రఘు నందన రాజ మోహన

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః

శుద్ధదేశి రాగం - దేశాది తాళం


పల్లవి

రఘు నందన ! రాజ మోహన !

రమియింపవే నా మనసున


అనుపల్లవి

నగజానిలజ నారదాది హృ -

న్నాళినివాసుడైన గాని; శ్రీ


చరణము

చిత్తమందు నిన్నుంచి ప్రేమతో - జింతించు సద్భక్తుల

నుత్తమోత్తములంచు నామది నుంచి పూజించ లేదా ?

తత్తరంబు దీర్ప గారణంబు నీవే,

తాళ జాల నిక, త్యాగరాజనుత !