లోకోక్తి ముక్తావళి/విన్నపము

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

విన్నపము

"సామెతలు ప్రసంగానికి దీపాలు" ప్రసంగిస్తూ ఒక్క సామెతను ప్రయోగించామంటే అది ప్రసంగానికి అందమును, కాంతిని దెచ్చును. సామెతలో ధ్వని ఉంటుంది. సమయోచితముగ ప్రసంగములో ఒక సామెతను కలిపామంటే, పాలలో పంచదార కలిపినట్లుండును. తర్వాత వాటిని గ్రంధ రూపోమున ప్రకటింపవలయునని కోరిక గలిగి 1939 సంవత్సరములొ కొంతమంది మిత్రుల సహాయ్హముచేయ నుద్ధేశించితిని. కాని దైవ్ము ప్రతిఘటించ ఆ ప్రయత్నము అంతటితొ విరమింపవలసినవాడానైతిని. కాని అప్పటినుండి వాటియందుండు వ్యామోహముచే, కాకతాళీయ న్యాయముగ లభించు మతలను సేకరించుచుంటిని. ఈ మధ్య శ్రీయుత పిశిపాటి కృష్ణమూర్తిగాని స్నేహఫలము (వదకబోవు తీగెకాళ్ళకు దగిలె "నన్నట్లు)లభించినది. వారితో ప్రసంగవశమున ఈ విషయము ముచ్చటించగ, వారు కూడ అదే మనోరధముగలిగి, వారిచే చిరలాలముగ సమకూర్పబడిన సుమారు 3400 సామెతలను, అడుగుటయే తడవుగ నాకిచ్చి నాచే సంపాదింపభడిన కొలది సామెతలతో నిమిత్తము లేకుండగనే వారిచ్చిన వాటినే ముద్రించి లోకమునకు అందియ్యవలసినదిగ చెప్పి ప్రోత్సాహించిన వారియొక్క సహాయ సంపత్తితో నేటికైనను ఈకార్యమునందు కృతకృత్యుడనైనందుకు నే నెంతయు ఢన్యుడను. అడిగిన మాత్రముననే తనచే సంపాదింపబడిన సామతలను నాకిచ్చిన శ్రియుత పిశిపాటి కృష్ణమూర్తిగారికి నాధన్య్హవాదములు.

"తెలుగు సామెతలు" సముద్రమువలె అంతులేనన్ని ఉన్నవని నేడు భావించుచున్నాను. ఈ చిన్న పొత్తమును ఆధారము చేసుకొని ముందుతరములవారు వాటిని యింకా విపులీకరించి, వీలైనన్ని ఎక్కువగ క్రోడీకరించి, లోకకళ్యాణకారు లగుదురుగాక!

ప్రమాదవశమున సంభవించిన అచ్చు తప్పులను సంధులు మన్నించెదరుగాక!

తెనాలి, 7--8--`955

ఇట్లు

ఫిల్లమఱ్ఱి లక్ష్మీనారాయణ ప్రకాశకులు