రామ నీ దయ రాదుగా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


    ళహన రాగం         త్రిపుట తాళం


ప: రామ నీ దయ రాదుగా పతిత పావన

నామమే బిరుదుగా శ్రీ రామా || రామ ||


అ.ప: సామజ వరదా నిన్నేమని దూరుదు

ఏమి యదృష్టమో ఎంత వేడిన రావు || రామ ||


చ 1: ఈవు లడుగ జాలగా శ్రీపాద

సేవ మాకు పదివేలుగా రామ

భవజనక నీ భావము తెలిసియు

నీ దైవమనుచు నే నమ్మియున్నాను || రామ ||


చ 2: నీకే మరులు కొంటిగా నే నితరు

లకు లోనుగాక యుంటిగా రామా

ఆకొన్నవాడనై యనవలసి యుంటి గాని

నీకు దయరాకున్నా నే నేమిసేయువాడ || రామ ||


చ 3: ప్రేమ నిబ్బరమాయెగా భద్రాచల

ధామాయని మేమో మాయెగా రామా

భూమిజ నాయక నా స్వామి నీ వనుచు

కామించు రామదాసుని బ్రోవ || రామ ||

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.