యెంకి పాటలు/పీఠిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఈ పాటలు నేను మద్రాసులో క్రైస్తవ కళాశాలలో పట్టపరీక్షకు చదువుకొనే దినాలలో (1911-1918) వ్రాయ మొద లెట్టినాను. అప్పడు నా అదృష్టంవల్ల మ - రా - శ్రీ అధికార్ల సూర్యనారాయణ రావుగారి స్నేహభాగ్యం లభించటం, ఆయనతోకలిసి వాసం చేయటం కలి గింది. నన్నంతకు మునుపే సారస్వతివిషయాల్లో అంతో యింతో తరిఫీదు చేయుచున్న మా బసవరాజు ఆప్పారావు కూడా అక్కడే వుండేవాడు. వారితో ముచ్చట్లకు మ-రా-శ్రీ పాటిబండ అప్పారావుగారును వచ్చుట మూమూలు, వారందరు యెవరి రచనలగురించి వారు సొంపుగా మాట్లాడుకొంటుంపే సేనొకప్రక్క కూర్చుని విస్తుపోయి వినటం రివాజు, ఒకనాడు కాలేజీనుండి ట్రాంబండిలో వస్తుండగా, గొంతులో సన్నని రాగం బయలుదేరింది, దానిని నా లో నేను పాడుకోపో లని సాహిత్యం జ్ఞాపకంచేసుకోపోయాను. ఎప్పడోవిన్న పదంలాగున "గుండెగొంతుకలోన కొట్లాడుతాది" అన్న పల్లవి వచ్చింది. ఆదే మననం చేసుకోగా చేసుకోగా యిల్లు చేరేసరికి నేను వ్రాసిన మొదటిపాట తేలింది. మా "జానకీ" పతికిన్నీ, అప్పారావుకున్నూ ఆ పాట గద్దదికతో విని పించాను. * సెబాస్ వ్రాయ°మన్నాడు జానకీపతి; "నీవు నిత్యం వాడేభాష కాదిది, యీ భావసాయమున సత్యాస్వేనణం చేయలే"వన్నాడు మా బసవ రాజు ఆప్పారావు, ఏ సమయమున వెన్ను చరిచాడో, నూర్యనారాయణ ! ఆప్పటినుండియు "యెంకి"ని కవితారీతిని స్మరించుట నిమసమైన మానలేదు. ఆతడును అంత కంతకు దన అభిప్రాయమును బలపరుచుకొన్నాడు. మా అప్పారావు రానురాను తన అభిప్రాయం మార్చుకొని యిటీవల అతడును వల్లె ఆసుచున్నాడు. పాటలు అప్రయత్నంగా వచ్చేటట్లు ప్రసాదించిన యెంకికి కృతజ్ఞడనా ! ప్రోత్సాహము చేసి వీపుదట్టిన అధికార్లవారికా కవిత్వ కళారహస్యాలు తెలియజెప్పిన మా బసవరాజు అప్పరాయనికా ? మువ్వరకును, ఇంకను సహృదయు లెందరో చాల కాలంనుంచీ నన్ను హెచ్చరిస్తున్నారు. ఆందులో యెంకి పాటలు పదిమందికీ వినిపించినవారు దేశోద్ధారక శ్రీయుత కాశీనాదుని నాగేశ్వరరావు పంతులుగారు, ఆంధ్రపత్రికలో నేమి, భారతిలోనేమి ఆ పాటలకు తగిన తావొసంగి, యీ పుస్తకం అచ్చులో యొంతో అభిమానంచూపి, రెండు మాసములు యూ పుస్తకమును తమ మూడు పత్రికలలోనూ ఉచితముగా ఆడ్వర్టైజ్ చేయునట్లు ఆర్డరు దయచేసినారు. వారికెంతో కృతజ్ఞడను. "సాహితి’ మా పత్రికే అననూయ, జనరంజని, జ్యోతి, సుజనరంజనీ పత్రికాధిపతులును నాకెంతో గౌరవ మొసంగినారు, శారదయు ఆట్లే వారు తెలుగుతల్లియొక్క నిజస్వరూపం చూడాలెనని ఉవ్విళ్లూరుచున్నవారే తెలుగు పస, తెలుగసనుడి, తెలుగునాదం, తెలుగురిచీ తెలిసికొని మనజాతి సాంప్రదాయాలలోగల సొగసు, జీవమూ, పదిమందికిన్నీ మనసుకెక్కించాలె నని కంకణము కట్టుకుని కృషిచేస్తున్నవారే, వారందిరికీ నా నమస్కృతులు. ప్రభువులలో మా ప్రభువులును, కవులూ, రసికులూఅయిన శ్రీశ్రీశ్రీ రాజా వేంకటాద్రి అప్పారావు బహద్దయగారు యీ పాటలు విని ఆనందించే వారు. ఆ మహారాజు నాకెన్నోవిధాల మేలుచేసినారు. వారివంశ మాచంద్రా ర్కమా నిలుచుగాక యని పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నాను, పాటలలో సగం పైగా నూజవీటిలో శ్రీవారి సన్నిధినే వ్రాశాను. మా అభినవాంధ్రకవిమిత్రమండలి వారందరు నా ప్రాణమిత్రులు. మాప్రెసి డెంటుగారగు శ్రీయుత కోలవెన్ను రామకోటేశ్వరరావుగారి ద్వారా వారిద్వారా వారి దయకు బదులు నా వందనము లర్పిస్తున్నాను. ఇందులో చిత్రపటములు మా అడవి బాపిరాజుగారు వ్రాసినవి. ఆయన చిత్రములలోని మహోన్నత భావాలకు నా యెంకి పాటలే కారణమైతే, ధన్యుడను, ధన్యుడను! మద్రాసు ఆంధ్ర పండిత మండలివారు నన్ను ప్రత్యేకం ఆహ్వానించి గౌరవించారు, ఆప్పటినుంచీ పండితులంటే భయంపోయి భక్తే మిగిలింది, వారికి నా నమస్సులు.

కావ్యవ్యాకరణతీర్థులు బ్రహ్మశ్రీ పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రుల వారికి మా యెంకి పేరు చెపితేనే యెంతోఆపేక్ష; పాటలంటే ప్రాణమే. పండితులయిన్నీ "యేమో, చదువరానివారి పాట"లని తోసెయ్యరు. యెంకిపై పదిమంది హృదయాలల్లో భక్తి కలిగించింది, వారున్నూ, బ్రహ్మశ్రీ పొక్కులూరి లక్ష్మీనారాయణగారున్నూ. వారిరువురికీ నా నమస్కారాలు.

"తెలుగుదేశంలో పేరొందిన "మేటిగాయకులు మ.రా. శ్రీ విద్వాన్ పొరుపల్లి రామకృష్ణయ్యగారు యెంతో శ్రమపడి, శ్రద్ధతో యీ పాటలకు స్వరం చేశారు. వారికి నా నమస్కారాలు, అదే నేను పాడేవిధము.

తర్క వ్యాకరణ శాస్త్రవేత్తలగు బ్రహ్మశ్రీ గంటి సూర్యనారాయణశాస్త్రులుగారు తమకుతామై కోరి, యీ పాటలు చక్కగా అచ్చువేయించినందుకు వారికి చదువరులతోబాటు నేనును కృతజ్ఞుడను.

ఈ కృతి నర్పించినది నా పెత్తల్లి కుమారునకు. నా తండ్రి నాకు నాలుగైదేండ్లున్నప్పడు కాలం చేస్తే, అప్పటినుండి యిప్పటివరకు మా కందరకు అతడే పట్టుకొమ్మ, "చంద్రున కొక్క నూలిపోగ"న్నట్లు అతని కీ కృతి సమర్పిస్తున్నాను.

మద్రాసు,

29-8-25

నండూరి వెంకటసుబ్బారావు.