లోకోక్తి ముక్తావళి/సామెతలు-తొ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తే

1676 తేనెతుట్టలు పున్నానికి పూత అమావాస్యకు ఆరగింపు

1677 తేనెవున్నచోట ఈగలు పోగవుతవి

1678 తేరగాడికి యేమిరా తెల్లజొన్ననూక

1679 తేరగా వస్తే మాఅన్న యింకొకడునాడు

1680 తేమానెం తెగబారెడు

1681 తేరిసొమ్ము బీరపీచు

1682 తేలుకుపుట్టి చలిపురుగైనట్లు

1688 తేలుకు యెవరపకారం చేసినారు

1685 తేళ్ళల్లోకొండి పాముల్లో పడిగ

తొ

1686 తొంగున్న సుంకరీ తలమూట దింపు అన్నట్లు

1687 తొండకు తోటసాక్షి

1688 తొండముదిరి వూసరివెల్లి అయినట్లు

1689 తొంభైతొమ్మండుగురుచేరి తోలుచిరగబొడిచినట్లు

1690 తొక్కలేనమ్మ తొక్కులో నీళ్లుపోసిందట

1691 తొత్తుకు సివమెత్తితే ముక్కకమానునా

1692 తొలకరి చెరువునిండినా తొలుచూలు కొడుకు పుట్టినా లాభము

1693 తొలకరివానలు మొలకలకు తల్లులు 1694 తొత్తువలెపాటుపడి దొరవలె తినవలెను

1695 తొలియేకాదశికి తొలితాటిపండు

తో

1696 తోకవడ్లుపంట యెన్నుకోత నేస్తం

1697 తోకతొక్కిన పామువలె లేచినాడు

1698 తోచీతోచనమ్మతోడుకోడలు చెల్లెలుపెళ్ళికి వెళ్లిందట

1699 తోటకూరకు కడిగిపెట్టినయెసరే చాలును

1700 తోడేటిని గొర్రెలు కాయపెట్తినట్లు

1701 తోరణములేనిపెండ్లి వీరణములేనిబాజా యుండవు

1702 తోలుతియ్యకనే తొనలు మెంగేవాడు

1703 త్రాగుటకు ముందు వ్రాతకు వెనుక

1704 తల్లినిబట్టి పిల్ల, విత్తునుబట్టి పంట

1705 తనకు తెలిసినవన్నీ తలగడ చెప్పేటట్టుంటే తగిన వాళ్లెందరో తలవంచుకోవలసి వస్తుంది

1706 తవిటికివచ్చిన చెయ్యే ధజమునకు వస్తుంది

1707 తన్నేకాలుకు రోలు అడ్డమైనట్లు

1708 తాదినతౌడులేదు వానికిఒక పందిపిల్ల

1709 తీగెకు కాయబరువా

1710 తుళ్లేయెద్దే గోనె మోసేది


1711 తెగువ దేవేంద్రపదవి

1712 తేరగుఱ్ఱము తంగేడుబరికె

1713 తొండకు వెలుగుసాక్షి