లవణరాజు కల

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


లవణరాజు కల గురజాడ అప్పారావు రచించిన కవిత.


నిండు కొలువున లవణుడను రా
జుండె, జాలికు డొకడు దరి జని,
"దండి నృప ! వొక గండు గారడి
కలదు కను" మనియెన్.

అల్ల పింఛ్ఛము నెత్తి నంతనె
వెల్ల గుఱ్ఱం బొకటి యంచల
పల్లటీల్పస నొడయు నుల్లము
కొల్లగొని వచ్చెన్.

వచ్చి నిలిచిన వారువంబును
యచ్చెరువు పై కొన్న చూపున
మచ్చ మేరలు గనక చూసెడి
నృపుని కత డనియెన్.

"ఉత్తమాశ్వం బిది నరేశ్వర !
చిత్ర గతులను సత్వ జవముల
చిత్త మలరించేని, జను మిక
మనసు గల చోట్లన్."

చూపుదక్కగ చేష్ట లుడిగెను
చూపరులు వెరగంద నృపునకు;
యేపు చెడి, వొక కొంత తడవున
కెరిగి, నలుగడలన్.

"https://te.wikisource.org/w/index.php?title=లవణరాజు_కల&oldid=26321" నుండి వెలికితీశారు