లోకోక్తి ముక్తావళి/సామెతలు-దొ

వికీసోర్స్ నుండి

1801 దేవుడి పెండ్లికి అందరు పెద్దలే

1802 దేవుడిస్తాడుగాని వండివార్చి వాతబెట్టునా

1803 దేవుడు వరమిచ్చినా, పూజారి వరమివ్వడు

1804 దేహం నీటిబుగ్గ వంటిది

1805దేహి అంటే నాస్తి అనరాదు

దొ

1806 దొంగకు అందరిమీద అనుమానమే

1807 దొంగకు దొంగబుద్ధి దొరకు దొరబుద్ది

1808 దొంగకు దొరికిందేచాలు

1809 దొంగగొడ్లకు గుది కర్రవేసినట్లు

1810 దొంగ చిక్కెనోయీ అంటే కరిచేవోయి అన్నట్లు

1811 దొంగ చెయ్యి దాచిపెట్టినా అమావాస్యనాడు అల్లల్లాడుతుంది

1812 దొంగతోకూడా దయ్యం వెంబడె వచ్చును

1813 గొంగను తేలు కుట్తినట్లు

1814 దొంగను దొంగ యెరుగును

1815 దొంగను పుట్టించినవాడు మతిభ్రష్టును పుట్టించక మానడు

1816 దొంగల తల్లికి యేడ్వ భయం

1817 దొంగలబడ్డ ఆరుమాసములకు కుక్కలు మొరిగినవి

1818 దొంగలుతోలిన గొడ్దు యే రేవున దాటినా ఒకటే 1819 దొంగవస్తానని ముందు చెప్పివుంటే సాక్షులనైనా సంపాదించు కుందును

1820 దొంగ వాకిట మంచం వేసినట్లు

1821 దొంగవాదిదృష్టి మూటమీదే

1822 దొంగవాడి పెండ్లాము యెప్పుడు ముండమోపే

1823 దొంగసొమ్ము దొరలపాలు

1884 దొంగా మనిషే

1825 దొంగిలబోతే మంగలం దొరకినట్లు

1826 దొంగీలించేటంత దొరతనం వుండగా అడిగేటంత అన్యాయానికి పాలుపడతానా

1827 దొడ్డెడు గొడ్లను దొంగలు తోలుకొనిపోతే గొడ్దుగేదె శ్రామహాలక్ష్మి అయినదట

1828 దొరను పేదనరాదు యెద్దును సాధనరాదు

1829 దొరలుయిచ్చిన పాలుకన్నా ధరణియిచ్చిన పాలుమేలు

1830 దొరలెని మూకలు

1831 దొరికిన సొమ్ముకు దొంగ అవుతాడా

1832 దోవలో కూర్చుండి దొబ్బులు తిన్నట్లు

1833 ద్రావిడానాం ఘృతంనాస్తి మిళ్లే మిళ్లె నిరంతరం

1834 ద్వారపూడి పచ్చవువాని యెత్తు

1835 దాష్టీకానికి ధర్మంలేదు, గుడ్డికంటికి చూపులేదు

1836 దోమలు పండితే చామలు పండును

1837 దోమలేకుండా చొడియగట్టి ఒంటెను మ్రింగువారు

1838 దాసరితప్పు దండముతోసరి


, 1839 దిక్కులేనివారికి దేముడే దిక్కు

1840 దొంగకు చేను పచ్చిలేదు

1841 దొంగకు తలుపుతీసి దొరను లేపినాడు

1842 దాగబోయి తలారి యింట్లో దూరినాడట

1843 ధనము దాచినవానికే తెలియును లెక్కవ్రాసినవానికే తెలియును

1844 ధనవంతుడు భక్తిపరుడైతే సూదిబెజ్జములో ఒంటె దూరిందన్నమాట

1845 ధనియాల జాతి

1846 ధర్మం తలకాచును

1847 ధర్మంచేసేవాడు తన్ను మరుస్తాడా

1848 ధర్మపురిలో దొంగిలించబోతూ ధార్వాడనుంచి వంగుని పోయినట్లు

1849 ధర్మమే జయం దైవమేగ్తి

1850 ధర్మానికి దండుగలేదు వెట్టికి పైసలేదు

1851 ధీరుడైనా కావలె దీనుడైనా కావలె

1852 ధూపంవేస్తే పాపంపొతుంది

1853 ధైర్యములేనిరాజు యోచనలేనిమంత్రి

1854 ధ్వంసపారాయణం దంటు మంట

1855 ధాష్టీకానికి ధర్మమూలేదు గుడ్దికంటికి చూపూలేదు