొదటి క్రౌడ్ ఫండింగ్ నిర్మాతలు: భారతదేశంలో తీసిన తొలి క్రౌడ్ ఫండింగ్ సినిమా - మంథన్. పాల రైతుల నుంచి సేకరించిన డబ్బుతో వాళ్ళ జీవితాలు, విజయాల మీదే ఈ సినిమాని శ్యాం బెనగల్ దర్శకత్వంలో తీశారు.
- భారత్ ప్రపంచ #1: 1980ల్లో పాల కోసం ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడ్డ భారతదేశం అమూల్ మోడల్ ని, కురియన్ దేశవ్యాప్తంగా పున:సృష్టించి 21వ శతాబ్దంలో ప్రపంచ నెంబర్ 1గా చేశారు.
భారతరత్నాలు: ఇప్పటికి దాదాపు 45మందికి భారత రత్న పురస్కారాలు ఇచ్చారు, వీరిలో మరణానంతరం ప్రకటించిన వారూ ఉన్నారు. ఐతే వీరు కాక భారత రత్న పురస్కారానికి ఏ సందేహం లేకుండా నిజమైన అర్హులు ఎవరో తెలుసా?