రాజశేఖరచరిత్రము/పీఠిక

వికీసోర్స్ నుండి

రాజశేఖరచరిత్రము

ఈ రాజశేఖరచరిత్రమును రచించిన కవి మాదయ్యగారి మల్లన్న. ఈతనికి పూర్వము ఏకాదశీమాహాత్మ్యమును రచించిన ప్రౌఢకవి మల్లన్న యొకడుండుటచేత నీతనిని మాదయ్యగారి మల్లన్న యనుచుండిరి. ఈత డఘోర శివాచార్యుని శిష్యుడు. శౌనకగోత్రుఁడు, అయ్యంకిపురాగ్రహారస్వామి. అయ్యంకి గ్రామము కృష్ణామండలములోని చల్లపల్లి సంస్థానములనిది. ఈతడు రచించిన రాజశేఖరచరిత్రము మూఁడాశ్వాసముల రసవత్కావ్యము.

క. చెప్పఁదగుఁ గవిత రసముల్
     చిప్పిల నప్పప్ప బళిబళీ యనలేదా
     యెప్పుడుఁ జేయక యుండుటె
     యొప్పుఁజుమీ సుకవి కెంత యుచితజ్ఞుడొకో.

ఈతని కవిత్వము నిర్దుష్టమై ప్రౌఢభావవిలసితమై, రసవంతమై, యనర్గళధారావిలసితమై, మనోజ్ఞకముగా నుండును.

శా. గాఢార్ధప్రతిపాదన క్రమకళాకౌశల్యము ల్లేక, వా
     చా ఢక్కార్భటితోడఁ దామ తము మఝ్ఝాయంచుఁ గైవారముల్
     ప్రౌఢిం చేయుచుఁ బ్రాజ్ఞులన్నగుచు గర్వగ్రంధు లైయుండు న
     మ్మూఢస్వాంతుల మెచ్చకుండుటయె సమ్మోదంబు మాబోంట్లకున్.

అని కవితారచన కొకమార్గమును నిర్దేశించి యట్లే తన కావ్యమును నిర్వహించెను.

ఇతర ప్రబంధముల వలె వర్ణనాబాహుళ్యముతో సరిపెట్టి కథావస్తువును పెండ్లి, వేటలతో సరిపెట్టక కళాపూర్ణోదయమువలె, విచిత్రతరకల్పనలు పొంపిరి పోవునట్లు కథావైచిత్రిని గల్పించి, తన యనల్పకల్పనాకౌశలిని వెల్లడించెను.

కవికాలనిర్ణయమునకు కృతిపతి నాదిండ్ల అప్పామాత్యుని కాలము సహకారిగా నున్నది. నాదిండ్ల అప్పామాత్యుఁడు ఆఱువేల నియ్యోగి బ్రాహ్మణుఁడు. కృష్ణమాంబా కుమారుడు. మంతియు, దండనాథుడును. ఈతడు శ్రీకృష్ణ దేవరాయని మంత్రియైన తిమ్మరుసుమంత్రికి అల్లుడు. ఈ అప్పామాత్యుఁడు తిమ్మరుసుమంత్రి కూతురు తిరుమలాంబను వివాహమాడిన ట్లీపద్యములలో వర్ణించెను.

సీ. ఏమంత్రిమణి నిజస్వామికార్యక్రియాతత్పరమానసోత్సాహశాలి
     యేమంత్రిమణి మిత్రహితబాంధవాశ్రితప్రకరరక్షణకళాప్రౌఢబుద్ధి
     యేమంత్రిమణి వచోహేలాతినైర్మల్యశీతలతాధూతశీతరోచి
     యేమంత్రిమణి సుధాధామశాంభవధామధాళధళ్యసుతుల్యధవళకీర్తి
గీ. యట్టి మంత్రికులోత్తంస మహితనృపతి, పటలమకుటాగ్రఘటితపత్పద్మయుగళి
     సకలకర్ణాటరక్షోవిచక్షణుండు, దీనసురశాఖి సాళువతిమ్మమంత్రి

గీ. అమ్మహామంత్రి కతనియర్ధాంగలక్ష్మి, సకలపుణ్యాంగనాజనశ్లాఘనీయ
     లక్ష్మమాంబకు నుదయించి లలిని మెఱయు, తిరుమలాంబికఁ బెండ్లియై తేజరిల్లె.

కావున నీకవి శ్రీకృష్ణ దేవరాయలకాలము అనగా 1540 సంవత్సరప్రాంతమున నుండెననుట నిర్వివాదము.

కవితాశైలి దెలియుట కీక్రిందిపద్యము లుదాహరింపబడుచున్నవి.

ఉ. చెప్పిడి దేమి నవ్వుచు రచించినమాటలు రాము బాణముల్
     దప్పినఁ దప్పఁ డాశ్రితకలాపము ముంగిటనున్న వేలుపుం
     దిప్ప వివేకశాలి యువతీజనచిత్తవినూత్నదర్శకుం
     డప్పనమంత్రి వానిఁ దరమా నుతియింప నిలింపకోటికిన్.

ఉ. రాహువుఁగాను నిన్నరగ రాచిన శూలినిగాను నీతను
     ద్రోహము చేసినట్టి యలరోహిణి తండ్రిని గాను దజ్జగ
     న్మోహిని నీలనీలకచ ముద్దులచక్కెరబొమ్మఁ గూర్ప క
     య్యో! హరిణాంకతావకమయూఖముఖంబుల నేచ నేటికిన్.

మ. కటిశాటీభవదేణకృత్తితనుజాగ్రన్నాకులేకాగ్రదృ
     క్పుటి లాలాటసమర్పితాంజలి రమాంభోజాననానాయకో