లోకోక్తి ముక్తావళి/సామెతలు-బొ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

బొ

2512 బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయలంత అన్నాడట

2513 బొంత కట్టుకున్నవాడు కప్పుకోలేడా

2114 బొగ్గులలో రామచిలక

2115 బొక్కగొరుకంగ భోగము లెక్కచెప్పంగ దు:ఖము

2116 బొచ్చు కాల్చితే బొగ్గులగునా

2517 బొజ్జను నమ్మి యేట పట్టట్టు

2518 బొటనవేలు సున్నమైతే బోర్లపడుతాడు

2619 బొట్టు కట్తితేగాని ముండ మొయ్యదు

బో

2520 బోగం వలపు బొగ్గు తెలుపు లేదు

2621 బోడితలకు బొడ్డుమల్లెలు ముడిచినట్లు

2522 బోడితలకు మోకాటికి ముడి పెట్టినట్లు

2523 బోడినెత్తిన టెంకాయ కొట్తినట్లు

2524 బోడెద్దుకు పోటు నేత్పటం

2585 బోసినోటికి చరుకు ముక్క అందించినట్లు

2526 బోసినోటి వానికి పేలపిండి మీద ప్రీతి