మామవ సతతం రఘునాథ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

జగన్మోహిని రాగం - ఆది తాళం


పల్లవి 

మామవ సతతం, రఘునాథ !

అనుపల్లవి 

శ్రీద ! దినాన్వయ సాగరచంద్రా !

శ్రితజన శుభఫలద ! సుగుణసాంద్ర !


చరణము 1 

భక్తిరహిత శాస్త్రవిదతిదూర !

పంకజదళ నయన ! నృపకుమార !


చరణము 2 

శక్తితనయ హృదాలయ ! రఘువీర !

శాంత ! నిర్వికార !


చరణము 3 

యుక్తవచన ! కనకచలధీర !

యురగశయన ! మునిజన పరివార !

త్యక్తకామమోహమదగంభీర !

త్యగరాజరిపు జలద సమీర !