లోకోక్తి ముక్తావళి/సామెతలు-కీ

వికీసోర్స్ నుండి

కీ

919 కీ వెరిగి కాటో, రే నెరిగి దాటొ, జా గెరిగి బైటో

920 కీడెంచి మేలెంచవలెను

కు

921 కుంచములో కదుళ్లు పోసినట్లు

922 కుంచెడు గింజలు కూలికిపోతే తూమడుగింజలు దూడ తిన్నదట

923 కుంచెడు బియ్యం గుమ్మడికాయ

924 కుంటికులాసం యింటికి మోసం

925 కుంటి గాడ్దెకు జూరిందే సాకు

926 కుంటెద్దు రానిది దూల మెత్తరు

927 కుండలోకూడు కూడుగానే వుండాలి, పిల్లలుదుడ్డలై వుండాలి

928 కుండల్లో గుర్రాలు తోలేవాడు

929 కుందేటి కొమ్ము

930 కుంపట్లో తామర మొలచినట్లు

931 కుక్క అమేధ్యము తిన్నది

932 కుక్క ఆశ గుండ్రాతితో తీరును

933 కుక్కకాటుకు చెపుదెబ్బ

934 కుక్కకు నెయ్యి యెక్కడైనా యిముడునా

935 కుక్కకువచ్చేవన్నీ గొగ్గిపండ్లు

936 కుక్కతీసినకొయ్యా నక్కతీసిన కొయ్యా