Jump to content

రచయిత చర్చ:గోన బుద్దారెడ్డి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి
తాజా వ్యాఖ్య: ప్రాచుర్యం టాపిక్‌లో 21 రోజుల క్రితం. రాసినది: Bhanusweety7788

గోన బుద్ధారెడ్డి

[మార్చు]

గోన బుద్ధారెడ్డి ఒక తెలుగు కవి. పదమూడవ శతాబ్దమునకు చెందిన ఇతను కాకతీయుల సామంతరాజుగా పనిచేశాడు. కందూర్ రాజధానిగా పాలిస్తూ తన తండ్రి పేర రంగనాథ రామాయణము గ్రంథాన్ని రచించాడు. ఇది పూర్తిగా ద్విపద ఛందస్సులో సా.శ.1294-1300 కాలంలో రచించబడింది. యుద్ధకాండ వరకు ఇతను రచించగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు పూర్తిచేశారు. ఇతని కుమారుడు గోన గణపతిరెడ్డి తండ్రిపేరిట బుద్ధేశ్వరాలయాన్ని నిర్మించాడు. ఉత్తరకాండ కర్తలయిన కాచ, విఠలనాథులు ఇతని కుమారులేనని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు. ఐతే ప్రముఖ సాహిత్య విమర్శకుడు వేటూరి ప్రభాకరశాస్త్రి గోన బుద్ధారెడ్డి పినతండ్రి కుమారుడైన మరో గన్నారెడ్డి కుమారులే ఉత్తర రంగనాథరామాయణ కర్తలను పరిశోధన వెలువరించారు. గోన బుద్ధారెడ్డి రచించిన రామాయణమే తెలుగులో తొలి రామాయణ కావ్యంగా ప్రశస్తి వహించింది. అంతకుముందు రచించినది నిర్వచనోత్తర రామాయణమే కాని సంపూర్ణ రామాయణంకాదు. Bhanusweety7788 (చర్చ) 09:54, 25 జనవరి 2026 (UTC)ప్రత్యుత్తరం

జీవిత విశేషాలు

[మార్చు]

కాకతీయ రుద్రదేవుడు కందూరు చోడులను (నేటి మహబూబ్ నగర్ జిల్లా) లోని వర్ధమానపురం (నేటి నందివడ్డేమాన్, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నది) నుంచి పారద్రోలడంతో, ఆ స్థానంలో గోరెడ్డిని తన సామంతుడిగా నియమించాడు. ఇతని కుమారుడు గన్నారెడ్డి రాజధానిగా పాలించాడు. ఇతని అల్లుడు మాల్యాల గుండ దండధీశుడు వర్థమానపురం పాలకుడైనాడు. ఇతని మరణానంతరం గోన బుద్ధారెడ్డి గుండేశ్వరాలయం నిర్మించింది. ఈమె తొలి తెలుగు కవయిత్రిగా ఖ్యాతి చెందింది. Bhanusweety7788 (చర్చ) 09:55, 25 జనవరి 2026 (UTC)ప్రత్యుత్తరం

గోన సంస్థానం

[మార్చు]

కాకతీయ పరిపాలన కాలం (995-1323) లో గోన బుద్ధారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలోని రాజ్యాలైన వర్ధమానపురం (ప్రస్తుతం నంది వడ్డెమాన్), ఖిల్లా ఘన్‌పూర్ (ఘనపూర్ కోట) నుండి పరిపాలన చేసాడు. అతని కుటుంబం, గోనప్రసిద్ధమైనది. అతని మరణం తరువాత అతని సోదరుడూ గోన లుకుమా రెడ్డి రాజ్యపాలన బాధ్యతలను స్వీకరించాడు Bhanusweety7788 (చర్చ) 09:56, 25 జనవరి 2026 (UTC)ప్రత్యుత్తరం

ప్రాచుర్యం

[మార్చు]

గోన బుద్ధారెడ్డి వ్రాసిన రంగనాథ రామాయణం తెలుగు నాట అత్యంత ప్రాచుర్యం వహించిన గ్రంథాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఆంగ్ల విద్య తెలుగు నాట ప్రవేశించని రోజుల్లో సంస్కృత భాషా పాఠకులు తప్ప తక్కిన విద్యార్థులందరికీ చిన్నతనంలోనే పెద్ద పుస్తకం పట్టించి చదివించేవారు. ఇంతకీ ఈ పెద్ద పుస్తకం అంటే మూడు పుస్తకాలకు సామాన్య నామం. ఆ మూడు పుస్తకాలు ఇవి:

  1. కవిత్రయం వారి ఆంధ్రమహాభారతం
  2. గోన బుద్ధారెడ్డి కృతమైన రంగనాథ రామాయణము
  3. పోతన భాగవతం

గోన బుద్ధారెడ్డి ములికినాటి సీమకు రాజధాని అయిన గండికోటకు అతిచేరువలోని పెద్దపసుపల లేదా కొట్టాలపల్లెకు చెందినవాడు. నేటికీ గోనా వంశస్ధులు ఆగ్రామాలలో మరియూ జమ్మలమడుగులో నివసించుచున్నారు. Bhanusweety7788 (చర్చ) 09:57, 25 జనవరి 2026 (UTC)ప్రత్యుత్తరం