లోకోక్తి ముక్తావళి/సామెతలు-పా

వికీసోర్స్ నుండి

2148 పల్లికమ్మగడుస్తే (మార్గశిర పూర్ణిమ) తల్లితోకలుస్తాను

2149 పల్లె గమారు, పట్టణ దలారి

2150 పశువులకు పాలు నోటిలోవున్నవి, పాలు కాచేవాడు పాటుకు అక్కరకురాడు

2151 పసుపుకొమ్ము యివ్వని కోమటి పసారమంతా కొల్ల యిచ్చినాడు

2152 పసుపూ బొట్టూపెట్టి పెండ్లికి పిలిస్తేపోక, పెంకుపట్టుకొని పులుసుకు వెళ్లినట్లు

2153 పక్షిమీద గురిపెట్టి మృగాన్ని కొట్తినట్లు


పా

2154 పాండవుల వారిసంసధ్యం, దుర్యోధనుల వారి పిండాకుళ్లకు సరి

2155 పాపాలులేవు పుణ్యాలులేవు తరిమితేచెట్లపాలు గుట్లపాలు

2156 పాలకువచ్చి ముంత చాచినట్లు

2157 పాకలపాటివరి రణకొమ్ము

2158 పాగావంటి బంధువుడు అంగరకావంటిహరంగాడు లేరు

2159 పాటిమీద గంగానమ్మకు కూటిమీదే లోకం

216O పాటిమీద వ్యవసాయం కూటికైనా రాదు

2161 పాటు గలిగితే కూటికి కొదవా

2162 పాటుపడితేభాగ్యం కలుగును

2163 పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి

2164 పాడితో పంట వోపదు 2165 పాడిఆవును దానంచేసి పాలు తానే పిరుక్కున్నట్లు

2166 పాడిపసరము, పసిబిడ్డ ఒక్కటే

2167 పాడువూరికి నక్క తలారి

2168 పాడూరికి మచముకొయ్య పోతరాజు

2169 పాడు వూళ్లో పొగిడేవారు లేరు నాకు నేనే పొగుడుకుంటాను

2170 పాత దొంగ వొక్కరోజు పట్టుబడక మానడు

2171 పాతముండ కలవరిస్తే కొత్తముండకు దెయ్యం పట్టినట్లు

2172 పాతముండ లందరు పోగయి కొత్తముండ తాడు తెంచినట్లు

2173 పానకములోని పుడక

2174 పాన్పు మంచిదిచూచి పసరము కొట్టవలెను

2175 పాపంవుంటే భయం, పల్లంవుంటేనీళ్లు

2176 పాపటకాయ కొరకనెంత యాక నెంత

2177 పాపనము పదిసేద్య్హాల పెట్టు

2178పాపమని పాతబట్టయిస్తే గోడచాటుకుపోయి మూరవేసిగొనెనట

2179 పాపమని పల్లెడంబలిపోస్తే కారంలేదని కచ్చేరికెక్కెనట

2180 పాపిసొమ్ము పరులపాలు ద్రోహిసొమ్ము దొరలపాలు

2181 పాముకాళ్ళు పామువకెరుక

2182 పాముకు పాలుపోస్తే విషమైనట్లు

2183 పాముకు బదనిక చూపినట్లు

2184 పాము చిన్నదైనా దొకటే పద్దదైనా వొకటే 2185 పాముచుట్టం పడిగ పగ

2186 పాముతో చెలిమి కత్తితో సాము

2187 పాముతో చెలిమి రాజుతో చెలిమి వొకటి

2188 పామునకు విషము పండ్లతో వుంటుంది

2189 పామును ముద్దుపెట్టుకున్నట్లు

2190 పాడైపోయిన కూరలు బాపడికి

2191 పామునూ చాననివ్వడు, కర్రా విరగనివ్వడు

2192 పాములతో మెలగవచ్చును గాని స్రాములతో మెలగ రాదు.

2193 పాయసములో నెయ్యి వొలికినట్లు

2194 పారవేసుకున్న చోటనే వెతుక్కోవలసినది

2195 పారే చీమ చప్పుడు వినేవాడు

2196 పాలచుట్తితే మాత్రం మేలుగుణం వస్తుదా

2197 పాలల్లో పంచదార వొలికినట్లు

2198 పాలను చూడనా భాండాన్ని చూడనా

2199 పాలిచ్చే బర్రెనుపోగొట్టుకొని పైనెక్కేదున్నను తెచ్చుకున్నట్లు

2200 పాలుపోసి పెంచినా పాము కరవకమానదు

2201 పాలేకుడిచి రొమ్మే గుద్దినాడు

2202 పాలేదు దున్నినవాడు అప్పులపాలు

2203 పాలేరు వాని పశువుపోయినాల్ మారుతల్లి బిడ్డపోయినా బెంగలేదు

2204 పాశికూడు పదునుకువస్తుంది 2205 పాలుచిక్కనైతే వెన్న నెక్కసం

2206 పాలొల్లని పిల్లియున్నదా

పి

2207 పిండిఎంతో నిప్పటి (రొట్టె) అంతే

2208 పిండికిదగ్గ పిడచ

2209 పిండిప్రోలూలేనిది పెండ్లిఅగునా

2210 పిండిబొమ్మనుచేసి పీటమీద కూర్చుండపెట్టితే ఆడబిడ్డల్ తనాన అదిరి పడ్డదట

2211 పిందెలో పండిన పండు

2212 పిచ్చుకమీద బ్రహ్మాస్త్రమా

2213 పిచ్చికుదిరింది రోలు తలకు చుట్టమన్నట్లు

2214 పిచ్చుగుంటలవాని పెండ్లెంత వైభమెంత

2215 పిచ్చివానికి లోకమంతయు పిచ్చగానె యుంటుంది

2216 పిట్టకొంచెము కూతఘనము

2217 పిట్ట పిట్ట పోరు పిల్లి తీర్చినది

2218 పిఠాపురంవెళ్ళి పిడికెడు నీళ్ళు తెచ్చినట్లు

2219 పిడుకిపొగకు సిగమూగితే గుగ్గిలంపొగ కెట్లాగనలె

2220 పిడుకలు తీసుకురార సివ్వయంటే నాపిక్కలు నొస్తున్నవి అవ్వా అన్నాడట

2221 పిడుక్కూ బియ్యానికి వొకటే మంత్రం

2222 పిడుగుకు గొడుగడ్డమా

2223 పిడుగు పడడానకు వారసూలా