లోకోక్తి ముక్తావళి/సామెతలు-చె

వికీసోర్స్ నుండి

చూ

1328 చూచిందిపాము కరచింది దోమ

1329 చూచిందెల్లా సుంకము సాశిందల్లా వంశము

1330 చూచిరమ్మంటే కాల్చివస్తాడు

1331 చూడగా చూడగా గుఱ్ఱం గాడిదయింది

1332 చూడచుంచెలుక గోడత్రవ్వ పందికొక్కు

1333 చూడచుట్టము మ్రొక్క దైవమూ లేదు

1334 చూడబోతే చుట్టాలు రమ్మంటే కోపాలు

1335 చూడవచ్చినవారికి శుక్రవారమేమిటి

1336 చూస్తే సుంకం చూడకుంటే బింకము

1337 చూడక తిరగక చూస్తూ చెయ్యవలసినది

1338 చూస్తేనీది చూడకుంటే నాది

చె

1339 చెంబు కంచముపోతే మొఖంమీద కొట్టినట్లు ముంతామూకుడు తెచ్చుకోలేనా

1340 చెట్టుకొట్తి పైనవేసుకున్నట్లు

1341 చెట్టుచెడే కాలానకు కుక్కమూతి పిందెలు

1342 చెట్టు నీడకుపోతే కొమ్మవిరిగి మీదపడ్డట్టు

1343 చెట్టుముందా విత్తుముందా అన్నట్లు

1344 చెట్టు యెక్కించి నిచ్చెన తీసినట్లు

1345 చెట్టువేసినవాడు వొకడు ఫలమనుభవించే వాడొకడు

1346 చెట్టు యెక్కేవాణ్ణి యెంతవరకు తొయ్యవచ్చు 1347 చెడి చెన్నాపట్నంచేరు

1348 చెడిపోయిన బ్రాహ్మణునికి చచ్చిపోయిన ఆవుదానం

1349 చెడి స్నేహితుని యింటికి వెళ్ళవచ్చునుగాని చెల్లెలింటికి వెళ్ళగూడరు

1350 చెడేవాడు అబ్బడున్నాడు మరిపిడికెడుతేరా దానం చేస్తాను

1351 చెడ్డకాపరమునకు ముప్పేమిటి మొండికాలుకు చెప్పేమిటి

1352 చెడ్డచేనుకు మూడుమంచేలా

1353 చెడ్డచేనుకు యింటివడ్లు పొంగలా

1354 చెడ్డాపడ్డా చేబ్రోలేగతి

1355 చెప్పి తేసిగ్గు దాస్తేదు:ఖము

1356 చెప్పినంత చేసేవారు శివునికన్న వేరేలేరు

1357 చెప్పినబుద్దీ కట్టినబిద్దీ నిలువదు

1358 చెప్పుకింద తేలు

1359 చెప్పుడుమాటలకన్నా తప్పుడుమాటలు నయం

1360 చెప్పులవానికి చేనంతా చెప్పులు కప్పినట్లగుపడుతుంది

1361 చెప్పులు చిన్నవని కాళ్లు తెగగోసుకున్నట్లు

1362 చెప్పేవాడికిసిగ్గులేకపోతే వినేవాడికి వివేకమైనావుండద్దా

1363 చెయ్యిచూపి అవలక్షణం అనిపించుకున్నట్లు

1364 చెరుకుండేచోటికి చీమలు తామే చేరుతవి

1365 చెట్టులేనిచేను చుట్టములేనియూరు కష్టము

1366 చెట్లుమొండయితే చేరికలో వాన

1367 చెడగొట్టి శనగ ఆముదాలు 1368 చెడినచేను చెరకురాజనాలు పండునా

1369 చెప్పకపోయినా పిచ్చకొమ్ములయెద్దును కొనుము

1370 చెఱకుతినడానికి కూలియివ్వవలెనా

1371 చెరుకుతీపిఅని వేళ్ళతో తినవచ్చునా

1372 చెరుకా బెల్లముపెట్టమంటే పెట్టనా

1373 చెరుకుపండితే కొఱత లేదు

1374 చెరుకువంకపోతే తీపిచెడునా

1375 చెరపుకురా చెడేవు పురకకురా పడేవు

1376 చెరువుమీద కోపంవచ్చి మడ్దికడుగమానినట్లు

1377 చెరువుఓడు ఊరుపాడు

1378 చెలిమిని చేదు తినిపించవచ్చును గాని, బలిమిని పాలు త్రాగింపలేము

1379 చెల్లీచల్లడములకు శెట్టిగారున్నారు

1380 చెవిటిపెద్దమ్మా చాంతాడంటే చెవులపోగులు నా జన్మానా యురుగనన్నదట

1381 చెవిటివానివద్ద శంఖమూదితే అది కొరకడానికి నీ తండ్రి తాతలతరం గాదన్నాడట

1382 చెవుడు చెవుడూంటే తవుడుతవుడన్నాడట

1383 చెవ్వాకుపోయునమ్మ కెంతవ్యసనమో, దొరికినమ్మకంత సంతోషం

1384 చెవిటికి శంఖూదినట్లు

1385 చెరువునిండితే కప్పలు చేరుతవి

1386 చెల్లనికాసు ఎన్నడూచెల్లదు వల్లనిమగడు ఎన్నడూవల్లడు