రావే తల్లి మా యింటికి
అఠాణ రాగం - మిశ్రచాపు తాళం
[మార్చు]పల్లవి:
రావే తల్లి మా యింటికి లక్ష్మీ దేవి
నిన్నే నమ్మితి నెప్పటెప్పటికి
సావధానముగ వినవే నా మనవి
జనవినుతమగు నీ సేవ చే దీరుగదని వి
భావ జనని భక్త పోషిణి పరమ
కరుణా రసావేశ
మావతుల నాదుకొనవే హృదయమున
పాదుకొనవే ||
చరణం 1:
నిన్ను వేడితి చాల
ఉల్లసిల్లు నీ గుణము గొనియాడితి
ఫుల్ల సారస సల్లలిత వదనా
మదనారి సోదరి
కల్లగాదమ్మా నిన్ను విడిచెదనా
యెల్ల లోకములకును నీవే
తల్లివిగదా సదా నీ దయ వెల్లి విరియగ
నా మనవి వినవే నన్నుంగనవె జనని ||
చరణం 2:
కలకాలము నీవే గతిగా నిన్నే తలచి కొలచి
డెందము నిల్పితిగా
కలదే నీ బిడ్డ యెద వేరొక చలము
కలుముల మిఠారి
నిలువ నీడవు నీవు కావ
బలము కలుగదా జగదాదిదేవుడగు
గదాధరు పేరురము నీ కిల్లుగదా
కోరితిని నీ సాయమమ్మా యమ్మ ఇక రారా ||
చరణం 3:
ఆదరించుము నన్నిపుడు నీదు
పాదసేవకుడయ్యె సమరాధిపుడు
మోదమున నిన్ను వర్ణింపగా దరమే
పరమేశ్వరీ యల
వేదములకైన నది దుస్తరమే శ్రీదలిర్పగ
సకల సంపచ్చిదహి దయసేయు
మిక దాసు కులోదయుండను
రాముడ యండగా నుండగా నిక ||