లోకోక్తి ముక్తావళి/సామెతలు-భూ

వికీసోర్స్ నుండి

2561 భార్యచేతి పంచభక్ష్య పరమాన్నములు కన్న తల్లి చేతి తవిటిరొట్టె నయం

భి

2562 భిక్షగాని గుడిసె మాయాక్కచూసి మురిసె

2563 భిక్షాదికారైనా కావలె భిక్షాధికారైనా కావలె

భూ

2564 భూమికిరాజు నాయ్యం తప్పితే గ్రామస్తులేమి చేస్తారు

2565 భూమికి వానమేలా అంటే మేలే అన్నట్లు

భో

2566 భోజనం చేసిన వారికి అన్నంపెట్ట వేడుక బోడితలవానికె తలంటువేడుక

2567 భోజనానికి మాబొప్పడు, నేను లెక్కజెప్ప నేనొక్కడనే యన్నాడట

2568 భోజనానికి ముందు స్తానానికి వెనుక

2569 భోజునివంటి రాజు గలిగితే కాళిదాసువంటి కవి అప్పుడే వుంటాడు

2570 మంగలివాడి గుంటపెల్లగిస్తే బొచ్చుబైటపడుతుంది

2571 మంగలినిజూచి యెద్దుకుంటుతుంది

2572 మంగలి పాత చాకలి కొత్త