రతిరహస్యము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

తృతీయాశ్వాసము

వశీకరణాధికరణం

చతుర్థశః పరిచ్ఛేదః

క.

శ్రీనిత్యభవ్యమందిర
మానితరేఖావిలాసమండన నానా
స్థాననుతచతురవితరణ
భానునిభా కుంటముక్ల భైరవమల్లా.

యోగప్రకరణము

శ్లో.

దృష్ట్వానేకవిధాని మన్మథకళాశాస్త్రాణి శబ్దార్ణవం
సోడ్డీశం హరమేఖలాంచ నిఖిలాం యోగావళీనాంశతమ్।
తిస్రో వైద్యకసంహితా బహువిధానాలోచ్య శైవాగమాన్
యోగాధ్యాయమహం మహాజనమతం వక్ష్యామి సంక్షేపతః॥


శ్లో.

యూనోర్మిథో౽నురాగాభరణం కామోధివసతి రతికేళిమ్।
సహజాధేయవిభాగాదనురాగశ్చ ద్విధా భవతి॥

సీ.

శైవాగమము వైద్యసంహితయును మన్మ
                 థాగమములును శబ్దార్ణవంబు
నొడ్డామరంబును నొడ్డికమును హార
                 మేళనంబును నాదిమీననాథ
కచ్ఛపుటాది నాగార్జునమతములఁ
                 బరికించి బహువిధభంగులైన
మంత్రౌషధక్రియామతములు తత్ప్రయో
                 గంబుల నెఱిఁగి యాక్రమము దెలిసి


గీ.

సకలజనసమ్మతంబుగా సంఘటించి
పురుషులకుఁ గాంతలకుఁ బరస్పరగుణాను
రాగభూషణమైన యీరతిరహస్య
తంత్ర మెఱిఁగింతు సంక్షేపతరనిరూఢి.


తా.

శైవాగమము, వైద్యసంహిత, మన్మథాగమము, శబ్దార్ణవము, ఒడ్డా
మరము, ఒడ్డికము, హారమేళము, నాగార్జునము, మొదలగు పుస్తకములనుండి
యనేకవిధములగు మంత్రౌషధక్రియలను వానియుపయోగముల నెఱింగి సర్వజను
లును దెలుసుకొని పురుషులు స్త్రీలు యొకరిపై యొకరు ప్రేమగలిగియుండుటకు
సంక్షేపముగా యీరతిరహస్యతంత్రము నెఱింగించుచున్నాడను.


శ్లో.

వేగాదీని తదంగాన్యప్యంగీకుర్వతే ద్విధా వృద్ధాః।
తస్య తదంగానామితి మంత్రౌషధవిధయ ఉచ్యన్తే॥


క.

మంత్రౌషధంబు లనఁగాఁ
దంత్రజ్ఞలు వీనిఁ దెలిసి తాత్పర్యమునన్
మంత్రింతురు గావున నీ
మంత్రపువిధిఁ జెప్పి పిదప మందు వచింతున్.


తా.

మంత్రౌషధములనిన తంత్రముల నెఱింగినవారు వీనిని తెలిసికొని
దృఢాభిప్రాయమున మంత్రింతురు. కనుక మంత్రములను తెలిపి పిదప మందు
లను గుఱించి చెప్పెదను.

శ్లో.

లక్షాం జప్త్వా హుత్వా తద్దశమాంశేన కింశుకైః సిద్ధః
తదను చ దీపశిఖాభః ప్రవేశితో రేచకేన భగమ్।
గత్వా శిరస్సరోజం గలదమృతం కామకమలమాగచ్ఛన్
ధ్యాతో ద్రవయతి వశయతి శర్షతి కామేశ్వరః కాన్తామ్॥


క.

కామేశ్వరాఖ్యమైన మ
హామంత్రము లక్ష చేసి యందు దశాంశన్
హోమము మోదుగపువ్వుల
చే మలపిన మంత్రసిద్ధి చేకుఱునంతన్.


తా.

కామేశ్వరమంత్రము లక్షపర్యాయములు జపము చేసి మోదుగపువ్వు
లచేత పదివేలపర్యాయములు హోమము చేసిన కామేశ్వరమంత్రసిద్ధి కలుగును.


సీ.

ప్రణయపూర్వకముగాఁ బఠియించి యేకాక్ష
                 రంబైన యీమంత్రరాజవిద్య
విధిఁ బునశ్చరణఁ గావించి యంతటనల్ల
                 మంత్రంబు దీపాగ్ని మాడ్కిఁగాఁగ
ధ్యానంబు చేసి యత్తరుణి గుహ్యమున రే
                 చకమార్గమునఁ బ్రవేశమును జేయ
నది మీఁది కెక్కి మూర్ధాంతంబునందున్న
                 వెలిదమ్మి నొయ్యన విరివిఁ జేసి


ఆ.

యందులోని యమృత మల్లనఁ గరఁగించి
మరునిజలము వరుస దొరలునట్లు
వలఁపుఁ బుట్టఁజేసి వాంఛింపఁగాఁ జేసి
వశము సేయు నెట్టి వనితనైన.


తా.

ఓం, క్లీం, నమః, అను శ్రేష్టమగు నీకామేశ్వర మంత్రమును విద్యు
క్తముగా జపమొనరించి పిమ్మట యీ మంత్రమును దీపాగ్నివలె ప్రార్థించి స్త్రీ
యొక్క భగమందు రేచకమార్గముగా బ్రవేశింపచేయగా నది శిరస్సున కెక్కి
అందున్న కమలమును వికసింపజేసి అందున్న యమృతమంతయు కరిగించి మదన
జల ముప్పొంగునటులొనర్చి ప్రేమకలుగునటులబన్ని యిచ్చ నొడమజేసి ఎటు
వంటి స్త్రీనయినను వశము చేయును.

కామేశ్వరమంత్రవిధానము

శ్లో.

ఆదౌ కామేశ్వరతః సాధ్యానామ ద్వితీయయా యుక్తమ్।
ఆనయ నయ వశతామితి పరతః క్షంకారమోంకారాత్॥


శ్లో.

అయుతం జప్త్వా హుత్వా తద్దశాంశేన కింశుకం కదంబ వా।
సాధిత ఏష నిశాయాం కర్షతి వరవర్ణినీం జప్తః॥


చ.

మొదలను గామరాజ మిడి ముందట రుద్రుని పేర బీజము
ల్గదియఁగ నిల్పి యానయయుగం బిడుచుం బ్రణవాక్షరంబుల
న్బొదవుచుఁ దత్సహస్రజపమున్ జపయుక్త మొనర్చి వేలిమి
న్పదియవపాలు బ్రహ్మకుసుమంబులఁ జేసినఁ దెచ్చుఁ గామినిన్.


తా.

ఓం అను కామేశ్వరమును, క్లీం, అను బీజాక్షరమును కలిపి యుచ్చ
రించుచు తానుకోరు స్త్రీ పేరు నుచ్చరించి, మానయ, నయ, యను పదములను
గూర్చి వశతాం యను యాకర్షణబీజమును, ఓంకారమేళము నుచ్చరించుచు
నీవిధముగా పదివేలు జపమొనరించి మోదుగుపువ్వులచేత వెయ్యిహోమము చేసిన
నాస్త్రీ వశురాలగును. ఇందుకు ఉదాహరణము; — ఓం, క్లీం, ........................
మానయ నయ వశతాం ఓం క్షాం నమః, మఱియు నీమంత్రము తుదను జపకాల
మందు నమః అనియు హోమకాలమందు స్వాహా అనియు నుచ్చరించునది.


శ్లో.

ఉరసి లలాటే మన్మథ సద్మని సంచిన్తితా చ కుండలినీ।
ధ్రువమాకర్షయతి వశయతి విద్రావయతి జ్వలద్రూపా॥


శ్లో.

కాన్తాసు కామదేవో వాచి చ వాచస్పతిర్గతే గరుడః
జప్తైః సప్తభిరస్యా లక్ష్మైస్సాక్షాత్స్మరో భవతి॥


శ్లో.

వింశతిసహస్రజాపాత్తదర్ధ హోమేన పాటలాయాశ్చ।
సిద్ధిం వ్రజతి సబిన్దుః స్వరోష్టమః సర్వసిద్ధికరః॥


సీ.

ప్రణవమాయోనమః పదములఁ గూడఁ గుం
                 డలినామమంత్రంబు వెలయుచుండు
నీమూఁడువర్ణంబు లింతులకుచముల
                 ఫాలంబునను గుహ్యభాగమునను
హత్తంగఁదలఁచిన నాకర్షణంబును
                 వశ్యంబు నధికద్రవంబుఁ జేయు

నీమంత్రజప మొకయేడులక్షలుఁ జేయ
                 మన్మథుండౌ నెల్ల మానినులకు


గీ.

వివిధవాగ్విద్యగురుఁ డగు విషయమునకు
ఘనుఁడు నగు, బిందురూపమోంకార మొక్క
జపము వింశతిసాహస్రసంఖ్య చేయ
వేలుపది కలగొట్టులు వేల్వమేలు.


తా.

ఓం, హ్రీం, నమః, ఇది కుండలినీమంత్రము, ఈ మూడువర్ణంబులగు
కుండలినీమంత్రము స్త్రీని ధ్యానించి దాని చన్నులయందును ఫాలభాగమునను
భగప్రదేశమునను కూడునటుల దలంచిన కుండలినీశక్తి స్త్రీకి ఆకర్షణమును వశ్య
మును పరవశత్వమును కలుగజేయును. మఱియు నీమంత్రమును ఏడులక్షలు
జపముజేసిన సర్వకాముకస్త్రీలకు మన్మథునివలె తోచును. మఱియు నీమంత్ర
మును ఇరువదివేలు జపమును కలిగొట్టుపువ్వులతో పదివేలు హోమము చేసిన మాట
కారియు యౌవనముగలవాడును అగును.


శ్లో.

పీతాసితసితరక్తైః కంఠహృదయవదనమదనసదనేషు।
ఈశం ద్విషం చ వాణీం వశయతి రమణీమపి ధ్యాతః॥


శ్లో.

ఓంచాముండే హుళుహుళు చుళుచుళు వశమానయాముకీం స్వాహా।
అభిమన్త్రస్య సప్తకృతో వశయతి తాంబూలదానేన॥


సీ.

పసుపువర్ణంబును బాండువర్ణంబును
                 నలుపును రక్తవర్ణములు గాఁగ
నష్టమస్వరము జప్యంబున నెలకొల్పి
                 కంఠముఖహృదయకామగృహము
లందుఁ గ్రమంబునఁ బొందించి ధ్యానంబు
                 సరవితోఁ జేసిన దరతరంబు
ప్రభు శత్రు ధనికుల భామినీమణులను
                 వశముగాఁ జేయు భావము గలంచి


గీ.

 ప్రణవచాముండ లుజ్వలపదయుగంబు
సరవి వశమానయంక్లీముస్వాహ యనుచు

నేడుమార్లటు మంత్రించి వీడె మిడిన
మించి చాముండ వశము గావించుఁ బ్రియను.


తా.

పసుపు, తెలుపు, నలుపు, యెఱుపు, ఈ వర్ణములను వరుసగా మెడ,
ముఖము, ఱొమ్ము, భగము, వీటియందు ౠం అనే అష్టమస్వరసహితముగా
కామేశ్వరమంత్రమును ధ్యానించి జపించి ప్రయోగించినయెడల నెట్టిస్త్రీనయినను
వశము చేయును. మఱియు "ఓం చాముండే హుళుహుళు చుళుచుళు వశమాన
యాముకీం స్వాహా" అను ఈచాముండమంత్రముచేత తాంబూలమును ఏడు
మార్లు మంత్రించి స్త్రీ కిచ్చిన చాముండ యాస్త్రీని వశము కావించును.


శ్లో.

లక్షైకజాపపూర్ణం దశాంశతిల హోమసిద్ధహృల్లేఖా।
ఆకర్షతి దుర్గమపి సూర్యోదయసమయజాపేన॥


చ.

జప మొకలక్ష చేసి తిలజంబున వ్రేల్మి దశాంశఁ జేసి యా
తపనుఁడు వచ్చువేళ నిది దాల్చిన దుర్గఁ దలంచి తెచ్చుఁ బో
రపమున మంత్రము న్బ్రణవరాజముతోఁ గదియింపఁజేయుఁ డీ
విపులత హృద్యలేఖ యనువిద్య మహామునిసమ్మతంబుగన్.


గీ.

ప్రణయహృల్లేఖసంబుద్ధిపరము నిల్పి
కడఁకతోడ మదద్రవకామరూపి
ణీ పదంబగస్వాహానునీతమైన
మంత్రవేదులు హృల్లేఖమంత్ర మనిరి.


తా.

"ఓం హృల్లేఖే మదద్రవే కామరూపిణీ స్వాహా" అను యీహృల్లే
ఖమంత్రము నొకలక్ష జపించి నువ్వులచే పదివేలు హోమము జేసిన నీహృల్లేఖమం
త్రము సిద్ధిపొందును. మఱియం సూర్యోదయకాలమందు నీహృల్లేఖమంత్రము
జపించిన దుర్గాదేవి ప్రత్యక్షమగును.


శ్లో.

ఓంమదమద మాదయమాదయ హంసౌంహ్రీం రూపిణీం స్వాహా।
సాధ్యో౽యమయుతజాపాదరుణకుసుమదశమభాగహోమేన॥


శ్లో.

అథ కామధామవినిహితవామకతానామికేన పరిపఠితః।
భటితి ద్రవయతి యువతీం నిపీడీతామిక్షుయష్టిమివ॥

చ.

మదయనుమాదయద్వయ మమర్చుచు సోమ్మను హ్రీంకృతంబున
న్బొదవుచు రూపిణీపదము పొందఁగ స్వాహపదంబు గూర్చినన్
మద యనుమంత్ర మయ్యె జపమార్గముగాఁ బదివేలు హోమమున్
బదియవపాలు రక్తదళపద్మములన్ జనవశ్యసిద్ధికిన్.


తా.

'మదమద మాదయమాదయ, హం, సౌం, హ్రీం, రూపిణీస్వాహా,'
ఇదిమాదయమంత్రము. ఈమంత్రము పదివేలు జపము చేసి యెఱ్ఱతామరపువ్వు
లతో వెయ్యిహోమము చేసిన సిద్ధి కలుగును.


క.

ఈమంత్రంబునఁ బురుషుఁడు
కామినిభగమున ననామికాంగుళ మిడుచోఁ
గామించిన ద్రవ ముబ్బును
బ్రేమంబునఁ జేరు కోల పిడిచినభంగిన్.


తా.

పైన చెప్పిన మాదయమంత్రమును జపించుచు స్త్రీభగమందు తన
యుంగరపువేలును పెట్టి త్రిప్పిన చెఱకును పిడిచిన రసముకలుగునటు లాస్త్రీభగ
మున ద్రవము పట్టును.


శ్లో.

జప్తం లక్షద్వయమథ కదంబుకుసుమార్థహోమసంసిద్ధమ్।
తూష్ణీం జప్తం తత్త్వం సతీమపి వశం క్షిప్రమానయతి॥


ఆ.

లక్షయుగము జపము లక్షహోమము కదం
బప్రసూనములను బరఁగజేయ
కాదిమాంతతత్త్వ మగునక్కరముతోడ
జపమునందుఁ దెచ్చు సతులజాడ.


తా.

హృల్లేఖమంత్రమునకు అంత్యమున ణ కారమునుతీసి వైది కకారమును
జేర్చి రెండులక్షలపర్యాయములు జపము చేసి కడిమిపువ్వులతో లక్షహోమము
జేసిన ఎట్టిస్త్రీయైనను వశమగును.


శ్లో.

నాడీం చ తాడబీజం సరోచనం కన్యయా చ పరిపిష్టమ్।
వశయతి మూర్ధ్ని వికీర్ణం సప్తాక్షరమన్త్రితం భటితి॥


క.

వేదాదిమకౄంకారము
నాది మహామాయ శ్రీయు నై తత్స్వాహా

నాదయుతంబౌ మంత్రము
నాదిగ సప్తాక్షరాఖ్యమై విలసిల్లెన్.


ఆ.

నేల తాటిగడ్డ నెలయంగ గోరోజ
నమునఁ గన్యచేత నలియనూరి
యదియు నియ్య దాని నభిమంత్రణముఁ జేసి
తల నునిచిన పతులకులము మెచ్చు.


తా.

"ఓం, క్రోం, హ్రీం, శ్రీం, ఢం, స్వాహా” ఇది సప్తాక్షరీమం
త్రము. ఈమంత్రమును జపించుచు నేలతాడిగడ్డయును గోరోజనమును కన్యచే
నూరించి యామందును స్త్రీలకు యిచ్చినను లేక తలమీద పులిమినను వశులగుదురు.


శ్లో.

ఓం చాముండే జయ జంభే మోహయ వశమానయాముకీం స్వాహా।
అభిమన్త్య పుష్పదానాత్ ప్రణవాదిరయం వశీకరణః॥


గీ.

ప్రణవచాముండజయజృంభపదము మోహ
యవశమానయాముకీంస్వాహా యటంచు
మంత్రితము చేసి పువ్వులు మగువ కనుప
వశ్య మగుఁ జూడ నెటువంటి వనితయైన.


తా.

"ఓం చాముండే జయ జంభే మోహయ వశమానయ అముకీం
స్వాహా” ఇది మోహనమంత్రము. ఈ మంత్రమువలన పువ్వులను మంత్రించి స్త్రీకి
పంపిన నాస్త్రీ వశమగును.


శ్లో.

శవశిరసి స్థితమాల్యం జీవంజీవకమయూరయోరస్థి।
సద్యకరేణ గృహీతం హిత్యావర్తోత్థీతం పత్త్రమ్॥


శ్లో.

చూర్ణం వికీర్ణమేషాం వశయతి నారీనరౌ శిరఃపదయోః।
దత్తం ధవళం కుసుమం కృష్ణాక్షీత్యాదిమన్త్రేణ॥


సీ.

పీనుఁగుతలయందుఁ బెట్టినపువ్వులు
                 నమిలియెముకయుఁ బొన్నంగిముడుసు
సుడిఁగొన్నగాలిలోఁ జడితూలు నాకును
                 గూడఁ జూర్ణము జేసి కొమ్మతలను
బురుషునిపదములఁ బొందింప వశ్యుల్
                 యలరుదు రిఁకను గృష్ణాక్షి యనెడు

మనువున సితకుసుమంబులు మంత్రించి
                 యనుపుడు ప్రణవకృష్ణాక్షి కృష్ణ


గీ.

ముఖియుఁ గృష్ణాంగియును నన్యముఖపదములు
పరఁగ పుష్పంబు దాస్యామి పరమవశ్య
వశ్యవశమానయది నభవతియదాది
బ్రహ్మరుద్రాదిభవతి నాఁ బరఁగె మనువు.


తా.

పీనుగతలయందుంచిన పువ్వులు, నెమలియెముక, పొన్నంగిపిట్ట
యెముక సుడిగాలి యందుతిరిగిన యెండుటాకు, ఈనాలుగువస్తువులు చూర్ణము
చేసి యాచూర్ణమును పురుషులు స్త్రీల తలలయందును స్త్రీలు పురుషుల పాద
ములయందును పూయగా వశులగుదురు. మరియు "ఓం కృష్ణాక్షీ కృష్ణముఖీ
కృష్ణసర్వాంగీ యస్యహస్తే పుష్పం దాస్యామి తమవశ్యం వశమానయ యది
నభవతి తదా బ్రహ్మహో రుద్రోభవతి స్వాహా" ఇది కృష్ణాక్షి మంత్రము. ఈమం
త్రిమువలన తెల్లనిపువ్వులు మంత్రించి స్త్రీకి యిచ్చిన వశ మగును.


శ్లో.

శంభుః శక్త్యారూఢః కుండలినీమండితోథ బిన్దుయుతః।
అష్టావింశతివారం వశయతి రామాం రతే జప్తాః॥


శా.

ఓంకారంబును మాయఁగూర్చి సుమతిన్ యోజింతు సత్కుండలీ
న్యంకంబై ధర నుత్తమం బగు జపం బష్టోత్తరంబౌశతిన్
సంకల్పాదిగఁ జేయ వశ్యమగు రాజద్రాజబింబాస్య దా
వంక న్ముక్కునవ్రేళ్ళు మారుతముతో వర్తింపఁ జేయందగున్.


తా.

"ఓం, హ్రీం. నమః పురస్కృత్యకంభవే” ఇదికుండలినీమంత్రము.
ఈ మంత్రము తన యెడమముక్కునుండి గాలి బయటకు వెళ్ళుసమయమున ఇరు
వదియెనిమిదిమార్లు జపించిన వశ మగును.


శ్లో.

మదనాతపత్రవదనే స్ఫటికాకారం వకారమనుచిన్త్య।
ధ్యాతం ధ్వజోగ్నిబీజం వశయతి రామాం రతే జప్తః॥


క.

మదనగృహద్వారంబునఁ
గదియ వకారంబుఁ దలఁచి కామాగ్రమునన్
విదిత రకారము దలఁచుచు
సుదతిన్ రమియింప ద్రవముఁ జూపున్ వలచున్.

తా.

స్త్రీయొక్క భగద్వారమున వకారమును తనదండాగ్రమున రకా
రమును ధ్యానమునం దుంచి రమించిన స్త్రీ ద్రవించి వశమగును.


శ్లో.

వామదృశో వామాంగే వామకరేణైవ వామగే వాయౌ।
తద్వద్భృశముపచారః కుచోరుకరకానుభవనేషు॥


చ.

వనరుహనేత్ర వామకరవక్త్రకుచోరుభగస్థలంబులన్
దనదగు వామనాడి పవనంబు చరింపఁగ వామహస్త సం
జనితమహోపచారములు సల్పినఁ గాంత ద్రవంబు పుట్టి నె
మ్మనమునఁ జారఁగూర్చి సతి మచ్చిక సేయును వశ్యచిత్తయై.


తా.

స్త్రీయొక్క యెడమపార్శ్వమునగల చేయి నోరు చన్ను తొడ
భగప్రదేశము వీటియందు తనయెడమముక్కుగాలిని ప్రవర్తింపజేయుచు తన
యెడమచేత వాటిని తట్టినయెడల స్త్రీ ద్రవించి సంపూర్ణవశమగును.


శ్లో.

మృతమాల్యమరుతోత్థితదళమధుకరపక్షయుగళమిళితేన।
ధ్రువమనుధావతి కీర్ణా రాజరదనయుగ్మచూర్ణేన॥


శ్లో.

ఆదాయ హుతవహాదనమేకచితాదగ్ధయోశ్చ దంపత్యోః।
యా తేన హన్యతే స్త్రీ తమేవ సా నూనమనుయాతి॥


సీ.

పీనుఁగుతలమీఁదఁ బెట్టినపువ్వులు
                 సుడిగాలి నెగసిన శుభ్రదళము
భ్రమరపక్షంబులు పరఁగ ముందఱిపండ్లు
                 రేండును బ్రేతభూమండలమున
నిశి కృష్ణయగు చతుర్దశినాఁడు చూర్ణించి
                 తరుణులఁ బతుల నెవ్వరికి గాని
శిరముపై జల్లిన నరుగుదెంతురు వెంట
                 సతియును బతియును జచ్చినపుడె


ఆ.

యట్టవారఁ గాల్చు నట్టివేళలఁ గాంతఁ
బొడిచికాల్చు కొరవి పుచ్చి తెచ్చి
పొలఁతి మోపవలఁచుఁ బురుషునికైనను
బురుషుఁ బొడుచు కట్టె పొడువవలయు.

తా.

పీనుగుతలయందున్న పువ్వులు, సుడిగాలిలో యెగిరిన ఆకు, తుమ్మెద
రెక్కలు, ప్రధానమైన ముందరిపండ్లు రెండును యీవస్తువులను కృష్ణచతుర్దశి
దినమున రాత్రి రెండుఝాములవేళ శ్మశానమున చూర్ణము చేసి యాచూర్ణమును
పురుషుడు స్త్రీనెత్తిపైన చల్లినను లేక స్త్రీ పురుషునినెత్తిపైన చల్లినను వశుల
గుదురు. మఱియు ఒక్కకాటియందు కాల్చు దంపతులలో పురుషుని పొడిచి
కాల్చినకఱ్ఱను స్త్రీ తెచ్చియుంచుకొని తాను మోహించిన పురుషునికి తాకించి
నను అట్లై స్త్రీని పొడిచి కాల్చినకఱ్ఱను పురుషు డుంచుకొని తాను మోహించిన
స్త్రీకి తాకించినను వశులగుదురు.


శ్లో.

దక్షిణదిగస్థిఫలకే శున ఉన్మత్తస్య తాప్యతే యస్యాః।
నామ విలిఖ్య చితాయా అంగారైరవశ్య మాయాతిః॥


ఆ.

వెఱ్ఱియెత్తినట్టి వేఁపి దక్షిణదిక్కు
నెముకమీఁద నొక్కయింతిపేరు
వ్రాసి ప్రేతభూమి వహ్నిచేఁ గాల్పంగ
వలచివచ్చు నెట్టి వనితయైన.


తా.

వెఱ్ఱికుక్కయొక్క కుడివయిపుయెముక తెచ్చి యాయెముకపై తాను
వలచిన స్త్రీ నామమును వ్రాసి యాయెముకను కాటియందుండునిప్పుతో కాల్చిన
యెడల నాస్త్రీ వశమగును.


శ్లో.

మోహలతా గిరికర్ణీం రుదన్తికాం జాలికామవాక్పుష్పీమ్।
రుద్రజటాం చ కృతాంజలిమాజ్యమధుభ్యాం సమాయోజ్యః॥


శ్లో.

కృతతిలకస్త్రైలోక్యం వశయతి తైః స్యాంగమలమిళితైః।
పానే౽థ భక్షణే వా దత్తైర్విశ్వం వశం నయతి॥


శ్లో.

చూర్ణం దత్తం వశకృత్ చూర్ణం కీటస్య కాకజంఘయాః।
మునిదళరససిక్తో వా టంకణకః స్యాంగమలమిళితః॥


సీ.

జాజిపు వ్వుమ్మెత్త చంచలి తెల్లగం
                 టెనయు మదంతియుఁ దనరునట్టి
యుత్తరేణియు జాజివిత్తులు పిల్లపీఁ
                 చరయును నారుద్రజడయుఁ గూర్చి

తేనె నేతులతోడఁ బూని మర్దన చేసి
                 మలపంచకంబుతోఁ గలియఁబిసికి
తిలకంబు పెట్టినఁ ద్రిజగద్వశంబగు
                 నటుగాక భక్ష్యాదు లందునిడిన


గీ.

సర్వజనవశ్యమగునుగా సాలెపురుఁగుఁ
గాకిఁ జంపియుఁ జూర్ణించి కడఁగి యాత్మ
జలముతోఁ గూడఁజేయు నౌషధముచేత
సర్వజనవశ్యమగు మునిసమ్మతంబు.


తా.

జాజిపువ్వును ఉమ్మెత్తపువ్వును తెల్లగ టెన మదంతి ఉత్తరేణి
జాజివిత్తులు పిల్లపీచర రుద్రజడ యీవస్తువులు నేయి తేనెలతో మర్దించి మలపం
చకము (అనగా తనయొక్క చెమట, ఉమ్మి, రక్తము, మూత్రము, శుక్లము.)
యీఅయిదింటితో కలిపి అబొట్టు పెట్టుకొనిన త్రిలోకవశీకరణమగును. మఱియు
పైన చెప్పినదానినే భక్ష్యవస్తువులలో కలిపి తినిపించిన వారు వశులగుదురు. ఇంక
సాలెపురుగును కాకిని చంపి చూర్ణము చేసి ఆ చూర్ణమును ఆత్మజలమున కలిపి ఎవరి
పై జల్లిన వారు వశులగుదురు.


శ్లో.

చూర్ణేన మక్షికాయా అసితశునీవక్షసశ్చ సహ చూర్ణమ్।
వశయతి వసిష్ఠభార్యామపి నిజబీజాన్వితం దత్తమ్॥


క.

వెలిగార మెఱ్ఱగిసెపూ
దళమును నూరించి యాత్మతనుజలముల స
మ్మిళితముగఁ జేసిపెట్టిన
వలచు న్సతి యెట్టి చెనటివాఁ డతఁడైనన్.


తా.

వెలిగారము యెఱ్ఱగిసెచిగుళ్లు ఈ రెండును నూరి అందుతన మలపంచక
మును కలిపి తినిపించిన పురుషు డెంతదుర్మార్గుడైనను స్త్రీ వలచును.


ఆ.

నల్లకుక్కపా లొనర జీడిగింజల
పొడియుఁ గూర్చి తనకుఁ బొడమునట్టి
శుక్లమునను గడుపుచోరఁ బెట్టగా నరుం
ధతికినైన మోహ మతిశయిల్లు.

తా.

నల్లకుక్కపాలలో జీడిగింజలు కలియనూరి యాపిండిని తనశుక్లముతో
కలిపి భక్ష్యాదులయం దుంచి స్త్రీ తినునటులొనర్చిన పతివ్రతలయినను వశలగు
దురు.


శ్లో.

కరిమదగదసిద్ధార్థారుణకరవీరప్రసూనఘృతసహితమ్।
సితరవజటావిశృంగీమధుపంచాంగోత్థమలమిళితమ్॥


శ్లో.

తిలకేవ త్రైలోక్యం వశయతి పర్యుషితవారిణా పిష్టమ్।
పానే౽థ భక్షణే వా దత్తం పరమం వశీకరణమ్॥


చ.

సితరవిమూల మాహిషపుశృంగము తేనియ నీరవర్ణగో
ఘృతమును దెల్లనావలుఁ గరీంద్రమదంబును రక్తవాజిమూ
లితకుసుమంబులున్ దనజలంబున మిశ్రితచూర్ణ మద్ది గా
మతి తిలకంబు వశ్యమగు మర్దితపర్యుషితాంబుయుక్తమై.


తా.

తెల్లజిల్లేడువేరు దున్నపోతుకొమ్ము తేనె నల్లనియావునేయి తెల్లని
యావాలు యేనుగుమదము ఎఱ్ఱనికలిగొట్టుపువ్వులు తనమలపంచకమున నూరి బొట్టు
పెట్టుకొనిన త్రిలోకవశీకరణమగును.


క.

ఈయౌషధమే విను పా
నీయంబున భక్షణమున నెలఁతుకప్రేమన్
డాయంగ నొప్పుఁ గావునఁ
జేయఁదగు నిట్టిరీతి చెలువు దలిర్పన్.


తా.

పైన చెప్పిన యౌషధమును భక్ష్యాదులలో కలిపి స్త్రీ తినునటులొ
నర్చిన వశవర్తినియగును.


శ్లో.

వజ్రీఖండైర్గోలాగన్ధకచూర్ణేన భావితైర్భూయః।
శోషణపూర్వవిచూర్ణితమధ్వక్తైర్లింగలోపో వా॥


గీ.

కడఁగినల్లేరుతునకలు గంధకంబు
చూర్ణ మొనరించి తేనెతో జోకఁజేసి
లింగలేపనతోఁ గూడ లేమ చిక్కు
ఘోణికాపుత్త్రుఁ డొనరించె గురుమతంబు.

తా.

నల్లేరుతునకలు గంధకము ఈరెండును చూర్ణము చేసి తేనెతో కలిపి
దండమునకు పూసుకొని స్త్రీని రమించిన వశవర్తినియగును.


శ్లో.

చూర్ణమిదమరుణవానరవిష్ఠాక్తం మూర్ధ్ని కీర్యతే యస్యాః।
తాముద్వహేత కన్యాం కమనీయాంగీమభవ్యోపి॥


క.

అరుణకపివిష్ఠమును మఱి
హరిదళమును గూర్చి తలల నలికిన వనితల్
పురుషుఁడు కురూపియైనను
వరుఁ గాఁ గోరుదురు మదనబాధిత లగుచున్.


తా.

ఎఱ్ఱకోతిమలములో హరిదళము కలిపి స్త్రీతలయందు పులిమిన పురు
షుడు రూపవంతుడు కాకున్నను యతనికి స్త్రీ వశవర్తినియగును.


శ్లో.

వటయువతీమలయోద్భవసూక్ష్మైలాసర్జకుష్ఠసిద్ధార్థైః।
సర్వాంగీణో ధూపః సర్వజనానాం వశీకరణః॥


క.

వెలియావలు నేలుసిరిక
మలయజమును గోష్టువటము మఱియును బసవున్
గలిపిన ధూపము దనువునఁ
గలిసిన జనవశ్య మగును గాంతయు వశమౌ.


తా

తెల్లఆవాలు, నేలుసిరిక, గంధము, చెంగల్వకోష్టు, వటము, పసుపు,
ఇవి ధూపము వేసికొనిన స్త్రీవశ్యమును జనవశ్యమును గలుగును.


శ్లో

కోష్ఠోత్పలదళమధుకరపక్షతగరమూలకాకజంఘానామ్।
చూర్ణం శిరసి వికీర్ణమనామికారక్తమిశ్రమపి యదృక్॥


క.

అలచందవ్రేళ్ళు నుత్పల
దళమును గంధంబు గ్రంధితగరము నళిఱె
క్కలచూర్ణంబును వామాం
గుళరక్తముఁ గలిపి చల్లఁ గోమలి వలచున్.


తా

అలచందవ్రేళ్లు కలువరేకులు గంధము గ్రంధితగరము తుమ్మెద
ఱెక్కలు ఇవి చూర్ణము చేసి యెడమబొటనవేలిరక్తముతో కలిపి స్త్రీమీద చల్లిన
వశమగును.

శ్లో.

ఉత్పలదళదండోత్పలపునర్నవాసారివేత్థకల్కసంసిద్ధమ్।
తైలం నయనాభ్యంజనమాహుః పరమం వశీకరణమ్॥


ఆ.

కలువఱేకుఁ గాకికలువదుంపయుఁ దెల్లు
గలజరయును నాసుగంధివేరు
తైలయుక్తముగను దనకంట నిడుకొన్న
వామలోచనాది వశ్యకరము.


తా.

కలువఱేకులు. నల్లకలువదుంప తెల్లగలిజేరు సుగంధిపాలవేరు
ఈవస్తువులు నూనెలో యరువదీసి తనకన్నులకు బెట్టుకొనిన స్త్రీలు వశ్యులగుదురు.


శ్లో.

మాతంగనిహతనరనయననాసికాహృదయలింగజిహ్వాభిః।
పుష్యర్క్ష్యయుక్తరాత్రౌ భవభవనే సాధితం తైలమ్॥


శ్లో.

మదనాంకుశ ఇతి నామ్నా మహావశీకరణమేతదితి మునయః।
భక్షణపానస్పర్శననావిధి విశ్వం వశం నయతి॥


చ.

మదకరిఘాతచేఁ బడిన మర్త్యుని లోచనలింగజిహ్వలున్
హృదయము నాసియు న్జదిపి యీశగృహంబునఁ బుష్యయుక్తమై
యొదవినరాత్రి భూపుటనియుక్తము తైలము తీసి ధూప మి
పొదవిన వశ్యకారణ మహ మదనాంకురనామభావమై.


తా.

మదపుటేనుగువలన చచ్చినమనుష్యునియొక్క కన్నులు ముక్కు
గుండెకాయ దండము నాలుక ఈవస్తువులు నలుగగొట్టి వాటిని పుష్యమీనక్షత్ర
ముతో కూడిన రాత్రియందు శివునిగుడిలో తైలము తీసి స్త్రీలకు ధూపము వేసిన
వశులగుదురు మఱియు నా తైలము మదనాంకురమను పేరు గలిగి భక్ష్యపానాది
స్పర్శనవిధులవలన సర్వజనవశీకరణమగును.


శ్లో.

వసుకుష్ఠమలయజఘుసృణసురతరుకుసుమసలిలసంజనితః।
చిన్తామణిరీతి భణితో ధూపః పరమో వశీకరణః॥


శ్లో.

రమణీరమణే వరణే కన్యాయాః పణ్యవస్తువిక్రయణే।
సిద్ధికరం ధూపమిమం మనుతే హరమేఖలాకారః॥


ఉ.

చందనకుంకుమంబులును జల్లనికోష్టులు దేవదారువున్
బొందుగఁ దేనెధూప మిడి పోయిన కన్య వరించుఁ బుణ్యమున్

జెందును దేవతత్త్వమని చెప్పిరి ధూపము పేరు నిట్టివే
సుందరి వశ్యకారణము చొప్పడు నాగబలాదియుక్తమై.


తా.

గంధము కుంకుమ కోష్టులు దేవదారు తేనె ఇవి చూర్ణము చేసి
ధూపము వేసుకొనిన స్త్రీ వశ్యమగును. మఱియు నీయౌషధమును సంభోగకాల
మున ధూపము వేసినయెడల అంగడియందు కొనినవస్తువువలె వశవర్తినియగును.


శ్లో.

ఆన్త్రోజ్భితచటకోదరనివేశితం బీజమాత్మనః కృత్వా।
దత్వా వజ్రోదకమథ శరావయుగసంపుటం కృత్వా॥


శ్లో.

సప్తాహముపరి చుల్యాం నిధాయ ఘుటికాం విధాయ భక్ష్యవిధౌ।
దత్తం వశయతి కర్షతి వశిష్టభార్యామపి క్షిప్రమ్॥


ఉ.

పిచ్చుకపొట్టలోనఁ దనబీజముఁ బెట్టి శరావయుగ్మమున్
దెచ్చి తదీయమధ్యమున నిల్పుచు మూత్రముఁ బోసి చీలమ
న్నిచ్చియుఁ బొయ్యిలోన నిడి యేడుదినంబులు వండి మీఁద వేఁ
బుచ్చినభూతి దెచ్చి జలభక్తులఁ బెట్టినఁ గాంత మేలగున్.


తా.

పిచ్చుకను చంపి దానిపొట్టలో తనశుక్లముంచి మూకుడు నందుంచి
దానిపై నొకమూకుడును బోర్లించి చీలమన్నుంచి ఏడుదినములు వండిన భస్మ మగును.
ఆభస్మమును నీటియందయినను భక్షణపదార్ధములయందయిన నుంచి స్త్రీలకు
యిచ్చిన వశులగుదురు.


శ్లో.

క్షౌమీం లిప్త్వా వర్తి గదదళతాళీసతగరకై స్తైలమ్।
సిద్ధార్థస్య గృహీత్వా నృకపాలే కజ్జలం విహితమ్।
నయనగత యువతీనామపి మునిచేతాంసి మోహయతే॥


క.

తాళకతగరమ్ములును దు
కూలంబున వత్తిఁ గూర్చికొని వెలియావల్
తైలంబుఁ దీసి మనుజక
పాలంబున కంజనంబుపగిదిని బూయన్.


క.

ఆకాటుక నయనంబులఁ
గైకొన్న వధూటి కామకాండంబులచే

నాకమునీంద్రులనైనను
బాకము తప్పించి తనకు బంటుగఁ జేయున్.


తా.

తాళకము తగరము యీరెండును తెల్లపట్టుగుడ్డలో వత్తి చేసి ఆవత్తి
పుర్రెయందుంచి తెల్లఆవాలనూనె పోసి దీపము వెలిగించి ఆదీపముమీద నింకొక
పుర్రెను బోర్లించి కాటుకను పట్టి ఆకాటుక కన్నులకు బెట్టుకొనినస్త్రీ మునుల
నయినను మోహాంధులను చేయును.


శ్లో.

స్వార్తవశోణితభావితరోచనయా రచితతిలకా।
నారీ వశయతి భువనం న తత్ర చిత్రం కిమప్యస్యాః॥


క.

ఋతుశోణితమున గోరజ
మతిశయముగ నునిచి తిలక మళికంబున నే
యతివ ధరించి నది ది
క్పతి ముని గురుజనులనైన వశ్యత నొంచున్.


తా.

స్త్రీలు ఋతుకాలమందలి రక్తముతో కూడా గోరోజనమును కలియ
గూర్చి బొట్టు పెట్టుకొనిన మునిశ్రేష్టులయిన వశ్యులగుదురు.


శ్లో.

యది సహదేవీమూలం గ్రహణే సంగృహ్య రోచనాపిష్టమ్।
తత్కృతతిలకా నారీ గురుకులమపి వికలతాం నయతి॥


క.

సహదేవి సమూలం బొక
గ్రహణంబునఁ బుచ్చి పసుపుఁ గలియఁగ నూరన్
మహిలోన తిలక మిడినను
మహనీయునినైన వికలమతి నొనరించున్.


తా.

సహదేవిచెట్టును గ్రహణదినమున పెల్లగించి సమూలముగా తెచ్చి పసు
పుతో కలియునూరి యానూరినపిండిని బొట్టు పెట్టుకొనినస్త్రీ మునులనయినను
మోహవశులను జేయును.


శ్లో.

దత్వా ద్విజాయ పాయసభోజనముత్పాద్య సితబలామూలమ్।
కన్యాపిష్టం భక్ష్యే దత్తమనిచ్ఛాహరం పరమమ్॥


శ్లో.

జటిపిప్పలయోర్లూతాగృహాణ్డకై రేకమూలయోర్లిప్త్వా।
వక్షోఘనమాలింగనమనిచ్చతాం హరతి హరిణాక్ష్యాః॥

సీ.

ముత్తువపులుగము మూలంబు దెచ్చిక
                 న్నియచేత నూరించి నెలఁతలకును
భోజనంబునఁ బెట్ట బురుషులపై కోప
                 ముడిగి కూడుదు రుచిరోక్తు లలర
మ్రానొక్కటై రావిమఱ్ఱులు పెరిఁగిన
                 నేకమై దాని వ్రేళ్ళెల్లఁ దీసి
చెలఁదిగ్రుడ్లును నూరి చెలియపైఁ జల్లినఁ
                 గాంతునిఁ దలఁచి యాకాంత వేగ


గీ.

నలుకచేఁ బాసియున్నట్టి యలుకఁ దేరి
వేడ్క మీఱంగు నెదురెక్కి విభునిఁ గవయు
చుందు రిది సిద్ధియోగంబు సుదతులకును
మోహనకరంబు విటజనామోదకరము.


తా.

తెల్లనిపువ్వులు గల ముత్తువపులుగముచెట్టు సమూలముగా తెచ్చి కన్నె
పడుచుచే నూరించి స్త్రీలకు భక్షణపదార్ధములతో భక్షింపజేసిన వశవర్తులగుదురు.
మఱియు నొక్కమానుగా కలిసి పెరిగిన రావిచెట్టు మఱ్ఱిచెట్టు యొక్క వేళ్ళను
తెచ్చి సాలెపురుగుగుడ్డుతో నావేళ్ళను నూరి స్త్రీపై చల్లిన వశురాలగును.


శ్లో.

సితదూర్వా సితబృహతీ సితగిరికర్ణీ సమూలపుష్పా చ।
తాంబూలేన వితీర్ణా స్త్రీపురుషౌ వశ్యతాం నయతి॥


క.

వెలిగంటెన వెలిదూర్వము
వెలిములకయుఁ గూడ వీని వ్రేళ్ళను బతియున్
లలనయు నొకళ్ళొకళ్ళకు
వలనుగ విడియమునఁ బెట్ట వశ్యత కలుగున్.


తా.

తెల్లగంటెనవేరు, తెల్లగరికవేఱు, తెల్లములకవేఱు, యీ మూడును
పురుషులు పరస్పరము విడియమున బెట్టిన వశులగుదురు.


శ్లో.

కరభాస్థిక్షృంగపక్షద్రవభావితమేకవింశతిం వారాన్।
పుటదగ్ధం సమశైలాంజనసహితం చూర్ణితం సమ్యక్॥


శ్లో.

కరభాస్థినాలికాయాం నిహితం కరభాస్థిశలాకయా విహితమ్।
ఇదమంజనమఖిలజనం జనయతి వాగ్వశ్యవద్వశ్యమ్॥

సీ.

ఇరువదియొక్కమా ఱెనయఁ గల్గరవేరు
                 రసమున నునిచి యుష్ట్రంబు నెముక
శైలాంజనముతోడ సమ్మేళన మొనర్చి
                 పుటదగ్ధభస్మసంఘటనఁ జేసి
యెనయ నాయెముకఁ జేసిన కరాటములోనఁ
                 గదియించి యయెమ్ము కణికఁ జేసి
యందు నొయ్యన నుంచి యాయంజనము కాంత
                 తనకన్నులను బెట్టి జనులఁ జూడ


గీ.

వశ్యు లగుదురు మఱి మగవారు దీని
కన్నుఁగవఁ బెట్టి కామినీగణముఁ జూడఁ
జాలవలతురు ధర సర్వజనులకెల్ల
మునులు చెప్పిన మతమిది మోహనంబు.


తా.

లొట్టిపిట్ట యెముక గుంటగలగరఆకురసముతో యిరువదియొక్క
వారములు భావన చేసి ఆయెముకలో సగముయెత్తు శైలాంజనముతో కూడా కలిపి
పుటము పెట్టి భస్మము జేసి ఆభస్మమును ఆయెముకతో చేసిన బరిణయందుంచి యా
యెముకతోడనే కణిక చేసి యాకణికతో నాకాటుకను స్త్రీలు కన్నులయందు
బెట్టుకొనిన పురుషులు వశులగుదురు. పురుషు లాకాటుకను బెట్టుకొనిన స్త్రీలు
వశులగుదురు. దీనినే మోహనాంజన మందురు.


శ్లో.

నిజబీజేన రతాన్తే వామదృశో భటిత వామపాదం యః।
అథవా లింపతి హృదయం స ఏవ తస్యాః పరో దయితః॥


క.

తనవీర్యము సురతాంతం
బునఁ గామిని వామపాదమునఁ బూసిన న
వ్వనజాక్షి వలచు హృదయం
బుననైనను బూయ రసము పొరసిన భంగిన్.


తా.

పురుషుడు స్త్రీని రమించిన తరువాత తనయొక్క శుక్లము స్త్రీ
యొక్క యెడమపాదమందైనను, హృదయమునందైనను పూయ నాస్త్రీ వశ
వర్తిని యగును.

ఇతి శ్రీకొక్కోకకృతే రతిరహస్యే
వశీకరణాధికారో నామ
చతుర్థశః పరిచ్ఛేదః

సకలయోగాధికరణము

పంచదశః పరిచ్ఛేదః

ద్రావకయోగలక్షణము

శ్లో.

కర్పూపటంకణాభ్యామథవా మధుకేసరాస్థిసారాభ్యామ్।
ఘోషఫలక్షోదైర్వా రసేన దణ్డోత్పలాయా వా॥


శ్లో.

మూర్ఛితమథవా మిళితం శశినా భవబీజమేకం వా।
ఏకష్టంకణో వా ఏకం వా ఘోషకోత్థరజః॥


శ్లో.

యది వా మధుగుడసహితా చించా కఠినాంగవరాంగేషు।
క్షేపాద్వా ధ్వజలేపాద్రేతఃస్రోతః ప్రవర్తయతి॥


సీ.

కర్పూరటంకణకారంబులును హర
                 బీజంబుతోఁ గూడ వెలయు నొకటి
పొగడగింజలనీరు పువ్వుఁదేనియఁ గూడి
                 పాదరసంబుతో బరఁగు నొకటి
ములకవిత్తులు తేనె కలిపి శంకరవీర్య
                 మున యోగమై వేడ్క నొనరు నొకటి
కాకికలువదుంప కలబంద గలిజేరు
                 రసములు రసముతో నెసఁగ మూఁడు


గీ.

కప్పురముతోడ నొకటి యేకముగ నొకటి
గోఱజంబును మధువును గూడ నొకటి
చింతపులుసు మరాటంబు చేత నొకటి
రసము పుట్టించు ద్రవములు రమణులకును.


తా.

కర్పూరము వెలిగారము సురేకారము ఈమూడును రసమున కలిపిన
నొకద్రావకయోగ మగును. నల్లకలువదుంపరసము పాదరసమున కలిపిన

నొక ద్రావకయోగమగును. పొగడగింజలనీరును పువ్వుతేనెయు పాదరసమున
కలిపిన నొకద్రావకయోగమగును. ములకవిత్తులు తేనెయు పాదరసమున కలిపిన
నొకద్రావకయోగమగును. కలబందరసమున పాదరసమును కలిపిన నొకద్రావక
యోగమగును. గలిజేరుఆకులరసమున పాదరసము కలిపిన నొకద్రావకయోగ
మగును. కప్పురముతో పాదరసము కలిపిన నొకద్రావకయోగమగును. ప్రత్యే
కపాదరస మొకద్రావకయోగమును, గోరోజనము తేనె పాదరసమున కలిపిన నొక
ద్రావకయోగమగును. చింతపండుపులుసు మరాటిమొగ్గలు పాదరసమున కలిపిన
నొకద్రావకయోగమగును. ఈ ద్రావకములు పురుషుడు లింగమునకు పులుము
కొని స్త్రీని రమించిన స్త్రీ ద్రవించి సుఖము చెందును.


శ్లో.

ఇత్యేతే దశ గదితా దావణయోగాః ప్రసిద్ధమహిమానః।
ద్రావణవశతాకర్షణమాదధ్యాద్యోగషట్కం చ॥


వ.

పూర్వమునందుఁ జెప్పంబడిన పదిద్రావకంబులును జాలమహిమ గలవని
చెప్పంబడియున్నది. ఇక ముందు చెప్పంబడు నారుయోగంబులును ద్రావణ
వశ్యాకర్షణములను జేయంగలవు.


శ్లో.

లోధ్రశ్రీఫలమజ్జానేకపమదసిన్ధువారసమభాగః।
అథవా మధుమాగధికాధత్తూరకలోధ్రమరిచాని॥


శ్లో.

రక్తకపిలింగముడుపతికాంచనమధుసూతసహితం వా।
హయలాలామంజిష్ఠాసితసర్షపజాతికుసుమం వా॥


శ్లో.

ఘృష్టం కపిలాసర్పిషి లోహితకపిలింగమేకం వా।
మధుసైన్ధవకలరవమలమిళితం వా లింగలేపేన॥


క.

శ్రీవృక్షఫలరసంబును
వావిలియును లోధ్రతరువు వారణమదమున్
బ్రోవిడి సమభాగంబులఁ
గావించిన ద్రవము వశ్యకరమై నెగడున్.


తా.

మారేడుపండురసము బావిలియాకురసము లొద్దుగుచెక్కరసము
యేనుగుమదము ఈవస్తువులు సమభాగములుగా గలిపి పురుషుడు లింగమునకు పులు
ముకొని స్త్రీని రమించిన నాస్త్రీ ద్రవించి సుఖము చెంది వశవర్తినియగును.

క.

మిరియము పిప్పలితేనెయు
వరలోధ్రము నుమ్మెత్తయును వశమౌ మఱి క
ప్పురమును నుమ్మెత్తయు మధు
కరసంబును గూడ నొక్కకరణం బయ్యెన్.


తా.

మిరియములు పిప్పలితేనె లొద్దుగుచెక్క ఉమ్మెత్తవేరులు కలియ
నూరిన నిది యొకయోగమగును. కప్పురము ఉమ్మెత్తవేరులు అతిమధురము పాద
రసము కలియనూరిన యొకయోగమగును.ఈ రెండుయోగములలో నేదైన
పురుషుడు లింగమునకు పులుముకొని రమించిన స్త్రీ ద్రవించి సుఖము చెంది వశ
వర్తినియగును.


ఆ.

కపిలనేయి రక్తకపిలింగమును రక్త
హయములాల తెల్లయావపిండి
మంచిజాజిపువ్వు మంజిష్ఠ.ను గూడ
ద్రావకంబు యోగభావ మయ్యె.


తా.

గోరోజనమువంటి వర్ణముగల నేయియు, యెఱ్ఱకోతియొక్కదండ
మును, యెఱ్ఱగుఱ్ఱముచొంగయు, తెల్లనియావపిండియు, మంచిజాజిపువ్వును, మం
జిష్ణచెట్టుపువ్వును ఈవస్తువులు కలిపి లింగలేపన మొనర్చి కూడిన స్త్రీ ద్రవించి
సుఖము చెంది వశవర్తినియగును.


క.

తేనెయు నుమ్మెత యెఱ్ఱని
వానరలింగంబుఁ గూర్చి వండఁగ నొకటౌ
తేనియ సైంధవలవణము
నూనెయుఁ బార్వంబురెట్ట నూత్నద్రవముల్.


తా.

తేనెయు, ఉమ్మెత్తవేరులు, ఎఱ్ఱనికోతిదండము వీనిని వండిన యొక
యోగమగును. తేనెయు, సైంధవలవణము, నూనె, పావురమురెట్టలు కలిపిన నొక
యోగమగును. ఈ రెండుయోగములలో నేదయిన లింగలేపన మొనర్చి రమించిన
స్త్రీ ద్రవించి సంఖము చెంది వశవర్తినియగును.


శ్లో.

పుష్యోద్ధృతరుద్రజటామూలం విచవ్యార్థ కర్ణయోర్యస్యాః।
క్రియతే ఫూత్కృతమల్పం తత్క్షణమేవ చ్యుతి స్తస్యాః॥

గీ.

పుష్యమిని రుద్రజడవేరు పొసఁగఁదెచ్చి
నమిలి పుక్కిట నిడికొని నాతిచెవుల
గాలి వాఱంగ నూదినఁ గామినికిని
మదనజల ముబ్బుఁ దత్క్షణమాత్రమునను.


తా.

పురుషుడు పుష్యమీనక్షత్రమునందు రుద్రజడవేరును దెచ్చి నమలి
పుక్కిట నుంచుకొని స్త్రీయొక్క చెవులయందు ఊదిన నాసతి ద్రవించును.

వీర్యవృద్ధిలక్షణము

శ్లో.

నాగబలాం సబలామథ శతావరీం వానరీం సమం పాయసా।
గోక్షుర కేక్షురకే నిశి నిపీయ రతిమల్లతామేతి॥


క.

ముత్తవపులగము గొలిమిడి
విత్తులు పల్లేరు పిల్లపీఁచరయును నొ
క్కెత్తుగఁ బాలను గొన్నను
జిత్తమునకు రాత్రి వృద్ధి సేయును రతికిన్.


తా.

చిట్టాముదపువేరులు, గొలిమిడివిత్తులు, పల్లేరువేరులు, పిల్లపీచరవేరు
సమభాగములుగా చూర్ణించి ఆవుపాలతో పుచ్చుకొనిన వీర్యవృద్ధియగును.


శ్లో.

మధుకస్య కర్షమేకం సహితం తుల్యేన సర్పిషా మధునా।
లీడ్వానుపీయ దుగ్ధం నిధువనశక్తిం పరాం ధత్తే॥


ఆ.

మధుకయష్టి నాల్గుమాడలయెత్తు త
త్పాద మావునేయి పరగఁ గూర్చి
కుడిచి యావుపాలఁ గ్రోలిన రతివేళ
బలము నిచ్చు నెట్టి పందకైన.


తా.

నాలుగుమాడలయెత్తు యష్టిమధుకమును మాడయెత్తుయావునేతిలో
కలిపి తిని యావుపాలను తాగిన వీర్యవృద్ధియగును.


శ్లో.

పంచాశత్పలమాజ్యం తద్ద్విగుణసితాసమన్వితం మధునా।
షాదేన వారిపాదిక మేతత్సంసాధ్య మర్దితేన చిరమ్॥


శ్లో.

గోధూమచూర్ణపాదేనోత్పాద్యోత్కారికాం చ భుంజానః।
కందర్పసమరకేళీదర్పితదుర్మదయువతీజనం జయతి॥

శ్లో.

దశగుణదుగ్ధే పక్వం శతావరీగర్భితం చ ఘృతమశ్నన్।
మాగధికామధుసహితం సశర్కరం భవతి రతిమల్లః॥


సీ.

 ఫలము లేఁబది నెయ్యి పంచదారయు రెట్టి
                 తేనె తత్పాదంబు మానుగాఁగఁ
దత్పాదముదకంబు తగ నన్నియును గూర్చి
                 పాదము గోదుమ పదిలపఱచి
విరివిఁజక్కెర ద్రాక్ష పిప్పలి తగఁగూర్చి
                 భక్షింప రతి లింగబలము నిచ్చు
పదిగుణంబులు పాలపక్వంబుగాఁ బిల్లి
                 పీఁచర వండి యాపిండి తెచ్చి


గీ.

మధువు శర్కర ఘృతమును మాగధియును
గూర్చి భక్షించి కామినిఁ గూడెనేని
వాఁడు పురుషుఁడు గాఁడు దుర్వారమదన
ఘోటకముగాఁగ నొప్పు నీ కూటములను.


తా.

ఏఁబదితులములయెత్తు యావునేయి, నూరుతులములయెత్తు పంచ
దార, ఇరువదియైదుతులములయెత్తు తేనె, ఆరుతులములపావుయెత్తు నీరును, పం
డ్రెండుతులములన్నర గోదుమపిండి, వీనిని కలిపి మర్దించి పిప్పలి ద్రాక్షపండ్ల
నుంచి తినిన వీర్యవృద్ధియగును. మఱియు పిల్లిపిచరవేరులను మెత్తగా నూరి దానికి
పదిరెట్లుపాలతో వండి దానిలో తేనె పంచదార నేయి పిప్పలి కలిపి భక్షించిన
వీర్యవృద్ధియై రతికేళియందు మదించినగుఱ్ఱమువలె మెలంగును.


శ్లో.

బస్తాండసిద్ధదుగ్ధే భూయో వా భావితాంస్తిలానశ్నన్।
ఘృతదుగ్ధసాధితౌ వా బస్తాండౌ సలవణౌ సగుడౌ॥


శ్లో.

స్వరసేన భావితం వా ధాత్రీచూర్ణం విదారికాచూర్ణమాజ్యమధుమిళితమ్।
గోక్షురవిదారికోత్థం చూర్ణం వా శర్కరాసహితమ్॥


శ్లో.

స్వరసేన భావితం వా ధాత్రీచూర్ణం సితా౽౽జ్యమధుమిళితమ్।
లీడ్వా౽నుపీయ దుగ్ధం న తృప్యతి స్త్రీశతేనాపి॥


శ్లో.

యుపకలమమాషచూర్ణైస్తుల్తైర్గోధూమమాగధీసహితైః।
పూపలికాం ఘృతపక్వాం భుక్త్వా క్షీరం సశర్కరం పిబతః॥

శ్లో.

ఘృతమధుసహదేవ్యన్వితసరోజకింజల్కలిప్తనాభేర్వా।
రమమాణస్య న తృప్యతి మనః శతేవాపి రమణీనామ్॥


సీ.

మేషాండములు పాల మృదువుగా నుడికించి
                 నల్లనువ్వులతోడ నమలిరేని
యింతిఁ గూడిన బల మిచ్చును రతులను
                 జిక్కితి నిఁక నేమి సేయుదు నన
నెఱిచింతపండైన నిమ్మపండైనను
                 జవిచూడ మన్మథజలము విడుచు
మాషగోదుమములు మఱి యవవేష్టిత
                 పటలీఘృతమున పూపములు వండి


గీ.

కడఁగి భక్షించి దుగ్ధశర్కరలఁ ద్రావ
విజయమునును బొందు రతియుద్ధవేళలందు
సితము సహదేవి తేనియ ఘృతము పాండు
రాగకింజల్కములు నాభి రాయనగును.


తా.

మేకవట్టలు పాలతో వండి, నల్లనువ్వులతో భక్షించిన వీర్యవృద్ధియగును.
సంభోగకాలమున స్త్రీ తాళజాలకపోయినయెడల చింతపండయినను నిమ్మపండు
నయినను రుచిచూచిన వీర్యపతన మగును. మఱియు మినుపపిండి గోదుమపిండి
యవలపిండి వీనిని కలిపి యావునేతితో పూరీలుగా వండి భక్షించి పంచదార కలి
పిన పాలను ద్రాగిన వీర్యవృద్ధియగును. మఱియు పంచదార సహదేవి తేనె నేయి
పద్మకింజల్కములు వీటిని కలిపి పురుషుడు తన బొడ్డునకు చమిరినయెడల వీర్యవృద్ధి
యగును.

వీర్యస్తంభన లక్షణము

శ్లో.

ముష్కశిరాయా మూలం దృఢమంగుల్యానిపీడ్య రతికాలే।
చిన్తాన్నరనిహితమనాః కుంభితపవనశ్చ్యుతిం జయతి॥


క.

తన మొట్టమొదటివ్రేలను
ఘనముగఁ బీడించి యన్యగతమానసుఁడై
యనిలంబుఁ బట్టి రతిఁ జే
సిన శుక్లస్తంభనంబు సిద్ధి న్బొందున్.

తా.

పురుషుడు కాళ్ల పెద్దవ్రేళ్ళనూనద్రొక్కి నింకొకవిషయమునందు
ధ్యానముంచి యుచ్ఛ్వాసనిశ్వాసములను బంధించి రతి చేసిన శుక్లము స్తంభించును.


శ్లో.

సితశరపుంఖామూలం వటపయసా పిష్టమానేన నిహితమ్।
ఏకకరజ్జకబీజాభ్యన్తరగం స్తంభయేద్బీజమ్॥


క.

వెలివెంపలి మర్దించియుఁ
గలియంగా మఱ్ఱిపాలఁ గానుఁగుగింజన్
దొలిచి యది నోట నిడుకొని
కలిసిన వీర్యంబు పడదు కాముకరతికిన్.


తా.

తెల్లవెంపలివేరు మఱ్ఱిపాలతో నూరి దానిని తొలిచిన కానుగగింజలో
నుంచి దానిని పుక్కిట నుంచుకొని రతిచేసిన శుక్లము స్తంభించును.


శ్లో.

కృత్వా దృఢగుదపీడనమానాభేశ్చిన్తితశ్చ్యుతిం జయతి।
ఆమస్తకమోంకారః శ్యామతనుః కచ్ఛపాకారః॥


ఆ.

శ్యామకచ్ఛపంబు చాయగా నోంకార
మాత్మఁ దలచి నాభి యాత్మగాఁగ
శిరముదాఁక నుండఁ జింతించి గుడపీడ
నంబుఁ జేయ నింద్రియంబు వడదు.


తా.

నల్లటితాబేలువంటి యాకారముగల ఓంకారమును మసస్సునందు
తలచి బొడ్డుదగ్గరనుండి తలవరకు యుండజూచుకొని దృఢముగా పాదములచే
గుదస్థానము బిగించి రతిచేసిన శుక్లము స్తంభించును.


శ్లో.

సితశరపుంఖామూలం పారదరససహితమాననే నిహితమ్।
ఏకకరంజకబీజాన్తస్థం బీజం విధారయతి॥


గీ.

పారదంబును గానుఁగుపండుపప్పు
తెల్లవెంపలివేరు నీత్రికము నూరి
యుండగాఁ జేసి ముఖమునం దుండజేసి
రతి యొనర్చినయెడల వీర్యంబు విడదు.


తా.

తెల్లవెంపలివేరు కానుగుగింజలో నుండుపప్పు పాదరసము ఇవి కలిపి
ముఖమునం దుంచుకొని రతి చేసిన వీర్యము స్తంభించును.

శ్లో.

నరదక్షిణకరరోమభిరిభకరకరభాశ్వపుచ్ఛసంజాతైః।
గ్రథితం దక్షిణకరగం రేతోరుత్ కోలదశనాస్థి॥


శ్లో.

అసితవృషదంశ దక్షిణపార్శ్వస్థితమస్థి కటితటే బద్ధమ్।
సప్తచ్ఛదబీజం వా బీజచ్యుతివిజయి వదనగతమ్॥


శ్లో.

స్నుహ్యజాదుగ్ధపిష్టం లజ్జోలార్మూలమంఘ్రిలేపనతః।
ధ్వజలేపాదజమూత్రైః పిష్టం వా వారుణీమూలమ్॥


శ్లో.

కౌసుంభతైలమథనా వర్షాంభూచూర్ణమభ్యంగాత్।
చరణస్య చ్యుతిజయినో యోగా హ్యేతే న సన్దేహః॥


సీ.

పురుషుని కుడివంకఁ గరరోమముల నశ్వ
                 ఖర ముష్ట్రముల పుచ్ఛకములతోడఁ
బందికొమ్మును వలపలిచేతఁ గట్టిన
                 నరుని శుక్లము స్తంభనంబు సేయు
కృష్ణమార్జాల దక్షిణపార్శ్వశల్యంబు
                 కటిఁ గట్ట వీర్యంబు కదలకుండు
పొలుపొంద నేడాకు పొన్నబీజము నోట
                 నునిచి కూడిన బీజ ముండుఁ బడదు


ఆ.

మేఁకపాలు జెముడుమ్రాకులపా ల్ముణ్గు
దామరయును బాదతలమునందు
లేపనంబుఁ జేసి లేమఁ దాఁ బొందినఁ
బడదు వీర్య మెంతతడవునకును.


తా.

పురుషుడు తన కుడిచేతిరోమములతో గుఱ్ఱము గాడిద యొంటె
వీటియొక్క తోకలవెంట్రుకలు కలిపి త్రాడు పేని యాత్రాటితో పందికొమ్మును
దనకుడిచేతికి కట్టుకొని రమించిన వీర్యము స్తంభించును. నల్లనిపిల్లియొక్క కుడి
వైపుయెముకను పురుషుడు మొలయందు కట్టుకొని రమించిన వీర్యము స్తంభించును.
మఱియు యేడాకు పొన్నగింజను నోటియందుంచుకొని రమించిన వీర్యము
స్తంభించును. మఱియు మేకపాలు జెముడుపాలు ముణుగుదామర యీవస్తువులు
కలియనూరి యఱకాళ్లయందు లేపనము చేసి రతియొనర్చిన వీర్యము స్తంభించును.

ఆ.

మేఁకపోతునుచ్చ మెదిపి పాపరవేరు
శిశ్నలేపనంబుఁ జేసిరేని
కుసుమనూనె కామకొసను దాఁబూసినఁ
బడదు వీర్యమెంత తడవుకును.


తా.

పాపరవేరును మేకపోతుమూత్రమున నూరి దండమునకు పూసినను లేక
కుసుమనూనెను దండముకొనయందు పూసినను శుక్లము స్తంభించును.


క.

కప్పపొడి కాలఁ జమరిన
నెప్పటివలె నుండు వీర్య మీయోగమునన్
దప్పులు లేవని యోగ్యులు
చెప్పిన తెఱఁగెఱిఁగికొనుడు చిత్తజరతులన్.


తా.

కప్పపొడి యఱకాలునందు రాచుకొని రమించిన వీర్యము స్తంభించును.


శ్లో.

మాహిషఘృతసహదేవీతిలమధుకమలకేసరైస్తుల్యైః।
గృహచటకేన విలేపితనాభిఛ స్తబ్ధేన్ద్రియో రమతే॥


క.

వెలదామర కేసరములు
తిలలును మహిషీఘృతంబు తేనియ దండో
త్పలమూలముఁ బిచ్చుకతో
వెలయంగను నాభిఁ బూయ వీర్యము నిలుచున్.


తా.

తెల్లతామరకింజల్కములు నువ్వులు గేదెనేయి తేనియ సహాదేవి
మూలము వీనిని పిచ్చుకతో నూరి బొడ్డునకు బూసి రతి చేసిన శుక్లము స్తంభించును.

దండవృద్ధిలక్షణము

శ్లో.

తిలతైలఘోషటంకణమనః శిలాజాతిపర్ణరసకుష్ఠైః।
నర్ధయతి లింగముచ్చైః సప్తదినం మర్దనం విహితమ్॥


ఆ.

మాషటంకణమును మణిశిల జాజాకు
జలము కోష్టురసము తిలలనూనె
యేడుదినము లొక్కయీడుగా దండానఁ
బూయ వృద్ధి పొంది పొదలుచుండు.

తా.

అయిదుగురిగింజలయెత్తు వెలిగారము మణిశిల జాజాకురసము కోష్టు
నువ్వులనూనె రసము వీటిని కలిపి యేడుదినములు దండమునకు పూసిన దండము వృద్ధి
చెందును.


శ్లో.

వజ్రీదాడిమబల్కలబృహతీఫలకుష్ఠసహితభల్లాతైః।
సిద్ధం సర్షపతైలం షడ్గుణకుంభీరసే తద్వత్॥


ఆ.

ములకపండురసము వెలియావనూనెయు
దాడిమంబుతోలు జీడిగింజ
కుంభిరసమునందుఁ గూర్చి దండంబునఁ
బూయఁ బెరిఁగి బలిసి పొదలుచుండు.


తా.

ములకపండ్లరసము తెల్లనియావనూనె దానిమ్మపండుతోలు జీడి
గింజలు పినగుమ్ముడురసముతో నూరి దండమునకు బూసిన వృద్ధియగును.


శ్లో

అన్తర్ధూమం దగ్ధ్వా సైన్ధవజలశూకకమలదళవజ్రైః।
భల్లాతక్యా లేపో బృహతీరసభావితైస్తద్వత్॥


క.

నల్లేరును గఱదూపము
భల్లాతకి సైంధవాజ్జపత్త్రంబులచే
మొల్లలు ములకరసంబునఁ
బెల్లుగఁ బూయంగఁ గామ పెరుఁగున్ బెలుచన్.


తా.

నల్లేరు కఱదూపము జీడిగింజలు సైంధవలవణము తామరఱేకులు
మొల్లలు ములకచెక్కరసము యివి నూరి రసము తీసి కామదండమునకు పూసిన వృద్ధి
యగును.


శ్లో.

లింగం వ్రజతి వివృద్ధి మాహిషమలమిళితపూర్వమాలిప్తమ్।
మాహిషనవనీతాన్వితజలకణ్డూకుష్ఠగోమూత్రైః॥


శ్లో.

భల్లాతకాస్థిసంభృతమాహిషమలసర్పిషా చ కుంభికాశ్మశ్రుః।
హయగన్ధాసైన్ధవమితి లేపో లింగస్య వృద్ధికరః॥


శ్లో.

మధుతగరగౌరసర్షపబృహతీఖరమజరీకణాః సతిలాః।
యవకుష్టమరిచసైన్ధవహయగన్ధామాషసంయుక్తాః॥


శ్లో.

స్తవయుగళకర్ణపాళీధ్వజభుజశిఖరోపచయమేతాః।
ధ్రువమున్మర్దనవిధినా సతతాభ్యాసేన కుర్వన్తిః॥

సీ.

కాచు నెనుమువెన్న కప్పచిప్పలయొక్క
                 పిష్టంబు నెనుపెంటి పెంట పెరుఁగు
నెనుపెంటినెయ్యి పెన్నేరుగడ్డయు జీడి
                 పండుగింజయు గోవుపంచితంబు
సైంధవలవణంబు సరిగాఁగ మర్దించి
                 కామఁ బూసిన వృద్ధి కలుగుచుండు
తేనెయుఁ దగరంబు తెల్లయావలు నపా
                 మార్గంబు యవ కోష్టు మరిచములను


గీ.

దిలలు పిప్పళ్ళు పెన్నేరు ములకపండ్లు
మినుము సైంధవలవణంబు నెనయఁ గూర్చి
కంఠ భుజ యోని కుచ కర్ణ కాయములను
గలియఁబూసిన దండము బలియు రతుల.


తా.

కాచు, ఎనుమువెన్న, కప్పచిప్పలయొక్కపిండి,
పెరుగు, గేదినేయి, పెన్నెరుగడ్డ, జీడిగింజ, గోమూత్రము, సైంధవలవణము,
సమానభాగములుగా కలిపి నూరి దండమునకు బూసిన వృద్ధియగును. మఱియు,
తేనె, గ్రంధితగరము, తెల్లనియావాలు, ఉత్తరేను, యవలు, చంగల్వకోష్టు,
మిరియములు, నువ్వులు, పిప్పళ్లు, పెన్నేరుగడ్డ, ములకపండు, మినుములు, సైం
ధవలవణము, ఇవి నూరి మెడ, భుజములు, మర్మస్థానము, కుచములు, చెవులు,
దేహము, వీటియందు పూసికొని రమించిన దండము వృద్ధియగును.


శ్లో.

భల్లాతకబృహతీఫలదాడిమఫలకల్కసాధితం కురుతే।
లింగం మర్దనవిధినా కటుతైలం వాజిలింగా౽౽భమ్॥


ఆ.

జీడిగింజ ములకచిగురు దాడిమపండు
చర్మ మావనూనె సహితముగను
శిశ్నలేపనంబుఁ జేసిన వర్ధిల్లు
నశ్వలింగమటుల నతిశయిల్లు.


తా.

జీడిగింజ, ములకచిగురు, దాడిమపండుతోలు, ఆవనూనె, ఈవస్తు
వులు కలియనూరి దండమున కుబూసిన గుఱ్ఱముయొక్కదండమువలె వృద్ధిపొందును.

శ్లో.

పుటదగ్ధపద్మినీదళభల్లాతకబాలకృష్ణలవణానామ్।
భూత్యా పరిణతబృహతీఫలరసపరిపిష్టయా భవతి॥


శ్లో.

మహిషీమలేన మిళితం లింగం పశ్చాదనేకశో లిప్తమ్।
ముసలమివ మదనవిహ్వలయువతీజనదర్పనిర్దళనమ్॥


శ్లో.

సింహీఫలభల్లాతకనళినీదళసిన్ధుజన్మశైవాలైః।
మాహిషనవనీతేన చ కరంబితైః సప్తదినముషితైః॥


శ్లో.

మూలం హయగన్ధాయా మాహిషమలమిళితపూర్వమాలిప్తమ్।
భవతి లఘూకృతగర్దభలింగం లింగం ధ్రువం పుంసామ్॥


సీ.

పద్మదళంబులు భల్లాతకంబులు
                 నువ్వులు పిప్పళ్ళు నూరి కడవఁ
బెట్టి యగ్నిపుటంబు పెట్టి బృహస్పతీ
                 రసముతో నొక్కకరాటమునను
మహిషీమలంబును మఱిగూర్చి పూయ ఘో
                 టకలింగ మటుల దండంబు పెరుఁగు
ములకపండును హరిదళము జీడియుఁ గాచు
                 సైంధవలవణంబు సరవిఁ దెచ్చి


ఆ.

యెనుము నేతితోడఁ నెనయంగ మర్దించి
దినములేడు బరణి నునిచిపుచ్చి
బఱ్ఱెపేడ నీటఁ బరఁగంగఁ బెన్నేరు
గలిపి పూయ కామబలము నిచ్చు.


తా.

తామరరేకులు, జీడిగింజలు, నువ్వులు, పిప్పళ్లు యివి నూరి యొక
కుండలో బెట్ టిదానిపై మూకుడు బోర్లించి చీలమన్నుంచి పుటము బెట్టగా
వచ్చినభస్మమును బృహస్పతీఫలరసముతోడ మర్దించి గేదెపేడతో కలిపి లింగము
నకు బూసికొనిన గుఱ్ఱముయొక్క లింగమువలె వృద్ధి చెందును. మఱియు ములక
పండు, హరిదళము, జీడిగింజలు, కాచు, సైంధవలవణము, ఇవి గేదెనేయితో
మర్దించి యేడుదినము లొకబరణియం దుంచి తరువాత గేదెపేడను గలిపిననీటిలోను
పెన్నేరుగడ్డరసములోను కలిపి లింగమునకు బూసిన దండము వృద్ధి చెందును.

శ్లో.

కనకరసమసృణవర్తితహయగన్ధామూలమిశ్రపర్యుషితమ్।
మాహిషమిహ నవనీతం గతబీజే కనకఫలమధ్యే॥


శ్లో.

గోమయగాఢో ద్వర్తితపూర్వం పశ్చాదనేన సలిప్తమ్।
భవతి హయలింగసదృశం లింకం కఠినాంగనాదయితమ్॥


శా.

పెన్నే రుమ్మెత్తపూలు నుల్లిజలమున్ బీజంబు గీలించి యం
దు న్నుమ్మెత్తఫలంబులోన నడి యం దున్మాహిషావిష్ఠియున్
వెన్నం బెట్టుచు గోమయద్రవమునన్ వేదించి కామ్యంబునన్
జెన్నారం గలందినన్ ధ్వజము వాజిప్రక్రియన్ బొల్పగున్.


తా.

పెన్నేరుగడ్డ, ఉమ్మెత్తపూలు, ఉల్లి, ఇవి నూరి గింజలు తీసిన ఉమ్మె
త్తకాయలో బెట్టి దానిపైన గేదెపేడను పొదిగి పుటముబెట్టి యందురాబడిన చూర్ణ
మున గేదెవెన్నయు ఆవుపేడను గలిపిననీటిని గలిపి దండమునకు బూసిన గుఱ్ఱము
యొక్క లింగమువలె వృద్ధి చెందును.

భగదోషహరణ లక్షణము

శ్లో.

దళకుంకుమకునటీభిర్గంజదళతాళీసతగరపాదైర్వా।
దళకరికేసరమాంసీరోహితశైలేయకుసుంభతగరైర్వా॥


శ్లో.

లోహితపిత్తకణఘృతవిమలాంజనసైన్ధవైరథవా।
భగలేపఃసౌభాగ్యం జనయతి భూయో న సన్దేహః॥


శ్లో.

దాడిమపంచాంగైర్వాసిద్ధం సిద్ధార్థతైలమాతనుతే।
మాలతికాకుసుమైర్వా గుహ్యభ్యంగేన సౌభాగ్యమ్॥


సీ.

మణిశిలయున గుంకుమంబును జిత్రకం
                 బును నొక్కయోగమై పొల్పుఁ జెందు
హరితాళ తగరంబు లవియొక్కయోగంబు
                 రాష్ట్రంబు గజకేసరములదళము
తగరంబు కౌసుంభతైలంబు మాంసియు
                 నొకయోగమై ధాత్రి నుల్లసిల్లు
నమృతంబు పచ్చనిదైన నెఱ్ఱనిదైన
                 విమలాంజనములవణమును నొకటి

గీ.

యావనూనెయు దానిమ్మయందు పంచ
కంబు నొక్కటి మఱి మల్లికాప్రసూన
మొకటి యన్నియుఁగూడ నీయోగములను
యోనిదోషంబు హరియించు నొక్కటొకటి.


తా.

మణిశిల, కుంకుమము, చిత్రమూలము, ఇవి నూరి నీటిలో కలిపి భగ
మును కడిగిన భగదోషము హరించును. మఱియు హరిదళము, గ్రంధితగరము కలిపి
భగమును కడిగినను, దుంపరాష్ట్రము, నాగకేసరములు, హరిదళము, గ్రంధితగరము
కుసుమనూనె, జటామాంసి ఇవి నూరి నీటిలో కలిపి భగమును కడిగినను, నెయ్యి
పచ్చదైనను యెఱ్ఱనిదయినను, విమలాంజనము, సైంధవలవణము వీనిని నీటిలో కలిపి
భగమును కడిగినను, ఆవనూనె, దానిమ్మచెట్టుయొక్క పట్ట, ఆకు, పువ్వు, వేరు,
పండు వీనిని కలియనూరి నీటిలో కలిపి భగమును కడిగినను, జాజిపువ్వులు నీటి
యందుంచి యానీటితో భగమును కడిగినను భగదోషము హరించును.


శ్లో.

సమభాగైర్గదపద్మకకర్పూరోశీరపుష్కరాంబుధరైః।
సితవర్షపజం తైలం సమస్తభగదోషమపనయతి॥


శ్లో.

నింబకషాయక్షాలనమమలాంజననింబసారధూపో వా।
జీవచ్ఛంబూకాంబుక్షాలనమహ్నాం త్రిసప్తకం తద్వత్॥


సీ.

కర్పూరములు పద్మకంబులు కోష్ఠులు
                 పుష్కరఫలపత్త్రములు నుశీర
ములు నాగముస్తెలు కలియంగ సమభాగ
                 ములఁ జేసి యావనూనె లలిఁగలిపి
భగమునఁ బూసిన భగదోషములు పాయు
                 నింబకషాయజలంబులందుఁ
గడిగినఁ బాయు దుర్గంధంబు మఱి వేప
                 బంక ధూపంబునఁ బాయునటులె


గీ.

కప్పచిప్పలనీటను గడిగిరేని
యోనిదుర్గంధ మడఁగు నీయుక్తితోడఁ
గామినులు యోనిఁ బూయఁగాఁ గ్రమము తెలియ
మోహ ముదయించు నెంతయు ముదముఁ బెంచు.

తా.

కర్పూరము, పద్మకము, కోష్టు, తామరకాయ, తామరయాకులు,
వట్టివేరు, నాగముస్తెలు, సమభాగములుగా కలిపి నూరి యావనూనెయందు కలిపి
భగమునకు బూసినను, వేపచెక్క కషాయమున భగము కడిగినను, వేపబంకను
యోనికి ధూపము వేసినను, కప్పచిప్పలనీరుతో భగమును కడిగినను భగదోషములు
హరించును.


శ్లో.

పయసా సనాళమబ్జం పిష్ట్వా స్మరసదనమధ్యనిక్షిప్తమ్।
హరిణీమివ కరిణీమపి కురుతే స్మరసమరసుఖహేతుమ్॥


క.

పాలు సనాళకకుముదము
పోలఁగ నూరించి యోనిపుటమునఁ బూయన్
స్త్రీలకు ప్రాయము గడిచినఁ
జాలగ బిగిచూపు భగము సమ్ముద మందన్.


తా.

పాలును తామరనాళములును కలియనూరి భగముఖంబున బూసిన
యెడల యోని చాలా బిగువుకలుగును.


శ్లో.

చరటీగృహగణ్డూపదవృషగోపానాం తు చూర్ణమేకైకమ్।
అజగవ్యతక్రనేకాత్ సంకోచయతి స్మరాగారమ్॥


క.

ఇలనెఱ వృషగోపం బి
క్కల నూరుచు మేఁకచల్ల గలిపియుఁ ద్రావన్
వలరాజునిల్లు మిక్కిలి
వలనై సుఖ మిచ్చు బాలవనితను బోలున్.


తా.

ఎఱయు, ఆరుద్రపురుగును కలియనూరి మేకచల్లలో కలుపుకొని
తాగిన దానిభగము పిన్నవయస్సుదాని భగమువలె బిగువుగా నుండును.


శ్లో.

ఆసితభుజగముఖనిహితా మూత్రమృదసితేన వేష్టితా యస్యాః।
సూత్రేణాస్తే తస్యాః క్రమశః సంకోచయతి యోనిమ్।
ప్రకృతిం యాతి పునఃసా తత్త్వాఖ్యానేన వా తదుద్ధరణాత్॥


ఉ.

నల్లనిపామునోట విటనాయకు మూత్రపుమన్నుఁ బోయుచున్
దెల్లనిత్రాటఁ గట్టి సుదతీమణి మూత్రపుఁజోటఁ బాతినన్
సల్లలితంబు యోని కడుసన్నమగు న్సుమి ప్రాఁతఁబుచ్చినన్
దొల్లిటయట్లయౌను భగదోషము బాయు ననేకభంగులన్.

తా.

తనవిటుడు మూత్రముపొసినచోటియందు మన్నును తెచ్చి నల్లని
పామునోటియందు పోసి తెల్లనిదారముతో దానిమూతిని బిగగట్టి తాను మాత్రము
పోయు స్తలమున పాతిపెట్టినయెడల నాస్త్రీ భగము బిగువుగానుండును, అట్లు
పాతిపెట్టబడిన పామును పెల్లగించి మూతికికట్టబడియున్న దారమును విప్పిన యెప్ప
టివలె బిగువులేకయుండును.


శ్లో.

పికనయనబీజలేపః కురుతే సంకోచమేకదినమ్।
అధరోర్ధ్వాగ్రస్థితయోర్యథాక్రమం గోవిషాణయోశ్చూర్ణైః।
సంకోచం చ ప్రకృతిం ప్రజతి భగో నాభిలేపేన॥


క.

లోనికిఁ గూడుచు వంగిన
ధేనువు శృంగముల నూరి స్త్రీజనములకున్
యోనులఁ బూసిన సన్నము
లై నెగడెడి నెంతప్రౌఢలైనను రతులన్.


తా.

లోనికి వంగిన యావుకొమ్ముల నూరి భగమునకు బూసివయెడల ప్రౌఢ
స్త్రీయయినను బాలస్త్రీవలె యోని బిగువుగా నుండును. మఱియు కోకిలపిట్ట
యొక్క కంటిగుడ్లను దెచ్చి భగమునకు పులిమినయెడల బిగువుగానుండును.


శ్లో.

అనయో రేవ యథాక్రమమాలిప్తే మదనమందిరే చూర్ణైః।
పతనోత్థానే భవతః రతోద్యమాన్తే౽పి లింగస్య॥


క.

ఇటువంటి యావుకొమ్ములె
పుటచూర్ణము చేసి యోనిఁ బూసియుఁ బిదపన్
విటుఁడు రమింపఁగ దండము
తటుకునఁ బడు లేచుచుండు ధరఁ బలుమాఱున్.


క.

వాడియగు నావుకొమ్ములు
పోడిమిగా నూరి యోనిఁ బూసిన నందునన్
గూడిన శిశ్నము వాడక
నాడెంబై యుండు వీర్యనాశన మైనన్.


తా.

పైన చెప్పంబడినటువంటి యావుకొమ్ములను పుటము పెట్టినభస్మమును
భగమునకు బూసి రమించిన విటునియొక్క దండము ఎగసిపడుచుండును. మఱియు

ఆవుకొమ్ములను నూరి భగమునకు పూసి రమించినయెడల పురుషునికి శుక్లము పడి
పోయినను దండము వాడక నిలువబడియుండును.


శ్లో.

రజనీద్వయరాజీవోద్భవకేసరదేవదారుభిర్లేపః।
మన్మథసద్మని విహితః కరోతి సంకోచసౌభాగ్యే॥


క.

పసుపులు రెండును సురతరు
బిసరుహకింజల్కములును బృధుచూర్ణంబై
యెసఁగఁగ యోనిన్ బూసినఁ
బసగా సంకోచసుభగభాగ్యము లమరున్.


తా.

పిండిపసుపు, చాయపసుపు, పద్మకింజల్కములు, దేవదారుచెక్క
ఇవి గంధము తీసి భగమునకు లేపనము చేసిన బిగువుగా నుండును.


శ్లో.

ఘృతమధుసైన్ధవలేపాదపి హరిణీనాంచ తరుణీనామ్।
బాలానామబలానాం విశాలతాం వ్రజతి రతినిలయః॥


క.

గొలిమిడివిత్తుల పిండిని
గలియంగా యోనిఁ బూయ గడుసన్న మగున్
వెలయఁగ మధుఘృతసైంధవ
జలములచేఁ గడుగ మొదటి చక్కినె యుండున్.


తా.

గొలిమిడివిత్తులు మెత్తగా నూరి భగమునకు బూసిన బిగువుగానుండును.
మఱియు తేనె, నేయి, సైంధవలవణము, ఇవి నూరి భగమునకు పూసి నీళ్ళచేత
కడిగిన బిగువుగా నుండును.

రోమనాశన లక్షణము

శ్లో.

హరితాళతాళబీజే సిన్ధురఘననాదకన్దళీక్షారః।
ఇక్ష్వాకుబీజకునటీవచాస్ను హీమూలమంజిష్ఠాః॥


శ్లో.

వరుణగిరికర్ణికే చ స్నుహ్యాఃక్షీరేణ సప్తధా సిక్తే।
సిక్త్వేక్షాకురసైరథ సంపిష్ట్వా కల్పయేత్ కల్కమ్॥


శ్లో.

తత్కల్యార్ద్వతైల కన్దలికా బహుళవారిణా పక్క్వా।
రోమోత్పాటనపూర్వం కురు లేపం తేన తైలేన॥


సీ

హరితాళతండులీయకబీజములు సైంధ
                 వము పద్మబీజము ల్వసయుఁ గూర్చి

జెముడువేరును మణిశిల వెఱ్ఱిసొరచెట్టు
                 విత్తులు పక్కియవేరుఁ గూర్చి
వరుణయు క్షారంబు గిరికర్ణికయు మేఁక
                 పాలు మఱి జెముడుపాలఁ గూర్చి
యెనయఁ బిష్టముఁ జేసి యేడురాత్రులు నిల్పి
                 వెదురాకురసమునఁ బొదవి దాని


గీ.

యర్ధమును నూనెఁ గొని యంత నరఁటిరసము
కలిపి యది వండి నూనె చిక్కగను బుచ్చి
ముందుగల కేశములఁ దీసి యందుఁ బూయ
మస్తకంబైనఁ జెక్కిలిమాడ్కి నుండు.


తా.

హరిదళము, చిట్టికూరవిత్తులు, సైంధవలవణము, తామరవిత్తులు, వస,
జెముడువేరు, మణిశిల, వెఱ్ఱిసారచెట్టువిత్తులు, పక్కిచెట్టు వేరు, ఉలిమిరిచెట్టు
వేరు, చవుడు, దింటెనవేరు, యీవస్తువులు మేకపాలు, జెముడుపాలు, కలిపి
యేడుదినము లందూరనిచ్చి వెదురాకురస మొకశేరును, నూనె అర్ధశేరును, అరటి
సొన అర్ధశేరును కలిపి చిక్కనగునటుల వండి భగమునకు నూనె రాచి యావండిన
యౌషధమును నలుగుబెట్టిన వెండ్రుకలు మొలువక నున్నగా నుండును.


శ్లో.

యది మస్తకమపి నేతుం తపకౌతుకమస్తి హస్తతాళతులామ్।
ద్విత్రాణామపి చైషామేష విధిః సహరితాళానామ్॥


క.

హరిదళము కుసుమనూనెయుఁ
బొరికేశము లూడ్చి పూయఁ బుట్టక మానున్
హరిదళ కింశుకభస్మము
నిరవుగ నటువలెనె పూయ నెటువలె నుండున్.


తా.

హరిదళము, కుసుమనూనె, యీరెండును గలిపి భగముమీది వెండ్రు
కలు తీసి పూసిన యెన్నటికిని వెండ్రుకలు పుట్టకయుండును. మఱియు హరిదళము
మోదుగబూడిదెయు, కుసుమనూనెతో కలిపి పైవిధముగా పూసిన నదేవిధముగా
జరుగును.


శ్లో.

శాతయతి శంఖచూర్ణం లోమానిపలాశభస్మహరితాళమ్।
కౌసుంభతైలమప్యుత్పాటనపూర్వం విలేసనాత్త ద్వత్॥

ఆ.

శంఖచూర్ణమందు సమముగా మోదుగ
భస్మ మరిదళంబుఁ బరఁగ నుంచి
జలమునందు నవ్వి కలిపిరుద్ద మఱియుఁ
గుసుమనూనె రుద్దఁ గురులు వీడు.


తా.

శంఖచూర్ణము మోదుగబూడిదె, హరిదళము ఈమూఁడును కలిపి
రాచిన వెండ్రుకలు రాలిపోవును. కుసుమనూనెను రాచినను వెండ్రుకలు రాలి
పోవును.


శ్లో.

షడ్భాగాద్ధరితారాదేకో భాగశ్చ కింశుకక్షారాత్।
తద్వచ్చ శంఖచూర్ణాదితి శాతనుముత్తమం లోమ్నామ్॥


గీ.

అరిదళము నారువంతులు మఱియునొక్క
వంతు మోదుగబూడెదఁ బంచి కలిపి
నీటితో నూరి పట్టింప నిశ్చయముగ
వెండ్రుకలు దేహముననుండి వీడిపోవు.


తా.

హరిదళ మారుభాగములును మోదుగబూడిదె యొకభాగమును
నీటిలో గలిపి పూసిన వెండ్రుక లూడును.

గర్భహరణ లక్షణము

శ్లో.

అమలామలాంజనయుతా పీతా శీతాంబునా హరతి।
గర్భమృతౌ భగనిహితం ఘృతమధుయుక్తం పలాశబీజం వా॥


శ్లో.

తండులజలేన పీతం మూలం జ్వలనస్య వా జయన్త్యా వా।
గర్భఘ్నం భగనిహితం లవణం కటుతైలయుక్తం వా॥


సీ.

విమలాభ్రకమును సౌవీరము సమముగా
                 చిట్టెపురాయిని చేర్చి నూరి
ఋతుకాలమునను నెలఁతుక చల్లనినీటఁ
                 ద్రాగిన యాపెగర్భము హరించు
కురుజుతేనెయు నేయిఁ గూర్చియు మోదుగ
                 విత్తులపప్పున పెరయనూరి
ఋతుకాలమునను నెలఁతుగ భగంబున
                 నుంచ గర్భంబు హరించిపోవు

గీ.

ఉప్పు పొడిచేసి కటుతైలయుక్తముగను
పత్త నునిచిన గర్భము వదలిపోవు
కడుగునను చిత్రమూలము కలిపి త్రాగ
గర్భహరణంబుఁ గాంతురు కాంత లవని.


తా.

చిట్టెపుఱాయి, అభ్రకము, సౌవీరము నీమూఁడింటిని గలిపి ఋతు
కాలమందు చల్లనినీటితో త్రాగిన గర్భము నశించును. మఱియు మోదుగవిత్తులు
నెయ్యి, తేనెతో నూరి ఋతుకాలమందు భగమునం దుంచిన గర్భము నశించును .
చిత్రమూలము నూరి కుడితిలోఁ గలిపి తాఁగిన గర్భహరణమగును. మఱియు కటు
తైలమున నుప్పును గలిపి భగమందుంచిన గర్భహరణమగును.


శ్లో.

శైవలకేసరబీజం మూలం వా చమ్పకస్య వా కణయా।
గర్భం రుణద్ధి పీతం కటుతైలం వా జరత్సుదయా॥


వ.

నాచుతోఁ గూడిన పులిగోరువేరు కడుపు పోఁగొట్టును. జరత్సుధతోడి కటుతైలమైన నట్లు చేయును.

గర్భోత్పత్తి లక్షణము

శ్లో.

ఋతుదివసే ఘృతసహితం పీత్వా నవనాగకేసరస్య రజః।
దుగ్ధమనుపీయ రమణీ రమణగతా గర్భిణీ భవతి॥


క.

ఋతుదివసంబునుఁ గామిని
ఘృతసహితముగాఁగ నాగకేసరరజమున్
సితదుగ్ధయుతముఁ గ్రోలిన
సుతుఁ డుద్భవమందు గర్భసూచక మగుచున్.


తా.

స్త్రీ ముట్టుయైనదినమున నాగకేసరములయొక్కపొడిని నేయితో
కలిపి భక్షించి యావుపాలను దాగిన గర్భోత్పత్తియై సుతు డుద్భవించును.


శ్లో.

మూలమపి లక్ష్మణాయాః ప్రాజ్యేనా౽౽జ్యేన నాసికాపీతమ్।
తండులజలేన పీతా దదాతి పుత్రం జటామాంసీ॥


గీ.

కుడితియును జటామాంసియుఁ గూడఁజేసి
క్రోలినను, లక్ష్మివంజి సమూలముగను
ఘృతమునను నూరి యద్దానిఁ గేలనుంచి
గాలి పీల్చిన గర్భముఁ గాంచు కాంత.

తా.

లక్ష్మీవంజిచెట్టువేరును నేతితోఁ గలిపి ముక్కువద్ద నుంచుకొని గాలి
పీల్చినను, జటామాంసిని గుడితితోఁ గలిపి తాగినను స్త్రీకి గర్భము కలుగును.


శ్లో.

గోరేకవర్ణభాజః పయసా వన్ధ్యాపి ధారయేద్గర్భమ్।
పీత్వా కేకిశిఖాయాః పుత్త్రంజీవస్య వా మూలమ్॥


ఆ.

ఆవువర్ణ మొక్కటైనది యాయెనా
దానిపాలతోడఁ బూని పుత్త్ర
జీవివేరునైన శిఖమూలమైన సే
వింప గర్భ మగును వెలఁదులకును.


తా.

ఒక్కరంగుగల యావుయొక్క పాలను దెచ్చి యందు పుత్రజీవివేరు
నైనను లేక నెమిలియడుగుచెట్టువేరునయినను కలిపి త్రాగిన కాంతకు గర్భో
త్పత్తి యగును.


శ్లో.

పీత్వా౽మునైవ పయసా రజసి స్నాతా చ లక్ష్మణామూలమ్।
సప్తక్షాలిత శాలీభక్తం భుక్త్వా సుతం లభతే


ఆ.

చెఱఁగు మాసినట్టి చెలి లక్ష్మివంజిమూ
లమును దెచ్చి పాయసమున వండి
తినినయెడల నట్టి తెఱవకు గర్భమై
తనయుఁ డుద్భవించు మునిమతంబు.


ఆ.

చెలువలక్ష్మివంజిచెట్టుమూలం బేడు
మార్లు నీళ్ళ ముంచి మఱియు నెత్తు
నట్టినీటి వండు నన్నంబు సేవింపఁ
దనయుఁ డుద్భవించు మునిమతంబు.


తా.

లక్ష్మీవంజిచెట్టుయొక్క వేరును తెచ్చి పరమాన్నమున వండి ముట్టయిన
వెలది భక్షించినను లేక యావేరును యేడుపర్యాయములు నీటియందు కడిగి యా
కడిగిననీటితో వండినయన్నము తిన్నను యావెలదికి గర్భోత్పత్తియగును.

గర్భస్రావ నివారణోపాయము

శ్లో.

పీతం మధుసైన్ధవయుతముత్పలరాజీవమూలశాలూకమ్।
దళమపి గోధావల్యాః సా౽౽జ్యం రక్తస్రుతిం హరతి॥

శ్లో.

ఉత్పలముపలామధుకం శ్యామలతా లోధ్రచన్దనోపేతమ్।
తండులజలేన పీతం గర్భస్రావం నివారయతి॥


శ్లో

మధుకకుశకాశసర్పిః సీతోత్పలైః సహితమధ దుగ్ధమ్।
ముస్తాన్వితమపి పేయం గర్భస్రావే చ శూలే చ॥


సీ.

కమలమూలము నల్లకలువదుంపయు రేఁగు
                 దుంపయు మధువు చేదుఁదగునుప్పు
నవనీతమును నెద్దునాలుకవేరును
                 గలిపి త్రావ భగరక్తము హరించుఁ
బంచదారయును నుత్పలమూలమును యష్టి
                 మధుక లోధ్ర ప్రేంకణ ధృతసుమము
తండులజలముతోఁ ద్రావిన గర్భపు
                 స్రావరుధిరమెల్లఁ జక్కనౌను


ఆ.

పాలు పంచదార భద్రముస్త కుశలు
తెల్లఁదామరయును రెల్లు మధుక
ఘృతయుతంబుఁ ద్రావ నతివకు గర్భంపు
శూల రక్తరుజము చులకనగును.


తా.

తామరదుంప, నల్లకలువదుంప, రేఁగువేరు, తేనె, సైంధవలవణము,
వెన్న, బెండవేరు, వీటిని నూరి భక్షించిన గర్భరక్తస్రావము హరించును. పంచ
దార, నల్లకలువదుంప, యష్టిమధుకము, లొద్దుగపువ్వు, ప్రేంకణముపువ్వు, యివి
కడుగులో కలుపుకొని తాగిన గర్భస్రావము హరించును. పాలు, పంచదార,
భద్రముస్తలు, కుశలు, తెల్లతామరదుంప, రెల్లు, యష్టిమధుకము, వీటిని నూరి
నేతితో కలిపి త్రాగిన గర్భస్రావమును శూలలును హరించును.

సుఖప్ర్రసవలక్షణము

శ్లో.

ఖర్వశ్రీపుచ్ఛజటాం పుష్యార్కోత్పాటితాం కటౌ బద్ధా।
పీత్వా చ లగ్నగర్భా విముచ్యతే గర్భిణీ భటితి॥


క.

పారువముతోఁక యీఁకలు
ధీరతపుష్యార్కమునను దెచ్చి త్రికమునన్

నేరుపుతోఁ గట్టియు గో
క్షీరముఁ ద్రావింపఁ జూలు చెడకయ నిలుచున్.


తా.

పావురముతోకయీకలు పుష్యమీనక్షత్రముతో కూడిన యాదివార
మున దెచ్చి స్త్రీవెన్నుపూసకు గట్టి పాలు తాగించినయెడల గర్భము చెడక
నిలుచును.


శ్లో.

కృత్వా చ సప్తఖండం గుంజామూలం నిబధ్య కటిదేశే।
సూత్రైః సప్తభిరచిరాత్ సుఖప్రసూతిర్మూఢగర్భాపి॥


క.

గురువిందవేరు తునుకలు
పొరినేడుగఁ జేసి యేడుప్రోఁగులత్రాటన్
దరుణిత్రికంబునఁ గట్టిన
నరుదారసుఖప్రసూతి యగు గర్భిణికిన్.


తా.

గురువిందవేరు నేడుతునకలుగా జేసి యేడురంగుల ప్రోఁగులు మెలియ
వేసినత్రాటను యేడుచోటుల గట్టి యాత్రాడును గర్భిణీస్త్రీయొక్క వెన్నుపూ
సకు గట్టినయెడల యాస్త్రీ సుఖప్రసూతియగును.


శ్లో.

సితపికలోచనచరణం చవర్ణపూర్వం చ కర్ణపూరణతః।
అతిగర్భపీడీతాంగీ వనితౌ సుఖప్రసూతిమాతనుతే॥


ఆ.

తెల్లకోకిలాక్షి మెల్లన నమలుచు
గర్భిణీవధూటి కర్ణమునను
గాలిఁ బార నూద గర్భంబు స్రవియించు
నిందులకును వేఱె మందులేల.


తా.

తెల్లములుగొలిమిడివేరును తెచ్చి పుక్కిటనుంచుకొని నమలుచు
బిడ్డను కనలేక కష్టపడుస్త్రీయొక్క చెవులయం దూదినయెడల వెంటనే ప్రసవమగును.


శ్లో.

మూలం కృష్ణబలాయాః సితగిరికర్ణీజటాయుతం లిప్త్వా।
క్షిప్తం యోనా జనయతి సుఖప్రసూతిం మూఢగర్భాయాః॥


క.

నల్లనిముత్తవపులగము
తెల్లనిదింటెనయు రుద్రదేవునిజడయున్
వ్రేళ్ళమరఁబుచ్చి నూరుచు
నొల్లవ గర్భిణికి యోని నునుప స్రవించున్.

తా

నల్లని చిట్టాముదపుఁ జెట్టువేరు, తెల్లదింటెనవేరు, రుద్రజడవేరు
ఈమూటిని నూరి బిడ్డను కనలేక కష్టపడుస్త్రీభగమునం దుంచినయెడల వెంటనే
ప్రసవించును.


శ్లో.

కటిబద్ధమరుణసూత్రైః శ్వేతబలామూలమత్రమలపాతమ్।
కురుతే హ్యాపాదలిప్తం క్షిప్రమేక్ష్వాకవం మూలమ్॥


గీ.

బిడ్డఁ గన్నవెనుక మాయ వెడలనట్టి
యతివమొల నెఱ్ఱదారమునందు తెల్ల
ములకవేరు లునిచి గట్టవలయు మఱియు
చేదుసొరవేరు రసమును చెలియపాద
యుగమునను బూసినను మాయ యుండ దింక.


తా.

బిడ్డనుగని తరువాత మాయపడనిస్త్రీకి తెల్లములకవేరులు యెఱ్ఱని
త్రాళ్లతో మొలకు గట్టినను, చేదుసొరవేరురసము పాదములవరకూ పూసినను
మాయవెడలును.

భగశూలహరణ లక్షణము

శ్లో.

పిష్ట్వా క్షిప్తం యోనౌ మూలం ఖరమంజరీపునర్నవయోః।
నవసుతాయాః సకలం యోనిగతం శూలమపనయతి॥


క.

గలిజే ర్వెంపలి దూసరి
కలియంగా నూరి బిడ్డఁ గని నొచ్చిన యా
లలనభగంబునఁ బూసిన
నలవడు నెటువంటి శూలయైనను మానున్.


తా.

గలిజేరువేరు, వెంపలివేరు, దూసరివేరు యీ మూడింటిని కలియనూరి
బిడ్డనుకనినొచ్చిన స్త్రీయొక్క భగమునకు పూసిన భగశూల మానును.


శ్లో

కార్పాసబీజసాధితఘృతమున్దురుమాంససిద్ధతైలం వా।
భగభరణేన తదీయం సూతాయాః శూలమపనయతి॥


ఆ.

మూషకంబుమాంసమునఁ దీయునూనె యే
న్బ్రత్తివిత్తుయొక్క రసమునైనఁ

బుత్రవతికి యోనిఁ బూసినఁ గ్రిమి చచ్చు
నందు నొప్పులెల్ల నపహరించు.


తా.

ఎలుకమాంసమునుండి తీయు నూనెనైనను పత్తివిత్తులయొక్క నూనె
నైనను బిడ్డనుకన్నదాని భగమునకు పూసిన భగశూల హరించును.


శ్లో.

గోమయరసగోమూత్రైః పేషణపూర్వం ఘృతేన సహలోపాత్।
హన్తి కృమీన్ కామౌకసి పత్రం వరుణస్య సూతాయాః॥


ఆ.

ఆవుపేడరసము నావుమూత్రమునందు
నులిమిరాకు నూఱి మెలపియుంచి
ఘృతముతోడఁ గూర్చి సుతుఁ గన్నకామిని
యోనిఁ బూయఁ గ్రిములు మానిపోవు.


తా.

ఆవుపేడరసమును ఆవుమూత్రముతో కలిపి దానిచే ఉలిమిరాకును
నూరి దానిని నేతిలో కలిపి భగమునకు బూసిన భగమునందుగల పురుగులు హరించి
భగశూల నశించును.

యోనిదుర్గంధహరణ లక్షణము

శ్లో.

కుష్ఠకమలబాలోత్పలసాధితతైలేన పూరణం యోనేః।
అభయగుడధూపనమథ నింబక్వాథేన ధౌతాయామ్॥


శ్లో.

పిష్ట్వా జాతీకుసుమం జ్యేష్ఠీమధుపంచపల్లవానథవా।
తైలేన యోనిపూరణమాతపతప్తేన గన్ధఘ్నమ్॥


సీ.

కువలయకేసరకోష్టువు తైలంబుఁ
                 గలపూయ యోని దుర్గంధ మణఁగు
కరకకాయలు ద్రాక్షఖండంబు ధూపంబు
                 గాఁజేయ యోని దుర్గంధ మణఁగు
వేఁపచెక్కలు వోసి కాపించు రసమునఁ
                 గడుగఁగ యోని దుర్గంధ మణఁగు
మాలతీకుసుమంబు మధుకంబు పంచప
                 ల్లవములు నూనెతోఁ దవులఁజేసి

ఆ.

యట్టినూనె నెండఁబెట్టి కాఁగినఁ దెచ్చి
యోనిలోనఁ బూసి యునుప నిట్లు
కడఁగిరేని యెట్టి కంపైన మానును
సకలవైద్యశాస్త్రసమ్మతంబు.


తా.

కలువకింజల్కములు, తామరకింజల్కములు, చెంగల్వకోష్టు, వీటి
తైలము తీసి బిడ్డకన్నదాని భగమునకు పూసిన దర్గంధ మణగిపోవును. మఱియు
కరికకాయలు, ద్రాక్షఖండము, ఈ రెండువస్తువులు కలియనూరి బిడ్డనుకన్న భగ
మునకు ధూపము వేసిన దుగ్గంధమడగిపోవును. వేపచెక్కలు వేసి కాచిన నీళ్లతో
బిడ్డనుకన్నదాని భగమును కడిగిన దుర్గంధమణగును. జాజిపువ్వులు యష్టిమధు
కము పంచపల్లవములు, అనగా-(మామిడిచిగురు, వెలగచిగురు, నేరేడుచిగురు
మాదీఫలచెట్టుచిగురు, మారేడుచిగురు.) వీనిని నూనెలో వైచి సూర్యరశ్మియందు
కాచి యానూనెను బిడ్డను కని నొచ్చినదాని భగమునకు పూయునెడల దుర్గంధ
మణగును.

ప్రసూతిభగసంకోచ లక్షణము

శ్లో.

సూరగోపకీటచూర్ణం మిళితం మూలేన కారవేల్లస్య।
స్మరమందిరమభ్యంగాత్ సంకోచయతి ప్రసూతాయాః॥


ఆ.

ఇంద్రగోపమంబు నెనయఁ గాకరవేరు
నూరి సమము చేసి నూనెఁ గలిపి
బిడ్డఁ గనియు మిగులఁ బెంపైన యోనిపైఁ
బూయఁ గొంచెమగును బొలఁతులకును.


తా.

ఆరుద్రపురుగు, కాకరవేరు, యీ రెండువస్తువులు సమముగా నూరి
నూనెయందు కలిపి బిడ్డకన్నదాని భగమునకు పూసిన బిగువగును.

స్తన్యవృద్ధి లక్షణము

శ్లో.

దుగ్ధేన పిష్టపీతాః స్తన్యం తన్వన్తి కమలతండులకాః।
పుష్కరరుహపుష్కరమివ సప్తాహా౽భ్యాసయోగేన॥


క.

పాలును దామరవిత్తుల
ధూళియు సేవించెనేనిఁ దొయ్యలి చనులన్

బాలుబ్బు జలజపుష్కర
మూలంబుల నేడుదివసములు గొననుబ్బున్.


తా.

తామరవిత్తులపిండిని పాలతో కలుపుకొని తాగినయెడల చన్నుల
యందు పాలు వృద్ధియగును. మఱియు, తామర మెట్టతామర దుంపలను యేడు
దినములు భక్షించిన చన్నులయందు పాలు వృద్ధి చెందును.


శ్లో.

జయతి జయస్తనకోపం విశాలమపి లేపనాద్విశాలాయాః।
అస్కన్దతి కన్దోపి చ కుమారికాయాః సమం నిశయాః॥


క.

కలబందచెట్టు పలుకులు
కలియంగా నూరి మిగుల ఘలమిలకానౌ
జలజానన చన్నులపై
నలికిన నుద్రేక ముడిగి యలవడియుండున్.


తా.

కలబందమానులోనిపలుకులను కలయనూరి బిడ్డనుకన్నదాని చన్ను
లకు పూసిన పెరుగకయు వాలబడకయు వట్రువగా నుండును. ఇంద్రవారుణి
తీఁగరసము పూసిన స్తనవర్ధనమడఁగును.

ప్రసవస్త్రీగర్భము కొలఁదియగు లక్షణము

శ్లో.

సూతాయాః కృశముదరం పీతం తక్రేణ మాలతీమూలమ్।
ఘృతమధు లీఢా చోషసి కరోతి ధాత్రీ సమం నిశయా॥


ఆ.

జాజివేరుఁ దెచ్చి చల్లతోఁ ద్రావిన
బిడ్డఁగన్నకడుపు పిన్నదగును
పసుపు ఘృతము ధాత్రిఫలము తేనియఁ ద్రావ
బిడ్డఁగన్నకడుపు పిన్నదగును.


తా.

జాజివేరు నూరి చల్లతో త్రాగినయెడల బిడ్డకనినదానికడుపు చిన్న
దగును. పసుపు, నేయి, ఉసిరికకాయ, ఇవి నూరి తేనెతో తాగినను బిడ్డకనిన
దానికడుపు చిన్నదగును.

దేహదుర్గంధనాశన లక్షణము

శ్లో.

సహకారదాడిమత్వశ్మిళితం శంఖశూర్ణలేప ఇవ।
చించాకరంజబీజై ర్లేపోపి క్షిపతి దౌర్గన్ధ్యమ్॥

శ్లో.

కకుభకుసుమజంబూదళలోధ్రైరుద్వర్తనం చ సమభాగైః।
హరతి నిదాఘే విహితం ఘర్మాదిజదేహదౌర్గన్ధ్యమ్॥


శ్లో.

రోధ్రోశీరశిరీషపద్మకచూర్ణేన మిళితదేహస్య।
గ్రీష్మేపి త్వగ్దోషాః స్వేదప్రభవా న జాయన్తే॥


శ్లో.

మలయజకాశ్మీర జలఘులోధ్రతగరవాలకైశ్చ సమభాగైః।
సకృదపి కృతముద్వర్తనమతనుం తనుగన్ధమపనయతి॥


సీ.

దాడిమోత్పలచూత తత్పల్లవము శంఖ
                 ములసున్నమున మేన నలఁదిరేని
చింతగింజలు కాన్గుచెట్టుగింజలు నూరి
                 కలిపి దేహంబున నలఁదిరేని
పెనుమద్దిచెట్టు పువ్వును లోధ్ర నేరేడు
                 దళముల నెమ్మేన నలఁదిరేని
దిరిసెన లొద్దుగు విరులు పద్మకమును
                 కలనూరి నెమ్మేన నలఁదిరేని


గీ.

చంద నాగరు కాశ్మీరజలము లోధ్ర
తగరమును గూర్చి సమభాగముగ ఘటింపఁ
గలయ నెమ్మేన నొకసారి యలఁదిరేని
దేహదుర్గంధ మణఁగు సందేహ మేల.


తా.

దానిమ్మచిగుళ్లు, కలువపూలు, మామిడిచిగుళ్లు, శంఖములసున్నము,
ఇవి నూరి దేహమునకు నలుగు పెట్టిన దుర్గంధమణగును. చింతగింజలు,
కానుగుగింజలు కలియనూరి దేహమునకు నలుగు పెట్టిన దుర్గంధమణగును. పెద్ద
మద్దిపువ్వులు, లొద్దుగుదళములు, నేరేడుచిగుళ్లు, ఇవి కలియనూరి దేహమునకు
నలుగు పెట్టిన దుర్గంధమణగును. దిరిసెనపూలు, లొద్దుగుపూలు, పద్మకాష్ఠము,
ఇవి కలియనూరి దేహమునకు నలుగు పెట్టిన దుర్గంధమణగును. మంచిగంధము,
అగరు, కుంకుమపువ్వు, కురువేరు, లొద్దుగుపువ్వు, గ్రంధితగరము ఇవి సమభాగ
ములుగా కలియనూరి దేహమునకు నలుగు పెట్టిన దుర్గంధమణగును.


శ్లో.

బిల్వశివాసమభాగైర్లేపాద్భుజమూలగన్ధమపనయతి।
పరిణతతిన్తిడికాన్వితపూతికరంజోత్థబీజం వా॥

క.

మాలూర శివాఫలముల
వాలాయము నూరి బాహుపార్శ్వములందున్
జాలఁగఁ బూయఁగ నక్కడ
దూలయు దుర్గంధచయము తొలఁగున్ బెలుచన్.


తా.

మాలూరఫలము కరక్కాయ ఈరెంటిని నూరి చంకలయందు బూసు
కొనిన నచ్చటనుండు దురదయు దుర్గంధమును తొలగును.


ఆ.

చింతపండులోనఁ జిక్కినగింజల
పప్పు కాన్గుగింజపప్పుఁ జేర్చి
కలయనూరి చంక నలఁదిన నచ్చోటి
కంపు విడిచి మంచి కంపు వెలయు.


తా.

చింతగింజలపప్పు, కానుగుగింజలపప్పు ఈ రెండును నూరి చంకల
యందు పూసుకొనిన దుర్గంధమణగును.

ముఖదుర్గంధహరణ లక్షణము

శ్లో.

అస్వాదితా చ సకృదపి ముఖగంధం సకలమపనయతి।
త్వగ్బీజపూరకఫలజా పవనమవాచ్యం చ నాశయతి॥


ఆ.

మంచితేనెతోడ మాదీఫలపుఁబండు
తోలు నమలిరేని మేలుగాఁగ
ముఖముకంపు మాను మొనయంగ నోటను
మాటలాడు కంపు మానుచుండు.


తా.

మాదీఫలముతోలు, మంచి తేనెతో నమలిన ముఖముయొక్కయు
నోటియొక్కయు దుర్గంధమణగును.


శ్లో.

కుష్ఠైలవాలు కైలాయష్ఠీమధుముస్తధాన్యకృతకఫలః।
హరతి ముఖగన్ధమఖిలం క్షిపతి రసోనాదికం గన్ధమ్॥


క.

ముస్తలు రెండేలంకులు
కుస్తుంబరి యష్టి మధువు కోష్టువులును వి

న్యస్తముగ నూరి గళమున
విస్తరముగ నిడినఁ గంపు విడుచును నోటన్.


తా.

నిడుముస్తె, నాగముస్తె, ఏలకులు, కొతిమిరి, యష్టిమధుకము, చంగ
ల్వకోష్టు ఇవి నూరి కంఠమునం దుంచుకొనిన నోటియొక్క దుర్గంధమణగును.


శ్లో.

జాతిఫలజాతి పత్రీఫణిజ్జవాహ్లీకకుష్ఠసంచరితా।
అపహరతి పూతిగంధమ్ ముఖవివరపరిస్థితా గుటికా॥


ఆ.

జాజిపత్రికంబు జాజికాయయు హింగు
కోష్టు పిప్పలములు కూడఁగూర్చి
ముద్దఁ జేసి వక్త్రమునఁ బెట్టుకొనిరేని
ముఖము రోగగంధములు హరించు.


తా.

జాజిపత్రి, జాజికాయ, ఇంగువ, చంగల్వకోష్టు, పిప్పలి, వీనిని
ముద్దగా జేసి పుక్కిట నుంచుకొనివ ముఖరోగదుర్గంధము లణగును.


శ్లో.

విఘటయతి పూతిగంధమ్ ముఖగంధమ్ ఖాద్యమానమనుదివసమ్।
కటుతిక్త కషాయరసం తైలయుతం దంతధావనం పుంసామ్॥


క.

త్రికటుకము లనుదినంబును
బ్రకటకషాయమున నేయి భావన సేయన్
సకలముఖదంతధావన
సుకరంబై రోగ ముడిగి సురుచితఁ జూపున్.


తా.

శొంఠి, పిప్పలి, మిరియాలు వీటిని కషాయము పెట్టి వేపపుడుకతో
దంతధావన మొనరించి. అనంతర మాకషాయమును పుక్కిలించిన ముఖదుర్గంధ
మణగును.

కంఠస్వర మాధుర్య లక్షణము

శ్లో.

జాతిఫలైలాపిస్పలిలాజకమధుమాతులుంగదళలేహః।
సతతాభ్యాసాత్కురుతే కిన్నరమధురస్వరం పురుషమ్॥


గీ.

జాజికాయలు పిప్పళ్ళు చంద్రబాల
బీజములు వట్టివేరులు బీజపూర

దళములను గల్పి చూర్ణము వెలయఁజేసి
కురుజునను దిన్న కిన్నెరస్వరము కలుగు.


తా

జాజికాయలు, ఏలకులు, పిప్పళ్ళు, వట్టివేరులు, మాదీఫలపుఁజెట్టు
యాకులు వీటిని నలుగఁగొట్టి పురుషులు ప్రతిదినము తేనెతోఁ దినినయెడలఁ
గిన్నరుల కంఠధ్వనివలె కంఠస్వరమాధుర్యమును గలిగియుందురు.

శరీరకాంతి లక్షణము

శ్లో.

తిలనర్ష పరజనీద్వయకుష్ఠకృతోద్వర్తనాని భజమానాః।
కాన్తిం హసన్తి హేమ్నో బిభ్రతి సౌరభ్యమధికం చ॥


తే.

తిలలు పసుపులు రెండు చెంగలువకోష్టు
సమముగాఁ దీసి పొడిఁ జేసి సారసాక్షు
లనుదినంబును నేతితోఁ దినిన యొడలు
స్వర్ణకాంతిని మించెడి చాయఁ దనరు.


తా.

నువ్వులు, పిండిపసుపు, చాయపసుపు, చెంగల్వకోష్టు వీనిని నలుగఁ
గొట్టి నేతితోఁ దినినయెడల హేమకాంతిగల దేహకాంతిని పొందుదురు.


శ్లో.

నింబారగ్వధదాడిమ శిరీషకల్కైః సలోధ్రకైః స్త్రీణామ్।
రజనీయుతముస్తైః స్యాదంగానాం సుందరో రాగః॥


క.

దానిమ్మ ఱేల దిరిసెన
సూనము లొద్దుగయు వేపచూర్ణంబులలో
మానినులు పసుపుఁ గలిపియు
మేనుల నలదఁగ జిగియును మృదుతయుఁ గలుగున్.


తా.

దానిమ్మ, ఱేల, దిరిసెనపువ్వు, లొద్దుగ, వేప, ఇవి నూరి పసు
పులో గలిపి శరీరమునకు స్త్రీలు నలుగుపెట్టుకొనిన మంచికాంతియు మృదు
వును గలుగును.


శ్లో.

కృష్ణతిలకకృష్ణజీరక సిద్ధార్థజీరకైః సమం పాయసా।
లేపో౽తివదనసుభగో౽ప్యంగకళంకం చ నాశయతి॥


ఆ.

నల్లజీలకఱ్ఱ తెల్లనియావాలు
జీలకఱ్ఱ తిలలు పాల నూరి

పడఁతిముఖము నలఁద వరకాంతి రెట్టించి
కందులేనిచంద్రు కరణి నొప్పు.


తా.

నల్లజీలకఱ్ఱ, తెల్లనియావాలు, జీలకఱ్ఱ, నువ్వులు వీటిని పాలతో
నూరి స్త్రీలు ముఖమునకు నలుగు పెట్టుకొనిన చంద్రునివలె ప్రకాశించును.


శ్లో.

అపనయతి బదరమజ్జా గుఢమధునవనీతసంయుతాప్యంగమ్।
లేపేన వరుణశల్కలమజ్జాక్షీరేణ పిష్టం వా॥


శ్లో.

లోధ్రవచాధాన్యాకైర్యౌవనపిటకాపహో లేపః।
గోరోచనాన్వితేన చ లేపో మరిచేన తాదృక్షః॥


శ్లో.

వితుషయవచూర్ణయష్టీమధుసితసిద్ధార్థలోధ్రలేపేన।
స్త్రీణాం భవన్తి నియతం వరకాంచనతుల్యాని వదనాని॥


సీ.

ఆవువెన్నయుఁ దేనె యంగూరయును రేఁగు
                 పండ్లగుజ్జునఁ బుచ్చి ప్రామిరేని
వరుణభూరుహముల వల్కలంబును మేఁక
                 పాలతోడను నూరి ప్రామిరేని
కొతిమెర వసయును గూర్చి లోధ్రను నీటఁ
                 బదునిచ్చి దళముగాఁ బ్రామిరేని
గోరోచనమ్మును గూడ మిర్యము నూరి
                 పలుచన పూఁతగాఁ బ్రామిరేని


ఆ.

తేనె లోధ్రతరువు తెల్లనియావాలు
యవలపిండితోడ నలఁదిరేని
ముఖమునందుఁ గలుగు మొటిమలు గ్రంధులు
వాసి వన్నెగలుగుఁ బడఁతులకును.


తా.

ఆవువెన్న, తేనె, అంగూరపండ్లగుజ్జు, రేగుపండ్లగుజ్జు ఇవి కలిపి
ముఖమునకు నలుగు పెట్టినను, ఉలిమిరిచెట్టుయొక్క వేరునగల పట్టను మేకపాల
తో నూరి నలుగు పెట్టుకొనినను, ధనియాలు వస లొద్దుగు వీటిని నీటితో నూరి
నలుగు పెట్టుకొనినను, గోరోచనము మిరియాలు వీటిని కలిపి నలుగు పెట్టుకొని
నను, తేనె లొద్దుగు తెల్లనియావాలు యవలపిండి వీటిని కలిపి నలుగు పెట్టుకొని

నను ముఖమునందుగల మొటిమలు, గ్రంధులు, నశించి స్త్రీల మొగములకు
చాయకలుగును.


శ్లో.

పరిణతపటదళకాంచనపర్ణీ మధుకప్రియంగుపద్మానామ్।
సహదేవీహరిచందనలాక్షావాహ్లీకలోధ్రాణామ్॥


శ్లో.

సమభాగైర్జలపిష్టైర్విలాసినీనాం కరోతి నియతమయమ్।
అధరితశారదశశధరదీధితి ముఖపంకజం లేపః॥


చ.

సరసిజకేసరంబులును జందన కాంచన లోధ్ర బాహ్లిక
స్థిరతయుఁ బ్రేంకడంబు సహదేవియు లక్కయు యష్టియు న్దగు
న్గురుమతి నేకభాగముగఁ గూర్చి జలంబులఁ బోసి నూరి సుం
దరులకు మోమునందు నలఁద న్శుభకాంతి వహించు నెంతయున్.


తా.

పద్మకింజల్కములు, గంధము, కోవిదారపర్ణములు, కుంకుమపువ్వు,
మోరటి, సహదేవి, లక్క, అతిమధురము, లొద్దుగు వీటిని సమభాగములుగా
చేర్చి నీరు పోసి నూరి ముఖమునకు నలుగు పెట్టిన మంచికాంతి జనించును.

కుచోన్నతికరణోపాయ లక్షణము

శ్లో.

శ్రోతోంజనతండులజలనస్యాభ్యాసేన భవతి యువతీనామ్।
రసికహృదయధనతస్కరమతివిపులోత్తుంగకుచయుగళమ్॥


క.

ఎసఁగన్ శ్వేతాంజనమును
బసకడుగును గుచములందుఁ బ్రామిన సతికిన్
రసికమనోభవతస్కరు
వసమగు చనుగవకు బిగువు వన్నెయుఁ దెచ్చున్.


తా.

శ్వేతాంజనమును కడుగులో కలిపి చన్నులయందు నలుగు పెట్టిన
చన్నులు వన్నెకలిగి బిగువు చెందును.


శ్లో.

యువతివచాకటుకాన్వితకృతాంజలీరజనీతుల్యమాత్రాభిః।
గోమహిషీఘృతతుల్యం తైలం సంసాధితం విధినా॥


శ్లో.

కురుతే పరిణతవయసామపి వనితానాం త్రిసప్తరాత్రేణ।
స్థిరవిపులతుంగకఠినం స్తనయుగళం తస్య యోగేన॥

ఆ.

ఆవునేయి మహిషియాజ్యంబు నూనెయు
సమము చేసి దుగ్ధసహితముగను
నిరువదొక్కరాత్రు లింతులు విడువక
క్రోలఁ గఠినమగును గుచయుగంబు.


తా.

ఆవునెయ్యి, గేదెనెయ్యి, నూనె ఇవి సమముగా
కూడా సరాసరి యిరువదియొక్కరాత్రులు స్త్రీలు త్రాగినయెడల చన్నులు
బిగువు చెందును. మఱియు మునగ, వస, కటుకరోహిణి, ముడుగుదామర, వీటిని
పసుపుతో నూరి చన్నులకు బ్రామిన బిగువు చెందును.


శ్లో.

గృహగతగోలాంగూలో నవనీతం భోజితస్సహరితాళమ్।
అథ తన్మలలిప్తకరో హరతి కుచం ముష్టిబన్ధేన॥


గీ.

పెంచుకొనునట్టి కోఁతికి వెన్నలోన
అరిదళము నుంచి తినిపించి నట్టి దినము
దానిమలమును మర్దించిరేని వెలఁది
యుబ్బుఁ గలిగిన కుచముల యుబ్బడంగు.


తా.

పెంపుడుకోతికి వెన్నలోఁ గలిపిన యరిదళ మిడి, పిదప దాని మలము
చేతఁ బూసికొని మర్దించినఁ గుచముల యుబ్బణఁగును.

అన్యోన్యప్రేమ లక్షణము

శ్లో.

సురగోపభూమిలతయోశ్చూర్ణం యస్యా భగే నరః క్షిపతి।
స్తంభితశస్త్ర ఇవా౽౽జౌ తదితరపురుషో రతే తస్యాః॥


క.

జలగయు సూరగోపంబును
గలియఁగ మర్దించి భగముఖంబున నిడినన్
నళినముఖి యన్యపురుషుని
గలియక యెడమీక యోని గదియుచు నుండున్.


తా.

జలగ, ఆరుద్రపురుగు, ఇవి చూర్ణము చేసి స్త్రీ యొక్క భగమునం
దుంచిన యా స్త్రీభగము బిగువుకలిగియుండుటయేగాక పురుషునియందు ప్రేమ
గలదై యితర పురుషులను వాంఛింపదు.

శ్లో.

గగనసమాగతవల్గుళివిష్ఠాలిప్తధ్వజేన యాం భజతే।
సకృదపి సా తదితరతో వాంఛాం దూరేణ పరిహరతి॥


క.

ఆకాశంబునఁ బారుచుఁ
గాకము రెట్టిడిన దానిఁ గామాగ్రమునన్
గైకొని కూడిన యప్డిఁక
నాకామిని యేలచొచ్చు నన్యులఁ గవయన్.


తా.

ఆకాశమునందు పోవుచుండిన కాకి రెట్ట వేసినయెడల యా రెట్టను
తన కామదండముచివరవలన గ్రహించి స్త్రీని రమించినయెడల నాస్త్రీ మఱి
యొకపురుషునియం దనురాగము కలిగియుండదు.


శ్లో.

తాం నిష్ఠాం పుటపాకే దుగ్ధ్వా సహ కాంజికేన భగలేపాత్।
భవతి కృతా ప్రకృతిస్థా రమణీ రమణీయతాభూమిః॥


ఆ.

పుటముఁ బెట్టి విష్ఠ బూడిదెఁ గావించి
కలినిఁ గలిపి యోనిఁ గలయఁబూయఁ
దొల్లియట్లయుండుఁ దొయ్యలిజఘనంబు
కాకిరెట్ట కదియె కడుగుమందు.


తా.

పైన చెప్పినటువంటి కాకిరెట్టను పుటము బెట్టి కడుగులో కలిపి స్త్రీ
యొక్క భగమునకు బూసి రమించినయెడల మఱియొకపురుషునియం దనురాగము
కలిగియుండదు.


శ్లో.

ఖరరేతోమిళితారుణముఖకపిరేతో విలిప్తరతినిలయామ్।
గత్వా న జాతు కామీ కామయతే కామినీమన్యామ్॥


క.

అరుణాననకపివీర్యము
ఖరశుక్లముఁ గూర్చి యోనిఁ గలయఁగఁ బూయన్
బురుషుఁడు రమింప వేఱొక
తరుణీమణి పొందుఁ గోరఁ దలఁపఁడు పుడమిన్.


తా.

నల్లనిమొగముగలకోతియొక్క వీర్యమును, గాడిదయొక్క వీర్య
మును కలిపి స్త్రీ భగమునకు పూసుకొని పురుషునితో రమించినయెడల నాపురుషు
డింకొకస్త్రీని పొందుగోరడు.

నపుంసక లక్షణము

శ్లో.

షణ్డో భవతి నరో౽సౌ బహువారదళే ఖురే న ఖట్వాయాః।
యస్యాలక్తకపత్రే బద్ధ్వా నిక్షిప్తతే రేత॥


క.

ఏనరు శుక్లము మడుపుచు
మానిని సేలువుదళమున మంచముక్రిందన్
జానుగ లత్తుకఱేఁకునఁ
దానూదిన విటుఁడు పందతనమును బొందున్.


తా.

పురుషునియొక్క శుక్లమును బట్టి సన్ననిబట్టలో పెట్టి మడత వేసి ఆమడ
తను తాము పండుకొను మంచముక్రింద యుంచినను, లేక యాతని శుక్లమును లత్తుక
అకునం దుంచి మంచముక్రింద బెట్టి పండుకొనినను యాపురుషుడు నపుంసకు
డగును.


శ్లో.

అజమూత్రభావితం షడ్బిందురజోరజనిచూర్ణయుగమశితమ్।
ఉపనయతి నియతమచిరాన్నరస్య యూనో౽పి షణ్డత్వమ్॥


ఆ.

మేషరాజమూత్రమిళితషడ్బిందువు
దూదియందుఁ బసుపు ధూళిఁ గలిపి
పూవుఁబోఁడి యోనిఁ బూసి రమించిన
బల్లవుండు షండభావ మొందు.


తా.

మేకపోతుమూత్రముచేత దూదిని తడిపి యాదూదిలో పసుపును గలిపి
యాదూదిచేత స్త్రీయొక్క భగమును దుడిచియుంచినపుడు రమించిన పురుషుడు
నపుంసకుడగును.

పుంసకత్వ నాశన లక్షణము

శ్లో.

సతిలం గోక్షురచూర్ణం ఛాగీచీరేణసాధితం మధునా।
సహ పీతం సప్తాహాచ్ఛమయతి షణ్డత్వమచిరేణ॥


గీ.

తిలలు పల్లేరుకాయలు కలియఁగూర్చి
మేఁకపాలును దేనెయు మేళవించి
యేడుదినములు సేవించిరేని నరుల
షండభావంబు మాను నిశ్చయముగాను.

తా.

నువ్వులు, పల్లేరుకాయలు, ఇవి నూరి మేకపాలు తేనెతో కలిపి
యేడుదినములు తినినయెడల నపుంసకత్వము పోయి పుంసకత్వము లభించును.


శ్లో.

నరపార్శ్వస్థేనాస్థ్యా విద్ధం కరబాస్థి స్థాప్యతే యస్యాః।
శయనశిరోభాగే స్యాల్లగ్నత్వం తస్య రతికాలే॥


క.

లొట్టిపిట యెముకతోడను
గట్టిన నరుపార్శ్వపెముకఁ గంకటితలలోఁ
బెట్టి రమింపఁగ యోనిన్
బెట్టిన శిశ్నంబు తగిలి పెగలకయుండున్.


తా.

లొట్టిపిట్టయెముక, నరుని ప్రక్కయెముక, యీరెంటిని కలిపికట్టి
మంచము తలవైపున బెట్టి రమించిన రతియందు దండము పెగలకయుండును.


శ్లో

క్రియతే పేచకమేచకకాకాసృక్సర్పిషా యయోర్నామ్నా।
కోవిల్లకసమిదష్టోత్తరశరహోమో భవేద్ ద్వేషః॥


శ్లో.

కాకోలూకజరోమ్ణా హోమశ్చ మిథునయోస్తద్వత్।
అనయోరసృజా హోమో నామ లిఖిత్వా చ నిబందళైః॥


శ్లో.

మూషకమార్జాలద్విజదిగంబరాణాం చ రోమభిరపి।
క్రియతే యస్మిన్ వేశ్మని తత్రత్యానాం మిథో వైరమ్॥


సీ.

గూఁబ నల్లనికాకి కోవెల నయ్యయి
                 నెత్తురులను గూడ నేయిఁ గలిపి
బూరుగుసమిధల పేరులుగా గ్రుచ్చి
                 వ్రేల్చినఁ బొడము విద్వేషమగును
గాకియీఁకలు గూఁబయీఁకలు వ్రేళ్ళతోఁ
                 బెనచినఁ బుట్టు విద్వేషమగును
గఱికాకి గూఁబయీఁకల నెత్తుటను వ్రాసి
                 వేపాకువేల్వ విద్వేషమగును


గీ.

విప్ర మార్జాల మూషక ద్విరదవదన
రోమముల ధూప మిడఁ బతి కామినికిని
బుట్టు నన్యోన్యవైరంబు లట్టు గానఁ
జతుర నాగార్జునోక్తసమ్మతము గాగ.

తా.

గూబ, నల్లనికాకి, కోవెల, వీటినెత్తురులను నేతితో కలిపి బూరుగు
సమిధలతో నష్టోత్తరశతహోమము చేసిన సతీపతుల కన్యోన్యవైరము కలుగును.
కాకియీకలు, గూబయీకలు ఈరెండును వేళ్ళతో బెనవైచినను, నల్లకాకి,
గూబ, ఈరెంటియీకలను నెత్తురులో ముంచి వేపాకుపై వ్రాసి హోమము చేసినను
సతీపతుల కన్యోన్యవైరము లుద్భవించును. బ్రాహ్మణుడు, పిల్లి, యెలుక,
ఏనుగు వీటియొక్క ముఖములనుగల వెంట్రుకలను దెచ్చి ధూపము వేసిన సతీపతుల
కన్యోన్యవైరము కలుగును.

అన్యోన్యప్రీతి లక్షణము

శ్లో.

సురతరుతగరవచాగురుమృగమదమలయజరసైః।
ధూపో వేశ్మని విహితః పరస్పరం ప్రీతిమాతనుతే॥


క.

సురతరు తగరంబు వసా
గరు కస్తురి నెయ్యి మంచిగంధము మరుమం
దిరమున నిల్పిన యప్పుడె
పరమంబగు ప్రీతికలుగుఁ బతికిన్ సతికిన్.


తా.

దేవదారు, గ్రంధితగరము, వస, అగరు, కస్తూరి, నేయి, మంచిగం
ధము, ఇవి మర్మస్థానమున నుంచినయెడల సతీపతుల కన్యోన్యమగు ప్రేమ
జనించును.

నాగార్జున యోగములు

శ్లో.

నాగార్జునేన కథితా యోగా బహవశ్చతుర్దశద్రవ్యైః।
దృష్టఫలాన్ ప్రకృతానిహ యోగాంస్తత్రోద్ధరిష్యామః॥


వ.

నాగార్జునుఁడను సిద్ధుఁడు పదునాల్గుద్రవ్యములతోడి పెక్కుయోగములు ప్రత్యక్షానుభవదృష్టములఁ దెల్పియున్నాఁడు, వానిని వివరింతును.


శ్లో.

భృంగరజోమోహలతే మోహయతస్తిలకతో విశ్వమ్।
అజకర్ణ్యా సరుదన్త్యా సహ సహదేవ్యా చ లజ్జాళుః॥


గీ.

గుంటగలిజేరు నుమ్మెత్త రెంటిచూర్ణ
మాస్యమున నుంచికొనిన మోహంబుఁ జేయు
అటులె నజకర్ణి లజ్జాళు వల రుదన్తిఁ
గలియు సహదేవి వశ్యంపుతిలక మగును.

తా.

గుంటగలిజేరుపొడి, ఉమ్మెత్త యీ రెంటిని తిలకమును బెట్టిన లోక
మెల్లను మోహింపఁజేయును. సహదేవీసహితమైన లజ్జాళువు రుదన్తీ సహితాజ
కర్ణ మిశ్రితమైన తిలకమున నట్లచేయును.

వశీభావ లక్షణము

శ్లో.

శిఖిశిఖయాం౽జారికయా సహితే సురవారుణీకృతాంజల్యౌ।
భగనిహితే భామిన్యా దాసీభావం చ దాసతాం పుంసః॥


గీ.

నెమిలిపించెముఁ గప్పయు నెలఁత నూరి
దాని సురవారుణిని గూర్చి యోనిఁ బూసి
సురత మొనరింప దంపతు లిరువు రొకరి
కొకరు వశులౌచు వర్తించుచుందు రవని.


తా.

నెమలిపించెమును కప్పయు సురవారుణియు కలియనూరి యోని
నునిచిన స్త్రీపురుషులు పరస్పరవశులయి యుందురు.


శ్లో.

భృంగరజోలజ్జాళుకహరజటధవళకిలేపతో వపుషః।
క్రాన్తాసితార్కపుంజరిహరజటగుళికా వశీకురుతే॥


క.

కలయగరయు మణుఁగుఁదామర
వెలిజిల్లెడు రుద్రజటయు విష్ణుక్రాంతా
వళియును బాపరవేరును
గుళిగలు భగలేపవశ్యగుణములు సేయున్.


తా

కలగర, ముణుగుదామర, తెల్లజిల్లేడు, రుద్రజడ, విష్ణుక్రాంత,
వీటివేరులును, పాపరవేరును కలియనూరి మాత్రలు చేసి యోనియందు బూసు
కొనిన స్త్రీపురుషులు పరస్పరము వశులయి యుందురు.


శ్లో.

గోచన్దనాజకర్ణీరుదన్తికాకన్యకాభిరిహ విహితః।
భగలేపో మరణాన్తం స్త్రీణాం ప్రేమప్రసాధయతి॥


శ్లో.

లజ్జాళుకసహదేవీకన్యాగోరోచనోద్భవం చూర్ణమ్।
తాంబూలేన వికీర్ణం నార్యా పరమం వశీకరణమ్॥


శ్లో.

విష్ణుక్రాన్తాసితరవికృతాంజలీశిఖిశిఖామిరాలేపః।
వనితాపరాంగవివరే ద్రావణమంగే వశీకరణమ్॥

సీ.

ద్రాక్షాఫలమును రుదంతియుఁ దెల్లగం
                 టెనయుఁ గన్యకుమారియును ఘటించి
భగలేపనము సేయఁ బ్రాణాంతవశ్యమై
                 స్త్రీపురషులఁబ్రేమ సిద్ధిఁ బొందు
గోరోచనము కన్యకొమరిమూలము పొత్తి
                 తామర సహదేవి తనర చేర్చి
చూర్ణించి విడెమునఁ జొనపిన నన్యోన్య
                 వశ్యుంబలంటు నెవ్వారికైన


ఆ.

ధవళరవియు ముడుఁగుఁదామర శిఖియును
విష్ణుక్రాంత గూర్చి వెలఁదులకును
యోనిఁ బూయ నుదక ముదయించిఁ దనువున
నలఁదిరేని మోహ మతిశయిల్లు.


తా.

ద్రాక్షపండు, రుదంతివేరు, తెల్లగంటెనవేరు, కన్యకుమారివేరు,
వీటివి నూరి భగలేపన మొనర్చిన మరణాంతమువరకు, వశులయియుందురు. గోరో
చనము, కన్యకొమరి, పొత్తితామర, సహదేవి, వీటిని చూర్ణము చేసి విడెమున బెట్టిన
సతీపతుల కన్యోన్యవశీకరణమగును. తెల్లజిల్లేడు, ముడుగుదామర, చిత్రమూ
లఋ, విష్ణుక్రాంతఁ వీటిని నూరి స్త్రీలకు భగమునకు పూసిన ద్రవముపుట్టును,
శరీరమున బూసిన మోహము పెరుగును.

బీజస్తంభన లక్షణము

శ్లో.

భృంగరజః కన్యాభ్యాంవిష్ణుక్రాన్తాసజాతికామిళితా।
సా ముఖఘృతగుటికా వా బీజస్తంభం రతే కురుతే॥


గీ.

కలగరయు జాజియును విష్ణుక్రాంత కన్నె
కొమరివేరును గలనూరి గుళికఁ జేసి
యదియె పుక్కిట నిడుకొని యతివఁ గవయఁ
బడదు శుక్లము నెటువంటి పందకైన.


తా.

గుంటగలగర, జాజికాయ, విష్ణుక్రాంతి, కన్నెకొమరివేరు, వీటిని
నూరి మాత్ర చేసి యామాత్రను పుక్కిట బెట్టుకొని స్త్రీని రమించిన యెటువంటి
పందకయినను వీర్యము స్తంభించును.

భగసౌభాగ్యలక్షణము

శ్లో.

విష్ణుక్రాన్తాహరజటభృంగరజోభిస్సమేతసహదేవ్యా।
స్మరసదనవిలేపనతః సౌభాగ్యం దుర్భగా లభతే॥


క.

హరిక్రాంతయుఁ గలగరయును
హరజట సహదేవియాకు నన్నియుఁ గలియన్
స్మరమందిరమున నలఁదినఁ
దరుణికి సౌభాగ్యమహిమ దలకొనియుండున్.


తా.

విష్ణుక్రాంత, గుంటగలగర, రుద్రజడ, సహదేవియాకు, ఇవి నూరి
భగమునకు బూసినయెడల భగసౌభాగ్యమును గలిగియుండును.

గర్భధారణ లక్షణము

శ్లో.

గోచన్దనదణ్డోత్పలవిష్ణుక్రాన్తాకృతాంజలీచూర్ణమ్।
రజసి స్నాతాపీత్వా గర్భం వహేత వన్ధ్యా౽పి


ఆ.

ద్రాక్షపండు ముణుఁగుఁదామర దండోత్ప
లంబు విష్ణుకాంతలఁ దగఁగూర్చి
నాలుగవదినంబు పాలతో సేవింప
గర్భమౌ నిఁకెట్టి కాంతకైన.


తా.

ద్రాక్షపండు, ముణుగుదామర, దండోత్పలము, విష్ణుక్రాంత, ఇవి
నూరి స్త్రీ ముట్టయిన నాలుగవదినమున పాలతో తినినయెడల స్త్రీకి గర్భోత్పత్తి
యగును

సుఖప్రసూతి లక్షణము

శ్లో.

సరుదన్త్యా శిఖిశిఖయా పుత్రంజాతీకుమారికే మిళితే।
గుహ్యే నిధాయ ధత్తే సుఖసూతమ్మూఢగర్భా౽పి॥


ఆ.

భూజనారి శిఖియుఁ బూతిగడ్డయుఁ గల
బందయును రుదంతి చెందనూరి
యోనిలోనఁ బెట్ట యుగ్మలి గుహ్యంబు
వదలి కొడుకుఁ గాంచు వైళమునను.


తా.

భూజనవైరి, చిత్రమూలము, పూతిగడ్డ, కలబంద, రుదంతి ఇవి
నూరి ప్రసవము కాజాలని స్త్రీభగములోన బెట్టిన సుఖప్రసూతియగును.

శ్లో.

సరుదన్త్యా హరజటయా సహ సహదేవ్యా చ శిఖిశిఖయా।
కృతలేపస్య శరీరే సమస్తకార్యాణి సిధ్యన్తి॥


క.

హరజటయును సహదేవియు
సురనారియు శిఖి రుదంతి సొరిదిఁ గలియఁగాఁ
బురుషులు తరుణుల నలఁదిన
స్థిరతనువులు వశ్యసౌఖ్యసిద్ధులఁ బొందున్.


తా.

రుద్రజడ, సహదేవి, సురనారి, చిత్రమూలము, రుదంతి, ఇవి కలియ
నూరి స్త్రీపురుషులు పరస్పరము దేహములకు బూసుకొనిన బ్రతికియున్నన్నిదిన
ములు వశ్యసిద్ధియు సౌఖ్యసిద్ధియు గలుగును.


ఉపసంహారము

మాలిని.

ప్రకటితభుజలీలా భ్రాత్రుమిత్రానుకూలా
సుకవిజనవిలోలా సువ్రతాచారపాలా
వికచనయనబాలా వేషసౌభాగ్యశీలా
సకలగుణవిశాలా సజ్జనారామహేలా.


శ్లో.

ఉద్భూతః పారిభద్రాదమరనరఫణిప్రేయసీగీతకీర్తేః
నప్తా తేజోకనామ్నస్సదసి బహుమతః పణ్డితానాం కవీనామ్।
ఏతచ్ఛ్రీగద్యవిద్యాధరకవితనయః కామకేళీరహస్యం
కొక్కోకః కాముకానాం కిమపి రతికరం వ్యాకరోత్కౌతుకేన॥

ఇతి శ్రీసిద్ధపండిత కొక్కోకకవి విరచితే రతిరహస్యే
సకలస్త్రీప్రస్తావభేదయోగోనామ
పంచదశః పరిచ్ఛేదః
సమాప్తో౽యం
గ్రన్థః

గద్యము
ఇది శ్రీమదష్టభాషాకవితాప్రవీణ నవఘంటాసుత్రాణ మాచనామాత్యపుత్త్ర
సుజనకవిమిత్త్ర సజ్జనవిధేయ యెఱ్ఱయనామధేయ
ప్రణీతంబైన కొక్కోకంబను గళాశాస్త్రంబునందుఁ
సర్వంబును తృతీయాశ్వాసము
సంపూర్ణము