లోకోక్తి ముక్తావళి/సామెతలు-దూ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

1785 దుబ్బుకాగెడు వెన్ను మూరెడు, దూసితే దోసెడు, వూదితే యేమీలేదు

1786 దుమ్ముపోసి అంబలి కాచినట్లు

1787 దురాశ దు;ఖముచేటు

1788 దుర్మార్గమునకు తండ్రి బద్ధకము

1789 దుష్టునికి దూరముగా వుండవలను

దూ

1790 దూడ కిడిచినట్లా దుత్తలలో పడ్డట్లా

1791 దూడకుడిస్తే గాని ఆవు చేపదు

1792 దూడచస్తే కమ్మలం (దూడ లేని పశువుపాలు) గేదెచస్తే నిమ్మళం

'1793 దూడపాలు దుత్తకాయె

1794 దూడలేని పాడి దు:ఖపుపాడి

1795 దూడ బర్రెవుండగా గుంజ అరజినట్లు

1796 దూబరతిండికి తూమెడు, మానవతికి మానెడు

1797 దూరపు కొండలు నునుపు

దె

1798 దెబ్బకు దెయ్యంసహా హడలుతుంది

దే

1799 దేవుడిచ్చునేగాని తినిపించునా

1800 దేవుడితోడు నామీద దయవుంచు