లోకోక్తి ముక్తావళి/సామెతలు-బ్ర

వికీసోర్స్ నుండి

బ్ర

2527 బ్రతకని బిడ్డ బారేడు

2528 బ్రతకలెనివాడు భావిలోపడితే, తియ్యబోయినవాడు కయ్యలో పడ్డాడట

2529 బ్రతుకెన్నాళ్లు: భాగ్యమెన్నాళ్ళు?

2530 బ్రతికివుండగా పాలులేవుగాని చచ్చిన తరువాత గంగిగోవును దానం చేస్తానన్నాడట

2531 బ్రతికేబిడ్డ అయితే పాసినవాసన యెందుకు వస్తుంది

2532 బ్రహ్మకూ పుట్టుతుంది రెమ్మతెగులు

2533 బ్రహ్మచారి శతమర్కటం

2534 బ్రహ్మతలిస్తే ఆయుస్సుకు తక్కువా మొగుడు తలిస్తే దెబ్బలకు తక్కువా

2535 బ్రహ్మవ్రాత తిరుగునా

2536 బ్రహాస్త్రానికి తిరుగులేదు

2537 బ్రాహ్మడిచెయ్యి యేనుగుతొండమూ వూరుకుండవు

2538 బ్రాహ్మడిమీద సంధ్యా కోమటిమీద అప్పు నిలవదు

2539 బ్రాహ్మణుడు ఒంటిపూటపడ్డా పసరం ఒంటిపూట పడ్డా మానెడు

2540 బ్ర్రహ్మల్లో చిన్న జెస్తల్లో పెద్ద

2541 బ్ర్రాహ్మల్లో నల్లవాణ్ణీ బెస్తల్లో యెర్రవాణ్ణి నమ్మరాదు

2542 బాధకోకాలం భాగ్యానికో కాలం

2543 బలుపుతీరితే గాని వలపుతీరది 2544 బంకారు పళ్లెరమునకైన గోడచేర్పు ఉండవలెను

2545 బిందేడువచ్చి కోడలు కొత్తా లేదు

2546 బిడ్డచక్కిలమువలె యెండిపోయినాడంటే చక్కిలాలు యిమ్మని యేడ్చినాడట

2547 బూడిదగుంటలో కుక్కసామెత

2548 బహునాయకం బాలనాయకం స్త్రీనాయకం

2549 బాపనవాని బండవావి

2550 బ్రహ్మవ్రాసిన వ్రాలుకు యేడవనా రాగల సంకటికి యేడవనా

2551 భక్తి లేనిపూజ పత్రిచేటు

2552 భయ మెంతో అంతకోట కట్టవలెను

2553 భరణి కార్తెలో వేసిన నువ్వుచేను కాయకు చిప్పెడు పండును

2554 భరతుడి పట్టం రాముడి రాజ్యం

2555 భల్లూకపు పట్టు

2556 భరణి ఎండకు బండలు పగులును

2557 భక్రురాలు లేనిది బావాజీ ఉండదు

భా

2558 భాగ్యంవుంటే బంగారం తింటారా

2559 భారము లేని బావచస్తే దూలముపడ్డా దు:ఖములేదు

2560 భారీముద్ర భారీముద్రే కరుకుకరుకే