యెంకి పాటలు/యెంకితో బద్రాద్రి
Jump to navigation
Jump to search
యెంకితో బద్రాద్రి
ఆడ నీ సుక్కాని యీడ నే గెడయేసి
పడవెక్కి బద్రాద్రి పోదామా!
బద్రాద్రి రాముణ్ణి సూదామా!
గోదారి గంగలో కొంగుకొంగూగట్టి
కరువు తీరా బుటకలేదామా!
సరిగెంగ తాణాలు సేదామా!
కొత్తమడతలు కట్టుకోని పెజలోకెల్లి
'రామన్న రాముడో' యందామా!
రామకతలే పోయి యిందామా!
సంబరము కెదురుంగ జంటగా నిలుసుండి
సామివోరికి దణ్ణమెడదామా!
సాపనుట్టుగ నేల బడదామా!
ఈడ నీ సుక్కాని ఆడ నే గెడయేసి
పడవెక్కి మనపల్లె కెడదామా!
బద్రాద్రి రాముణ్ణి యిడదామా!