వాడుకరి:Naga Chaitanya Varma
స్వరూపం
నాగచైతన్య వర్మ (చైల్డ్ యాక్టర్) కడపజిల్లాలోని చమర్తివాండ్లపల్లి అనే కుగ్రామం లో జన్మించారు, 2012 జులై 28న నాగార్జున రాజు,వరలక్ష్మిదేవీ అను దంపతులకు మొదటి సంతానం . ప్రస్తుతం హైదరాబాద్ కూకట్పల్లి ప్రగతినగర్లో ని ప్రగతి సెంట్రల్ స్కూల్ లో ఒకటవ తరగతి చదువుకుంటూ సినిమాలలోను, షార్ట్ ఫిల్మ్స్ లలోను నటిస్తూ తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు.
తన ప్రతిభను గుర్తించి వీరి తల్లిదండ్రులు ప్రోత్సహించటంతో "అమీర్ పేటలో" చిత్రంలో డైలాగ్ లేని ఒక చిన్నపాత్రలో నటించి తెలుగు సినీరంగానికి పరిచయం అయ్యారు. సీనియర్ యాక్టర్ (పాత తరం హీరో) నరేష్ గారి అబ్బాయి నవీన్ విజయక్రిష్ణ హీరో గా అవసరాల శ్రీనివాస్ గారు ప్రత్యేక పాత్రలో బాలాజీ సనాల గారి దర్శకత్వంలో "ఊరంతాఅనుకుంటున్నారు" చిత్రంలో ఒక మంచి పాత్రలో బాల నటుడిగా నటించారు,
ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుకుంటూ విడుదలకు సిద్ధం అవుతుంది.
Divorce ప్రేమతో, సంభవామియుగేయుగే అను షార్ట్ ఫిల్మ్స్ లోను నటించారు.
షకలక షంకర్ హీరో గా నటిస్తున్న చిత్రం " కేడీ నెం.1 " చిత్రంలో చిన్ననాటి హీరోపాత్ర లోను,
" మార్షల్ " చిత్రంలో హీరో శ్రీకాంత్ గారి చిన్ననాటి పాత్రలోను నటించి తన ప్రతిభను నిరుపించుకుంటూ సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.