మొల్ల రామాయణము/కిష్కింధా కాండము/వాలి సుగ్రీవుల కయ్యము

వికీసోర్స్ నుండి

వాలి సుగ్రీవుల కయ్యము[మార్చు]

శా. శైలంబుల్‌ కడు వేగ ఱువ్వుచు, మహా ఝంకార హుంకారముల్‌
చాలం జేయుచు, భీకరోద్ధతులచే సాలంబులన్‌ వ్రేయుచున్‌,
వాలాగ్రంబుల మోదుచున్‌, వడివడిన్‌ వక్త్రంబులన్‌ రక్తముల్‌
కూలన్‌, వాలియు సూర్య సూతియు వడిం గోపాత్ములై పోరఁగన్‌ 12
వ. అట్టి సమయంబున, 13