మున్నంగి

వికీసోర్స్ నుండి

మున్నంగి గుంటూరు జిల్లా కొల్లిపర మండలములోని ఒక గ్రామము. మున్నంగి కృష్ణా నది తీరాన కలదు. దీనిని పూర్వము మునికోటిపురము అని పిలిచేవారు. విషయ సూచిక 1 పేరు వెనుక కథ 2 గ్రామ విశేషణములు 3 కొన్ని గణాంకాలు 4 బయటి లింకులు

1.పేరు వెనుక కథ మునికోటిపురము అని ఈ గ్రామానికి పేరు రావడానికి కారణంగా ఈ కథను చెప్పుకుంటారు. పూర్వం కోటి మంది మునులు కృష్ణా నది తీరాన ప్రాతఃకాలానికి ముందు తపస్సు చేస్తూ ఉండేవారు. జనసంచారం మొదలవక ముందే వారు అదృశ్యమయేవారు. ఒక రోజు కృష్ణా నదీ తీరాన గల పంట పొలాలలో (లంక)పని చేస్తున్న ఒక రైతు చీకటి పడగా ఆ రేయి అక్కడే నిదురించెను.అర్దరాత్రి సమయములో మెలకువ వచ్చిన ఆ రైతుకు కోటి మంది మునులు కృష్ణా నదీ తీరాన తపస్సు చేస్తూ కనిపించారు. ఆశ్చర్యంతో వారి తపస్సును గమనిస్తున్న ఆ రైతును మునులలో ఒకరు "ఈ విషయాన్ని ఎవరికైనా తెలియపరచిన నీ తల వేయి ముక్కలవును"అని శపించెను. భయముతో ఆ రైతు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆ రైతు తన అవసాన దశలో ఈ సంగతిని తన బంధువులకు వెల్లడించగా, వెంటనే అతని తల వేయి వ్రక్కలయెను. ఆ తెల్లవారు ఝామున ప్రజలు కృష్ణా నదీ తీరానికి వెళ్ళి చూడగా మునులు అదృశ్యమై, ఆ రోజు నుండి వారు మరలా ఎవరికీ కనిపించలేదు. అలా ఈ ఊరికి "మునికోటిపురము" అనే నామము వచ్చెను. కాలక్రమేణా 'మున్నంగి'గా వ్యవహరించబడసాగెను.

2.]గ్రామ విశేషణములు విశ్వనాథ సత్యనారాయణ గారిని మున్నంగి గ్రామ ప్రజలు ఆహ్వానించి సన్మానమును జరిపెను. విశ్వనాథ వారు మున్నంగిలోని వేణుగోపాలస్వామి మీద "మున్నంగి వేణుగోపాలా!" అను మకుటముతో నొక శతకమును వ్రాసెను. అది మధ్యాక్కరలలో గలదు. స్వర్గీయ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డి మున్నంగిని సందర్శించి ఇందిరా గాంధీ విగ్రహావిష్కరణను జరిపెను. మున్నంగి గ్రామము సర్వమతసమానమైనది. ఈ గ్రామములో హిందువులతో పాటు ముస్లీములు, క్రైస్తవులు కలసిమెలసి నివసిస్తున్నారు. హిందూ దేవాలయములతో పాటుగా చర్చి, మసీదులు కూడా కలవు. ఇక్కడ ఉర్దూ పాఠశాలకూడా ఉండుట దీనికి నిదర్శనం. మున్నంగి దేవాలయాలలో శివాలయము ప్రత్యేకమైనది. ఇది ఐదు గుళ్ళ సముదాయము.ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క దైవస్వరూపము(శ్రీగంగా పార్వతీ సమేత శ్రీసకల కోటేశ్వరస్వామి, శ్రీ భ్రమరాంభ సమేత శ్రీశైలమల్లిఖార్జున స్వామి, శ్రీ బాలత్రిపుర సుందరీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి, శ్రీ షట్ క్రోణబాలత్రిపురసుందరీ దేవి, అన్నపూర్ణేశ్వరీ సమేత శ్రీకాశీ విశ్వేశ్వర స్వామి) కలరు.ఈ ఐదు గుళ్ళకు ఒకే ద్వారముండుట ఈ గుడి ప్రత్యేకత. అందుకే ఈగుడిని "ఐదు దేవుళ్ళ గుడి"గా పిలుస్తారు.

3.కొన్ని గణాంకాలు

జనాభా: 6597 పురుషులు: 3325 స్త్రీలు: 3272 అక్షరాస్యత: 69.35 శాతం పురుషుల అక్షరాస్యత: 73.77 శాతం స్త్రీల అక్షరాస్యత: 64.91 శాతం

"https://te.wikisource.org/w/index.php?title=మున్నంగి&oldid=22619" నుండి వెలికితీశారు