లోకోక్తి ముక్తావళి/సామెతలు-రో

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రో

2949 రోకటికి చిగురు పట్టినట్లు

2950 రోకలి మూడు మాడలు

2951 రోగము వొకటి మందు వొకటి

2952 రోగీ పాలేకోరినాడు వైధ్యుడూ పాలే కోరినాడు

2953 రోట్లో బుర్రపెట్టి రోకలి దెబ్బకు వెరచినట్లు

2954 రోలు కరు వెరుగరు

2955 రోలు వెళ్లి మద్దెలతో మొరపెట్టు కున్నట్లు

2956 రోషములేని బంటుకు మోసము లేదు

2957 రోషానకు రోలు మడకు కట్టు కున్నట్లు

రౌ

2958 రౌతు కొద్దీ గుఱ్ఱము

2959 రౌతు మెత్తనైతే గుఱ్ఱము మూడు కాళ్ళతో నడుచును

2960 రేవతి వర్షం సర్వ సస్యములకు రమణీయము

2961 రోహిణి యెండకు ఱోళ్ళు పగులును

2962 రైతుబీద అయితే పొలంబీద


2963 రెంటికిం చెడ్డ రేవనివలె

2964 రెక్కలు విరిగిన పక్షి వలె ఉన్నాడు

2965 లంక కాల్చినవాడు హనుమంతుడు

2966 లంకమేతకు యేటియీతకు సరి