కురాన్ భావామృతం/ముహమ్మద్

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

47. ముహమ్మద్‌ (సల్లం)
(అవతరణ: మదీనా; సూక్తులు: 38)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
ఎవరు సత్యాన్ని తిరస్కరించి, ప్రజలను దైవమార్గంలోకి రానీయకుండా నిరో ధిస్తారో వారి కర్మలను దేవుడు నిష్ఫలం చేస్తాడు. దీనికి భిన్నంగా ఎవరు సత్యాన్ని విశ్వసించి, సదాచార సంపన్నులయి, ముహమ్మద్‌ (స)పై అవతరించిన దాన్ని కూడా విశ్వసిస్తారో- అది వారి ప్రభువు నుండి వచ్చిన సత్యవాణి- దేవుడు అలాంటి వారిలో చెడులేమైనా ఉంటే వాటిని దూరంచేసి వారి పరిస్థితి చక్కబరుస్తాడు. (1-2)
దీనిక్కారణం అవిశ్వాసులు అసత్యాన్ని అవలంబించారు; విశ్వాసులు తమ ప్రభువు నుండి వచ్చిన సత్యాన్ని అనుసరించారు. ఈవిధంగా దేవుడు మానవుల స్థితి గతులు ఉన్నవి ఉన్నట్లు తెలియజేస్తున్నాడు. (3)
కనుక మీరీ (మక్కా) అవిశ్వాసుల్ని ఎదుర్కోవలసి వస్తే మొట్టమొదట వారి మెడలు నరకండి. వారిని పూర్తిగా అణచివేశాక ఖైదీలను గట్టిగా కట్టివేయండి. ఆతర్వాత యుద్ధం(చేసే శత్రువు) ఆయుధాలు క్రింద పడవేసేవరకు (ఖైదీల విషయంలో) మీరు ఉపకారబుద్ధితోనైనా ప్రవర్తించండి లేదా నష్టపరిహారమైనా తీసుకోండి.
ఇవీ మీరు చేయవలసిన పనులు. దేవుడు తలచుకుంటే (మీజోక్యం లేకుండా) స్వయంగానే వారి భరతం పట్టేవాడు. కాని ఆయన మిమ్మల్ని ఒకరి ద్వారా మరొకరిని పరీక్షించడానికి (ఈ పద్ధతి అవలంబించాడు). దైవమార్గంలో చంపబడినవారి కర్మల్ని దేవుడు ఎన్నటికీ నిష్ఫలం చేయడు. వారికి ఆయన (తన ప్రసన్నతాభాగ్యం పొందే) దారి చూపిస్తాడు; వారి పరిస్థితి చక్కబరుస్తాడు; ఆ తరువాత వారిని (ఇంతకు ముందే) పరిచయం చేసిన స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. (4-6)
విశ్వాసులారా! మీరు దేవునికి సహాయంచేస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీ కాళ్ళను (యుద్ధం నుండి వెనుకంజవేయకుండా) స్థిరంగా ఉంచుతాడు. (7)
ఇక అవిశ్వాసుల సంగతి. వారికి వినాశం (రాసిపెట్టి) ఉంది. దేవుడు వారి పనుల్ని పెడదారి పట్టించాడు. కారణం ఆయన పంపినదాన్ని వారు అసహ్యించుకున్నారు. అంచేత దేవుడు వారి కర్మల్ని నిష్ఫలం చేశాడు. వారు ప్రపంచంలో తిరిగి తమకుపూర్వం గతించినవారికి ఎలాంటి గతి పట్టిందో చూడలేదా? దేవుడు వారిని నామరూపాల్లేకుండా తుడిచిపెట్టాడు. అలాంటి దుర్గతే ఈ తిరస్కారుల క్కూడా రాసిపెట్టి ఉంది. (8-10)
దానిక్కారణం, విశ్వాసులకు సహాయకునిగా, సంరక్షకునిగా దేవుడున్నాడు. తిరస్కా రులకు ఏ సహాయకుడు, సంరక్షకుడూ లేడు. సత్యాన్ని విశ్వసించి సదాచార సంపన్ను లైనవారిని దేవుడు సెలయేరులు పారే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. సత్యతిరస్కా రులు ప్రపంచంలో కొన్నాళ్ళపాటు పశువుల్లా తింటూ, త్రాగుతూ జీవిత భోగభాగ్యాలు అనుభవిస్తారు. ఆతర్వాత వారి అంతిమ నివాసం నరకమవుతుంది. (11-12)
ముహమ్మద్‌ (స)! నిన్ను వెళ్ళగొట్టిన పట్నం కన్నా ఎంతో శక్తి, వైభవాలతో తుల తూగిన పట్నాలు గతంలో ఎన్నో ఉండేవి. అలాంటి పట్నాలను (సైతం) మేము తుడిచి పెట్టాం. అప్పుడు వారిని కాపాడే నాథుడే లేకపోయాడు. (అవిశ్వాసులకు గుర్తుచెయ్యి) ఒక వ్యక్తి తన ప్రభువు తరఫున స్పష్టమైన ప్రమాణంతో సన్మార్గంలో ఉన్నాడు. దీనికి భిన్నంగా మనోవాంఛలకు బానిసలైనవారు కొందరున్నారు. వారి దుష్కార్యాలు వారికి మనోహరమైనవిగా చేయబడ్డాయి. మరి వీరుభయులు సమానమవుతారా? (13-14)
భయభక్తులు కలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గం మహా వైభవంగా ఉంటుంది. అక్కడ అణుమాత్రం కూడా కలుషితంకాని పరిశుభ్రమైన నీరుగల (చల్లటి) సెల యేరులు, ఏమాత్రం రుచి కోల్పోని స్వచ్ఛమైన పాల నదులు, పానప్రియులకు అమిత రుచికరంగా ఉండే వారుణీవాహినీలు, ఎంతో నిర్మలమైన తేనె ఝరులు (నిరంతరం) ప్రవహిస్తుంటాయి. అక్కడ అన్నిరకాల పండ్లు లభిస్తాయి. వారి ప్రభువు తరఫున వారికి మన్నింపు భాగ్యం ఉంటుంది. స్వర్గంలో ఈ మహాభాగ్యాలన్నీ పొందే మనిషి, నరక కూపంలో (నానాయాతనలు అనుభవిస్తూ) ఎల్లకాలం పడివుండేవాడు సమానమవు తారా? (ఎన్నటికీ సమానులు కాలేరు.) నరకంలో ఉండేవారికి (దైవదూతలు) త్రాగేం దుకు సలసల మరిగే నీరిస్తారు. ఆ నీరు వారి ప్రేగుల్ని సైతం మాడ్చివేస్తుంది. (15)
వీరిలో కొందరు చెవులు రిక్కించి నీ మాటలు వినడానికయితే బాగానే వింటారు. కాని నీ దగ్గర్నుంచి వెళ్ళిపోయి, జ్ఞానం ఇవ్వబడినవారిని కలసుకొని “ఇప్పుడీయనగారు చెప్పిందేమిటండీ?” అనడుగుతారు. (ఈ నిర్లక్ష్యం, కాపట్యాల వల్లనే) దేవుడు వారి హృదయకవాటాలు మూసివేశాడు. వీరసలు తమ మనోవాంఛలకు బానిసలైపోయారు. సన్మార్గగాములకు దేవుడు మరింత సన్మార్గావలంబన బుద్ధి ప్రసాదించి, వారి దైవభీతిని మరింత పెంపొందింపజేస్తాడు. వారు హఠాత్తుగా తమపై ప్రళయం వచ్చిపడాలని దాని కోసం నిరీక్షిస్తున్నారా? దాని సూచనలు ఇప్పటికే బహిర్గతమయ్యాయి. అయితే అది వచ్చిపడితే వారికిక హితోపదేశం స్వీకరించే అవకాశం ఎక్కడుంటుందనీ? (16-18)
కనుక ప్రవక్తా! తెలుసుకో, దేవుడు తప్ప మరోఆరాధ్యుడు లేడు. క్షమాపణ కోరుకో నీ పొరపాట్లకు, విశ్వసించిన స్త్రీ పురుషుల పొరపాట్లకు కూడా. దేవునికి మీ కార్యకలా పాలు, మీ నివాసస్థలాలు అన్నీ తెలుసు. (19)
విశ్వాసులు (యుద్ధం గురించి) ఏదైనా అధ్యాయం ఎందుకు అవతరించ లేదు? అని అడుగుతున్నారు. కాని యుద్ధప్రస్తావన స్పష్టంగావున్న అధ్యాయం అవతరించగానే హృదయాల్లో (కాపట్య) రోగమున్నవారి వైఖరి నీవు గమనించావు కదా! వారు మృత్యువు ఆవహించిన మనిషి చూసినట్లు (కళ్ళు తేలవేసి) నీవైపు చూడసాగారు. కనుక వారికి వినాశం ఉంది. వారు అతివినయం ఒలకబోస్తూ పైకి మంచిమాటలే పలుకుతారు. కాని కచ్చితమైన ఆజ్ఞ వచ్చినప్పుడు (దాన్నుండి పలాయనం చిత్తగిస్తారు). వారు దేవుని దగ్గర చేసిన వాగ్దానం నిలబెట్టుకొనిఉంటే వారికెంతో మేలు జరిగేది. (20-21)
(కపటులారా!) మీరు (ఈ నూతన విప్లవానికి) విముఖులై (అనాగరిక విధానం వైపుకు) పోతే ప్రపంచంలో మళ్ళీ అరాచకం, అల్లకల్లోలాలు రేకెత్తిస్తూ ఒకరి గొంతులు మరొకరు కోసుకుంటారు. అంతకంటే మీనుండి మరేం ఆశించగలం? వీరసలు దైవ శాపగ్రస్తులు. దేవుడు వీరిని (సత్యం కానలేని) అంధులుగా, (హితోక్తులు వినలేని) బధిరులుగా చేశాడు. వీరు ఖుర్‌ఆన్‌ గురించి ఆలోచించ లేదా? లేక వారి హృదయ కవాటాలు మూసుకుపోయాయా? సత్యం, సన్మార్గాలు స్పష్టంగా ముందుకొచ్చిన తర్వాత కూడా వాటికి విముఖులైపోయారు. అందుకే షైతాన్‌ వారికోసం ఇలాంటి (కపట) వైఖరిని సులభం చేసి, లేనిపోని ఆశలు వారిలో పెంచిపోషించాడు. (22-25)
ఈ కారణంగానే వారు, దేవుడు పంపిన జీవన విధానాన్ని ద్వేషించేవారితో “కొన్ని విషయాల్లో మేము మీమాటే వింటాం” అన్నారు. వారు జరిపిన ఈ రహస్యమంతనాలు దేవునికి బాగా తెలుసు. మృత్యుదూతలు వారి ప్రాణాలు తీసి, ముఖాలు, వీపులు చిట్ల గొడ్తూ తీసికెళ్తున్నప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వారు దేవుని ప్రసన్నతా మార్గం త్రోసిపుచ్చి, ఆయనకు ఆగ్రహం తెప్పించే చేష్టలకు పాల్పడ్డారు. అందుకే దేవుడు వారి కర్మల్ని నిష్ఫలం చేసి ఇలా శిక్షిస్తున్నాడు. హృదయాల్లో (కాపట్య) రోగమున్నవారు, తమ హృదయాల్లో దాగిన కల్మషాన్ని దేవుడు బట్టబయలు చేయడని భావిస్తున్నారా? (26-29)
మేము తలచుకుంటే వారిని నీ కళ్ళకు చూపించగలం. వారి ముఖాలు చూస్తేనే నీవు గుర్తిస్తావు. వారు మాట్లాడే ధోరణిని బట్టే గుర్తించవచ్చు. మీరు చేసే పనులన్నీ దేవునికి బాగా తెలుసు. మీలో స్థిరచిత్తులెవరో, సాహసవీరులెవరో బట్టబయలుచేసి మీ పరిస్థితుల నిగ్గు తేల్చడానికి దేవుడు మిమ్మల్ని తప్పకుండా పరీక్షిస్తాడు. (30-31)
అవిశ్వాసులు దైవమార్గంలో ఆటంకాలు సృష్టించడమే గాక సత్యం, సన్మార్గాలు స్పష్టంగా వారి ముందుకొచ్చినా దైవప్రవక్తతో జగడం పెట్టుకున్నారు. అయినా వారు దేవునికి ఎలాంటి నష్టం కలిగించలేరు. దేవుడే వారి కర్మల్ని నిష్ఫలం చేస్తాడు. (32)
విశ్వాసులారా! మీరు మాత్రం దేవునికి, దైవప్రవక్తకు విధేయులయి మసలుకోండి. (చేజేతులా) మీ కర్మల్ని నాశనం చేసుకోకండి. (గుర్తుంచుకోండి,) సత్యాన్ని తిరస్కరించే వారిని, దైవమార్గంలో ఆటంకాలు సృష్టించేవారిని, చచ్చేదాకా సత్యతిరస్కారంలోనే పడి వుండేవారిని దేవుడు ఎన్నటికీ క్షమించడు. కనుక మీరు ధైర్యం కోల్పోయి (అవిశ్వాసు లతో) రాజీ పడకండి. (ధైర్యంతో వ్యవహరిస్తే) మీరే విజయం సాధిస్తారు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన మీ కృషిని ఎన్నటికీ వమ్ముచేయడు. (33-35)
ఈ ప్రాపంచికజీవితం ఒక ఆట, తమాషా మాత్రమే. మీరు విశ్వాసులై భయభక్తు లతో నడచుకుంటే దేవుడు మీకు రావలిసిన ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాడు. ఆయన మిమ్మల్ని మీ సిరిసందలు ఇవ్వమని అడగటం లేదు. ఆయన మీ ధనాన్ని అడిగితే, చాలా తరిగిపోయేదాకా ఇవ్వమని అడుగుతుంటే మీరు పిసినారితనం చూపుతారు. ఇలా దేవుడు మీ బలహీనతల్ని బయటపెడ్తాడు. (36-37)
వినండి, (అవసరార్థం) దైవమార్గంలో ధనం ఖర్చుపెట్టమని మిమ్మల్ని కోరడం జరుగుతోంది. కాని మీలో కొందరు పిసినారితనం వహిస్తున్నారు. అయితే పిసినారితనం వహిస్తున్నవాడు నిజానికి తన సొంత విషయంలోనే పిసినారితనం వహిస్తున్నాడు (అని వారు తెలుసుకోలేకపోతున్నారు). దేవుడు నిరపేక్షాపరుడు. మీరే (సమస్త అవసరాలకు) ఆయనపై ఆధారపడేవారు. మీరు గనక (మా ఆజ్ఞలకు) విముఖులైతే దేవుడు మీ స్థానంలో కొత్తగా మరోజాతిని తెచ్చిపెడతాడు. వారు మీలా ప్రవర్తించరు. (38)