లేకయా నిన్ను జుట్టుకొన్నారు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

అసావేరి రాగం - ఆది తాళం


పల్లవి

లేకయా నిన్ను జుట్టుకొన్నారు ?

ఏకహృదయులై నిత్యానందము


అనుపల్లవి

శ్రీకర ! కరుణాసాగర ! నిరుపమ

చిన్మయా ! శ్రిత చింతామణి ! నీయెడ


చరణము 1

సౌందర్యములలో సుఖము సీతమ్మకు,

సౌమిత్రికి గనుల జాడల సుఖము


చరణము 2

సుందర ముఖమున సుఖము భరతునికి,

సుజ్ఞాన రూపమున సుఖము రిపుఘ్నునికి


చరణము 3

చరణ యుగమునందు సుఖమాంజనేయునికి

వరగుణ త్యాగరాజ వరదా ! నందము